33.2 C
Hyderabad
Thursday, April 23, 2026

మతాలకు అతీతంగా పండుగలు జరుపుకుందాం: డీసీపీ సుదీర్ రాంనాథ్

మతాలకు అతీతంగా పండుగలు జరుపుకుందాం: డీసీపీ సుదీర్ రాంనాథ్

యదార్థవాది ప్రతినిధి మంచిర్యాల

మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల జైపూర్ బెల్లంపల్లి సబ్ డివిజన్ లో గురువారం హిందూ ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశాన్ని మంచిర్యాల డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిసిపి సుధీర్ రామ్నాథ్ కేకన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న ప్రవిత్రమైన రంజాన్ మాసంతో పాటు ఈ నెల చివరిలో వస్తున్న శ్రీరామ నవమి హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎన్నో ఏళ్లుగా మతాలకు అతీతంగా గౌరవించి ప్రతి పండుగను సోదరభావంతో శాంతియుతంగా జరుపుకుంటున్నామని ఈ సంవత్సరం కూడా అన్నదమ్ముల జరుపుకుందాంమని తెలిపారు. జిల్లా పరిధిలో ప్రతి ఒక్కరు సోదర భావం కలిగివుండి శాంతియుత వాతారణంలో మీడియాలో వచ్చే వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అసత్య వార్తలను నమ్మి ప్రచారం చెయ్యవద్దని తెలిపారు. ఏ సమస్య వచ్చిన స్పష్టంగా మత పెద్దలు పోలీసుల దృష్టికి తీసుకు రావాలని పోలీస్ విధులు ఆటంకం కలిగించరాదని డిసీపీ కోరారు. సోషల్ మీడియాలో మతాలను కించపరుస్తూ అసత్యపు పుకార్లను సృష్టించాలని ఎవరైనాసోషల్ మీడియా లో పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఏ చిన్న సంఘటన జరిగిన స్థానిక పోలీసులకు డయల్ 100 ఫోన్ చేసి సమాచాలని చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని చట్టానికి అందరూ సమానమేనని డిసీపీ తెలిపారు. సమావేశంలో మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి జైపూర్ ఏసీపీ నరేందర్ బెల్లంపల్లి ఏసీపీ సదయ్య మంచిర్యాల పట్టణ సీఐ రాజు రూరల్ సీఐ సంజీవ్ మత పెద్దలు ఎస్సైలు పాల్గొన్నారు.

పోలీసులు ప్రజల మన్ననలు పొందాలి: జిల్లా ఎస్ పి

పోలీసులు ప్రజల మన్ననలు పొందాలి: జిల్లా ఎస్ పి

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

జిల్లా లోని చందుర్తి సర్కిల్ కార్యాలయంలో గురువారం పోలిస్ స్టేషన్ లో ఉన్న రికార్డులను ఫంక్షనల్ వర్తికాల్స్ పనితీరు సిబ్బంది యెక్క నామినల్ రోల్ పరిశీలించి, సర్కిల్ పరిధిలో ఏ తరహా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయిని జిల్లా ఎస్ పి అఖిల్ మహజెన్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారితనంగా విధులు నిర్వహించాలని స్టేషన్ వచ్చే ఫిర్యాదులను జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని కేసుల వివరాలను ఆన్లైన్లో ఉంచాలని బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచరాదని సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బ్లూకోట్స్ పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని ఆన్లైన్ మోసాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని ఎస్ పి మహాజన్ తెలిపారు. ప్రతిరోజు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాల నివారించడానికి కృషి చేయాలని అన్నారు. సైబర్ నేరాల నియంత్రణ గూర్చి గ్రామాలలో పట్టణాలలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువతకు గ్రామా పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నేర నియంత్రణలో సీసీ కెమెరా ల ప్రాముఖ్యత ప్రజలకు వివరించి సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ వెంట సి.ఐ కిరణ్ కుమార్ ఎస్.ఐ రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయులకు ఘన నివాళి

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహనీయులకు ఘన నివాళి

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

భారతదేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా
నివాళులర్పించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం అలుపెరగని మహనీయులు సుఖ్ దేవ్ రాజ్ గురు భగత్ సింగ్ ల బలిదానాలను స్మరిస్తూ వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొవలని మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పునరంకితం కావాలని స్వతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వనికి నిద్ర లేకుండా చేసిన యువ వీర కిశోరాలు సుఖదేవ్ భగత్ సింగ్ రాజ్ గురు. “ఇన్కలాబ్ జిందాబాద్” అనే నినాదం వీరితోనే పుట్టిందని భారత మాత కోసం ఉరికోయ్యల్ని ముద్దాడి నవ్వుతూ “మేరారంగ్ దే బసంతీ చోలా” అంటూ తమ రక్తం తో హోలీ జరిపిన భారత మాత ముద్దు బిడ్డలు చనిపోయి జీవించడం అంటే ఏంటో చూపించారని వారి త్యాగాలని సంస్మరించుకుంటూ ఆ స్పూర్తితో మనం కూడా దేశ భక్తిని ని గుండెల్లో నింపుకుందామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కస్తూరి ప్రవీణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంచెపు ఆనంద్ బీసీ అధ్యక్షుడు కారంపూరి రవి కుమార్ యువజన అధ్యక్షులు అంకార్ గణేష్, సంతోష్ సాగర్ సాయి రాం మహిళ నాయకులు రేఖ రాణి తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు రుణాల మంజూరులో జాప్యం తగదు: జిల్లా కలెక్టర్

