37.2 C
Hyderabad
Thursday, April 23, 2026

నిరాశ్రయురాలిని సఖి కేంద్రం తరలింపు

నిరాశ్రయురాలిని సఖి కేంద్రం తరలింపు

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

వీధుల్లో నిరాశ్రయురాలిగా జీవిస్తున్న మహిళలను గుర్తించి వృద్ధుల సంరక్షణ కేంద్రానికి తరలించిన జిల్లా సంక్షేమ అధికారి.. శనివారం విధి నిర్వహణకు వస్తున్న సందర్భంలో బాలల పరిరక్షణ విభాగంలో పనిచేస్తున్న న్యాయ సేవల అధికారికి ఒక నిరాశ్రయులైన మహిళ కనిపించగా ఆమె వెంటనే జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన జిల్లా సంక్షేమ అధికారి సఖి కేంద్రం నిర్వాహకురాలు బోనాల రోజా సమాచారం ఇచ్చి వెంటనే సదరు మహిళలను ఎల్లారెడ్డిపేటలోని వృద్ధుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వృద్ధురాలి వివరాలు తెలుసుకొని పిల్లల చెంతకు చేర్చాలని ఒకవేళ సంబంధించిన ఎవరూ లేనట్లయితే ఆమెను వృద్ధుల సంరక్షణ కేంద్రంలో తగు జాగ్రత్తలతో సంరక్షించడానికి కేంద్రం నిర్వాహకులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.

ఘనంగా బొమ్మ వెంకన్న వర్ధంతి

ఘనంగా బొమ్మ వెంకన్న వర్ధంతి

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు నాలుగవ వర్ధంతి వేడుకలను హుస్నాబాద్ పట్టణ అంబేడ్కర్ చౌరస్తాలో పుర ప్రముకులు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపి సిపిఐ వైయస్ఆర్ తెలంగాణ పార్టీల నాయకులు స్ఫూర్తి అసోసియేషన్ రైతు సంఘం నాయకులు బొమ్మ వెంకన్న అభిమానులు ఘనంగా నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వైస్ చైర్మన్ అయిలేని అనితా సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ కౌన్సిలర్లు చిత్తారి పద్మ కోమటి స్వర్ణలత సత్యనారాయణ దొడ్డి శ్రీనివాస్ భూక్య సరోజన పున్న లావణ్య వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఇంచార్జీ అయిలేని మల్లికార్జున్ రెడ్డి ఎక్సైజ్ డిఎస్ పి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్రమ నిర్మాణం కూల్చివేత

అక్రమ నిర్మాణం కూల్చివేత

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

వేములవాడ రురల్ మండలం చంద్రగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని తెట్టెకుంటలో అనుమతులు లేకుండా, చెరువు శిఖాన్ని ఆక్రమించుకుని నిర్మించిన భవనాన్ని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కూల్చివేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. తెట్టెకుంటలోని సర్వే నెంబర్ 5లో చేపట్టిన అనుమతిలేని నిర్మాణాన్ని ముందే గుర్తించి పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ యజమాని పట్టించుకోకుండా నిర్మాణాన్ని కొనసాగించారని తెలిపారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఈ నిర్మాణం శిఖం పరిధిలోకి వస్తుందని నిర్దారించి తొలగింపునకు ఆదేశించారని వివరించారు. దీంతో శనివారం మండల పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాన్ని తొలగించారన్నారు. సరైన అనుమతులు లేకుండా గ్రామాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని కోరారు. ఆక్రమణలు, అనుమతులు లేని నిర్మాణాల విషయంలో సంబంధిత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భవన నిర్మాణ అనుమతులు ఆన్లైన్లో అందిస్తున్నామని నిర్మాణదారులు స్వయంగా మీసేవ కేంద్రాల్లో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చని నివాసగృహాలకు 15 రోజుల్లో నివాసీతర నిర్మాణాలకు 30 రోజుల్లో ఆన్లైన్ లోనే అనుమతి పత్రాలు జారీ చేస్తారని ఆయన వివరించారు. అనుమతుల జారీలో ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత మండల పంచాయతీ అధికారులను సంప్రదించాలని ఆయన తెలిపారు.

