27.7 C
Hyderabad
Thursday, April 23, 2026

బస్సు” కాదిది…అందమైన గూడెం “బడి”

బస్సు” కాదిది…అందమైన గూడెం “బడి”

* మంత్రి చొరవతో తీర్చిదిద్దిన గూడెం ప్రభుత్వ పాఠశాల..

* బస్సుల బడి.. పల్లెవెలుగు, సిటీబస్సుల్లా తరగతి గదులు.

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

ఈ ఫొటోలు చూశారా..? అచ్చం విద్యార్థులు బస్సెక్కి స్కూలుకు పోతున్నట్లు, దిగి వస్తున్నట్లు ఉంది కదా.. ఇది బస్టాప్‌ అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పొరబడినట్లే..

బస్సు” కాదిది…అందమైన గూడెం “బడి”లో అందంగా తీర్చిదిద్దిన తరగతి గదులు. విద్యార్థులను ఆకర్షించేలా మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో ముస్తాబాద్‌ మండలం గూడెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఇలా ఆకర్షణీయంగా మార్చారు. గివ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్‌ నిధులతో మూడు బస్సుల బడిగా మార్చారు. గంభీరావుపేట మండలం నర్మాలకు చెందని చిత్రకారుడు నారోజు చంద్రశేఖర్‌ మూడు తరగతి గదులను అందమైన రంగురంగుల పెయింటింగ్స్‌తో మెట్రో పల్లెవెలుగు సిటీ బస్సుల్లా తీర్చిదిద్దారు. తమ తరగతి గదులు ఆకర్షణీయంగా ఉండడంతో విద్యార్థులు నిత్యం పాఠశాలకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారు.

అధికారులను వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు

అధికారులను వెక్కిరిస్తున్న ఖాళీ కుర్చీలు

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

సిద్దిపేట మున్సిపల్ కార్యాలయ అధికారులను ఖాళీ సీట్లు వెక్కిరిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 30 లోపు పన్నులు చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ప్రోత్సాహకంగా కలిపించింది. దీని ద్వారా ప్రజలకు మేలు కలగడంతో పాటు ప్రభుత్వానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో కల్పించిన ఈ అవకాశానికి అధికారుల తీరుతో తూట్లు పొడుస్తున్నారు. మున్సిపల్ శాఖ సకాలంలో ప్రజలు అన్ని రకాల బిల్లులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించలనే దేశంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది అయితే వివిధ రకాల బిల్లులు చెల్లించడానికి మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ప్రజలకు ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి.. ఉసురు మంటూ ఎండలో పడిగాపులు పడుతూ బిల్లులు చెల్లించడానికి వస్తే కార్యాలయంలో ఎవరు లేకపోవడంతో అధికారుల తీరుపట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నరు. నాన అవస్థలు పడి ఆటో ఛార్జీలు పెట్టుకొని కార్యాలయానికి వస్తె బిల్లులు తీసుకోవడం కి ఎవరూ లేకపోవడంతో చేసేదేమి లేక వెను తిరిగి వెళ్ళిపోతున్నారు. కాగా ఈ విషయమై అధికారులను వివరణ తీసుకోవడానికి ప్రయత్నించగా ఎవరు అందుబాటులో లేరు.

వైన్స్ లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు

వైన్స్ లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరి అరెస్టు

* పరారిలో మరొకరు

* స్కూటీ ఫోన్ స్వాధీనం

యదార్థవాది ప్రతినిది పెద్దపల్లి

పెద్దనపల్లిలోని వైన్ షాపులో దొంగతనాలు పాల్పడిన నిందితుల అరెస్టు వివరాలను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. సుల్తానాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ సమీర్, బంగారి కుంటకు చెందిన అబ్దుల్ షాకీబ్ లను అరెస్ట్ చేయగా ఎండి గౌస్ పరారిలో ఉన్నట్లు తెలిపారు. సోమగూడెం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిని ఆపి ప్రశ్నించగా సరైన సమాదానం ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించగా
గత నెల తేదీ 19.03.2023 రోజున రాత్రి రెండు గంటల సమయంలో స్టేషన్ పెద్దనపల్లి లోని ఆర్ఎస్ వైన్స్ వద్ద మూడు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఇనుప కడ్డీలతో ఆర్ఎస్ వైన్స్ షెటర్ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి రెండు మొబైల్ ఫోన్లను 20 వేల రూపాయల నగదును మరియు లిక్కర్ బాటిల్స్ ని దొంగిలించి ఆ తర్వాత దొంగిలించిన వాటిని ముగ్గురం పంచుకున్నామని ఆ తర్వాత గౌస్ కరీంనగర్ వెళ్తున్నానని చెప్పి గ్రామం నుంచి వెళ్లిపోయాడని, మళ్లీ అదే విధంగా దొంగతనం చేయడానికి రెక్కీ చేయగా పట్టుకున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణి

