27.7 C
Hyderabad
Thursday, April 23, 2026

బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనలు

బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనలు

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ని కరీంనగర్ లోని తన నివాసంలో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా మంగళవారం అర్ధరాత్రి అక్రమ అరెస్టు చేసి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కి తరలించిన విషయంలో సిద్దిపేట జిల్లా కోహడ మండల స్థాయి బిజెపి నాయకులు కార్యకర్త లను ఖమ్మం వెంకటేశం శ్రీనివాస్ సతీష్ రెడ్డి శివ లను ముందస్తు అరెస్టు చేయగా కార్యకర్తలు బుదవారం నిరసన తెలుపుతూ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ ప్రభుత్వ కేసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. కార్యక్రమంలోపిల్లి నర్సయ్య గౌడ్ రజినీకాంత్ రెడ్డి తిరుపతి శ్రీనివాస్ రెడ్డి వేంకటేశ్వర్లు గాజుల రవీందర్ శివసాయి గౌడ్ సంపత్ రాజు తదితరులు పాల్గొన్నారు.

బండి అరెస్ట్ నిరసనగా కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన.. బీజేపీ

బండి అరెస్ట్ నిరసనగా కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన.. బీజేపీ

యదార్థవాది ప్రతినిది ఆర్మూర్

రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా అక్రమంగా అన్యాయంగా పోలీసులను ఉసిగొలిపి ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బండి అరెస్ట్ నిరసనగా కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన అధ్యక్షులు నూతల శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి యుతంగా కార్యక్రమం చేస్తుంటే పోలీసులు అతి ఉత్సాహంతో అరెస్టు చేయడం సమంజసం కాదని కేసీఆర్ పాలనలో లీకులు అవినీతి అక్రమాలు లిక్కర్ స్కములు తప్ప తెలంగాణ కు ఒరిగింది ఏమీ లేదని తెలిపారు. అవినీతి అక్రమాలను కవిత లిక్కర్ స్కాం లో ఇరుక్కోడాన్ని పరీక్షల లీకుల విషయంలో ప్రజలు గమనిస్తున్న విషయాన్ని పక్కదోవ పట్టించడానికే బండి సంజయ్ అరెస్టు చేశారని ఇప్పటికైనా పోలీసులు బండి సంజయ్ విడుదల చేయాలి తెలిపారు. కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో నడవాలి

జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో నడవాలి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ..

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

భార‌త మాజీ ఉప ప్ర‌ధాని సమతావాది డా. బాబు జగ్జీవన్ రామ్ అడుగుజాడల్లో నడవాలి : జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ.. దేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డా జగ్జీవన్ రామ్ 116 వ జయంతి పురస్కరించుకొని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం సిరిసిల్ల పట్టణం డా. బి ఆర్ అంబేద్కర్ చౌరస్తా లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ జిల్లా ఎస్పీ అదనపు కలెక్టర్ లు ఆర్డీఓ మున్సిపల్ చైర్ పర్సన్ లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా మాట్లాడుతూ
సంఘసంస్కర్తగా బడుగు బలహీన వర్గాల కోసం బాబు జగ్జీవన్ రామ్ కృషి చేశారని జగ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయుడని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు డా బాబు జ‌గ్జీవ‌న్ రామ్ స్ఫూర్తితో తెలంగాణ లో సంక్షేమ‌ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారని ఎస్సీ ల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న ద‌ళిత‌బంధు దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తుందని తెలిపారు.

జిల్లా ఎస్ పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు సంఘ సంస్క‌ర్త‌ భార‌త మాజీ ఉప ప్ర‌ధాని బాబూ జగ్జీవ‌న్ రామ్ జీవితం స్ఫూర్తిదాయ‌కం స్వాతంత్య్ర కు ముందు ఆ తర్వాత కూడ వివక్ష లేని సమ సమాజం కు కోసం అవిరళ కృషి చేశారని డా బి ఆర్ అంబేద్కర్ తో కలిసి బాబు జ‌గ్జీవ‌న్ రామ్ అణగారిన వర్గాల రిజర్వేషన్ ల సాధన కోసం కృషి చేసి విజయం సాధించారని వారి కృషి వల్లే బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని రంగాలలో అవకాశాలు చెక్కించుకుంటున్నారని డా బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులవుతూ దేశాన్ని సూపర్ పవర్ గా నిలవాలని తెలిపారు.

జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ మాట్లాడుతూ డా బాబు జగ్జీవన్ రామ్
దేశ ఉప ప్రధాని గా అనేక శాఖల కు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిoచి దేశ పురోభివృద్ధికి పునాదులు వేశారని తెలిపారు.

జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ డా బాబు జగ్జీవన్ రామ్ కులరహిత సమాజం కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంత గానో కృషి చేశారని కొనియాడారు. వారి పుట్టిన రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు.

కార్యక్రమంలోరాష్ట్ర పవర్ లూమ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య డీఆర్ఓ టి.శ్రీనివాస రావు మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య జిల్లా బీసీ ఎస్సీ అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం జిల్లా సంక్షేమ అధికారి రాజారాం, మైనారిటీ సంక్షేమ శాఖ OSD సర్వర్ మియా తహశీల్దార్ విజయ్ కుమార్ స్థానిక కౌన్సిలర్ లు ఎస్సీ సంఘాల నాయకులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

యదార్థవాది ప్రతినిది సిద్దిపేట

ఘనంగా డా.బాబు జగ్జీవన్ రామ్ గారి 116 వ జయంతి సందర్బంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్ సిద్దిపేట పట్టణం బీజేఆర్ చౌరస్తాలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహనీయుడు స్వతంత్ర సమరయోధుడు గొప్ప సంఘసంస్కర్త వెనుకబడిన వర్గాల ఆశ జ్యోతి భారత పార్లమెంటులో 40 సంవత్సరాలు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా పనిచేశారని కరువు కోరల్లో చిక్కిన భారతావని వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సహకారం చేసిన మహనీయుడని అన్నారు. భారత సేనకు మంత్రిగా ధీరోదాత్తతను ప్రదర్శించి యావత్ భారత ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్నారని కొనియాడారు.

విద్యావేత్తగా మచ్చలేని నిస్వార్ధ నాయకుడు: బాబు జగ్జీవన్ రామ్

విద్యావేత్తగా మచ్చలేని నిస్వార్ధ నాయకుడు: బాబు జగ్జీవన్ రామ్

యదార్థవాది ప్రతినిది మెదక్

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్ పీ. రోహిణి ప్రియదర్శిని… ఈ సందర్భంగా ఎస్ పీ మాట్లాడుతూ మహనీయుడు స్వతంత్ర సమరయోధుడు గొప్ప సంఘసంస్కర్త వెనుకబడిన వర్గాల నుండి వచ్చి భారత పార్లమెంటులో వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా పనిచేశారని బయోగ్రఫీ పట్టుదల నిండిన ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొనసాగించారని విద్యావేత్తగా మచ్చలేని నిస్వార్ధ నాయకునిగా కరువు కోరల్లో చిక్కిన భారతావని వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సహకారం చేసి భారత ఆహార గిడ్డంగులను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని కయ్యానికి కాలుదువ్విన బ్రిటిష్ శత్రువులను మట్టి కరిపించి భారతదేశానికి విజయాన్ని సాధించిన భారత సేనకు మంత్రిగా ధీరోదాత్తతను ప్రదర్శించి యావత్ భారత ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్నారని తెలిపారు..

ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదు: మంత్రి సబితా

ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదు: మంత్రి సబితా

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

పదవ తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని రాష్ట్రంలో పదవ తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని ఈ విషయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పదవ తరగతి పరీక్షల నిర్వహణపై 33
జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జి లు షానవాజ్ కాసీం, చంద్రశేఖర్ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని ఈ పరీక్షల విషయంలో తమ స్వార్ధ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు అనుమానాలకు తావు లేదని తెలిపారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్.పి లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్ లను మూసివేయించాలని ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు.

