37.2 C
Hyderabad
Thursday, April 23, 2026

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపాకి తగిన గుణపాఠం చెప్పాలి: చంద్రబాబు..

యధార్థవాది ప్రతినిధిఅమరావతి:

ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైకాపాకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పి… తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు..ఎన్నికల్లో ప్రలోభాలు, బోగస్ ఓట్లతో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం హక్కులను కాలరాస్తూ తమను ఎలా మోసం చేసిందో ఉద్యోగులు, టీచర్లు గుర్తించి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్‌, భూంరెడ్డి రామ్‌గోపాల్‌ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ఎలా మోసం చేసిందో గ్రహించాలి..

”2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక అనేక సవాళ్లను అధిగమించాం. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను అధిగమించి పెట్టుబడులు తీసుకొచ్చాం. నాడు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోనే దాదాపు 10లక్షల ఉద్యోగాలు ఇచ్చి యువత భవితకు బాటలు వేశాం. నేడు ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోయి.. నిరుద్యోగం పెరిగిపోయింది. జాబ్ క్యాలెండర్, డీఎస్సీ గురించి ప్రభుత్వం ఎలా మోసం చేసిందో అంతా గ్రహించాలి. నాడు విభజనకష్టాలుఉన్నాఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత ఫిట్‌మెంట్‌ కాదు కదా.. కనీసం ఏనెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా లేదు. టీచర్లకు లిక్కర్ షాపుల వద్ద డ్యూటీలు వేసిన ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో టీచర్లు బుద్ధి చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల తరహాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలకు, ఫోర్జరీలకు వైకాపా తెరతీసింది. దొంగ అడ్రస్‌లు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి నిరక్షరాస్యులను పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారు. ఒక్క తిరుపతి నగరంలోనే 7వేలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారు” అని చంద్రబాబుధ్వజమెత్తారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం.. పీడీఎఫ్‌తో ఒక అవగాహనకు వచ్చిందన్నారు. పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి.. రెండో ప్రాధాన్య ఓటు పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని ప్రజలను, తెలుగుదేశం మద్దతుదారులను కోరారు. ఇదే సందర్భంలో పీడీఎఫ్ అభ్యర్ధులకు ఓటు వేసిన ఓటర్లను వారి రెండో ప్రాధాన్య ఓటు తెదేపాకు వేయాలని సూచించారు. ఓటు చీలిపోవడం ద్వారా దుర్మార్గమైన వైకాపా ఎట్టి పరిస్థితుల్లోను గెలవడానికి వీలు లేదని ఆయన తేల్చి చెప్పారు. అందుకే రెండో ప్రాధాన్య ఓటు విషయంలో పరస్పర మార్పిడి జరగాల్సి ఉందన్నారు. పతనం అంచులో ఉన్న రాష్ట్ర పునర్నిర్మాణానికి బాధ్యతతో,చైతన్యంతో ఓటు వేసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని ఉపాధ్యాయులు, పట్టభద్రులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు..

గెలుపు ఓటములు సహజం

గెలుపు ఓటములు సహజం

వైభవంగా 37వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం..

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆల్ ఫోర్స్ నరేంద్ర స్కూల్ నందు 37వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాయ్స్ హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా అడహక్ కమిటీ చైర్మన్ గంగా మోహన్ చక్రు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి క్రీడల ద్వారా శారీరక మానసిక అభివృద్ధి జరుగుతుందని, క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకొని ఓడిపోయిన క్రీడాకారులు మళ్లీ గెలుపు కోసం ప్రయత్నం చేయాలని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది , ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, మాట్లాడుతూ ఈ క్రీడా పోటీల నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి త్వరలో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, నరేంద్ర హై స్కూల్ చైర్మన్ బద్దం లింగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా, నిజాంబాద్ జిల్లాయువజన మరియు క్రీడా అభివృద్ధి అధికారి ముత్తన్న, జిల్లా ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య, హ్యాండ్ బాల్ సంఘం కొకన్వీనర్ రాజేష్, క్రీడా పోషకులు అప్పల గణేష్ , నిజామాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రెటరీ సెక్రెటరీ సురేష్, స్థానిక పాఠశాల ప్రిన్సిపల్ కోడె శ్రీనివాస్ ,అదేవిధంగా వివిధ జిల్లాల హ్యాండ్ బాల్ సెక్రెటరీలు,వ్యాయామ ఉపాధ్యాయులు సునీత,రాజేందర్, నరేంద్ర చారి, శ్యామ్, భూపతి చిన్నయ్య, మధు, నగేష్,నరేందర్, సంతోష్ ఠాగూర్, రమణ, నాగేష్ రాజేందర్,హరీష్, తదితరులు పాల్గొన్నారు.