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణి

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

భీంగల్ మండలంలోని గ్రామాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను భీంగల్ ఎంపీపీ మహేష్ జడ్పిటిసి చౌటుపల్లి రవి సోమవారం చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మండలంలోని పురానిపేట్ ముచ్కూర్ గ్రామాలకు ఇప్పించారని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శివసారి నర్సయ్య ఏఎంసి చైర్మన్ గుణవీర్ రెడ్డి రైతుబంధు మండల అధ్యక్షులు శర్మ నాయక్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ రైతాంగ పోరటంలో తొలి ఆమరుడు దొడ్డి కొమురయ్య

తెలంగాణ రైతాంగ పోరటంలో తొలి ఆమరుడు దొడ్డి కొమురయ్య

– పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఘనంగా కొమురయ్య జయంతి

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు కార్యాలయంలో దొడ్డి కొమురయ్య 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిపారు. నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్ ) జి. మధుసుదన్ రావు దొడ్డి కొమురయ్య 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1927 ఎప్రిల్ 3న వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో గొర్రె కపర్ల కుటుంబంలో జన్మించిన కొమురయ్య నిజాం పరిపాలన వ్యతిరేకముగా పోరాడడం జరిగిందని అనేక సంఘాలను ఏర్పాటు చేశారని 1946 జులై 4 న కడివెండి గ్రామంలో దొర పై రజాకార్లపై తిరగబడ్డారు. తెలంగాణ రైతాంగ పోరటంలో తొలి ఆమరుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన వ్యక్తి, అప్పటికి ఆయన వయస్సు 20 సంవత్సరాలు కూడా నిండలేదని అన్నారు. కార్యాక్రమంలో ఎ.ఓ శ్రీ శ్రీనివాస్, సూపరింటెండెంటులు శంకర్, గోవింద్, మక్సూద్, సి.సి.ఆర్.బి, IT, పోలీస్ కంట్రోల్ రూమ్, సెంట్రల్ కాంప్లెంటు సెల్, స్పెషల్ పార్టీ, పోలీస్ కార్యలయం, హోమ్ గార్డు సిబ్బంది పాల్గొన్నారు.

డయల్ 100తో పరిష్కారమవుతున్న ఫిర్యాదులు

డయల్ 100తో పరిష్కారమవుతున్న ఫిర్యాదులు
* గత నెలలో 3700 ఫిర్యాదుల పరిష్కారం
* కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు

యదార్థవాది ప్రతినిధి కరీంనగర్

శాంతిభద్రతలకు సంబంధించి తలెత్తే సమస్యలపై సత్వరం స్పందన, పరిష్కారం కోసం ఏర్పాటైన డయల్ 100 సేవలకు గత మార్చి నెలలో9 3700 అత్యవసర ఫిర్యాదులు అందగా పరిష్కరించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.
దోపిడి, దొంగతనాలు, తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, హత్యలు, హత్యాయత్నాలు, ఆత్మహత్యలు, తప్పిపోవుట, కిడ్నాప్, అత్యాచారయత్నాలు, గృహహింస, అసాంఘిక కార్యకలాపాలు మొదలగు ఆపదలు సంభవించిన సందర్భంలో “డయల్ 100” సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. జిల్లాలో గడిచిన మార్చి నెలలో 3700 ఫిర్యాధులను స్వీకరించి పరిష్కరించడం జరిగింది. ఇందులో 27 ఫిర్యాధులపై కేసులు నమోదు చేయడం జరిగింది.

ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాo ఏర్పాటు చేయాలి.

ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాo ఏర్పాటు చేయాలి.