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి
పెట్టుబడి పెట్టకండి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నేరాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు1930 డయల్ 100లకు తక్షణమే కాల్ చేయలని జిల్లా ఎస్పీ అఖిల్ మహజెన్ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఆశ భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారని ఎవరికైనా ఆశ చూపించి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వస్తాయని మాయ మాటలతో అతని వ్యక్తిగత సమాచారం తీసుకుని సైబర్ నేరం చేయడం జరుగుతుందని భయంతో ఏదైనా వ్యక్తికి సంబంధించిన బ్యాంకు అకౌంట్ పాన్ కార్డు అకౌంట్లు బ్లాక్ అవుతుందని భయపెట్టి వ్యక్తిగత సమాచారం తీసుకొని సైబర్ నేరం చేస్తున్నారని ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ ఉపయోగం పెరగడం వల్ల ప్రతి వ్యక్తి ఏదో అవసరానికి పోన్స్ వాడుతూ ఉంటాం ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి మన బ్యాంకులు నుండి డబ్బులు సులువుగా దోచుకుంటున్నారని అందువల్ల మన వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదని తెలిపారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా NCRP portal (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ వారు తక్షణమే స్పందిస్తారని తెలిపారు.

గంజాయి పట్టివేత నిందితుల అరెస్ట్

గంజాయి పట్టివేత నిందితుల అరెస్ట్

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఆకాశ రామన్న సమాచారంతో పోచంపాడు ప్రాజెక్టు వద్ద గంజాయి విక్రయిస్తున్న కళ్యాణ్, సంతోష్ లను అదుపులోకి తీసుకున్న ఆర్మూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీఫెన్సన్, సబ్ ఇన్స్పెక్టర్ ఏ. గంగాధర్.. గంజాయిని విక్రయిస్తున్న విచారించగా తాము నిర్మల్ కు చెందిన రాజ్ కుమార్ వద్ద తీసుకువచ్చినట్లు తెలియ జేశారు. నిందితులను రాజ్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి తనిఖీ చేయగా అతని వద్ద గంజాయి ఉండడంతో రెండు బైక్స్ 230 గ్రాములు గంజాయి పట్టుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టులో హాజరు పరిచిన పోలీసులు..

అక్రమ కేసులు ఎత్తివేయాలి..

అక్రమ కేసులు ఎత్తివేయాలి..

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

శాంతియుతంగా పోరాటం చేస్తున్న గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని గౌరవెల్లి ప్రాజెక్టు రైతులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టులో పలు కేసుల్లో విచారణకు గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులు హాజరయ్యారు. తమకు న్యాయంగా రావాల్సిన పరిహారం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమపై ప్రభుత్వం, అధికారులు అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని పరిహారం కావాలంటే అడుక్కోవాలి కానీ దౌర్జన్యం చేస్తారా అంటూ ఎమ్మెల్యే మాట్లాడడం సరికాదని రైతులు అన్నారు. మేము సర్వస్వం కోల్పోయామని స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇప్పటికైనా అధికారులతో మాట్లాడి పరిహారం పించి మాకు న్యాయం చేయాలని కోరారు. ప్రాజెక్ట్ వ్యతిరేకంగా కాదని మేము అడ్డుకుంటే ప్రాజెక్టు పనులు కా వస్తాయాఅని తెలిపారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు కోసం రైతులు ఏ విధంగా కన్నెర్ర చేశారో అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేకు తాము బుద్ధి చెప్తామన్నారు.

