27.7 C
Hyderabad
Thursday, April 23, 2026

మరోమారు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు: జిల్లా కలెక్టర్

మరోమారు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ
గడువు పొడిగింపు: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట

*58, 59 క్రింద భూ క్రమబద్ధీకరణకు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.
అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న పేదప్రజల ఇల్లు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ 30 వరకు మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు తెలంగాణ ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పట్రిక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 58, 59 ప్రకారం అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇల్లు ఇంటి స్థలాల క్రమబద్ధీకరణకు 2014 జూన్ 02 కటాఫ్ తేదీ ఉండగా దానిని 2020 జూన్ 02 కు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 17వ తారీఖున ఉత్తర్వుల సంఖ్య 29ను జారీ చేసి నూతనంగా భూ క్రమబద్దికరణకు దరఖాస్తులు చేసుకునేందుకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు అవకాశం కల్పించిందని మీ సేవా ద్వారా ఏప్రిల్ 30 లోపు ఎలక్ట్రిసిటీ బిల్లు రిసిప్ట్ ఇంటి పన్ను రసీదు ఇతర సంబంధిత పాత్రలతో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

మన చేతిలో మన భద్రత

మన చేతిలో మన భద్రత

యదార్థవాది ప్రతినిధి మంచిర్యాల

మంచిర్యాల పట్టణ కేంద్రంలో సేవ్ లైఫ్ నినాదంతో టీ షర్ట్స్, హెల్మెట్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ ఆధ్వర్యంలో శనివారం హెల్మెట్‌ ధరించని వాహనదారులకు పిల్లలతో గులాబీ పువ్వు ఇప్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని మద్యం తాగి సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనం నడపరాదని ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లరాదని ట్రాఫిక్‌ నిబంధనలు పాటించలని వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ తప్పని సరిగా ఉండాలని తెలిపారు. జంక్షన్‌ల వద్ద, సిగ్నల్స్‌ల వద్ద నిబంధనలను అతిక్రమించరాదని మితిమీరిన వేగంతో వాహనం నడిపేవారిపై చట్టపరంగా జరిమానాలు విధించనున్నట్లు తెలిపారు..

ప్రజలు ఎమ్మెల్యే గా చూడాలని కోరుకుంటున్నారు….. కర్ణకంటి మంజులారెడ్డి

ప్రజలు ఎమ్మెల్యే గా చూడాలని కోరుకుంటున్నారు….. కర్ణకంటి మంజులారెడ్డి

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

జెండా అజెండా లతో సంబంధం లేకుండా తనను ఎమ్మెల్యే పదవిలో చూడాలని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులారెడ్డి అన్నారు.. ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఏదో ఒక గుర్తుతో పోటీ చెయ్యడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కెఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 ను సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆమె మహిళలు యువకులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ నెహ్రూ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి బైక్ ర్యాలీగా క్రీడా మైదానానికి చేరుకోని క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేసి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అమే మాట్లాడుతూ మంజులక్క యువసేన జెండా హుస్నాబాద్ నియోజకవర్గంలో కచ్చితంగా ఎగురుతుందని నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలుగా సేవ చేస్తూ కష్టపడుతున్న మహిళనైన తనకు నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలతో ప్రభుత్వం అధికార యంత్రాంగం చెలగాటమాడుతోందని ఇందుకు నిదర్శనం టీఎస్ పి ఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారమేనని దీనికి కారణం లోపభూయిష్టంగా ఉన్న ఈ రాజకీయ వ్యవస్తేనాని తెలిపారు. రాజకీయ మార్పు అనేది మంజులక్క యువసేనతోనే ప్రారంభం అవుతుందని తానను ఎమ్మెల్యేగా గెలిస్తే ఎల్లమ్మ తల్లి సాక్షిగా వచ్చే సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ ను మరింత గ్రాండ్ గా నిర్వహిస్తానని నియోజకవర్గంలో మహిళలు యువకులు తనకు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారని ఇది నాకు దేవుడిచ్చిన వరమని తెలిపారు. ఈ కార్యకమంలో యువతీ యువకులు మహిళలు యువసేన నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

 

పల్లెలు అభివృద్ధి వైపు అడుగు వేయాలి: పోలీస్ కమిషనర్

పల్లెలు అభివృద్ధి వైపు అడుగు వేయాలి: పోలీస్ కమిషనర్

* యువత చదువులో ముందుండాలి..

