27.7 C
Hyderabad
Thursday, April 23, 2026

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు.!

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు.!

న్యూఢిల్లీ యదార్థవాది

లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 16న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం పాలసీ విషయంలో ప్రశ్నించాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. ఇప్పటికే పలువురిని ఈడీ విచారించింది. మార్చిలో డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. మనీష్ సిసోడియా చార్జ్ షీట్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటంలో ఇప్పుడు ఆయన్ను విచారించాలని నిర్ణయించింది. మనీష్ సిసోడియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ నోటీసులు జారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ ఆదివారం ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంపై ఇటీవలే జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశారు. అందులో ఏకే.. అంటే అరవింద్ కేజ్రీవాల్ అని.. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని తెలంగాన భవన్ లో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కూడా తన లేఖలో వివరించాడు. ఎమ్మెల్సీ కవితతో వాట్సాప్ చాట్ చేసినట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ సైతం జైలు నుండే.. తన లాయర్ ద్వారా బయటకు విడుదల చేశాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లిక్కర్ స్కాంలో నోటీసులు జారీ చేయటం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. సీఎం స్థాయి వ్యక్తికి.. 100 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి విచారించటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో పాత లిక్కర్ పాలసీనే మరో ఆరు నెలలు పాత పాలసీని కొనసాగిస్తూ.. ఇటీవలే కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు…

“అగ్నిమాపక వారోత్సవాలు”

“అగ్నిమాపక వారోత్సవాలు”

సిద్దిపేట యదార్థవాది

తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అగ్ని మాపక సేవల శాఖ అధ్వర్యంలో జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాల గోడ పత్రికను జిల్లా సమీకృతం సముదాయ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతాయని వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలున్నాయని అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యల గూర్చి ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని అగ్నిమాపక అధికారులకు కలెక్టర్ సూచించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101 నెంబర్ ప్రజల వద్దకు లోతుగా తీసుక వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పైజాన్ ఆహ్మద్, జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి సురేష్ కుమార్, అగ్నిమాపక కేంద్రీయ అధికారి రాజ్ కుమార్ అగ్నిమాపక కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

సికింద్రబాద్ యదార్థవాది

రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైమ్ విభాగ అధికారుల సిబ్బందితో కమిషనర్ డి ఎస్ చౌహాన్ నేరేడ్ మెట్ లోని కమీషనర్ కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.. కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న సైబర్ నేరాల శాతం పెరుగుతొందని వివిధ రకాల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరికరాలు ఉపయోగించక తప్పదని, కానీ అదే సమయంలొ సమాజం సైబర్ నేరాలపై అవగాహన కలిగి వుండాలని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేలా యువత భాగస్వామ్యంతో కళాశాలలు ఇతర ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. నకిలీ లాటరీలు నకిలీ ఉద్యోగ ప్రకటనలు నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం నకిలీ గిఫ్టు బాక్సుల వంటి పేరుతో ప్రజలను మోసం చేసే వారి పట్ల కఠిన శిక్ష అమలుచేస్తామని కమిషనర్ అన్నారు. సోషల్ మీడియాలో యువతులను వేధించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టేది లేదని అధికారులకు సూచించారు. పోలీసుల కృషి, కఠిన చర్యల వల్ల రాచకొండ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచర్ల బెడద చాలా వరకు తగ్గిందని, మహిళలు ప్రశాంతంగా బయటకు వెళ్లి తమ పనులు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టేలా అధికారులు క్రింది స్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది కలసి సమన్వయంతో పనిచేస్తేనే నేరాలు అదుపులో ఉంటాయని కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీపీ సైబర్ క్రైమ్స్ అనురాధ ఐపీఎస్, డీసీపీ క్రైమ్ మధుకర్ స్వామి, సైబర్ క్రైమ్ ఏసిపి వెంకటేశం, ఇన్స్పెక్టర్ లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మన ఊరు మన బడి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన..జిల్లా కలెక్టర్

మన ఊరు మన బడి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన..జిల్లా కలెక్టర్

