33.2 C
Hyderabad
Thursday, April 23, 2026

సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి వేడుకలు..

సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి వేడుకలు..

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం చదువులతల్లి సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల అస్పృశ్యుల మహిళల హక్కుల కోసం పోరాటం చేసి తమ సామాజిక బాధ్యతగా నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి భర్త జ్యోతిబా పూలే తో కలిసి సమష్టిగా పోరాటం చేసిన మహానియురాలని పలువురు నాయకులు కొనియాడారు.. పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ ఆమె కేవలం జ్యోతి బా పూలే భార్యగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే గారు.ఆమె చేసిన సేవలు నేటి మహిళలు, యువత చాలా మందికిఆదర్శం,స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆనాటి దేశ పరిస్థితి 1896వ సంవత్సరంలో ప్లేగు వ్యాధి దేశమంతటా వ్యాపించి లక్షలమందిని పొట్టన పెట్టుకున్నదని ప్లేగు వ్యాధి సోకిన బడుగు బలహీన వర్గాల వారికి సేవ చేస్తూ చివరికి అదే ప్లేగు అంటువ్యాది సోకి సరిగ్గా ఇదే రోజున చిపోయిందని తెలిపారు. కార్యక్రమంలో వేల్పుల శంకర్ మంద మల్లేశం గోవింద్ సురేష్ మంద ధర్మయ్య బందెల కిషన్ తేలు యాదగిరి ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు.

సమగ్ర సర్వే చేయకుండానే అనర్హుల కే డబుల్ ఇళ్ళు

సమగ్ర సర్వే చేయకుండానే అనర్హుల కే డబుల్ ఇళ్ళు

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

ప్రభుత్వం కట్టి ఇస్తున్న రెండు పలకల ఇండ్లు జాబితాలో అనేక అవకతవకలు జరిగాయని అర్హూలకు ఇండ్లు కేటాయింపు చేయకుండా అనర్హులకు కేటాయింపు చేయడంపై భారత కమ్యూనిస్టుపార్టీ సిపిఐ మొదటి నుండి అధికారుల తీరును తప్పు పడుతూనే ఉందని జిల్లా అధికారులు సమగ్ర సర్వే చేయకుండానే రెండు పడకల గదులను బీఆర్ఎస్ నాయకులు చెప్పిన వారికి అధికారులు మొదటి, రెండవ విడతలో కేటాయించారని ఆ కేటాయింపులు రద్దుచేసి మరోసారి సర్వే చేయాలని జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఎందుకు విచారణ జరిపించ కుండా కాలయాపన చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని గడిపె మల్లేశ్
అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానిక జిల్లాలో ఇలా ఉంటే రాష్ట్రంలో ఎలా ఉంటుందో.. కేటీఆర్ తో రెండు పడకల ఇండ్ల ప్రారంభోత్సవాలు చేయించడం కోసం సర్వం సిద్ధం చూస్తున్న అధికారులు.. ఇప్పటికైనా మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సతీష్, జిల్లా అధికారులు సమగ్రమైన విచారణ చేపట్టి నిరుపేదలకు మంజూరు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొహెడ కొమురయ్య, హుస్నాబాద్ మండల కార్యదర్శి అయిలేని సంజివరెడ్డి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి,ఎండి కుధురత్ అలీ, అందే సంపత్, మహిళా సమాఖ్య నాయకురాలు రాయిళ్ళ శోభ, పోన్నల స్వప్న తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగుల ఉద్యమాలను అణిచి వేయాలని చూస్తోంది

