27.7 C
Hyderabad
Thursday, April 23, 2026

ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి: బండి

ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి: బండి

యదార్థవాది ప్రతినిది కరీంనగర్

* టీ ఎస్ పిఎస్సీ లీకేజీపై సెట్టింగ్ జడ్జితో
విచారణ చేయలి..
* 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్తు అగన్య గోచరంగా మారింది..
* త్వరలో నిరుద్యోగ యువతతో భారీ ర్యాలీ నిర్వహిస్తాం..

టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజ్ కేసులో
అరెస్టై బైల్ పై శుక్రవారం కరీంనగర్ జైల్ నుండి విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టి ఎస్ పిఎస్సీ పేపర్ లీక్ ప్రస్తుతం పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వలన రాష్ట్రంలో నిరుద్యోగులు విద్యార్థులు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారినదని దీనికి బాధ్యున్ని చేస్తూ కేటీఆర్ ను మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయల నష్ట పరిహారం చెల్లించి లీకేజీ వ్యవహారం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని హిందీ పేపరు నేను లీకేజ్ చేసినట్టయితే మరి తెలుగు పేపర్ ఎవరు లీకేజీ చేశారు అని వరంగల్ సి పి నీ ప్రశ్నించారు. త్వరలో నిరుద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహిస్తానని సింగరేణి ని ప్రైవేట్ పరం చేయడానికి కెసిఆర్ కుట్రలు పన్నుతున్నారని 51 శాతం రాష్ట్ర ప్రభుత్వం అధిక శాతం వాటా కలిగి ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది అని ఆరోపించారు.

నేడు కరీంనగర్ పట్టణంలో 144 సెక్షన్ అమలు: పోలిస్ కమిషనర్

నేడు కరీంనగర్ పట్టణంలో 144 సెక్షన్ అమలు: పోలిస్ కమిషనర్

యదార్థవాది ప్రతినిది కరీంనగర్

నేడు కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలిస్ కమిషనర్ సుబ్బారాయుడు పత్రిక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుండి ఐబి చౌరస్తా గ్రేవ్ యార్డ్ జైలు పరిసర ప్రాంతాలు వెంకటేశ్వర టెంపుల్ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడమైనద…
ఈ పరిసర ప్రాంతాల్లో

* ప్రజలు ఎవరు గుమి కూడా రాదు.

* ఊరేగింపులు తీయరాదు.

* సమావేశాలు నిర్వహించరాదు

* అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ట్రాఫిక్ మళ్లింపు కూడా ఉన్నందున అటువైపు వాహనాలు కూడా అనుమతించబడవని కావున ప్రజలందరూ దీన్ని గమనించి పోలీసులకు సహకరించాలని ఆయన అన్నారు…

మతసామరస్యతకి అద్దం పడుతున్న బస్వాపూర్

మతసామరస్యతకి అద్దం పడుతున్న బస్వాపూర్

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్సాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా మతసామరస్యం వెళ్లివిరిసింది భక్తిశ్రద్ధలతో హనుమాన్ మండల దీక్ష చేస్తూ 41 రోజులు నిష్టగా ఉంటూ శ్రీరాముని హనుమాన్ నామస్మరణ చేస్తూ గ్రామస్తులు దీక్ష దారులు భారీగా తరలి వచ్చి ప్రతి సంవత్సరము ఊరేగింపు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సత్తయ్య ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి  గ్రామంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి సంవత్సరం హనుమాన్ భక్తుల ఊరేగింపులో భాగంగా ముస్లిం సోదరులు మతసామరస్యతను చాటుతూ సోదర భావంతో ర్యాలీలో పాల్గొన్న భక్తులకు మజ్జిగను అందించడం గ్రామంలో ఆనవాయితీగా వస్తుంది.అదేవిధంగా ఈ సంవత్సరం హనుమాన్ దీక్షలు మరియు ముస్లిం సోదరులు యొక్క రంజాన్ పండగ కలిసి రావడం ముస్లిం సోదరులు భక్తి (ఉపవాసం) లో ఉండి ఎప్పటిలాగే భక్తి పారవశ్యంతో ఊరేగింపు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్తయ్య మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కొక్కుల రమేష్ సంపత్ కిష్టారెడ్డి సురేష్ వాజిద్ ముజ్జు ఇక్బాల్ సలీం నవీన్ శ్రీనివాస్ శ్రీకాంత్ రవి సింగరయ్య కిషన్ గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ పోలీసులు ఆధ్వర్యంలో జాబ్ మేళా