దివ్యాంగులకు రుణాల మంజూరులో జాప్యం తగదు: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

జిల్లా దివ్యాంగులకు రుణాల మంజూరు విషయంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధి పొందే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా దివ్యాంగుల సాధికారికత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కొరకు బ్యాక్ లాగ్ వేకెన్సీ లు అన్నింటిని త్వరగా భర్తీ చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ విషయంలో సదరంలో ఉండి పెన్షన్ తీసుకుంటున్న విద్యాశాఖ నుంచి వివరాలను తీసుకొని అందరికీ ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్లు అందేవిదంగా చూడాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. దివ్యాంగులకు ఇచ్చే బ్యాంకు లోన్ల విషయంలో లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రతి ఒక్కరికి తొందరగా రుణాలు మంజూరు అయ్యేలాగా చూడాలని జిల్లా పరిశ్రమల కేంద్రం టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ నిర్వహించి దివ్యాంగులకు నైపుణ్యాలు పెంపొందించి వారు కూడా ఇతరులతో సమానంగా అవకాశాలు పొందడానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. పోలీస్ స్టేషన్ ప్రభుత్వ కార్యాలయాలలో దివ్యాంగులకు సహాయపడడానికి ప్రతి ఒక్కరూ వితోదికంగా కృషి చేయాలని దివ్యాంగుల పట్ల వివక్ష చిన్న చూపులేకుండా వుండాలని ఎవరైనా వారి పట్ల వివక్ష చూపించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం జిల్లా కార్మికశాఖ అధికారి ఎండీ.రఫీ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు జీసీడీఓ పద్మజ డీసీపీఓ స్వర్ణలత చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ త్రివేణి కమిటీ సభ్యులు పున్నం చందర్ ఖాజా మోయినొద్దీన్ ఈశ్వర్ మామిడాల నరేష్ కోడం శ్రీనివాస్ మామిడి పరుశురాములు గోగికారి రాము తిరుపతి వినయ్ కుమార్ పరశురాములు తదితరులు పాల్గొన్నారు..

విద్యార్థి దశనుండి ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవాలి

విద్యార్థి దశనుండి ట్రాఫిక్ నిబంధనలు తెలుసు కోవాలి

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

తడ్కపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు భద్రత ప్రమాదాల గూర్చి అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఏసిపి ఫణీందర్ సిఐ రామకృష్ణ.. సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ ఏ కారణము లేని మరణం ఒక రోడ్డు ప్రమాదం మాత్రమేనని ప్రతి ఒక్క వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు కిరువైపులా ఏర్పాటుచేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు పాటిస్తూ సేఫ్టీ గా డ్రైవింగ్ చేస్తు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు భద్రత పాటించడం నేర్చుకోవాలని తెలిపారు…
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ రోడ్డు మీద ఉన్న సైన్ బోర్డుల గుర్తులను విద్యార్థులకు వివరించారు వేగంగా వెళ్లే వాహనానికి, సాధారణ స్పీడ్ తో వెళ్లే వాహనానికి తేలిక 15 నిమిషాలు మాత్రమే తేడా ఉంటుందని మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కారు నడిపేటప్పుడు సీటు బెల్టు తప్పనిసరిగా పెట్టుకోవాలని రోడ్డు ప్రమాదాల నివారణ గూర్చి ప్రతి సంవత్సరం భద్రత వారోత్సవాలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని వాహనదారులు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో హై స్కూల్ హెడ్మాస్టర్ మహతి లక్ష్మి అధ్యాపకులు ట్రాఫిక్ ఎస్ఐ గోపాల్ రెడ్డి పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

క్యూ న్యూస్ ఛానల్ బ్యాన్ చేయాలి

క్యూ న్యూస్ ఛానల్ బ్యాన్ చేయాలి

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత పైన నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్న తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవలని క్యూ న్యూస్ ఛానల్ బ్యాన్ చేయాలనీ మంగళవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు కు పిర్యాదు చేసిన తెలంగాణ జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు మక్కల సాయినాథ్ పట్టణ అధ్యక్షుడు దండుగుల నాయుడు జాగృతి నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు భూమేష్ రాజు దండుగుల రాజేశ్వర్ సాయికుమార్ పిరియా రమేశ్ చింటూ తదితరులు ఫిర్యాదు చేశారు.

