33.2 C
Hyderabad
Thursday, April 23, 2026

జానప నార సంచులతో ఎంతో మేలు

జానప నార సంచులతో ఎంతో మేలు

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

ప్రకృతి ప్రేమికుడు కొట్టురు అశోక్ సొంత నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూన్నరు. వస్తున్నారు. అందులో భాగంగానే బుధవారం ఆర్మూర్ పట్టణంలో జానప నార సంచులను మార్కెట్ కు వచ్చే వారికి పంచారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా మానేయాలని పర్యావరణ హితమైన జీవనాన్ని ఆస్వాదించాలని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం తో పాటు పర్యావరణ శ్రేయస్సు కు దోహదపడి ప్రజలందరి ఆరోగ్యం మెరుగు పడుతుందని తెలిపారు.

ఘనంగా పందిళ్ళ గ్రామంలో శ్రీ సీత రాముల శోభాయాత్ర

ఘనంగా పందిళ్ళ గ్రామంలో శ్రీ సీత రాముల శోభాయాత్ర

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్
శ్రీరామనవమి సందర్భంగా పలుచోట్ల భక్తులు శ్రీ సీతారాముల శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలో శ్రీ సీత రాముల శోభాయాత్రను భక్తులు వైభవంగా నిర్వహించారు. కోలాటాలతో, డప్పు చప్పుల్లతో నిర్వహించిన ఈ శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొన్నారు. గ్రామమంతా సీతారాముల నామస్మరనతో మారు మ్రోగింది. పందిల్ల స్టేజి వద్ద ఉన్న దేవాలయంలో గురువారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు జరగబోయే కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. స్వామి వారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా పాడిపంటలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ శోభయాత్రలో కౌన్సిలర్ బొమ్మగాని అంజయ్య, గౌరవ అధ్యక్షులు మాదాటి వెంకట్రెడ్డి, తాటికొండ జైపాల్ రెడ్డి ,ఎల్లా గౌడ్ కిష్టయ్య, లక్ష్మణ్, కృష్ణ, తిరుపతి ఐలయ్య గౌడ్, అలుమల్ల బూట్ల రెడ్డి, తాడూరి బాబు బొమ్మగాని రవీందర్ గౌడ్ మహిళలు పాల్గొన్నారు,

రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్

రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

రైతుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు 10 వేలు ప్రకటించారని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బిందు సేద్యం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతుల కొరకు బీజేపీ మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని నల్ల చట్టాలు తెచ్చి 800 మంది రైతుల ఉసురు తీశారని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు రైతు బంధు రైతు భీమా నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా. ? తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండగా ఉన్నారని మంత్రి తెలిపారు. కేంద్రం మరోసారి యాసంగి వరి పంట కొనమని చేతులెత్తేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గింజ కొంటామని తేల్చి చెప్పారని రైతులను కేసీఆర్ ఓదారిస్తే బీజేపీ వంకర మాటలు మాట్లాడుతున్నదని ఎద్దేవాచేశారు. తెలంగాణ రాష్ట్రం తరహా పాలన దేశంలో కావాలని పక్క రాష్ట్రాలలో ధర్నాలు నిరసనలు ఆందోళనలు అక్కడి ప్రజలు చేస్తున్నారని అన్నారు.
వడగండ్ల వానకు సీఎం కేసీఆర్ ఎకరాకు 10 వేలు ప్రకటిస్తే..10 వేలు చాలవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సన్నాయి నొక్కులు నొక్కతున్నారని మీకు తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 10 వేలు ఇస్తున్నారని కేంద్రం ప్రభుత్వం 10 వేలు ఇస్తే రైతుకు మేలుజరుగుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రం నుండి 10 వేలు ఇప్పియలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చేర్పర్సన్ రోజా శర్మ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జిల్లా ఉద్యావన అధికారి టిఆర్ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

