34.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

విశాఖలో రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్..

విశాఖలో రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్..

విశాఖపట్నం యదార్థవాది

విశాఖపట్నం కంబాల కొండ జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…

శుభ్రత పరిశుభ్రతతో మలేరియాను అరికట్టవచ్చు: జిల్లా వైద్యాధికారి

శుభ్రత పరిశుభ్రతతో మలేరియాను అరికట్టవచ్చు: జిల్లా వైద్యాధికారి

సిరిసిల్ల యదార్థవాది

ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భముగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎ.సుమన్ మోహన్ రావు సమావేశం నిర్వహించి ర్యాలీ చేపట్టరు.. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల ద్వారా సున్నా మలేరియాను చేరుకొనుటకు సమయం అసన్నమైదని ”అనాఫిలిస్” దోమ ద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తిస్తుందని, దోమల నివారణ కొరకు దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలని, ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు నీటి తోట్ల మీద మూతలు పెట్టాలని అన్నారు. ప్రతి రోజు డ్రై డే గా, పొడి దినముగా పాటించి నీటి నిలువలు అన్నీ శుబ్రపరచి, అరబెట్టి తిరిగి నింపుకోవాలని దోమ తెరలను వాడటం అలవరచుకోవాలని వర్షాలకు ముందు తరువాత మురికి కాలువలలో పూడిక తీత చేపట్టి నీరు పారునాట్లుగా చూడాలని, వ్యాధులు ప్రబలినప్పుడు, స్థానిక ఆరోగ్య సిబ్బందికి వెంటేనే సంప్రదించాలని వారి సలహాలు, సూచనలు పాటించాలని, మలేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించి, రక్త పరీక్షల ద్వారా నిర్ధారణ చేసి చికిత్స కు తగిన ఏర్పాట్లు చేసుకోవడం, వ్యాధి ప్రబలిన చోట నియంత్రణ మందులు చల్లడం పొగబెట్టడం వంటి మొదలగు నివారణ చర్యల ద్వారా మలేరియా వ్యాధిని అరికట్ట వచ్చని ఆయన అన్నారు. సమావేశంలో డా. బి. శ్రీరాములు, జిల్లా ప్రోగ్రాం అధికారి, జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. మురళీధర్ రావు, డా,నయిమా, ఏ. వో. శ్రీనివాస్, డి. పి. ఏం. వో లు కాశీనాథం, సురేష్, ప్రతాపరెడ్డి, లింగం, బాలయ్య, భూమయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

నేరస్తులకు జీవిత ఖైదు పడేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించిన. పోలీస్ కమిషనర్

నేరస్తులకు జీవిత ఖైదు పడేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించిన. పోలీస్ కమిషనర్

నిజామాబాద్ యదార్థవాది

జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరస్తులకు జీవిత ఖైదు పడేందుకు కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు పోలీస్ సిబ్బందిని అభినందించిన ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ సి.హెచ్ ప్రవీణ్ కుమార్.. నిజామాబాద్ డివిజన్ పరిధిలో టౌన్ 3, టౌన్ 5 పోలీస్ స్టేషన్లలో జరిగిన నేరాల నేరుద్ధులకు జీవిత ఖైదీ శిక్షలు పడే విధంగా కృషి చేసిన వారిని మంగళవారం పోలీస్ కార్యాలయంలో కమిషనర్ శాలువాలతో పుష్పబొక్కెలతో అభినందిస్తూ ప్రశంసా పత్రలు అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు సిబ్బంది ఎల్లప్పుడు కేసులలో నేరస్థులకు తగు శిక్ష పడే విధంగా అన్ని రకాలుగా కృషి చేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచన మేరకు కోర్టులో ఎవ్వరిని ఎప్పుడు హజరుపర్చాలనో వారిని సరియైన సమయంలో హజరుపర్చుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమీషనర్ (ఎ.ఆర్) గిరిరాజు, అదనపు పోలీస్ కమీషనర్ అడ్మిన్ జి. మధుసుదన్ రావు, ఏసీపీలు ఎమ్. కిరణ్ కుమార్, నారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