మావోయిస్టు ప్రభావిత పోలీస్ స్టేషన్ లను సందర్శించిన: పోలీస్ కమిషనర్

మావోయిస్టు ప్రభావిత పోలీస్ స్టేషన్ లను సందర్శించిన: పోలీస్ కమిషనర్

యదార్థవాది ప్రతినిధి మంచిర్యాల

మావోయిస్టు ప్రభావిత దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజి) మంచిర్యాల డీసీపీ సుదీర్ రాంనాథ్ కేకన్ ఏసీపీ తిరుపతి రెడ్డి లతో కలిసి సందర్శించారు.. ఈ సందర్బంగా సీపీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ లను సందర్శించి పోలీసు స్టేషన్ లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని దానిలో భాగంగా మంళవారం దండేపల్లి, జన్నారం పోలీస్ స్టేషన్ అనేది చాల చారిత్మక పొలీసు స్టేషన్ ప్రాంతం, కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పొలీస్ స్టేషన్ ల పరిధిలో ఉన్నటువంటి ట్రైబల్ ప్రాంతంలో ప్రజల కోసం కమ్యూనిటి కనక్ట్ కార్యక్రమాలను నిర్వహించాలని మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ ప్రాంతాలను తిరిగి, “గ్రామ పొలీసు” అధికారి వ్యవస్థను పటిష్టం చేస్తామని ప్రజల కోసం పోలీస్ తరుపున చేసే ప్రతి కార్యక్రమం లో ఈ ప్రాంతంలోని ప్రజల సహకారం ఉండాలి తెలిపారు. కార్యక్రమం లో లక్షేట్టిపేట సీఐ కృష్ణ రెడ్డి ఎస్ఐ దండేపల్లి సాంబ మూర్తి ఎస్ఐ జన్నారం సతీష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

జిల్లా ప్రజలకు శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు: మంత్రి హరీష్ రావు

జిల్లా ప్రజలకు శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు: మంత్రి హరీష్ రావు

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరీష్ రావు జిల్లా  ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలని ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ…తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శ్రీ శోభకృత్ నా అంత శోభయమానంగ విరిజిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చిందని ఈ సంవత్సరం ఏడు కాలంతో ప్రమేయం లేకుండా కాళేశ్వరం జలాలతో కాలువలు, చెరువులు కుంటల్లో నీళ్లు సమృద్ధిగా నిండి ఉన్నాయని మండుటెండల్లో చెక్ డ్యామ్ లు..వాగులు జల సిరులు చుస్తున్నామని రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలని అన్నారు.
శోభకృత్ సంవత్సరంలో అన్ని పాలద్రోలి అన్నింటా శుభం జరగాలని ఈ పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని మంత్రి ఓ
పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.

పాఠశాలల్లో ఘనంగా ఉగాది ఉత్సవాలు

పాఠశాలల్లో ఘనంగా ఉగాది ఉత్సవాలు

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

ఆర్మూర్ పట్టణం లోని పాఠశాలల్లో ప్రజ్ఞ హైస్కూల్, నారాయణ స్కూల్ ఆద్వర్యములలో ఉగాది పండుగ’ శోభకృత్ నామ సంవత్సరం పురస్కరించుకొని ప్రవేట్ పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థుల ఆద్వర్యములో పాఠశాలలో ప్రాంగణములో ప్రతి యేటా ఉగాది పండగ పాఠశాలలో ప్రజ్ఞా హై స్కూల్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, కరస్పాండెంట్ జ్యోతి, ప్రిన్సిపాల్ శశికళ నారాయణ స్కూల్ ఏజీఎం శివాజీ, ప్రిన్సిపాల్ గోపీనాథ్ ఉపాద్యాయుల సమక్షంలో ఘనంగా ఉగాది ఉత్సవాలను నిర్వహించరు.

మోడల్ ఆటోనగర్ లో నిర్మాణం పనులు పూర్తి: జిల్లా కలెక్టర్

మోడల్ ఆటోనగర్ లో నిర్మాణం పనులు పూర్తి: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండేలా 50 కోట్ల రూపాయల విలువైన 25 ఎకరాల స్థలంలో 15 కోట్ల రూపాయల వ్యయంతో సిద్దిపేట ఇండస్ట్రియల్ పార్క్ లో మోడల్ ఆటోనగర్ కు గతంలోనే రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా శంకుస్థాపన చేసుకున్నామని ఆటోనగర్ లో నిర్మాణం పనులు పూర్తి దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని కాన్ఫరెన్స్ హల్ లో ఆటో నగర్ యూనియన్ నాయకులతో మాట్లాడుతూ ఆటో నగర్ లో ఉన్న షాప్ ఓనర్లకు మాత్రమే అర్హులని TSIIC సంస్థ వారు పరిశ్రమలకు లీజ్ పద్దతిలో అందజేస్తామని ట్రేడ్ లైసెన్స్ పోటో కాపితో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యత పద్దతిలో సర్టిఫికెట్లు జారి చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ బోర్డు సభ్యులు పాల సాయిరాం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...