యదార్థవాది ప్రతినిది మంచిర్యాల

మంచిర్యాల జోన్ సబ్ డివిజన్ పరిధి జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లి నగర్ గ్రామంలో శుక్రవారం పోలీస్ ఆధ్వర్యంలో 300 మంది మహిళలకు చీరలు యువకులకు వాలీ బాల్ కిట్స్ అందచేసిన రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి (డిఐజి) మంచిర్యాల డీసీపీ సుధీర్ రామనాథ్ కేకన్.. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మారు మూల గ్రామలైన అల్లి నగర్ దొంగపల్లి మల్యాల బొమ్మేనా పైడి పల్లి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖ తరుపున ఒక మంచి ఉద్దేశంతో పోలీస్ మీకోసం కార్యక్రమం ద్వారా ఇక్కడికి రావడం జరిగింది పల్లెలు దేశానికి పట్టుకోమ్మలని విద్యతోనే అభివృద్ధి జరుగుతుందని పిల్లలకు చదువు ఏంటో నేర్పిస్తుందని యువతీ యువకులు చదువుకొవడానికి కేజీ నిండి పి జి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈ ప్రాంతం లోని పిల్లలు పెద్ద స్థాయిలో ఎదగాలి ఉద్యోగంతో మన పల్లె యువతీ యువకులు ఉండాలని ఉద్యోగ పరంగా వాళ్ళకి కాంపిటీవ్ ఎగ్జామినేషన్ చదువుకు అవసరం ఉన్నటు వంటి సహాయం కోచింగ్ సెంటర్ లో జాయిన్ చేయించడం కోచింగ్ మెటీరియల్ ఇప్పివడం జరుగుతుందని పోలీస్ తరుపున మీకేం కావాలో తెలియచేయాలని డిపార్ట్మెంట్ తరఫున అందిస్తానని తెలిపారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం తరుపున చాలా పథకాలు అమలు చేస్తున్నదని వాటిని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యకమంలో మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి లక్షేట్టిపేట సీఐ కృష్ణ రెడ్డి జన్నారం ఎస్సై సతీష్ సర్పంచ్ ఎంపిపి గ్రామ పటేల్ ప్రజా ప్రతినిధులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

తిప్పారం గ్రామంలో అంగన్వాడి పోషణ పక్షం కార్యక్రమం

తిప్పారం గ్రామంలో అంగన్వాడి పోషణ పక్షం కార్యక్రమం

యదార్థవాది కుకునూరు పల్లి

తిప్పారం గ్రామ అంగన్వాడి రెండవ సెంటర్ లో పోషన పక్షం కార్యక్రమం సిడిపిఓ శారద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంగన్వాడి టీచర్లతో ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు చిరుధాన్యాలపై తల్లులకు గర్భిణీ స్త్రీలకు కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ పక్షం అంటే చిరుధాన్యాలతో కూడిన ఆహారం అని,వాటిని గర్భిణీ స్త్రీలు బాలింతలు వినియోగించుకోవాలని సూచించారు. చిరుధాన్యాలతో ఆహారం తీసుకోవడం వలన నూట్రిసిన్స్ పెరుగుతాయని, గర్భిణీ స్త్రీలు బాలింతలు బలంగా ఉంటారు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ మాధవి పోషణ అభియాన్ టీం నెంబర్స్ రాము కనకరాజు తిప్పారం అంగనవాడి టీచర్స్ భోగి శ్యామల కోరే విజయలక్ష్మి హై స్కూల్ టీచర్స్ సుగుణాకర్ శశిరేఖ ప్రైమరీ స్కూల్ టీచర్ తిరుమలేష్ కుకునూరుపల్లి సెక్టర్ అంగన్వాడీ టీచర్స్ తల్లులు బాలింతలు కిశోర బాలికలు గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.

హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ: చాడ వెంకటరెడ్డి

హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ: చాడ వెంకటరెడ్డి

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

బిజెపి హటావో దేశ్ బచావో అనే నినాదంతో ఏప్రిల్ 14 నుండి మే 15 వరకు దేశ వ్యాప్తంగా పల్లె పల్లెకు తీసుకుని వెళుతున్నట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు.. శుక్రవారం  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి పార్టీ హిందూ రాజ్యం పేరిట దేశంలో మతచిచ్చు రేపుతోందని సెంటిమెంట్ రాజకీయాలతో అధికారంలో ఉంటూ పబ్బం గడుపుతుందని తొమ్మిది సంవత్సరాల కాలంలో బిజెపి 15 లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని తాకట్టు పెట్టిందని బిజెపిలో ఉన్నవారు పవిత్రులని ఇతర పార్టీల నాయకులపై సిబిఐ ఈడి దాడులు చేయిస్తుందని ఆయన అన్నారు. టోల్ పై 5 శాతం ఔషధాలపై 12 శాతం పన్నులు పెంచి పేదలపై పెను భారం మోపుతోందని ప్రజలు కమ్యూనిస్టులను గెలిపిస్తే ప్రజా గొంతుకగా ఉంటామని చాడ వెంకటరెడ్డి అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మంద పవన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడిపే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

వీడ్కోలు గౌరవ వందనము స్వీకరించిన: పోలీస్ కమీషనర్ నాగరాజు

వీడ్కోలు గౌరవ వందనము స్వీకరించిన: పోలీస్ కమీషనర్ నాగరాజు

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

ఆర్మూడ్ రిజర్వు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వీడ్కోలు గౌరవ వందనము స్వీకరించిన
కమీషనర్ కె.ఆర్. నాగరాజు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను పదవి భాద్యతలు స్వీకరించిన తర్వాత పోలీస్ సిబ్బంది సహకారంతో చక్కగా విధులు నిర్వహించడం జరిగిందని కమినరేట్ పరిధిలోని సిబ్బంది ఎలాంటి రిమార్కు రాకుండా పూర్తి స్థాయిలో సహకరించారని రాష్ట్రంలో అన్ని రకాల బందోబస్తులకు వెళ్లిన సిబ్బంది అక్కడి అధికారుల మన్ననలు పొందారని అన్నారు. గత 15 నెలల నుండి సిబ్బంది పూర్తి సహకారం అందించడం సిబ్బంది ప్రతినిత్యం క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని హోమ్ గార్డులు మోటారు ట్రాన్స్పోర్టు సిబ్బంది అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అన్నిరకాల అలైన్డ్ బ్రాంచ్ల సిబ్బంది అందరి సహకారంతో ప్రోత్సాహంతో విధులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు డి.సి.పి (ఎ.ఆర్ ) పి. గిరిరాజు అదనపు డి.సి.పి ( హోమ్ గార్డ్స్) పరిపాలన అధికారి జి.మధుసుధర్ రావు నిజామాబాద్ ఎ.ఆర్ ఎ.సి.పిలు ఎమ్. కిరణ్ కుమార్ ఎన్. సంతోష్ కుమార్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం సి.ఐలు ఎస్.ఐలు ఆర్.ఐలు ఆర్.ఎస్.ఐ ఆర్మూడ్ రిజర్వు స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు రవాణ సంస్థలో మెరుగైన సేవలు