అప్పటి ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలి

అప్పటి ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలి

కార్యకర్తలే బలం: బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఒడితల

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం మంగళవారం కోహెడ మండల కేంద్రంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు అందించిందని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజల బేరీజు వేసుకోవాలని అన్కునారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రధంగా నిలిపామని రైతులు వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులు నిరుద్యోగులు ఇలా అందరి బ్రతుకులు బాగుపడ్డాయని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మన రాష్ట్రంలో పోటీ చేస్తే బాగుండేది అని ఆయా రాష్ట్రాలు ప్రజలు కోరుతున్నారని ఇలాంటి అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రతి గడప గడపకు వెళ్లి వివరించాలని శరవేగంగా విస్తరిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు పరుగులు పెడుతుందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అగ్ర భాగానే ఉంటుందని ప్రతి కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అందించడంతో పాటు ఆపదలో అండగా ఉంటున్నామని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైన బస్సాపూర్ గ్రామానికి చెందిన బిజగా సింగరయ్య కోహడకు చెందిన పొన్నాల సాయిచరణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోగా రెండు లక్షల రూపాయల విలువగల పార్టీ ప్రమాద బీమా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో కోహెడ మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు 63 లక్షల 7 వేల 380 రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కొక్కుల కీర్తి జడ్పిటిసి శ్యామల కర్ర శ్రీహరి ఆవుల మహేందర్ స్వామి కృష్ణమూర్తి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

“ఆరోగ్య మహిళా” పై ప్రతీ మహిళకు అవగాహన

“ఆరోగ్య మహిళా” పై ప్రతీ మహిళకు అవగాహన

* ఏఎన్ఎం లు ఆన్ లైన్ డేటా ఎంట్రీ పకడ్బందీగా చేయాలి

* తంగళ్ళపల్లి నేరెళ్ళ ఆరోగ్య మహిళా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

ఆరోగ్య మహిళా కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం, ఆవశ్యకత గురించి ప్రతీ మహిళకు అవగాహన కల్పించాలని, ఇందులో ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం తంగళ్ళపల్లి నేరెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ డాటా ఎంట్రీ నిర్ధారణ పరీక్షల తీరును పరిశీలించి మహిళలు ఆనారోగ్యానికి గురి కావొద్దన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతీ మంగళవారం ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు పోషకాహార లోపం, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడంతో పాటు, అవసరమైతే జిల్లా ఆసుపత్రికి పంపించి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీఎస్ నగర్, తంగళ్ళపల్లి, నేరెళ్ళ, వేములవాడ) ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్నామని అన్నారు. ఎనిమిది టెస్టులను అందరికీ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. పరీక్షల వివరాలను ఆన్ లైన్ లో పకడ్బందీగా ఎంట్రీ చేయాలని ఏఎన్ఎం లను ఆదేశించారు. నిర్ధారణ పరీక్షల్లో ఎవరికైనా వ్యాధి ఉన్నట్లు తెలిస్తే, మెరుగైన చికిత్స కోసం వారిని జిల్లా ఆసుపత్రికి పంపించాలని అన్నారు. వారు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకున్నారా లేదా అనే విషయాన్ని సంబంధిత ఆశా ఏఎన్ఎం లు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని తమ పరిధిలోని మహిళలందరూ వినియోగించుకునేలా సంబంధిత ఆశా ఏఎన్ఎం లు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట ఉప వైద్యాధికారులు డా.శ్రీరాములు డా.రజిత మెడికల్ ఆఫీసర్లు డా.స్నేహ డా.రేఖ ఏఎన్ఎం లు సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు.