ముందు ప్రచారం చేస్తే రద్దు..

ముందు ప్రచారం చేస్తే రద్దు..

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు శ్రీ చైతన్య, నారాయణ,తదితర విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సంగెం మధు, జేరిపోతుల జనార్దన్ లు డిమాండ్ చేశారు. శనివారం కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై విచారణ జరిపించి,శ్రీ చైతన్య,నారాయణ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని ముందస్తు అడ్మిషన్లు ప్రచార నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో గాంధీ రోడ్ లో కార్పొరేట్ విద్యాసంస్థల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, విద్యా సంవత్సరం పూర్తి కాకముందే వివిధ ఆకర్షపు తప్పుడు ప్రచారాలతో ముందస్తు అడ్మిషన్లకై తిరుగుతున్నారని, గుర్తింపు లేకుండా విచ్చలవిడిగా బ్రాంచ్ లను ఏర్పాటు చేసుకుంటున్నారని, అలాంటి వాటిని గుర్తించి విద్యాశాఖ అధికారులు ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అన్నారు..ఈ మధ్యకాలంలో శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయని విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ సంస్థలు ప్రవర్తిస్తున్నాయని, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారని వారు వాపోయారు.. విద్యాశాఖ అధికారులు ఈ కార్పొరేట్ విద్యాసంస్థలపై దృష్టి సారించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలను గుర్తింపు రద్దు చేయాలని, ముందస్తు అడ్మిషన్ల ప్రచారం నిర్వహిస్తున్న విద్యాసంస్థలను గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూన్న ఫీజుల పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తే ఏఐఎస్ఎఫ్ గా ఆయా విద్యాసంస్థల ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో మధు జిల్లా కౌన్సిల్ సభ్యులు సిద్ధుల సుమన్,ప్రవీణ్ నాయకులు ఆదిత్య, జనిత్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

దేశంలో కలవరపెడుతున్నాఇన్‌ఫ్లూయెంజా కేసులు.. హెచ్‌3ఎన్‌2తో ఆరుగురు మృతి..

యధార్థవాది ప్రతినిధి నూడిల్లి

దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసుల వ్యాప్తి కలవరపెడుతున్నది. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ ఫ్లూ కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా సంభవించాయని తాజాగా వస్తున్న వార్తలు భయాందోళన రేపుతున్నది. ఇన్‌ఫ్లూయెంజాతో దేశంలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి..కర్ణాటకలోని హాసన్‌ జిల్లాలో ఒక హెచ్‌3ఎన్‌2 మరణాన్ని అధికారులు ధ్రువీకరించగా.. పంజాబ్‌, హర్యానాల్లో కూడా మరణాలు నమోదైనట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కర్ణాటకలో హెచ్‌3ఎన్‌2 కారణంగా ఈనెల 1న మరణించిన వ్యక్తిని హీరె గౌడ(82)గా అధికారులు గుర్తించారు. మరణాల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఇన్‌ఫ్లుయెంజా కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, మార్చి చివరి నాటికి కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని తెలిపింది. పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో తాజాగా 440 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,294కు చేరింది..

జనాలకి రోగాలు ప్రబలకుండా చూస్తున్నాం..

జనాలకి రోగాలు ప్రబలకుండా చూస్తున్నాం..

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పోచమ్మ వాడలో సుమారు 82 ఊర పందులను పురపాలక సిబ్బంది జనావాసాల నుండి దూరంగా తరలించారు. ప్రభుత్వ ఆదేశం మేరకు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో సంచరిస్తున్న ఊర పందులను జనావాసాలకు దూరంగా తరలించడం జరుగుతుందని హుస్నాబాద్ పురపాలక శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. జనావాసాల మధ్య పందుల సంచారం ద్వారా హెచ్1ఎన్1 లాంటి వివిధ రకాల వైరస్ లు, డెంగ్యూ, మలేరియా లాంటి వైద్యులు ప్రబలి ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందన్నారు. పురపాలక సంఘ కౌన్సిల్ తీర్మానం మేరకు ఊర పందులను జనావాసాలకు దూరంగా తరలిస్తున్నట్లు వెల్లడించారు ఇందులో వాడు కౌన్సిలర్ బోజు రమ రవీందర్,జవాన్ సారయ్య ప్రభాకర్, కానిస్టేబుళ్లు రాజు,రమేష్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సీబీఐ విచారణ వెనుక రాజకీయ కుట్రలు: ఎంపీ అవినాష్‌రెడ్డి