ఉద్యోగుల ఉద్యమాలను అణిచి వేయాలని చూస్తోంది

యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం

బీజేపీ కార్యాలయంలో పత్రిక సమావేశంలో గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ హామీలు నెరవేర్చక పోవడంతో ఉద్యోగులు రాజకీయ పార్టీల మాదిరిగా ఉద్యమాలు చేయాల్సివస్తుందని గతంలో ఎప్పుడు చూడలేదని ప్రభుత్వం ఉద్యోగులను దొంగ దెబ్బ తీయాలని చూస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉద్యమాలను అణిచి వేయాలని చూస్తోందని అన్నారు. ఉద్యోగుల పోరాటానికి బీజేపీ అండగా వుంటుందని ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలు దృష్ట్యా ఉద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చిందని ఉద్యోగులు డిమాండ్ల విషయములో ప్రభుత్వానికి లొంగి పోవద్దని తెలిపారు. ఉద్యోగుల సర్వీస్ ప్రభుత్వానికే గాని వైసీపీకి కాదని ఉపాధ్యాయులు బదిలీల కోసం కోర్టుని ఆశ్రయించారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా డీ ఏ మాట దేవుడెరుగు జీతాలు వస్తే చాలు అన్నట్టుగా వున్నారని సలహా దారులకు మాత్రం సకాలంలో జీతాలు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం ఏమిటి అన్నది శ్వేతపత్రం విడుదలచేయలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల నమోదు బీజేపీ శ్రేణులు విజయం దిశగా పని చేస్తున్నారని ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటున్నామని తెలిపారు. రాష్ట దేవాదాయశాఖను ప్రభుత్వం దేవ ఆదాయ శాఖగా మార్చేసిందని అన్నవరం సింహాచలం శ్రీ శైలం దేవస్థానంలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణు కుమార్ రాజు, బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎం. రవీంద్ర, అనకాపల్లి ఇంఛార్జి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.నాగేంద్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారు

మహిళలు అన్ని రంగాలలో రాణిస్తూ తమ సత్తా చాటుతున్నారు

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారిని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ నాగరాజు అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నిజాంబాద్ లక్ష్మీ కళ్యాణ మండపంలో మహిళా పోలీస్ సిబ్బంది మరియు కాలేజీ విద్యార్థులతో కార్యక్రమంలో బుధవారం జిల్లా ఎస్పీ పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీమ్ భరోసా ప్రతీ పి.యస్ లో ప్రత్యేక మహిళా విభాగం ఏర్పాటుచేసిందన్నారు మహిళల భద్రత కోసం నగరంలో త్వరలోనే భరోసా సెంటర్ అందుబాటులోకి తెస్తున్నామని అందులో వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలు సభ్యులుగా చేరుస్తామన్నారు నేడు మహిళలు అన్నింగాల్లో రాణిస్తూ,తమ సత్తాచాటుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఫాతిమా రాజ్ జయసుధ గిరిరాజు కిరణ్ కుమార్ నారాయణ సంతోష్ కుమార్ శ్రీశైలం శ్రీమతి సరళ మహిళా ఆర్.ఎస్.ఐ శ్రవంతి పోలీస్ కార్యాలయం సిబ్బంది, మహిళ హోమ్ గాడ్స్ కలేజి విధ్యార్థులు కళాశాలల విధ్యార్ధులు, పోలీస్ కళాబృందం పాల్గొన్నారు

మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను బుధవారం జిల్లా పౌర సంబంధాల అధికారి డిపిఆర్ఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా కేక్‌ కట్ చేసి సీట్లు పంచారు మహిళా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మహిళా పాత్రికేయులకు జ్ఞాపికలు శాలువాలతో ఘనంగా సత్కరించారు
మహిళా అభివృద్ధి అభ్యున్నతి సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం అన్నారు

మహిళాలు అన్ని రంగాలలో ముందుఉండలి..

మహిళాలు అన్ని రంగాలలో ముందుఉండలి..

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా రేషన్ డీలర్ల సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని పలువురు మహిళా రేషన్ డీలర్లను ఘనంగా సన్మానించిన సిద్దిపేట జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షుడు రాష్ట్ర జేఏసీ కన్వీనర్ దొమ్మాటి రవీందర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే సమస్యలను పరిష్కరించుకుందమని మహిళాలలు చదువుతోనే సమాజంలో గుర్తింపు గౌరవం ఉంటుందని స్త్రీలు మానసికం గా ఆర్థికంగా బలోపేతమవుతారని దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని విజయం సాధిం చాలని సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోని అన్నిట ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ బ్రాహ్మణపల్లి చంద్రం మహిళా సెక్రెటరీ అనిత రెడ్డి హుస్నాబాద్ మండల అధ్యక్షుడు గంగారపు చేతన్ కోహెడ మండల అధ్యక్షురాలు కూర రమాదేవి జిల్లాలోని మహిళా రేషన్ డీలర్లు పాల్గొన్నారు..