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో తెలంగాణ తొలిదశ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య 96 వ జయంతి వేడుకలను కురుమ కులస్తులు ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ ఉద్యమంలో దొరల పై పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చాలా రోజులుగా తాము డిమాండ్ చేస్తున్న ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడమనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. దొడ్డి కొమురయ్య చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చి భావితరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం మండల్ నాయకులు సూర్ ఐలయ్య, గడ్డం కొమరయ్య, దొడ్డి శ్రీనివాస్, కోహెడ కొమరయ్య, మేకల రమేష్, బిజెపి నాయకులు బొమ్మగాని సతీష్, ఓదయ్య తదితరులు పాల్గొన్నారు

నిర్లక్ష్యంగా పాఠశాల బస్సును నడిపిన డ్రైవర్

నిర్లక్ష్యంగా పాఠశాల బస్సును నడిపిన డ్రైవర్
* తప్పిన పెను ప్రమాదం
* ఆర్టిఏ అధికారులు పాఠశాల బస్సులను పర్యవేక్షించాలి 

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్ ను నడపడంతో పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింన సంఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో సోమవారం జరిగింది. 50 మంది విద్యార్థులతో కూడిన ప్రైవేటు పాఠశాల బస్సు అధుపు తప్పి చెట్టుకు ఢీకొట్టి ఆగిపోయింది. లేదంటే పక్కనే ఉన్న బావిలో పడితే ఘోర ప్రమాదం జరిగేది. వివరాల్లోకి వెళితే ప్రైవేట్ పాఠశాల అయిన సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో ఉండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.. పక్కనే వ్యవసాయ బావి యుండగా చెట్టు అడ్డుగా లేనట్లయితే బావిలోకి వెళ్లి పెను ప్రమాదం జరిగి ఉండేది.. కాగా గతంలో లో కూడా ఇదే పాఠశాలకు చెందిన ఇదే బస్సు ఇదే డ్రైవర్ తో ఒక కారును ఢీకొట్టిన సంఘటన కూడా ఉంది.. బస్సుకు చెందిన డ్రైవర్ నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ చేస్తాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్టిఏ అధికారులు పాఠశాల వాహనాలను డ్రైవర్లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.

మహిళలకు బీజేపీ ప్రభత్వం పెద్దపీట వేసింది

మహిళలకు బీజేపీ ప్రభత్వం పెద్దపీట వేసింది

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం స్థానిక వైశ్య భవన్ లో తెలంగాణ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా బూత్ సశక్తికరణ్ అభియాన్ కార్యక్రమం బూత్ పరిధిలో నిర్వహించడంచరు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఉషాబాజ్పాయ్ హాజరై మాట్లాడుతూ దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మహిళ సాధికారత కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని కేంద్ర క్యాబినెట్ లో 11 మంది మహిళలకు అవకాశం కల్పించి మహిళలు ఎందులోని తీసిపోరని మహిళాలలే ఈ ప్రపంచానికి సారథులని బీజేపీ ప్రభుత్వం నిరుపించిందని బూత్ సశక్తికరణ్ అభియాన్ కార్యక్రమం విజయవంతం చేసి బూత్ లేవల్ లో పార్టీని పటిష్ట పరచాలని అమే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు బొమ్మ శ్రీరాం చక్రవర్తి జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అరుణ రెడ్డి ప్రధాన కార్యదర్శి తోట స్వరూప జిల్లా కోశాధికారి దొడ్డి శ్రీనివాస్ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు కౌన్సిలర్ కోమటి స్వర్ణలత సత్యనారాయణ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గన్నారు.

దొరలను ఎదిరించిన వీరుడు సర్వాయి పాపన్న

దొరలను ఎదిరించిన వీరుడు సర్వాయి పాపన్న

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

భారతదేశ తొలి బహుజనుల సామ్రాజ్య సృష్టికర్త గౌడ జాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్బంగా నిజామాబాద్ నగరంలోని ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు బుస్సాపూర్ శంకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ కోట నుండి గోల్కొండ కోట వరకు దాదాపు 12 వేల మంది స్వసంత్ర సైనికులతో సామ్రాజ్యాన్ని సృష్టించి న మహోన్నత వ్యక్తని కల్లు గీసే కత్తినే ఖడ్గంగా మార్చిన యోధుడని నవాబుల గుండెల్లో నిద్రపోయిన వీరుడు రాజ్య సంపదను పేద ప్రజలకు పంచిన మహోనతుదని ఆ మహానియుడిని స్ఫూర్తిగా తీసుకుని దొరల పాలనపై తిరుగుబాటు చేయాలని శంకర్ అన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు కస్తూరి ప్రవీణ్ నగర ప్రధాన కార్యదర్శి కుంచెపు ఆనంద్ నగర యువజన అధ్యక్షులు సంతోష్ సీనియర్ నాయకులు ఆల్లకుంట పాండు తాల్ల సాగర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...