సీబీఐ విచారణ వెనుక రాజకీయ కుట్రలు: ఎంపీ అవినాష్‌రెడ్డి

యధార్థవాది ప్రతినిది హైదరాబాద్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ మూడోసారి ముగిసింది..దాదాపు 4 గంటలకు పైగా ఆయన్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం అవినాష్‌ మీడియాతో మాట్లాడారు. ”మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పారు. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని అడిగాం. రెండు, మూడుసార్లు అడిగినా స్పందించకపోవడంతో హైకోర్టుకు వెళ్లాం. కేసు విచారణ వెనక రాజకీయ కుట్రలున్నాయి. మేం ఎలాంటి తప్పు చేయలేదని కార్యకర్తలకు భరోసా ఇస్తున్నా. అధికారుల వద్ద ఉన్నందున ఇవాళ కోర్టులో జరిగిన విషయాలు నాకు తెలియదు. తప్పుడు ఆధారాలు సృష్టించి విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని గతంలోనే చెప్పాను. కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్లు మాత్రమే తీసుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలను పక్కన పెట్టి చిన్నచిన్న విషయాలను ప్రస్తావిస్తూ పెద్దవి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కట్టుకథ అడ్డం పెట్టుకుని విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. సీబీఐ విచారణ కంచే చేను మేసిన చందంగా ఉంది” అని అవినాష్‌రెడ్డి ఆరోపించారు.’ఎంపీ టికెట్‌’ కోసమే ఈ హత్య జరిగిందని చేస్తున్న ఆరోపణలు వింటే నవ్వొస్తుంది. చనిపోయే ముందు రోజు కూడా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో 300 ఇళ్లలో వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంటింటికీ ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురాంరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్‌కు ఓటేయండి అని ప్రచారం చేశారు. అక్కడి ప్రజలను పిలిచి విచారణ చేయొచ్చు.. కానీ అలా చేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురాం రెడ్డిని పిలిచి విచారణ చేయొచ్చు. అలా చేయలేదు. ఎవరిదగ్గర ఎలాంటి స్టేట్‌మెంట్‌ తీసుకోలేదు. కేవలం వీళ్ల కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్స్‌ మాత్రమే తీసుకున్నారు. హత్యకు సంబంధంచిన నిజాలను వెలికితీయాలనే ఆలోచనే లేదు. కట్టుకథను అడ్డంపెట్టుకొని.. ఒక వ్యక్తిని టార్గెట్‌ చేసుకొని విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు.నా సోదరి సునీత నాపై ఎన్ని విమర్శలు చేసినా మౌనంగానే ఉన్నా. ఈ విషయంలో వైకాపా కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. మేం ఎలాంటి తప్పు చేయలేదని కార్యకర్తలకు ఇవాళ నేను భరోసా ఇస్తున్నా. వివేకా కుటుంబంలోనే అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి.వివేకానందరెడ్డికి 2006 నుంచి ఒకరితో సంబంధం ఉంది. 2011లో బహుశా పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ వివాహం చేసుకోవడానికి ఇస్లాం లా ప్రకారం తన పేరును షేక్‌ మహమ్మద్‌ అక్బర్‌గా మార్చుకున్నారు. వారికి షేక్ షెహన్‌షా అనే అబ్బాయి కూడా ఉన్నాడు. భవిష్యత్తులో తన రాజకీయ వారసుడిగా షేక్ షెహన్‌షాను ప్రకటించాలని వివేకానందరెడ్డి దృఢంగా భావించారు. విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.హత్య జరిగిన తర్వాత కొన్ని సీల్డ్‌ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. తప్పకుండా అవి నోటరైజ్డ్‌ డాక్యుమెంట్లే.. అవి ఆయన రాసిన వీలునామా అని నేను అనుకుంటున్నాను. ఆయన రెండో భార్య, లేదా వారి అబ్బాయికి ఆయన ఆస్తులు ఇవ్వాలని అనుకోవడం జరిగి ఉండొచ్చు. అయితే, ఈ ప్రక్రియను ఎవరు అడ్డుకోవాలనుకున్నారో? ఈ విషయంలో ఎవరికి ఆసక్తి ఉందో? అనేది తెలియాలి. ఈ కారణంతోనే వివేకానందరెడ్డిని హత్య చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ కేసుకు సంబంధించి నాకు తెలిసిన ప్రతి విషయాన్ని కోర్టు, మీడియా ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ఇంతకాలం నేను మాట్లాడకపోవడానికి ఇవే కారణాలు తప్ప మరొకటి కాదు. దీని వెనక ఉన్న రాజకీయ కుట్రలను ఛేదిస్తాం. ఎంత దూరమైనా న్యాయపోరాటం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా” అని అవినాష్‌ రెడ్డి తెలిపారు..