సిద్దిపేట యదార్థవాది

జిల్లా సమీకృత కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో దుబ్బాక నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద కేటాయించిన పాఠశాలలో పనుల పురోగతిపై గురువారం ఎంఈవో ఎంపిడిఒ ఎంపిఓ ఇంజినీరింగ్ విభాగం ఈఈ డిఈ ఎఈ నిర్మాణ ఏజెన్సీలు సర్పంచ్ లతో కలిసి పాఠశాలల వారిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమీక్ష నిర్వహించారు.. సమావేశం లో ఆయన మాట్లాడుతూ మన ఊరు మన బడి పథక పనులు నత్తనడకన సాగుతున్నందున అసహనం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అకాడమిక్ సంవత్సరం ముగిసే లోపు తప్పనిసరి గా పనుల్లో వేగం పెంచి పూర్తి చేయ్యాలని మన ఊరు మన బడి పథకం లో ఎలక్ట్రిసిటీ పనుల్లో నాణ్యమైనవి (రూపింగ్ లైట్లు ప్యాన్లు), తాగునీటి వసతి, మేజర్ మైనర్ రిపేర్లు,తో పాటు ఈజీఎస్ పనులు టాయిలెట్లు, కిచెన్ షెడ్, ప్రహరీ గోడ, డైనింగ్ హల్, అదనపు తరగతి గదులు ఇతర పనులు భవనం అన్ని సదుపాయాలు కల్పించి రంగులు వేస్తే సరిపోదు పాఠశాలల్లో సేవింగ్స్ ఉంటే మైదానంలో సుందరీకరణ చేయ్యాలని తెలిపారు. ఈజిఎస్ పనుల జనరేట్ చేసిన ఎస్టిమేట్ వివరాలను అందించాలని డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డికి ఆదేశించారు. ఇప్పటి వరకు అయిన పనులకు ఎప్టిఓ జనరేట్ చెయ్యాలి కలరింగ్ ఏజెన్సీ కి మెథర్ మెంట్ షిట్ అందించాలని ఎంపిడిఒ ఎంపిఓ లు ఏఈ లకు తోడ్పాటునందించాలని హబ్సిపూర్ రెసిడెన్షియల్ స్కూల్ లో చేపడుతున్న పనులు త్వరగా పూర్తి చెయ్యాలని ఎఈ, డిఈ కి ఆదేశించారు. పనులు పూర్తి అయ్యేవరకు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటాం కావున మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. సమావేశం లో అసిస్టెంట్ కలెక్టర్ పైజాన్ ఆహ్మద్, డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువత కోసం పోరాడుదాం

నిరుద్యోగ యువత కోసం పోరాడుదాం

నిజామాబాద్ యదార్థవాది

సామాజిక విప్లవకారులు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి పేద బడుగు బలహీన వర్గాలు మహిళల సముద్ధరణకు ఆయన చేసిన అమూల్యమైన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.. అనంతరం పులే విగ్రహం వద్ద టీ-సేవ్ లోగోను ఆవిష్కరించిన బుస్సాపుర్ శంకర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు దక్కాయి అని నిరుద్యోగుల విద్యార్థుల కోసం రాజకీయాలకు అతీతంగా కలిసి పోరాడుదాం అని తొమ్మిదేండ్లుగా నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం పై ప్రభుత్వ మోసాలపై గళం వినిపించుదాం పూర్తి స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం సర్కారుపై ఒత్తిడి తీసుకొద్దాంఅని శంకర్ అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ జిల్లా యువజన అద్యక్షులు అంకార్ గణేష్,సంతోష్, సాగర్,మహిళ నేతలు రేఖ, రాణి తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛమైన నీరు ఉచితంగా అందించాలి

స్వచ్ఛమైన నీరు ఉచితంగా అందించాలి

* హోటళ్లు రెస్టారెంట్ లు శుద్ధి చేసిన నీటిని ఉచితంగా అందించాలని..
* వీధి వ్యాపారులు తప్పని సరిగా జలమండలి సరఫరా చేసే తాగునీటిని అందించాలి..

హైదరాబాద్ యదార్థవాది

గ్రేటర్ హైదరాబాద్ లోని హోటళ్లు రెస్టారెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వీధి వ్యాపారులు తప్పని సరిగా జలమండలి సరఫరా చేసే మంచినీరు  ఆర్.ఓ వాటర్ శుద్ధి చేసిన నీటిని గానీ తప్పని సరిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ ఎంసీ కమీషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ హోటళ్లు రెస్టారెంట్ లలో తప్పని సరి పరిస్థితుల్లో వాటర్ బాటిల్స్ సరఫరా చేస్తే ఆయా బాటిల్స్ పై ముద్రించిన గరిష్ట ధరను మాత్రమే తీసుకోవాలని సూచించారు. నగరంలోని అనేక హోటళ్లు రెస్టారెంట్లలో వేరు వేరు బ్రాండ్ల పేరుతొ బాటిల్ వాటర్ ను అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్పందించారు..