కార్మిక వర్గానికి ఉరితాడు బిగించాలని చూస్తున్న: బిజెపి ప్రభుత్వం

కార్మిక వర్గానికి ఉరితాడు బిగించాలని చూస్తున్న: బిజెపి ప్రభుత్వం

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

మంచిర్యాల జిల్లా పట్టణంలో రాష్ట్ర 9వ
ఐ ఎఫ్ టీ యు మహాసభలకు ఆర్మూర్
నుండి ఐ ఎఫ్ టీ యు నాయకులు ప్రతినిధులను జిల్లా ఉపాధ్యక్షులు బి సూర్య శివాజీ భారీగా తరలించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ ఎఫ్ టీ యు నాలుగున్నర దశాబ్దల కాలంలో కార్మికుల సమస్యలపై పోరాడుతూ శ్రామికులును కూడగట్టి కార్మిక రాజ్య సాధనకై ఉద్యమిస్తుందని మోడీ సర్కార్ 8 సంవత్సరాల్లో దేశ సంపదను సహజ వనరులను కార్పోరేట్ కంపెనీలను అధిపతులకు కట్టబెట్టి కార్మికుల ఉపాధిని కొల్లగొట్టిందని నల్ల ధనం వెలికి తీసి పేదప్రజలకు జన్దన్ ఖాతాలో 15 లక్షల చొప్పున జమ చేస్తానని ఏటా రెండు కోట్ల కొలువులు ఇస్తామని ధరలను నియంత్రిస్తామని ఇచ్చిన హామీలను విస్మరించారని కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను సవరణ పేరుతో నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చి కార్మిక వర్గానికి ఉరితాడు బిగించారని అన్నారు. బిజెపి ప్రభుత్వం ఒకే భాష ఒకే మతం ఒకే ఆహారం పేరుతో భిన్న జాతుల మధ్య మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ ఉద్రిక్తత పెంచుతుందని దళిత గిరిజన మహిళ మైనార్టీ బీసీలపై నిరంతరం దాడులు జరుగుతున్న కేంద్రం పట్టించుకోకుండా ప్రజల్ని విభజించు పాలించు అన్న నీతితో విడగొడుతుందని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇచ్చిన హామీలను పక్కకు పెట్టిందని రాష్ట్రంలో 3 లక్షల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ విషయాన్ని మర్చిపోవడం విచారకరమని పెరుగుతున్న ధరల కనుగుణంగా 76 రంగాల కార్మిక కనీస వేతనం జీవోలను సవరించి గెజిట్ లో ప్రచురించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర, మహాసభలను జయప్రదం చేయాలని శివాజీ గంగాధర్ కార్మిక లోకానికి కోరారు. కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు జిల్లా సహాయ కార్యదర్శి జే గంగాధర్ నాయకులు పోశెట్టి సుప్రియ,అనురాధ లక్ష్మి, ధనలక్ష్మి గోదావరి తదితరులు పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

పోలీస్ కమిషనరెట్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నూతన భవనాన్ని శుక్రవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు..ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ ను తలపిస్తున్న నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటును ప్రభుత్వం పరంగా కాకుండా నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకోవడం అత్యుత్తమ పనితీరుకు నిదర్శమని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యాచరణలో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేకంగా శాంతి శాంతిభద్రతల్లో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని అందుకు తగ్గట్లుగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకున్నామని తెలంగాణలో పోలీస్ వ్యవస్థ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రధానమని అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టత వల్ల పారిశ్రామికీకరణ పెట్టుబడులు రావడం జరుగు తుందని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను 160 సి.సి కెమెరాలతో పటిష్ట పరిచి హెచ్.డి క్లారిటీ కెమెరాల సాయంతో నగర శాంతి భద్రతలను కాపాడుతుందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరం తర్వాత రాష్ట్రంలోనే ఇంతటి గొప్ప ఏర్పాట్లను నిజామాబాద్ కలిగి ఉంటుందని ఈ ఘనత కమీషనర్ కు దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నగర మేయర్ శ్రీమతి దండు నీతూ కార్పోరేటర్ శ్రీమతి పంచరెడ్డి నర్సూబాయి ఏ.సి.పిలు సి.ఐలు ఎస్.ఐలు రిజర్వు ఇన్స్పెక్టర్స్ ఆర్.ఎస్.ఐలు పోలీస్ హౌజింగ్ బోర్డు ఈ. ఈ టి. ఈశ్వర్ పోలీస్ ఐ.టి కోర్ సిబంది పాల్గొన్నారు.