త్వరలో పశువైద్య కళాశాలకు శంకుస్థాపన

త్వరలో పశువైద్య కళాశాలకు శంకుస్థాపన

సిద్దిపేట యదార్థవాది

సమీకృత జిల్లా కార్యలయ సముదాయ సమీపంలో 30 ఎకరాల విస్థిర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న పశువైద్య కళాశాలకు కేటాయించిన ప్రాంతాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. టిఎస్ఎంఎస్ఐడిసి ఇంజనిర్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీ, పశువైద్య యూనివర్సిటీ బృందం, ఎడి సర్వేయర్, స్థానిక తహసిల్దార్ అందరు కలిసి మ్యాప్ ద్వారా కళాశాల నిర్మాణం గుర్చి వివరించారు. కళాశాల ఆవరణ చుట్టూ 10 మి ఒకటి చొప్పున స్తంభాలు పాతాలని ఎడి సర్వేయర్ వినయ్ కుమార్ కి తెలిపారు. ఆవరణలో పెద్ద పెద్ద కరెంట్ స్తంభాలు తియ్యడానికి డిమాండ్ నోటిస్ తయారు చేయ్యాలని విద్యుత్ శాఖ ఎస్ఇకి తెలిపారు. భవిష్యత్తు తరాలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నిర్మాణ ఎస్టిమేట్ టెండర్ ను పైనల్ చెయ్యాలి. స్థలాన్ని చదును తర్వాత అతి త్వరలో జిల్లా మంత్రి హరీష్ రావు చే శంకుస్థాపన కార్యక్రమానికి సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా ఉద్యానవన అధికారిగా పదవీ భాద్యతలు స్వీకరించిన.. పి.సునిత

జిల్లా ఉద్యానవన అధికారిగా పదవీ భాద్యతలు స్వీకరించిన.. పి.సునిత

సిద్దిపేట యదార్థవాది

సిద్ధిపేట జిల్లా ఉద్యానవనశాఖ అధికారిగా పి.సునిత పదవీ భాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉద్యానవన సెరికల్చర్ పంటల అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో వడగండ్ల వాన వల్ల దెబ్బ తిన్న పండ్ల తోటల వివరాలను యుద్ధప్రాతిపదికన సేకరించాలని తెలిపారు.

సమీకృత జిల్లా కార్యాలయంలో జాతీయ పక్షి ప్రత్యక్షం..

సమీకృత జిల్లా కార్యాలయంలో జాతీయ పక్షి ప్రత్యక్షం..

జగిత్యాల యదార్థవాది

పచ్చని చెట్లతో  ఆహ్లాదాన్ని పంచుతూ… ఎకో ఫ్రెండ్లీ గా తీర్చిదిద్దిన  జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సందర్శకులనే కాక పక్షులను ఆకర్షిస్తుంది. సముదాయంలో పని చేసే ఉద్యోగులకు, వివిధ పనుల కోసం జిల్లా కార్యాలయానికి వచ్చే సందర్శకులకూ పక్షుల కిలకిల రావాలతో స్వాగతం పలుకుతుంటాయి. కాగా మంగళవారం ఉదయం సమీకృత జిల్లా కార్యాలయాల ఆవరణలో జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షమైంది. చాలా సేపు కార్యాలయ ఆవరణలోని లాన్ లో మయూరం అటూ ఇటూ తిరుగుతూ సందడి చేసింది. ఇదే సమయంలో కార్యాలయానికి వచ్చిన తెలంగాణ సాంస్కృతిక సారథి దొబ్బల ప్రకాష్ మయూరపు సోయగాలను తన మొబైల్ లో బంధించారు. మయూరపు సోయగాల వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన సోయగాలతో జాతీయ పక్షి నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

* ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో ఈ నెల 15 న నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్- 2022లో జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం గోల్డెన్ గార్డెన్ అవార్డ్  చేజిక్కించుకోవడం విశేషం.

* జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పచ్చదనం పెంపొందించేందుకు  అధికారుల తీసుకుంటున్న ప్రత్యేక చొరవ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భట్టి పాదయాత్రకు ఘన స్వాగతం..

భట్టి పాదయాత్రకు ఘన స్వాగతం..

* పేద ప్రజల కలలు సాకారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి  రావాలి: భట్టి విక్రమార్క

హుస్నాబాద్ యదార్థవాది

హుస్నాబాద్ నియోజక వర్గంలో ఎల్కతూర్తి మండలం సోమవారం భట్టి విక్రమార్క పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు న్యాయం జరుగాలంటే ధరణి పోర్టల్ ద్వారా తీవ్ర ఇక్కట్లు పోవాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే ప్రతి ఏటా కూలీ బంధు పథకం కింద రూ.12 వేలు ఇస్తుందని రూ. 500 కే వంట గ్యాస్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే మొదటి ఏడాది ఏక కాలంలో రూ. 2 లక్షల రైతు రుణ మాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోందని ఆయన అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అని మాయ మాటలు చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తామని అబద్ధపు వాగ్దానాలు చేసి రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం లీకేజీల తో నిరుద్యోగుల జీవితాలతో అటలడుకుంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, దొమ్మాటి సాంబయ్య, అన్వేష్ రెడ్డి, కోట నీలిమ, బీర్ల ఐలయ్య పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దళిత జర్నలిస్టులను ఆదుకోవాలి..

దళిత జర్నలిస్టులను ఆదుకోవాలి..