మల్లన్న సాగర్ నుండి ట్రయల్ రన్ ప్రారంభించిన : మంత్రులు

మల్లన్న సాగర్ నుండి ట్రయల్ రన్
ప్రారంభించిన : రాష్ట్ర మంత్రులు

గజ్వేల్ యదార్థవాది

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుండి ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు CMO సెక్రటరీ స్మితా సబర్వాల్.. సిద్దిపేట జిల్లా కుక్కునూరు పల్లి మండలం మంగోల్ గ్రామంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 12 వందల 12 కోట్ల రూపాయలతో రోజు 540 మిలియన్ లీటర్లను శుద్ధి చేయడానికి రాష్ట్రంలోనే అతిపెద్దగా నిర్మించిన నీటి శుద్దికరణ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ తో సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాలకు భవిష్యత్తులో తప్పనున్న తాగునీటి ఇబ్బందులు తప్పుతాయి..

నాణ్యత ప్రమాణాలు పాటించాలి :ఫుడ్ ఇన్స్ పెక్టర్

నాణ్యత ప్రమాణాలు పాటించాలి :ఫుడ్ ఇన్స్ పెక్టర్

హుస్నాబాద్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పలు హోటల్లు, టిఫిన్ సెంటర్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హోటల్లు, టిఫిన్ సెంటర్లలో తయారు చేస్తున్న ఆహార నాణ్యతను పరీక్షించారు. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని పలు హొటల్లు, టిఫిన్ సెంటర్లకు జరిమానా విధించారు. హుస్నాబాద్ పురపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు హోటల్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేశామని, అందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్, కిచెన్ లను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించని పలు హోటల్లు, టిఫిన్ సెంటర్లకు పెనాల్టీ వేశారు వినియోగదారులు ఏదైనా హోటల్లలో, టిఫిన్ సెంటర్లలో ఆహార నాణ్యత విషయంలో లోపాలను గుర్తిస్తే వెంటనే పురపాలక శాఖకు తెలియజేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో తమ వంతు బాధ్యతగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంట జవాన్ గడిపే సారయ్య పైసా శ్రీకాంత్ ప్రభాకర్ పాల్గొన్నారు.

వ్యవసాయ కళాశాల ప్రారంభానికి సిద్దం..

వ్యవసాయ కళాశాల ప్రారంభానికి సిద్దం..
*12న నూతన వ్యవసాయ కళాశాల
ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రులు

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులో నిర్మిస్తున్న వ్యవసాయ కళాశాల ప్రారంభానికి సిద్ధమైంది. 35 ఎకరాల విస్తీర్ణంలో 69.30 కోట్లతో ప్రభుత్వం ఈ కళాశాలను ఏర్పాటుచేసింది. 16 ఎకరాల్లో జీ ప్లస్‌ 2 పద్ధతిలో కళాశాల భవనం విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లు 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధనా క్షేత్రం ఫాంలాండ్స్‌ను నిర్మించింది. అత్యాధునిక కంప్యూటర్‌ ల్యాబ్‌లు ప్రయోగశాల సెమినార్‌ ఆధునిక లైబ్రరీ ఏర్పాటుచేశారు. ఈ నెల 12 వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తో కలిసి మంత్రి కే తారక రామారావు కళాశాల భవనం హాస్టల్స్ ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఇంచార్జీ వైస్ ఛాన్సలర్ రఘునందన్ రావు రిజిస్ట్రార్ డాక్టర్ సుదీర్ బాబు వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ డాక్టర్‌ సీమ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు.

నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలి : జిల్లా ఎస్ పి

నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలి : జిల్లా ఎస్ పి

యదార్థవాది ప్రదినిది సిరిసిల్ల

కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్ పి అఖిల్ మహాజన్ తెలిపారు.. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్ట్ విధులు నిర్వహించే పోలీస్ అధికారులతో సమావేశంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులతో ఎల్లప్పుడూ సమన్వయం పాటిస్తూ నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలని నిరంతరం పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలిస్తూ పై అధిారుల సూచనలు పాటిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. సాంకేతికత ప్రస్తుతం కీలకంగా మారిందని ప్రతి కేసులో సైంటిఫిక్ ఆధారాలు జమ చేయాలని ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదుపడేలా కృషి చేయాలని శిక్షల శాతం పెరిగేలా పనిచేసే అధికారులను రివార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్ట్ జారీ చేసిన నాన్ బేలబుల్ వారెంటులను క్రమం తప్పకుండా అమలుచేయాలని సూచించారు. సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...