జిల్లాలో నకిలీ ఏసీబీ అధికారులు

జిల్లాలో నకిలీ ఏసీబీ అధికారులు

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

* ఒక్క రోజే నలుగురు అధికారులకు పొన్ కాల్స్..
* ఏసీబీ అధికారులమంటూ డబ్బులు డిమాండ్..
అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటివి నమ్మవద్దు, వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని పత్రిక ప్రకటనలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. జిల్లా పరిధిలోని ఎంపీఓ అధికారికి అపరిచిత ఫోన్ నెంబర్ 084549989750 నుండి ఫోన్ చేసి మేము ఏసీబీ హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీపై అక్రమాస్తుల ఫిర్యాదులు వచ్చాయని వాటిపై విచారణ చేస్తామని మీపై ఉన్న ఆరోపణలు చిన్నవే అని ధృవీకరించుకొని రద్దు చేయుటకు ముందుగా రూ.1,50,000 పంపలని కోరారు. సదరు అధికారి నాకు కానీ నా కుటుంబానికి ఎలాంటి ఆస్తులు లేవని తెలిపారు. నకిలీ అధికారులు పది నిమిషాల తర్వాత 50,000 పంపినట్లయితే మీ మెయిల్ కి క్లియరెన్స్ సర్టిఫికెట్ పంపిస్తామని తెలిపారు నా వద్ద అంత మొత్తం కూడా లేదని చెప్పగా నేను ఆన్లైన్లోనే ఉంటాను మీ ఫోన్ పే ద్వారా రూ.10,000 పంపి సాయంత్రం వరకు మిగతా డబ్బులు పంపలని తెలిపారు. జిల్లా కమిషనర్ ఆఫీస్ ను ఎంపీఓ సంప్రదించారు. ఈ విధంగానే మిగతా వారికి కాల్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఎవరూ కూడా అపరిచితుల నుండి ఫోన్ కాల్ చేస్తే ఏ ప్రభుత్వ అధికారి కూడా నమ్మవద్దని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్ పరీక్షలు ప్రశాంతం వాతావరణంలో ప్రారంభం..

ఇంటర్ పరీక్షలు ప్రశాంతం వాతావరణంలో ప్రారంభం..

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణం లోని సెస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నీ ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.. కళాశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న తీరును నిఘా నేత్రాల ఏర్పాటును పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంట్, కళాశాల ప్రిన్సిపాల్ జి వనజ కుమారి జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ పరీక్షా కేంద్రంలో 198 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 183 మంది హాజరు కాగా, 15 మంది గైర్హాజరు అయ్యారని అధికారులు కలెక్టర్ వివరించారు. అనంతరం పరీక్షా కేంద్రంలోని రూములు పరిశీలించి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులు పరీక్షా కేంద్రంలో కల్పించిన ఫర్నిచర్‌, త్రాగునీరు, ప్రథమ చికిత్స వంటి సౌకర్యాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు..

యువ దర్శకులకు కొదవలేదు

యువ దర్శకులకు కొదవలేదు

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

ఇంటింటి రామాయణం సినిమా ప్రీమియర్ ఆదివారం నిజామాబాద్ లో
నిర్వహించరు రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ నరెడ్ల దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని, హాస్య భరితంతో కూడిన చిత్రమని తెలంగాణలో కళాకారులకు నాటులకు నటీమణులు కొదవలేదని అవకాశాలు లేక చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడు యువ దర్శకులతో ఎంతో మంది అవకాశాలు వస్తున్నాయని రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, గంగవ్వ అవకాశం కల్పించిన దర్శకులు సురేష్ నరెడ్ల ఆయన అభినందిస్తూ గ్రామీణ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబ కథగా తెరకెక్కిన ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నా యని ఈ చిత్రం త్వరలోనే మన ముందుకు వస్తుందని మనమందరం చూసి మన కళాకారులకు నాటులకు నటీమణులు అభినందించలేని తెలిపారు. కార్యక్రమంలో సినీ నటులు రామకృష్ణ, నవ్య స్వామి, సురభి ప్రభావతి, అంజి మామా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే.. దేహీ అనాల్సి వస్తుంది: పవన్‌

యధార్థవాది ప్రతినిధి మంగళగిరి:

బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు.
”భారాస పార్టీ ఏపీకి వస్తే జనసేన ఆహ్వానించింది. తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై భారాస స్పందించాలి. అన్యాయంపై భారాస వివరణ ఇవ్వాలి. బీసీ కులాల తొలగింపుపై వైకాపా, తెదేపా స్పందించాలి. బీసీలకు జనసేన అండగా ఉంటుంది. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు ఏం చేయగలం అనే దానిపై ఆలోచిస్తా. మీ ఓట్లే మీకు పడవు అని బీసీలను హేళన చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలి. నన్ను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారు. నన్ను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాల వారు గ్రామస్థాయిలో ఘర్షణకు దిగుతారు. నేను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదు. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నా” అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...