కరీంనగర్ పోలీసులు ఆధ్వర్యంలో జాబ్ మేళా

యదార్థవాది ప్రతినిది కరీంనగర్

పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు.. జాబ్ మేళా వివరాలను కమీషనర్ గురువారం కమీషనరేట్ కేంద్రంలో వివరిస్తూ ఈ నెల 11న కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు ఆధ్వర్యంలో జాబ్ మేళా గీతాభవన్ చౌరస్తా వద్ద గల పద్మనాయక కళ్యాణమండపంలో జరుగుతుందని 10 తరగతి ఉత్తీర్ణులై ఇంటర్ ఐటిఐ డిగ్రీ పీజీ ఫార్మసి బిటెక్ యంటెక్ యంబిఏ యంసిఏ చదివిన నిరుద్యోగ యువతీ యువకులకు దాదాపు 4వేల  ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. విప్రో జెన్ ప్యాక్ టాటా సర్వీసెస్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఐసిఐసిఐ ఇండిగో ఎయిర్ లైన్స్ గూగుల్ పే రిలయన్స్ జియో కంపెనీలతో దాదాపు 100 పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలను నిర్వహిస్తారని ఇంటర్వ్యులో సెలక్ట్ అయినవారికి నియామక పత్రాలు అందజేస్తారని అన్నారు. జిల్లాకు చెందిన నిరుద్యోగులు సద్వింయోగం చేసుకోవాలని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పైన తెలిపిన విద్యార్హతలు ఉన్నవారు వర్జనల్ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలతో హాజరై కావాలి ఈ జాబ్ మేళా ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆర్ఎస్ఐలు మహేష్ 9652169877 తిరుపతి 6301955823 నెంబర్లలకు సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డిసిపి (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్ ఏసిపిలు తుల శ్రీనివాసరావు ప్రతాప్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ నటేష్ లక్ష్మీబాబు దామోదర్ రెడ్డి ఆర్ఐలు మల్లేశం జానీమియా తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికం

బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికం.. ప్రభుత్వ కుట్ర

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన రాస్తారోకో చేశారు. ఈ నిరసన కార్యక్రమములో బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి బొమ్మ శ్రీరాం చక్రవర్తి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా  బండి సంజయ్ తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడం ప్రజాస్వామ్య వ్యవస్థను కూనిచేయడమే అవుతుందని అన్నారు. ఇండియన్ పినాల్ కోడ్ ప్రకారం పార్లమెంటు సభ్యుడికి నోటీసులు కానీ పార్లమెంటు కమిటీకి సమాచారం ఇచ్చి వారి ఆదేశాల మేరకు అరెస్టు చేయాలి వారెంట్ జారీ చేయకుండా పార్లమెంటు సభ్యుడిని అరెస్టు చేయడం అప్రజాస్వామికం అనైతికం దుర్మార్గమైన చర్యఅని అన్నారు.  వెంటనే బండి సంజయ్ విడుదల చేయాలని లేని పక్షంలో పెద్దయెత్తున ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమములో స్థానిక కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్ మ్యాదరబోయిన వేణు యాదవ్ కోమటి స్వర్ణలత జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలి: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిది మెదక్

హవేళిఘనాపూర్ మండలం టి.మగ్దూంపూర్ లో కంటి వెలుగు శిబిరాన్ని గురువారం సందర్శించి కంటి పరీక్షలు చేసుకుంటున్న వారిని వైద్యులు పరీక్షలు చక్కాగా చేస్తున్నారా కంటి అద్దాలు నాణ్యతగా ఉన్నాయా అద్దాలు పెట్టుకుంటే చూపు సరిగ్గా కనిపిస్తున్నదా అని ఆరా తీసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నందున కంటి సమస్యలతో బాధపడుతున్న వారందరు కంటి పరీక్షలు చేసుకోవాలని కంటి చూపుకు సరిపోయే రీడింగ్ అద్దాలను అప్పటికప్పుడే ఇవ్వడం జరుగుతుందని ప్రిస్క్రిప్షన్ అద్దాలను వారం రోజులలో ఆశా కార్యకర్తలు ఇంటికే తెచ్చిస్తారని జూన్ 15 వరకు కొనసాగుతనని కంటి వెలుగు శిబిరాలకు అత్యధిక సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేలా గ్రామాలలో అవగాహన కలిగించలని తెలిపారు. ప్రతి రోజు కనీసం 150 మందికి పైగా స్క్రీనింగ్ చేసేలా ఆశా కార్యకర్తలు ఏ.యెన్.ఏం. లు మహిళా సంఘ సంఘ సభ్యులు కృషి చేయాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 290 గ్రామా పంచాయతీలు 51 మునిసిపల్ వార్డులలో కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా నిర్వహించనని 2,91,336 మందికి కంటి పరీక్షలు పూర్తీ అయ్యాయని 29 గ్రామ పంచాయతీలు 3 వార్డులలో కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. చందు నాయక్ మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి తహశీల్ధార్ నవీన్ ఎంపిడిఓ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

మార్మోగిన హనుమాన్ నామస్మరణ

మార్మోగిన హనుమాన్ నామస్మరణ

* పట్టణమంతటా రెపరెపలాడిన కాషాయ జెండాలు..
* భారీ బందోబస్తు మధ్య శోభాయాత్ర..

