రైతులకు బీఅర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే
హుస్నాబాద్ యదార్థవాది
రైతులకు బీఅర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది: ఎమ్మెల్యే
హుస్నాబాద్ యదార్థవాది
సిరిసిల్ల మెడికల్ కళాశాలకు గ్రీన్ సిగ్నల్!
సిరిసిల్ల యదార్థవాది
రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతుల ప్రారంభానికి అనుమతి ఇస్తూ ఎన్‌ఎంసీ మెడికల్ అసెస్‌మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఏఆర్‌బీ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ
విద్యాసంవత్సరం నుంచి వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు బోధన సిబ్బందిని నియమించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని స్పష్టం చేసింది. మంత్రి కే టి ఆర్ హర్షం రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేయడం పట్ల మంత్రి కే తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. తరగతులు ప్రారంభించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వేగంగా మెడికల్ కాలేజీ భవన నిర్మాణం ఆధునిక హంగులతో చేపడుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి. అడ్మిషన్లకు అనుమతి మెడికల్ కాలేజ్ మంజూరు పట్ల జిల్లా ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రిని 300 పడకల మేర విస్తరించేందుకు సీఎం కెసిఆర్ ఆదేశాలు ఇచ్చారని కేటీఆర్ అన్నారు.ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలను చేపట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఫర్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ (MARB) అనుమతులను ఇచ్చిందన్నారు.
కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది: మంత్రి హరీష్
సిద్ధిపేట యదార్థవాది
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో సూఫీ మసీదు ఆవరణలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ముస్లిం సోదరులతో అలై బలై తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకుంటునమని కేసీఆర్ పాలనలో 9 ఎండ్లలో అందరూ అన్నదమ్ముల వలె పండుగలు, అన్ని వర్గాల్లో కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతుందని, కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
చైనాను అధిగమించి తొలిస్థానంలోకి..!
న్యుడిల్లి యదార్థవాది
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది..
ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్ తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలిచింది.
జనాభా అంచనాలకు సంబంధించి ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023’ పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ తాజా నివేదికను విడుదల చేసింది. భారత్‌లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది. మనతో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57కోట్లుగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది.
ఏపీ ఉద్యోగుల సంఘం నేతకు మరోసారి నోటీసులు..
అమరావతి యదార్థవాది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది.. సూర్యనారాయణ అధ్యక్షుడిగా ఉన్న ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. గతంలో వాణిజ్య పన్నుల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అదనపు కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కార్యాలయం వెలుపల ఉన్నతాధికారిని దిగ్భందించి ఆందోళన చేయడంపై సంజాయిషీ ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం మరోమారు నోటీసులు జారీ చేస్తూ.. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
వృద్దుల సంరక్షణ కేంద్రంలో చేర్పించవచ్చు: జిల్లా కలెక్టర్
సిరిసిల్ల యదార్థవాది
తంగళ్ళపల్లి మండలంలోని మండేపల్లి లో నిర్మిస్తున్న ప్రభుత్వ వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం సందర్శించారు.. ఏర్పాటు చేసిన వసతులు, పడక గదులు, భోజనశాల, వంటగది,సరుకులు నిలువచేయుగది, ఫిజియోథెరపీ రూమ్, వస్తువులు, డాక్టర్ రూమ్ ఆటలు పాటలు రూమ్ టీవీ రూమ్ అన్నింటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మొక్కలను గార్డెనింగ్ పరిశీలించారు.. వయవృద్ధుల సంరక్షణ కేంద్రంలోకి రావడానికి ఇష్టపడుతున్నటువంటి వయోవృద్ధులను చేర్చుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మి రాజం కు సూచించారు. చుట్టుపక్కల పరిసరాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని మండల పరిషత్ అభివృద్ధిని అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మంచిర్యాల యదార్థవాది
మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలం లోని పడ్తానపల్లి, కర్ణమామిడి గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కలెక్టర్ సంతోష్ వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు…
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని. రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని అమ్మలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో DCMS చైర్మన్ తిప్పని లింగన్న, ప్రజాప్రతినిధులు, బీఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
గురుకులాలలో స్పార్క్ లెస్ సమ్మర్ క్యాంప్స్..