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతోంది: పోలీస్ కమీషనర్

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతోంది: పోలీస్ కమీషనర్

యదార్థవాది ప్రతినిధి రామగుండం

పోలీస్ కమిషనరేట్ పరిధి ఆర్మేడ్ రిజర్వ్ విభాగం నందు పని చేస్తూ పదోన్నతులు పొందిన 68 మంది పోలిస్ సిబ్బందిని పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి (డిఐజి) రామగుండం పోలీస్ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పోలీసులు నిరంతరం శ్రమిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ద లేకుండా ఉంటారని వయస్సు పైబడిన అనంతరం ఆ వ్యాధి భాధలు తెలుస్తాయని సమయం దొరికినప్పుడల్లా యోగ వాకింగ్ రన్నింగ్ చేస్తూ ఆరోగ్య పరిరక్షణ కోసం పాటుపడాలని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు సాధించవచ్చని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మోహన్ ఏ ఆర్ ఏ సి పి సుందర్ రావు ఆరైలు మధుకర్ శ్రీధర్ విష్ణు ప్రసాద్ రామగుండం కమిషనరేట్ పోలిస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచ లింగం ఆర్ఎస్ఐ లు రాజేష్ ప్రవీణ్ అనిల్ విశ్వజా పోలిస్ సిబ్బది పాల్గొన్నారు.

మహిళల భద్రతే లక్ష్యం

మహిళల భద్రతే లక్ష్యం

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణంలో సాయి మణికంఠ ఫంక్షన్ హాల్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళ భద్రతే “షీ టీమ్” లక్ష్యం కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. విద్యార్థిని విద్యార్థులకు ఉమెన్ సేఫ్టీ సైబర్ క్రైమ్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్ అంశాలపై అవగాహన కల్పిస్తూ మహిళల రక్షణ షీ టీమ్ యెక్క ప్రాముఖ్యత విద్యార్థినులకు అవగాహన కల్పించరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి మన దేశంలో ఎక్కడ లేనటువంటి ఆవిష్కరణలలో మహిళల రక్షణ భద్రత కోసం చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ప్రతి జిల్లాలో షీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళా సురక్షితంగా అంటే మహిళలకు మాత్రమే బాధ్యత కాదని అది అందరి బాధ్యతగా ఉండాలని ఎవరైనా విద్యార్థులను మహిళలను ఇబ్బందిలకు గురి చేయడం ఈవ్ టీజింగ్ చేసినప్పుడు వారిని మీరు ప్రశ్నించాలని అది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని అన్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళలను ఎవరైనా వెంబడిస్తే వెంటేనే జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కి సమాచారం అందివ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడటం జరుగుతుదని మైనర్ బాలికల పై ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని విద్యార్ధిని విద్యార్ధుల సోషల్ మీడియా(ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్)కు దూరంగా ఉండాలని మహిళలపై వేధింపులు అఘాయిత్యాలు సోషల్ మీడియా వేధింపులు ఆన్లైన్ వేధింపులు సైబర్ క్రైమ్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని ఇలాంటి వేధింపులకు గురి కాబడే వారు చదువుకొని సాంకేతిక పరిజ్ఞానం తెలిసినవారే ఎక్కవగా బాధితులుగా ఉంటున్నారని జిల్లాలో సైబర్ నేరాల ఆన్లైన్ ఫ్రాడ్స్ మీదఅవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే వ్యక్తిత్వ వికాసం ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఇక్కడున్న పోలీసు అధికారులు ఉపాధ్యాయులు అందరూ ఇప్పుడు ఇలా మంచి హోదాలో ఉన్నారంటే దానికి ప్రధాన కారణం చదువువని ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనంలో మంచిగా చదువుతూ యుక్త వయసు కాలేజీ జీవితంలోకి వచ్చాక విద్యపై నిర్లక్ష్యం తో జీవితం నాశనం చేసుకుంటారని సక్సెస్ అనేది ఒక కొలమానంతో కొలిచేది కాదని జీవితంలో క్రమశిక్షణ పాటిస్తూ పద్ధతి ప్రకారం జీవితం కొనసాగించడమే సక్సెస్ అన్నారు. మీ తల్లిదండ్రులు ఏదో రకంగా కష్టపడి పని చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగిందని ఎప్పుడు మర్చిపోకూడదని తల్లిదండ్రులను అర్థం చేసుకొని గౌరవిస్తూ వారి కోరికలను నెరవేస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలని ఎస్ పి సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ విస్వప్రసాద్ సి.ఐ అనిల్ కుమార్ మండల విద్య శాఖ అధికారి రఘుపతి షీ టీమ్ ఎస్.ఐ ప్రేమ్ దీప్ ఎస్.ఐ లు రాజు శ్రీకాంత్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు షీ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు..

మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై నిఘా

మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై నిఘా

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో గురువారం అన్ని మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించిన ఎస్ పి
అఖిల్ మహాజన్..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులకు సహకరించాలని కోరారు. రాబోయే పండగలు రంజాన్ శ్రీరామ నవమి హనుమాన్ జయంతి పండుగలను కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతవరణంలో జరుపుకుందామని సోషల్ మీడియాలో మత కలహాలను సృష్టించే విధంగా విద్వేషపూరిత పుకార్లను నమ్మవద్దని నిజనిజాలు తెలియకుండా మనకు వచ్చిన అసత్యపు సోషల్ మీడియా సందేశాలను నిజామా అబద్దమా అని ఆలోచించకుండా ఇతరులకు షేర్ చేయకుడదని ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వారు పోలీసులకి సహకరించాలని తెలిపారు.
ప్రజాభద్రత లా & ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతి యుత జీవనం గడిపేల చూడడం జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యంఅని శాంతి కి భంగం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సిరిసిల్ల జిల్లా ప్రజలు అన్నదమ్ముల వలే కలిసి ఉండి ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా అందరికి అన్ని ప్రాంతాల వారికీ ఆదర్శంగా నిలివాలని తెలిపారు. కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ విస్వప్రసాద్ సి.ఐ అనిల్ కుమార్ టౌన్ మండల రెవెన్యూ అధికారి విజేయ్ ఎస్.ఐ రాజు అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు..

జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయి: జిల్లా కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయి: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల

సిరిసిల్ల పట్టణంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికి నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌క్వాస్‌) సర్టిఫికెట్ వచ్చిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హర్షం వ్యక్తం చేశారు.. ఇదివరకే జిల్లాలో వేములవాడ తంగళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ సర్టిఫికెట్ రాగా ఇటీవలే కోనారావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రనికి కూడ ఎన్‌క్వాస్‌ గుర్తింపు దక్కిందని తెలిపారు. జిల్లాలో వైద్య ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పడానికి మరో నిదర్శనమని నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్‌ రిసోర్స్‌ సెంటర్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ) నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను చేరుకొంటే ఎన్‌క్వాస్‌ సర్టిఫికెట్‌ వస్తుందని దీనికి మూడేండ్ల వ్యాలిడిటీ ఉంటుందని జిల్లా ప్రజలకు పీహెచ్‌సీ స్థాయి నుంచే నాణ్యమైన వైద్యం అందుతున్నదని చెప్పడానికి కేంద్రం ఇచ్చిన ఈ గుర్తింపు ఒక నిదర్శనమని అన్నారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. మంత్రి కే తారక రామారావు ప్రత్యేక చొరవతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయని విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయని ఓపీ ఐపీ సర్జికల్‌ ఇలా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగిందని జిల్లా కలెక్టర్ అన్నారు.

మల్లన్నను వెంటనే విడుదల చేయాలి

మల్లన్నను వెంటనే విడుదల చేయాలి

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

క్యూ న్యూస్ జర్నలిస్టు మల్లన్నపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడంపై నిజామాబాద్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు బుస్సాపూర్ శంకర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులతో జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూడడం సరైన పద్దతి కాదని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న జర్నలిస్టులను వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురి అయ్యేలా దాడులకు దిగడం సరైనది కాదని అక్రమ కేసులతో పత్రికా స్వేచ్ఛను నిర్బంధించడం తగదని తక్షణమే తీన్మార్ మల్లన్న పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయలని అన్నారు. తీన్మార్ మల్లన్న ను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి ఇప్పటివరకు ఆచూకీ తెలపడం లేదని ఆవేదన చెందుతున్న తీన్మార్ మల్లన్న భార్య ఆమె తెలంగాణ ఆడబిడ్డ కాదా.. ఇప్పటికైనా మల్లన్న ఆచూకీ తెలపాలని బుస్సాపూర్ శంకర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కుంచెపు ఆనంద్ యువజన నాయకులు కారంపూరి రవి కుమార్ అంకర్ గణేష్ సంతోష్ సాగర్ సాయిరాం బగ్గీలి కృష్ణ మహిళ నాయకులు రేఖ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...