యదార్థవాది ప్రతినిది మెదక్

విశ్వహిందూ పరిషత్ బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో బుదవారం వీరహనుమాన్‌ శోభాయాత్ర శోభాయమానంగా నిర్వహించారు..
ఈ శోభ యాత్రకు జిల్లా నలు మూలల నుంచి వందలాదిగా తరలి వచ్చిన భక్త జనులు.. ప్రత్యేక వాహనాలపై శ్రీరాముడు హనుమంతుడు శివాజీ విగ్రహాలను ఊరేగింగా శ్రీ కోదండ రామాలయం నుండి పట్టణంలో రాందాస్ చౌరస్తా పాత బస్టాండ్ మీదుగా గోల్కొండ మార్కెట్ పిట్లం బేస్ చమన్ న్యూ బస్టాండ్ మీదుగా శోభాయాత్ర హనుమాన్ స్వాములు భజరంగ్ ధళ్ కార్యకర్తలు భక్తిపారవశ్యంలో నృత్యాలు భజనలు కీర్తనలునాతో పట్టణవాసులను ఆకట్టుకున్నాయి.. ముందస్తు చర్యల్లో భాగంగా ఇలాంటి వాంఛనీయ సంఘటన జరగకుండా డి.ఎస్.పి సైదులు పట్టణ సీఐ సంజయ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో అర్ఎస్ఎస్ విబాగ్ కార్యనిర్వాహకులు నాగభూషణం జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి పుట్టి మల్లేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

క్షేత్ర స్థాయిలో పనులను వీక్షించిన మంత్రి హరీష్ రావు

క్షేత్ర స్థాయిలో పనులను వీక్షించిన మంత్రి హరీష్ రావు

యదార్థవాది ప్రతినిది మెదక్

మెదక్ జిల్లా అవుసులపల్లి వద్ద నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయం ఎస్ పీ గృహం సెంట్రిగార్డ్‌ నిర్మాణ పనులను బుధవారం పరిశీలిన్చారు. జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కాంట్రాక్టర్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్.పి. శ్రీమతి.రోహిణి ప్రియదర్శిని, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంధాలయ ఛైర్మన్ చంద్రా గౌడ్, కాంట్రాక్టర్లు ఇంజనీర్లు సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నూతన నివాస గృహ సముదాయాలను ప్రారంభించిన: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నూతన నివాస గృహ సముదాయాలను ప్రారంభించిన: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

యదార్థవాది ప్రతినిది హైదరాబాద్

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో నూతనంగా నిర్మించిన 112 నివాస గృహ సమూదాయ భవనాన్ని కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ సరైన మౌలిక సదుపాయాల కల్పన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇందులో పొందుపరచిన సౌకర్యాలు వారికి అనుకూలంగా ఉంటాయని ముఖ్యంగా జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో పోలీసుల సేవలను గుర్తు చేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. దేశంలోని తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడంలో సాయుధ దళాలు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. పోలీసుల కృషి వల్లే బాగా అభివృద్ధి చెందుతున్నామని తెలిపారు. ప్రశాంత జీవనానికి పోలీసు సిబ్బందికి కనీస సౌకర్యాల కల్పన అవసరం అని మంత్రి తెలిపారు. పోలీస్ అకాడమీ అదనపు డైరెక్టర్ అమిత్ గార్గ్ మాట్లాడుతూ గ్రూప్ బి గ్రూప్ సి సిబ్బందికి 642 క్వార్టర్లలో మొత్తం 320 క్వార్టర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

దేశానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివి..

దేశానికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివి..

* దళితులందరికి దళిత బంధు పధకం వర్తిపచేయాలి..

యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్

భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి సుదీర్ఘ కాలం పార్లమెంట్ సభ్యులుగా వివిధ శాఖల్లో మంత్రిగా పనిచేసి భారత ఉప ప్రధానిగా పని చేసి దేశంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నిర్మాణ బాధ్యులు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేశ్ అన్నారు. బుధవారం బాబు జగ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్థానిక అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్( సిపిఐ)లో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్ తో కలిసి అయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బాల్యం నుండే అనేక అవమానాలను అంటరానితనంను ఎదుర్కొని వాటికి వ్యతిరేకంగా ఎదురించినా ధైర్హశాలి అని ఉన్నత చదువులు చదువుకుని అతి తక్కువ వయసులో ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. సుమారుగా 55 సంవత్సరాల కాలం ఎంపీగా,కేంద్ర మంత్రిగా అత్యధిక కాలం పని చేసిన రాజకీయ నాయకుడిగా ప్రపంచ రికార్డు జగ్జీవన్ గారికి ఉందని అన్నారు.కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్మిక చట్టాలను తీసుకొచ్చి కార్మికుల పక్షపతిగా సమాచార సామాజిక న్యాయ రక్షణ వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసి అన్ని రంగాల్లో ఫలితాలు సాధించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం యువకులు దళితులు కృషి చేయాలని పిలుపునిచ్చారు… కార్యక్రమం లోదళిత హక్కుల పోరాట సమితి సిద్దిపేట జిల్లా కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్ ఆర్గనైజింగ్ కార్యదర్శి బోనగిరి శంకర్ జిల్లా నాయకులు నెలవేణి స్వప్న,కొమ్ముల శ్రీనివాస్ జేరిపోతుల జనార్దన్ జనగాం రాజ్ కుమార్ పొన్నాల స్వప్న ఇరుగు సంధ్య వడ్లూరి బాలవ్వ జంగిడి సునిత తదితరులు పాల్గొన్నారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...