సిద్ధిపేట యదార్థవాది
గురుకుల విద్యాలయాలలో స్పార్క్ లెస్ సమ్మర్ క్యాంప్స్ కార్యక్రమం వాల్పోస్టర్లను బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గురుకుల ప్రిన్సిపాల్ లతో కలిసి ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్…
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి మే 6 వ తేదీ వరకు స్పార్క్ లెస్ పేరుతో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించి విద్యార్థులకు ఎంపిక చేసిన రంగాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ క్యాంపులో పాల్గొనే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయా రంగాల్లో తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని, ఈ ప్రతిభ భవిష్యత్తులో ఎంచుకున్న రంగాల్లో విజయవంతంగా రానించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
హుస్నాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ (బాయ్స్) కాలేజీలో బాలురకు చిత్రలేఖనం, యాంకరింగ్, ఉపన్యాసం, యువ జర్నలిస్ట్, వెస్టర్న్ డాన్స్ రంగాలలో…
తొగుట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజీలో బాలికలకు లైఫ్ స్కిల్స్, వెస్టర్న్ డాన్స్, బ్యూటీ కేర్, బేసిక్ అబాకస్ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు..
కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఆర్సిఓ కె.నిర్మల, హుస్నాబాద్ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీనివాస్, తోట గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ మెర్సీ వరూధిని, ఇతర గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.
సబ్బండవర్గాల, సంక్షేమమే బీఅర్ఎస్ ప్రభత్వ ధ్యేయం
సిరిసిల్ల యదార్థవాది
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుపేద ముస్లింలకు అందిస్తున్న రంజాన్ తోఫా(గిఫ్ట్ )ప్యాక్ లను సిరిసిల్ల పట్టణంలో గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో మంగళవారం ప్రభుత్వం తరుపున లబ్ధిదారులకు అందజేసిన జడ్పి చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదలు పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు కొత్త దుస్తులు పంపిణీ చేస్తున్నారని అన్ని వర్గాల ప్రజలు పండుగలను సంతోషంగా చేసుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ ద్వారా సాయం చేస్తూ అదుకొంటుదని మైనార్టీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను అందిస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతుందని మైనార్టీల సంక్షేమం కోసం షాదీ ముబారక్, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం టిఆర్ఏస్ ప్రభుత్వ మేనని అన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమానంగా గౌరవిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అన్ని మతాల పండుగలను అధికారికంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మత సామరస్యాన్ని కోరుకుంటుందని, మత విద్వేషాలను ప్రోత్సహించదని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మన రాష్ట్రంలో అన్ని మతాల వారు అన్నదమ్ముల కలిసి మెలిసి ఉంటున్నారని మన మంత్రి కేటీఆర్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందo కళ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, కౌన్సిలర్ చందన, జిల్లా మైనారిటీ అధికారి సర్వర్మియా, తహశీల్దార్ విజయ్, ముస్లిం సోదరి సోదరులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు..
సీఎం దత్తత గ్రామనికి జాతీయ అవార్డు
గజ్వేల్ యదార్థవాది
న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి గిరి రాజ్ సింగ్ చేతుల మీదుగా గ్రామ్ ఉర్జా స్వరాజ్ విశేష్ పంచాయతీ అవార్డును సోమవారం సిద్ధిపేట
జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ముజామిల్ ఖాన్, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ మర్కుక్ మండల ఎర్రవల్లి గ్రామనికి జాతీయ పంచాయతీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. 2023 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక కేటగిరి అవార్డు కింద గ్రామ్ ఉర్జా స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కార్ కింద ప్రథమ స్థానంలో సిద్ధిపేట జిల్లాలోని మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో 519 ఇండ్లకు గానూ 414 ఇండ్లకు సౌర పలకల ద్వారా సౌర శక్తితో విద్యుత్ వాడడం జరుగుతున్నది. ఈ ప్రాజెక్టులో ఒక్కో యూనిట్ కి 1కేవి విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఒక్కో యూనిట్ కి గాను 1,57,000 ఖర్చయిందని ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 90000 సి ఎస్ ఆర్ ఫండ్ ద్వారా బీహెచ్ఈఎల్ వారి సహకారం 60000 రూపాయలు 7వేల రూపాయలు ఇంటి యజమాని వాటా ఉందని సీఎం కేసీఆర్ విజన్ కు అనుగుణంగా సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి గ్రామ ప్రజల సహకారంతో ప్రజా చైతన్యం, పంచాయతీ పాలక వర్గం సమన్వయం, పంచాయతీ అధికారుల కృషితో సాధ్యమైందని, సోమవారం కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న అధికారులను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలియచేశారు.