33.2 C
Hyderabad
Thursday, April 23, 2026

శోభకృత్ తెలుగు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు

శోభకృత్ తెలుగు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక సి.వి రామన్ ఉన్నత పాఠశాల నందలి శోభకృత్ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఈ ఉగాది వేడుకలలో విద్యార్థులు ఉగాది పచ్చడి తయారుచేసి అందరికి అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాయిత నారాయణరెడ్డి మాట్లాడుతూ షడ్రుచుల కలయిక ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో మనిషి జీవితం సుఖసంతోషాలతో ఉండాలని అందరూ తెలుగు ఉగాది నూతన సంవత్సరంలో అందరూ కలిసిమెలిసి సౌభ్రాతృత్వంతో జీవించాలని ఆయురారోగ్య అష్టశ్వర్యాలతో తులతూగాలని
అలాగే విద్యార్థుల్లో ప్రేరణ పెంపొందించేందుకు లీడ్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిబిరం నిర్వహించరు. కార్యక్రమములో ఉపాధ్యాయబృందం విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పాత నేరస్తులపై నిఘా పెట్టాలి: జిల్లా ఎస్.పి

పాత నేరస్తులపై నిఘా పెట్టాలి: జిల్లా ఎస్.పి

యదార్థవాది ప్రతినిధి మెదక్

చేగుంట పోలీస్ స్టేషన్ ను మంగళవారం తనిఖీ చేసిన జిల్లా ఎస్.పి పి.రోహిణి ప్రియదర్శిని.. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని ప్రతిరోజు వారి క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేయాలని ఎస్.పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు. పోలీస్ స్టేషన్ లోని వర్టికల్స్ నిర్వహణ ఆన్ లైన్ లో కేసుల వివరాలు ఇప్పటికప్పుడు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మనదేనని సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని కేసులను ఛేదించే విధంగా ఉండాలని బ్లూ కోట్స్ పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని డయల్100 కాల్స్ వచ్చిన వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని స్టేషన్ పరిధిలో వాహనాలను తనిఖీ చేయాలని సంబంధిత ధ్రువపత్రాలు పరిశీలించలని అన్నారు. కార్యక్రమంలో రామాయంపేట సి.ఐ. శ్రీ.చంద్రశేఖర్ రెడ్డి చేగుంట ఎస్.ఐ.శ్రీ.ప్రకాష్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.

పంచాయతీ పాలకవర్గాన్ని నిర్బందించిన గ్రామస్తులు..

పంచాయతీ పాలకవర్గాన్ని నిర్బందించిన గ్రామస్తులు..

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామాన్ని హుస్నాబాద్ మండలంలో కలపాలని డిమాండ్ చేస్తూ గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించరు.. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాలను హుస్నాబాద్ మండలంలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో చౌటపల్లి గ్రామం లేకపోవడంతో తమ గ్రామాన్ని కూడా హుస్నాబాద్ మండలంలో కలపాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అక్కన్నపేట వద్దు హుస్నాబాద్ ముద్దు అంటూ నినాదాలు చేస్తున్న గ్రామ ప్రజలు ..

మహిళా సాధికారధికై పోరాడుదాం

మహిళా సాధికారధికై పోరాడుదాం

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

తెలంగాణ రాష్ట్ర భారత జాతీయ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉస్తేల సృజన.. భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా స్థానిక హుస్నాబాద్ CPI అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం గూడా పద్మ అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షు రాలు మాట్లాడుతూ సమాజంలో సగం భాగం ఉన్న మహిళల హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలన్నారు. మహిలలు పురుషులతో సమానంగా దూసుకుపోతూ మహిళా సాధికారతకై పోరాడాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ను అమలు చేయకుండా నేటి పాలకులు విస్మరిస్తున్నారు. శ్రామిక మహిళలు శ్రమ దోపిడికి బలవుతున్నారని
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహిళలకు పిల్లలకు వృద్ధులకు బాలికలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నారు.రోజురోజుకీ మహిళలపై హత్యలు హత్యాచారాలు మానభంగాలు లైంగిక వేధింపులు హింస రకరకాలుగా వేధించబడుతున్నారు అందరికీ చట్ట పరిధిలో రక్షణ కల్పించాలని హత్య హత్య చేసిన వారిని ఒక్క నెలలోనే పూర్తిస్థాయి కేసులు విచారణ జరిపి ఫాస్ట్ ట్రాక్కోటు ద్వారా నిందితులకు శిక్షలు పడే విధంగా చట్టాలు ఉండాలని మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు సృజన డిమాండ్ చేశారు. మండల స్థాయిలో మహిళా పోలీస్ స్టేషన్లు నియోజకవర్గ స్థాయిలో ఫాస్ట్ ట్రాక్కోట్లు ఏర్పాటు చేయాలని మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సృజన డిమాండ్ చేసినారు. కార్యక్రమం లో NFIW జిల్లా నిర్మాణ బాద్యులు కనుకుంట్ల శంకర్ కార్యదర్శి పిల్లి రజిని ఆర్గనైజింగ్ సెక్రెటరీ లింగాల మమత నిర్మలా స్వాతి రాయిగళ్ళ శోభా సంగీత మంజులా రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