రోడ్డు రవాణ సంస్థలో మెరుగైన సేవలు

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ వారు ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని అని డిపోలలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్మూర్ బస్ స్టాండ్ లో డిపో మేనేజర్ కె. కవిత వాటర్ కూలర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని ప్రైవేటు వాహనాలకు దూరంగా ఉండాలని సురక్షితమైన సుఖప్రదమైన ఆర్టీసీ బస్సు లోని ప్రయాణించాలని ప్రయాణికులను కోరారు. కార్యక్రమంలో ఎం ఎఫ్ గంగా కిషన్ ఎస్ టి ఐ పారు పిడబ్ల్యుసి మెంబర్ నాగేశ్వరరావు సేఫ్టీ వార్డెన్ ఎన్ వి వి రెడ్డి డివిఎస్ చక్రవర్తి ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సీతారాముల కళ్యాణం

ఘనంగా సీతారాముల కళ్యాణం

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

పోచంపాడు గోదావరి నది తిరాన ఉన్న శ్రీ కోదండ రామక్షేత్రం ఆలయానికి ఎమ్మేల్సీ కవిత తరుపున పట్టువస్త్రాలను తలంబ్రాలను బినోల గ్రామ సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు సమర్పిచారు.. గురువారం సీతారాముల కళ్యాణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వేణు తెలంగాణా జాగృతి బాల్కొండ నియోజకవర్గం అధ్యక్షులు జోగన్ పల్లి సతీష్ గౌడ్ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ బాలా గౌడ్ తూమ అనిల్ బాబు రాజేష్ అజయ్ ఆలయాల పూజారిలు భక్తులు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దళిత హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

దళిత హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను విస్మరిస్తున్నాయని దళితుల మనుగడ హక్కుల కోసం దళిత పోరాట సమితిగా బలమైన పోరాటాలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు తాళ్లపెల్లి లక్ష్మణ్ పిలుపునిచ్చారు.. గురువారం దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా 2వ మహాసభ హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత దళితుల సంక్షేమం కొసం పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సామాజిక భద్రత కరువైందని, దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అణిచివేయలని చూస్తోందని లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేసారు. సిద్దిపేట జిల్లా నిర్మాణ బాధ్యులు గడిపే మల్లేశ్ మాట్లాడుతూ అణగారిన కులాల హక్కులను, సంక్షేమాన్ని ప్రోత్సహిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఏర్పడిందని దళితులపై అఘాయిత్యాల సంఖ్య ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతున్నాయని అనేక రాష్ట్రాల్లో నేటికీ వారికి తల దాచుకునేందుకు కనిసం నివాసం ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవని దళితుల సాధికారత అభివృద్ధి కోసం ఉద్యమాలు తీవ్రతరం చేయాలని ఆయన అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధమ మహాసభలు హైదరాబాద్ లో శుక్రవారం జరుగుతాయని రాష్ట్రంలోని 33 జిల్లాలనుండి ప్రతినిధులు హాజరవుతారని దళితుల జీవన స్థితిగతులు కుల వివక్ష ఆర్థిక సామజిక భద్రత సాధికారత అభివృద్ధిపై మహాసభలలో చేర్చిస్తామని ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం నూతనగా జిల్లా కమిటీ ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వేల్పుల బాలమల్లు జిల్లా కార్యవర్గ సభ్యులు జాగిరి సత్యనారాయణ కనుకుంట్ల శంకర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొమ్ముల భాస్కర్కొ య్యడ కొమురయ్య జేరిపోతుల జనార్ధన్ యాద పద్మ పిల్లి రజిని నేలవేని స్వరూప ఇరుగు సంధ్య పొన్నాల స్వరూప జనగాం రాజు కుమార్ నాయకులు సంగెం మధు బోనగిరి శంకర్ రామగళ్ల నరేష్ చిట్యాల శేఖర్ మాచర్ల శ్రీను కొమ్ముల శ్రీనివాస్ రాయికుంట శంకర్ పిట్టల మధు తదితరులు పాల్గొన్నారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...