నిరుపేద వధువుకు పుస్తే మట్టెల పంపిణీ

నిరుపేద వధువుకు పుస్తే మట్టెల పంపిణీ

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

సిద్దిపేటకు చెందిన గంప వెంకటేశం దంపతులు నిరుపేద వధువు వివాహానికి దాతృత్వాన్ని చాటుకుని చేయూతను అందించారు. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామం రంగు బుచ్చయ్య గౌడ్ కూతురు లాస్య వివాహానికి సిద్దిపేట లయన్స్ క్లబ్ సభ్యులు జోజి, సురేష్ కుమార్ ల అభ్యర్థన మేరకు పుస్తె మట్టెలు అందజేశారు మహిళా దినోత్సవం రోజు దాతృత్వాన్ని చాటుకొని పుస్తె మట్టలను అందించిన వెంకన్నకు లయన్స్ క్లబ్ సభ్యులతో పాటు లబ్ధిదారులు బుచ్చయ్య గౌడ్,లాస్య, పర్షరాములు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

మహిళలకు సరైన రక్షణ సముచిత స్థానం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్దిపేటలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మున్సిపల్ మహిళ పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు హత్యలు జరుగుతున్న వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ లో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి, మృతి చెందాక వారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వంలో కూడా మహిళ మంత్రులకు సరైన పదవి ఇవ్వలేదని మహిళలు ఆర్థికంగా రాణించేందుకు సీఎం కేసీఆర్ మహిళ ఇండస్ట్రియల్ ఉద్యోగాలు కల్పించడం లేదని అన్నారు మహిళలకు సమసిత ప్రాధాన్యం కల్పించాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మైనార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ అతీక్ సిద్దిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదారి మధు యువజన కాంగ్రెస్ నాయకులు గయాజుద్దీన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు

ఆదర్శవంతంగా కీర్తించబడే మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు

ఆదర్శవంతంగా కీర్తించబడే మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళ సిబ్బందిని పోలీస్ హెడ్ క్వార్టర్ లో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య బుధవారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉంది వారిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని, మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు అని అన్నారు. శక్తిసామర్ధ్యాలలో అభివృద్ధిలో నిర్ణయాలలో ఆదర్శవంతగా కీర్తించబడే స్త్రీమూర్తి వంటింటికే పరిమితం కాకుండా అంతరిక్ష పరిశోధన నుంచి భూగర్భల వరకు మేటి విలువలతో విభిన్న రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం అహర్నిశలూ కృషిచేస్తూనే మేలైన విజయాలను సొంతం చేసుకుంటున్నారు నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు కార్యక్రమంలో ఆర్.ఐ లు కుమారస్వామి, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు మహిళ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

నిరుపేద వధువుకు పెళ్ళికి బియ్యం అందజేత

నిరుపేద వధువుకు పెళ్ళికి బియ్యం అందజేత

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

సిద్దిపేట అర్బన్ మండలం, మిట్టపల్లి గ్రామంలో బాకీ కనకవ్వ కనకయ్య రెండవ కుమార్తె శ్రీ వల్లి వివాహానికి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొమ్మల యాదగిరి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు ఆయన మాట్లాడుతూ నిరుపేదలైన శ్రీ బాకీ కనకవ్వ కనకయ్యల కూతురు వివాహానికి నా వంతు సహాయ సహకారం అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అనంతరం పొన్నాల మల్లేశం చనిపోయిన విషయం తెలుసుకొని వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి మీరు దిగులు పడవద్దని మీకు ఎలాంటి ఆపదైనా మీ అండగా ఉంటామని అని వారికి ధైర్యాన్ని నింపారు వారికి ఆర్థిక సహాయంగా ఇవ్వడంజరిగింది ఈ కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షుడు కొలిమి బిక్షపతి మిట్టపల్లి గ్రామ అధ్యక్షులు లక్ష్మీనారాయణ దుర్గయ్య బాకీ చంద్రం మల్లేశం రాములు శ్రీనివాస్ ఇతర కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...