శాంతియుత వాతావరణం లో పండుగలు జరుపుకోవాలి


శాంతియుత వాతావరణం లో పండుగలు జరుపుకోవాలి కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు..

యదార్థవాది ప్రతినిది కరీంనగర్

రాబోవు రంజాన్ పర్వదినం సందర్భంగా నేపథ్యంలో మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఎలాంటి సంఘటనలు లేకుండా శాంతియుతంగా ఉండే ప్రాంతాలే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతాయని పండుగల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగలేదని, ఇకముందు కూడా ఇదే స్ఫూర్తితో ఉండాలని తెలిపారు. ఏవైనా సంఘటనలు జరిగినట్లయితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కటిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతను తెలుసుకొని ఉండాలని అత్యుత్సాహం ప్రదర్శించే చర్యలకు పాల్పడటం ద్వారా ఇబ్బందులు కలుగుతాయనే విషయాన్ని గుర్తించాలని మత విశ్వాసాలకు భంగం కలిగించకూడదని కోరారు. మైనర్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ త్రిబుల్ రైడింగ్ లను ప్రోత్సహించకూడదని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి చంద్రమోహన్ ప్రొబేషనరీ ఐపీఎస్ గైట్ మహేష్ బాబా సాహెబ్ ఏసిపిలు తుల శ్రీనివాసరావు విజయ్ కుమార్ ఎస్బిఐ లు జి వెంకటేశ్వర్లు బి సంతోష్ కుమార్ లతో పాటుగా శాంతి కమిటీ సభ్యులు మధుసూధన్ రెడ్డి ఎం ఏ రఫీక్ జగదీష్ చారి ఇనుగుర్తి రమేష్ రాధా కిషన్ మన్సూర్ తవక్కలి సయ్యద్ ముజఫర్ ఘనశ్యామ్ ఓజా తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకి మరింత చేరువలో

ప్రజలకి మరింత చేరువలో

“ఠాణా దివస్” కు విశేష స్పందన జిల్లా ఎస్ పి అఖిల్ మహాజన్..

యదార్థవాది ప్రతినిది వేములవాడ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “ఠాణా దివస్” కార్యక్రమాన్ని మొదటి సారిగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్… గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో నెలకొన్న భద్రత సమస్యలు ఫిర్యాదులను పరిష్కారం కోరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విన్నూతంగా చేపట్టిన “ఠాణా దివస్” కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 3:00 గంటల వరకు జిల్లా ఎస్పీ ప్రజలకు అందుబాటులో ఉండి వారి వద్ద నుండి 49 అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువగా వెళ్ళడానికి “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి వారి సమస్యలని అడిగి తెలుసుకుని అట్టి సమస్యల పరిష్కారం కోసం సంబదిత అధికారులకు పంపివ్వడం జరుగుతుందని ఈ విషయంలో కలెక్టర్ కు భూ సమస్యలను తీసుకవెళ్ళడం సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని భూ సమస్యలలో క్రిమినల్ సమస్య ఉంటే వాటిలో సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇచ్చి FIR నమోదు చేయాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేయాలని తెలిపారు. సివిల్ సమస్యలకు సంబంధించి సమస్యలలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో అవగాహన కల్పించడంతో పాటు రిటైర్ MRO మరియు డిఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమలు ఏర్పాటు చేస్తామని భార్య భర్తల గోడవల్లో భర్తకు దూరంగా ఉంటున్న భార్యకు జీవన భత్యం కొరకై లీగల్ సర్వీసెస్ అథారిటీతో మాట్లాడి భర్తల నుండి ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను విన్నపాలు స్వీకరించి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం జరుగుతుందని “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి మంగళవారం ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరుగుతుంది అ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా తమ దగ్గరికి వచ్చి తమ ఫిర్యాదులను స్వీకరించడం సంతోషంగా ఉందని అర్జీదారులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు బన్సీలాల్, వెంకటేష్, ఎస్.ఐ లు నాగరాజు,రఫిక్ ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...