33.2 C
Hyderabad
Thursday, April 23, 2026

మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్

మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్

యదార్థవాది ప్రతినిధి సిద్ధిపేట

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5కే రన్ కార్యక్రమాన్ని సిద్ధిపేట పోలీసు కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు, జిల్లా మేజిస్ట్రేట్ రఘురామ్, జెడ్పీ చైర్మన్ రోజాశర్మతో కలిసి 5కే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5కే రన్ కోసం వచ్చిన వారందరిలో ఉత్సాహం చూస్తే చాలా సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత షీ టీమ్స్ ద్వారా మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని మహిళల అభ్యున్నతి కోసం మనమందరం కలిసి కట్టుగా కృషి చూద్దామని మహిళలు ఆత్మ విశ్వాసంతో ముందుకు కదలాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా సిద్ధిపేటలో జరిగిన 5కే రన్ లో గెలుపొందిన వారికి బహుమతులు అందుకున్న వారు స్త్రీల విభాగంలో బీ.ఇందు-తృతీయ-5వేలు, బీ.హారిక-ద్వితీయ-7500, కావ్య ప్రథమ రూ.10వేలు బహుమతి పొందారు. పురుషుల విభాగంలో సి.హెచ్.ఎల్లం తృతీయ-5వేలు, జి.అభిషేక్-ద్వితీయ-7500, కే.అఖిల్ ప్రథమ రూ.10వేలు బహుమతి మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, జిల్లా బీఆర్ఎస్ నాయకులు ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బాల సాహిత్యం సేవకు గుర్తింపు

బాల సాహిత్యం సేవకు గుర్తింపు

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

అంతర్జాతీయ మ‌హిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు తెలంగాణ‌ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.. పలు రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఈ స్పెషల్ అవార్డులకు ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భార‌తి హోళీకేరి ఉత్తర్వులు జారీచేశారు. 2023 సంవత్సరానికి మొత్తం 27 మంది మహిళలను అవార్డుతో పాటు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం అందజేయనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ కు ఎంపికైంది. బాల సాహితి మహిళా శిశు అభ్యుదయం ప్రమాదకర జబ్బుల అవగాహన కల్పించేందుకై రచనలు కథలు కవితలు వ్యాసాలు పజిల్స్ సైన్స్ వ్యాసంగం మొదలైన రచనల ద్వారా ప్రయత్నించారు. పిల్లల విద్య పాఠశాల సమస్యలపై వ్రాసిన వ్యాసాలు వివిధ దినపత్రికల్లో ప్రచురించబడ్డాయి.

ఆగని వీధి కుక్కల దాడులు పట్టించుకోని అధికారులు

ఆగని వీధి కుక్కల దాడులు పట్టించుకోని అధికారులు

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్ 

తెలంగాణ రాష్ట్రం పలు ప్రాంతాలలో వీధి కుక్కలు స్వైర విహరం చేస్తున్నాయి ఇంటిలో నుండి బయటకు రావడానికి పెద్ద మనుషులు భయపడుతున్నారు చిన్నారులైతే వీధి కుక్కల దాడిలో ప్రాణాలు సైతం కోల్పోతూ కన్న తల్లిదండ్రులకు సోకని మిగులుస్తున్నారు ఇలాంటి దాడులు రోజుకు ఒకటి పునరావతం అవుతూనే ఉన్నాయి ప్రభుత్వ అధికారులు తమకేమీ పట్టనట్టుగా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ పసి బాలుడు మరణించిన ఘటన మరువకముందే, అలాంటి తరహాలోనే మరోచోట ఓ బాలికపై వీధి కుక్కలు దాడి చేయడానికి ప్రయత్నించాయి. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాటిని తరిమి కొట్టడంతో బాలిక ప్రమాదం నుంచి బయటపడింది. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో నాలుగవ తరగతి చదువుతున్న 9 ఏళ్ల బాలిక పిన్నింటి చిన్ని పాలు తీసుకురావడానికి ఇంటి నుండి షాపుకు వెళ్తున్న సమయంలో వీధి కుక్కలు బాలిక పై దాడి చేశాయి బాలిక భయానికి లోనై కింద పడిపోయింది అయినా కుక్కలు దాడికి యత్నించాయి. కుక్కల దాడిని గమనించిన చేపూరి తిరుపతి అనే మోటార్ వైండింగ్ మెకానిక్ కుక్కలను తరిమి బాలికను కాపాడాడు. ఈ దృశ్యాలు అక్కడే ఫోటో స్టూడియో వద్ద ఉన్న సిసి కెమెరాలో నమోదయ్యాయి బాలిక స్వల్ప గాయాలతో బయటపడింది సిసి కెమెరాలో కనిపిస్తున్న రెండు కుక్కలే కాకుండా మరిన్ని కుక్కలు అటువైపుగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు సమయానికి స్పందించి బాలికను కాపాడిన తిరుపతిని అభినందించారు. గత కొద్దిరోజుల నుండి కోహెడ మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని గ్రామపంచాయతీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

కంటివెలుగునుసద్వినియోగం చేసుకోవాలి..