మంత్రుల అండదండలు లేనిదే లీక్ సాధ్యమా

మంత్రుల అండదండలు లేనిదే లీక్ సాధ్యమా
– లీకేజీలపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదు

– గుండాల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో

యదార్థవాది ప్రతినిధి హైరాబాద్

గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో
నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో గ్రూప్-1 పేపర్ లీక్ చేసినవారి పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సిట్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మంత్రుల అండదండలు లేకుండానే లీకేజీ వ్యవహారం సాధ్యపడుతుందా అని అన్నారు. సీఎం కేసీఆర్ ఈ విషయంలో ఎందుకు నోరు మేదపడం లేదని ప్రశ్నించారు. కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరగటం లేదని తెలంగాణ వస్తే పిల్లల బ్రతుకులు మారుతాయని ఉద్యోగలు వస్తాయని అనుకుంటే ఏ ఒక్కరికి మేలు జరగలేదని అన్నారు. ఈ రాస్తారోకోలో అండెం సంజీవ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా పందిల్లలో పున ప్రతిష్టాపన మహోత్సవాలు

ఘనంగా పందిల్లలో పున ప్రతిష్టాపన మహోత్సవాలు

యదార్థ వాది ప్రతినిధి హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో శ్రీ మహా లింగేశ్వర స్వామి పునః ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా సాగాయి. ఎమ్మెల్యే విడుదల సతీష్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే గుడి నిర్మాణానికి తనవంతుగా 2లక్షల86వేల రూపాయల విలువగల ఇనుము, సలాక ,సిమెంట్ అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఆ పరమేశ్వరుని అనుగ్రహం తో
హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల కు,ఎప్పుడు ఉండాలని పాడి పంటల తో సుఖసంతోషాలతో పిల్ల పాపలతో నిండు నూరేళ్లు జీవించాలన్నారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీపీ మాజీ ఎంపీపీ ఎంపీటీసీ,వార్డు మెంబర్లు,అర్చకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

లీకు ద్రోహులను శిక్షించాలి నిరుద్యోగులకు న్యాయం చేయాలి

లీకు ద్రోహులను శిక్షించాలి
నిరుద్యోగులకు న్యాయం చేయాలి

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

హుస్నాబాద్ లో కేటీఆర్ దిస్తి బొమ్మ దహనం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల చిత్రపటాలను దహనం చేశారు నాలుగు లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటమాడిన టీఎస్పీఎస్సీ చైర్మన్ ను విధుల నుండి తొలగించి, టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న ఎమ్మెల్సీ కవిత కోసం రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేసి మంత్రులందరూ ఢిల్లీకి వెళ్లడం సిగ్గుచేటన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యాభివృద్ధి సేవలకు గాను లభినున్న జాతీయ పురస్కారాలు

విద్యాభివృద్ధి సేవలకు గాను లభినున్న జాతీయ పురస్కారాలు

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల/మేడ్చల్‌

సీఎస్అర్ నిధులతో రాజన్న సిరిసిల్ల, మేడ్చల్‌ జిల్లాల ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గానూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నీపా) అవార్డును ఈ నెల 23 న కేంద్ర మంత్రి చేతుల మీదుగా జిల్లా పూర్వ విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్, మేడ్చల్‌-మల్కాజిగిరి విద్యాధికారి విజయకుమారి అందుకోనున్నారు. ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.

జిల్లాలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్: జిల్లా ఎస్పీ

జిల్లాలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్: జిల్లా ఎస్పీ

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

జిల్లాలో 12 మంది బృందంతో విపత్తు నిర్వహణ పరిస్థితులలో పోలీసులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు ప్రతిస్పందన దళాన్ని(Disaster Response Force)టీమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.. ఈ సందర్భంగా ఎస్పీ
మాట్లాడుతూ జిల్లా పరిధిలో ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం ఇద్దరు RSI లతో పాటు పది మంది కానిస్టేబుల్స్ (2+10)తో DRF టీమ్ ఏర్పరిచి హైద్రాబాద్ లోని DRF శిక్షణ కేంద్రం నందు తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందని సుశిక్షితులైన DRF సిబ్బంది భారీ వర్షాలు వరదలు ఫైర్ అసిసిడెంట్స్ భవనాలు కూలిపోయినవుడు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా వివిధ శాఖల అధికారులను సమన్వయ పర్చుకుంటు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా DRF టీమ్ కి 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చినందుకు GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ ప్రకాష్ రెడ్డి కి జిల్లా ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

వడగండ్ల వాన నష్టం పై నివేదిక కోరిన: మంత్రి

వడగండ్ల వాన నష్టం పై నివేదిక కోరిన: మంత్రి

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన వడగండ్ల వర్షం తో కలిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కలెక్టర్ అనురాగ జయంతిని ఆదేశించారు..జిల్లాలో శనివారం కురిసిన వడగళ్ల వానతో జరిగిన నష్టాలను పంట నష్టపోయిన రైతుల వివరాలను క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు పరిశీలించి జాబితా సిద్ధం చేయాలని తెలిపారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...