మూడోసారి సీబీఐ ఎదుట హాజరైన ఎంపీ అవినాష్‌ రెడ్డి..

మూడోసారి సీబీఐ ఎదుట హాజరైన ఎంపీ అవినాష్‌ రెడ్డి..

యధార్థవాది ప్రతినిధి హైదరాబాద్

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు.విచారణలో భాగంగా.. సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలంటూ గురువారం తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని, వీటి ప్రకారం వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్‌రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. నేడు విచారణకు రానున్న ఈ పిటిషన్‌లో వివేకా కుమార్తె సునీత ఇంప్లీడ్‌ కానున్నారు.మరోవైపు ఈకేసులో చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ ఖైదీలుగా ఉన్న సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డితో పాటు గంగిరెడ్డి, దస్తగిరి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు..

క్రీడలు మానసిక దృఢత్వానికి ఎంతో ముఖ్యం

క్రీడలు మానసిక దృఢత్వానికి ఎంతో ముఖ్యం

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

కరీంనగర్ పార్లమెంటు స్థాయి క్రీడోత్సవాలు భాగంగా హుస్నాబాద్ అసెంబ్లీ పరిధిలో పట్టణంలోని స్థానిక సబ్ స్టేషన్ ప్రక్కన క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి హుస్నాబాద్ లిటిల్ ఫ్రేండ్స్ వర్సెస్ సైదాపూర్ టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించారు.. సందర్భంగా అయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపుదిస్తాయని క్రీడోత్సవాలు భాగంగా క్రీడలు క్రికెట్ కబడ్డీ ఖోఖో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని‌‌ హుస్నాబాద్ నియోజకవర్గంలోని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ సూర్యాపేట జిల్లా ఇంచార్జీ చాడ శ్రీనివాస్ రెడ్డి బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు బొమ్మ శ్రీరాం జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

న్యాయన్ని కాపాడే న్యాయ వాదులకే రక్షణ లేదా..

న్యాయన్ని కాపాడే న్యాయ వాదులకే రక్షణ లేదా..

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

న్యాయవాది పై పోలీసుల దాడిని ఖండిస్తూ నిజమాబాద్ జిల్లా కోర్ట్ ఎదురుగా న్యాయవాదూలకు సంఘిభావం తెలిపిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ న్యాయన్ని కాపాడే న్యాయవాదులకే ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుంటే ఇంకా ఎవరికి రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనని యువ న్యాయవాదులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ పార్టీ తోడుగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పార్టి నాయకులు మోహన్ నాయక్అం కార్ గణేష్ కారంపూరి రవి కుమార్ సన్నిథ్ గౌడ్ శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంఘ సంస్కర్త సావిత్రి బాయిపులేకు ఘన నివాళి

సంఘ సంస్కర్త సావిత్రి బాయి పులేకు ఘన నివాళి

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

మహిళలకు విద్య కుల వివక్ష లేకుండా పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రి బాయి ఫులే 126 వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ ITI కాలేజిలో సావిత్రి బాయి ఫూలే విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ..ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ జ్యోతిరావ్ పులే మన అణగారిన వర్గాల కొరకు విద్య ఎంతో అవసరం అని గుర్తించి తన బార్య సావిత్రి బాయికి చదువు నేర్పించారు..దేశంలో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికలకు ప్రత్యేకంగా తొలి పాఠశాల నెలకొల్పిన విద్యావేత్త సావిత్రి బాయి ఫులేనని గుర్తుచేసుకున్నారు..ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అని కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల అస్పృశ్యుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారని అయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్ టి అధ్యక్షులు మోహన్ నాయక్, జిలా యువజన అధ్యక్షులు అంకార్ గణేష్, జిల్లా నాయకులు చంద్రకాంత్ కాస్తూరి ప్రవీణ్ కారంపూరి రవి కుమార్ శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...