కంటివెలుగునుసద్వినియోగం చేసుకోవాలి..
.
యదార్థవాది ప్రతినిది నంగునూర్

ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ నాయక్ అన్నారు. సోమవారం నంగునూరు మండలం రాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి నేత్ర వైద్యం చేయించుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల వారిగా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలోని 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి అక్కడికక్కడే కళ్లద్దాలు ఇవ్వడం అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఐదు రోజులపాటు ఎక్కడి వైద్య శిబిరం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమ విజయవంతం కోసం గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు సహకరించి సక్సెస్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నితీష్ కుమార్, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ బిక్షపతి, నాయకులు పరశురాములు ,యాదగిరి, వైద్య సిబ్బంది అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి : జిల్లా ఎస్పీ ..

వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలి : జిల్లా ఎస్పీ ..

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

నైపుణ్యాలను పెంచుకుంటూ పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచలనిజిల్లా ఎస్పీ అఖిల్ మహజెన్ అన్నారు. సాయుధ దళాల వార్షిక పునర్ ఉచ్చరణ ముగింపు కార్యక్రమంలో సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వాటర్స్ లో సాయుధ ధళ పోలీసుల సమీకరణ కవాతు ముగింపు కార్యక్రమానికి హాజరై సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సమీకరణ కవాతు ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సాయుధ దళ పోలీసులకు రెండు వారాలు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఇందులో భాగంగా ఆర్మ్ డ్ రిజర్వ్ సాయుధ దళాలు యాన్యువల్ మొబిలైజేషన్ శిక్షణలో ఆర్మ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్ ఫుట్ డ్రిల్ సెర్మొనల్ డ్రిల్ గార్డ్ మౌంటింగ్ మాబ్ఆపరేషన్ ఫైరింగ్ నాకబంది పికెట్స్ విఐపి బందోబస్త్ లా అండ్ ఆర్డర్ వంటి అంశాలపై శిక్షణనిచ్చామన్నారు. పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతాయుతమైనదని మారుతున్న పరిస్థితుల క్రమంలో సాయుధ దళ సిబ్బంది సైతం శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు విధులలో కీలక పాత్ర వహిస్తున్నారని శాంతి భద్రతల పరిరక్షణ మన కర్తవ్యమని మరి ముఖ్యంగా విచక్షణ కోల్పోకుండా ప్రజల హక్కులను కాపాడుతూనే శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మనపైన ఉందని తెలిపారు. ఎట్టి పరిస్థితులలోనూ పోలీస్ శాఖ ప్రతిష్ట, గౌరవం దిగజారకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి సిబ్బందిపైనే ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు విశ్వప్రసాద్ రవికుమార్ ఆర్.ఐ లు కుమారస్వామి రజినీకాంత్ యాదగిరి సి.ఐ లు అనిల్ కుమార్ ఉపేందర్ నవీన్ కుమార్ ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు..

ఇండ్లు లేని నిరుపేదలు కనిపించడం లేదా?

ఇండ్లు లేని నిరుపేదలు కనిపించడం లేదా?

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

పేద ప్రజలకు రెండు పడకల ఇండ్లు ఇవ్వాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ బుస్సాపూర్ శంకర్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి అందించారు.. ప్రతి పేదవాని సొంతింటి కల నెరవేర్చాలని రెండు పడకల ఇండ్లు పేరుతో పేదలను మోసం చేయడం సరికాదని నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అంటూ ఊదరగొట్టిన కేసీఆర్ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఘోరంగా విఫలమయ్యారని అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదలు కనిపించడం లేదా? అనేక మంది ఇళ్ల స్థలాలు లేక చిన్న ఇళ్లలోనే రెండు మూడు కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని వెంటనే నిరుపేదలకు రెండు పడకల ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన జిల్లా అధ్యక్షులు అంకార్ గణేష్ , పార్టీ ప్రధాన కార్యదర్శి కుంచెపు ఆనంద్, బీసీ అధ్యక్షులు కారంపూరి రవి, మైనారిటీ అధ్యక్షులు ఇస్మాయిల్ ఖాన్, మహిళా అధ్యక్షురాలు బుడిగే హరిని , సినియర్ నాయకులు అల్లకుంటా పాండు, మహిళ నేతలు శశిరేఖ, శ్వేతా, కవిత, తదితరులు పాల్గొన్నారు.

వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ..

వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ..

యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 2023 రాష్ట్ర డైరీ ఆవిష్కరించిన రాష్ట్ర భారీ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్.. సీతమ్మదారలో సోమవారం ప్రైవేటు భవన్ లో వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ విశాఖ యూనిట్ అధ్వర్యములో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఈ డైరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. విశాఖలో ప్రపంచ పెట్టుబడులు సదస్సును విజయవంతం చేసిన. జర్నలిస్టులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్ట్ సభ్యులు సంక్షేమానికి ఫెడరేషన్ అందిస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారంలో తమ యూనియన్ ముందు వరుసలో ఉందని రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ కార్య వర్గ సభ్యులు నిరంతరం సభ్యుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు వైసిపి నేతలు కేకే రాజు, రవిరెడ్డి, సతీష్ వర్మ, విశాఖ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి నారాయణ్, కార్యదర్శి అనురాధ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన: జిల్లా కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ పరిశీలించిన: కలెక్టర్ మల్లికార్జున్

యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం

స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఎ . మల్లికార్జున్.. ఈ నెల 12న శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలకు అవసరమైన సామాగ్రి పంపిణీ చేసేందుకు సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియ చేయాలని ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్ లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లో పోలింగ్ కేంద్రం ఆవరణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఉండాలని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , భీమిలి ఆర్డీవో భాస్కర్ రెడ్డి , జెడ్పి సీఈవో , తహసీల్దార్ శ్యామ్ , ఎలక్షన్ సిబ్బంది రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి బిజెపి వల్లే సాధ్యం..

ఉత్తరాంధ్ర అభివృద్ధి బిజెపి వల్లే సాధ్యం..

యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం

రానున్న ఎన్నికల్లో బిజెపి దే అధికారం, ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ఫలితాల్లో బీజేపీ సాధించిన విజయం రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి సంకేతమని రాజ్యసభ సభ్యులు జీవీఎల్. నరసింహారావు అన్నారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పాదయాత్ర తరువాత జరిగిన తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ తుడిచుకుపెట్టుకు పోయిందని ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారని ఇప్పుడు దక్షిణాది రాష్ట్రా పై బీజేపీ దృష్టి సారించిందని ప్రధాన మంత్రి మోదీ నాయకత్వంలో భారత దేశం వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తుందని తెలిపారు. శాసన మండలి లో ప్రజల వాణి వినిపించాలంటే బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థి పి. వి.యన్. మాధవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. గతంలో ఈ ప్రాంతం నుండి బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు అభివృద్ధి కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమస్యలను గతంలో మాధవ్ కేంద్రం ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చారని గుర్తు చేశారు. మాధవ్ తండ్రి దివంగత పి వి చలపతిరావు రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేశారని ఉత్తరాంధ్ర అభివృద్ధి, భవిష్యత్ దృష్ట్యా మరోసారి మాధవ్ ను ఎమ్మెల్సీ గా గెలిపించుకోవాలని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, శాసనమండలిలో ప్రతిపక్షం లేకుండా చేయాలని వైసీపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ ను గెలిపించుకుందామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎం రవీంద్ర ఉత్తరాంధ్ర బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి..

యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం

ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక ఈనెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీతంరాజు సుధాకర్ ను గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నాయకత్వాన్ని పటిష్టం చేసినట్లు అవుతుందని వుడా మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ ఎస్. సి రహమాన్ తెలిపారు.. సోమవారం విశాఖపట్నం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మునుపెన్నడు ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేని అన్నారు. భూముల కుంభకోణానికి సంబంధించి బీచ్ రోడ్ లో కొండలన్నింటినీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే ధారాధత్తం చేశారని చంద్రబాబు రాష్ట్రాన్ని పూర్తిగా బ్రష్టు పట్టించారని విమర్శించారు. ఎన్టీఆర్ నుండి అధికారం లాక్కున్న చంద్రబాబు నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది, అధికారులు ఎంతగా ఒత్తిడికి లోనయ్యారో అందరికీ తెలిసిందేనని తన స్వంత ప్రయోజనం చూసుకొన్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని కరోనా సమయంలో అందరి చేత శభాష్ అన్నారని తెలిపారు. రాష్ట్ర బాగోగులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు సాధిక్, కోఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్, వక్ఫ్ డైరెక్టర్ శబ్నం అఫ్రోజ్ లతీఫ్,షేక్ బాబ్జి, రహంతుల్లా బేగ్ ఏఆర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...