జగిత్యాల యదార్థవాది

జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో దళిత జర్నలిస్టులకు దళిత బంధు, ఇండ్ల స్థలాలు, రెండు పడకల ఇల్లు ఇవ్వాలని తెలంగాణ ఎస్ సి ఎస్ టి వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో
జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద వినతిపత్రం ఇవడం జరిగింది.. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని దళిత జర్నలిస్టులకు ఆమాలు చేయాలని వివిధ పత్రికల్లో పనిచేస్తున్న వర్కింగ్ దళిత జర్నలిస్టులకు ఇల్లు లేదా ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో వివిధ పత్రికలు చానల్లో ఏండ్ల తరబడి అనేకమంది దళిత గిరిజన జర్నలిస్టులు పనిచేస్తున్నారని వారంతా ఆర్థిక స్తోమత లేక పత్రిక యజమాన్యాల దోపిడీ భరించలేక ప్రభుత్వాల భరోసా లేక తీర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన జర్నలిస్టుల యూనియన్లు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ రాష్ట్రంలో వివిధ పత్రికల్లో చానల్లో దళిత గిరిజన జర్నలిస్టులుగా పనిచేస్తూ ఆర్థిక స్తోమత లేక అనేక అవస్థలు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని దళిత జర్నలిస్టులకు అమలు చేయాలని కోరారు. దళిత బంధు పథకం అమలు కోసం ఇప్పటికే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
కలిసి వినతి పత్రం అందజేశామని ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదని ప్రభుత్వం స్పందించి రెండో విడత దళిత బంధు పథకంలో దళిత జర్నలిస్టులను గుర్తించి అమలు చేసి ఆదుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు దాసం కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల సతీష్, గొడిసెల రమేష్, బలిజ సంతోష్, పింజరి శివ తదితరలు పాల్గొన్నారు..

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా అదనపు కలెక్టర్

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా అదనపు కలెక్టర్

జగిత్యాల యదార్థవాది

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ మంద మకరంద సంబంధిత అధికారులను ఆదేశించారు.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 50 ఫిర్యాదులు వినతులు వచ్చాయి.. కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు..

అకాల వర్షాలతో నష్టపోయి పంటలను క్షేత్ర స్థాయిలో పరీశిలించిన.. జిల్లా కలెక్టర్

అకాల వర్షాలతో నష్టపోయి పంటలను
క్షేత్ర స్థాయిలో పరీశిలించిన .. జిల్లా కలెక్టర్

సిద్దిపేట యదార్థవాది

సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి చేర్యాల
మండలంలోని ఐనాపూర్ పోసాన్ పల్లి
పెద్దరాజ్ పేట పోతిరెడ్డిపేట గ్రామాలలో
అకాల వర్షాలతో నష్టపోయి పంటలను సోమవారం క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతా రెండు రోజులు జిల్లాలో ముఖ్యంగా కొమురవెల్లి చేర్యాల మండలాల్లో వడగండ్ల వాన వల్ల వరి పంటలకు తీవ్రంగా నష్టం జరిగిందని యుద్ధ ప్రాతిపదికన నష్టపోయిన వరి పంటల వివరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచిందని అదే పద్దతిలో వ్యవసాయశాఖ తరపున ఎడిఎ, ఎఈఓ, ఇతర అధికారుల ఆద్వర్యంలో ఈ రెండు మండలాల్లో 12నుండి 15గ్రామాల్లో వరి పంటనష్ట వివరాలను పారదర్శపద్దతిలో సేకరిస్తారని తెలిపారు. దెబ్బ తిన్న వరి పంట వివరాలను విస్తీర్ణం, సర్వే నెంబర్ వారిగా రెండు రోజులు గ్రామపంచాయతీలలో అతికిస్తారని ఎ రైతులకు ఎంత నష్టం జరిగిందో ప్రతి ఓక్కరు చుస్తారని నష్టపోయిన అర్హత ఉన్న రైతు వివరాలను సేకరించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే అర్హత లేని రైతులను లిస్ట్ నుండి తోలగించుతారు. వ్యవసాయ శాఖతో పాటు మామిడి ఇతర పండ్ల తోట సంబందించి ఉద్యాన వన శాఖ ఐనాపుర్ గ్రామంలోనే సుమారుగా 10 నుండి 15వ వరకు ట్రాన్స్ ఫార్మర్ లు కలిపోయినవి కావున విద్యుత్ శాఖ ఎస్సీ, ఎడి ఈరోజు, రేపు వచ్చి వివరాలను సేకరించాలని ఆదేశించారు. నష్టపోయిన కౌలు రైతులకు సంబందించి ప్రభుత్వం తప్పనిసరిగా మంచి నిర్ణయం తిసుకుంటుందని రైతుల వారిగా ధరణి పోర్టల్ ఉన్న నంబర్ ల ఆధారంగా పై అధికారులకు పంట నష్ట వివరాలను అందించడం జరుగుతుందని ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపుగా 2000 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని ఈ రెండు మూడు రోజుల్లో వ్యవసాయ శాఖ అధికారులు దెబ్బ తిన్న వరి పంట వివరాలలో స్పష్టత వస్తుంది. ప్రభుత్వం ఎ ఓక్క రైతుకు కుడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ ఎడిఏ, స్థానిక ఎఈఓలు, తహసిల్దార్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు అధికారులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...