36.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

మనోధైర్యనికి ప్రతీక,మానసిక సమస్యల పరిష్కార వేదిక “కిరణం”

మనోధైర్యనికి ప్రతీక,మానసిక సమస్యల పరిష్కార వేదిక “కిరణం”

రాష్ట్రంలోనే తొలి సారిగా మానసిక సమస్యల పరిష్కారం కోసం కిరణం సలహా కేంద్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి..

సిరిసిల్ల యదార్థవాది

ఆత్మస్థైర్యం కోల్పోయిన జీవితాల్లో నూతన ఆశలు చిగురించేలా కిరణం మానసిక సలహా కేంద్రం రానన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తుందని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు..కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సైకాలజిస్ట్ లు, సైకియాట్రిస్ట్ లు, కౌన్సెలర్ లు, వైద్యాధికారులతో జరిగిన సమావేశంలో టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3333 ను లాంఛనంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు… ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ మానసిక అనారోగ్యాన్ని తొలి దశలోనే గుర్తించడం, ప్రాథమిక చికిత్స, మానసిక మద్దతు, ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, సానుకూల ధోరణిని పెంచడం వంటి లక్ష్యాలతో మానసిక ఆరోగ్య సేవలను కిరణం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ అందిస్తుందని ఆయన  వెల్లడించారు. ఆత్మహత్య ఆలోచనలు, డిప్రెషన్,  ఒత్తిడి, ఆతృత, నిరాశ, భయాందోళనలు,  పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లు, మత్తు పదార్థాలు,  సంక్షోభ ప్రేరేపిత మానసిక సమస్యలు, గృహ హింస,  మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితులతో మానసిక సమస్యలతో బాధ పడేవారి సమస్యల పరిష్కారానికి ఈ హెల్ప్‌లైన్‌ సేవలు ఉపయోగకరం గా ఉంటాయని టోల్ ప్రీ నంబర్ 24/7 పనిచేస్తుందని తెలిపారు. ఈ నంబర్ కు ఫోన్ చేసిన వెంటనే నిపుణులైన సైకాలజిస్టు లు, సైక్రియటిస్టు లు, కౌన్సెలర్ లు ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తారని మానసిక సమస్యలను ఎలా అధిగమించాలో దిశా నిర్దేశనం చేస్తారని అవసరమైన సందర్భంలో జిల్లా  వైద్యశాలలో కౌన్సెలింగ్, చికిత్స కొరకు వారిని పంపడం ద్వారా చికిత్స కొనసాగిస్తారని రోగి కొలుకునేంత వరకు ఫాలో అప్ చికిత్స కొనసాగుతుందని అన్నారు. మానసిక సమస్యలతో బాధపడే జిల్లా లోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథంకు సూచించారు. వైద్యాధికారులు తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటు ఉప ఆరోగ్య కేంద్రాలలో ప్రచార గోడ పత్రికలను ప్రదర్శించాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వీటిని ప్రదర్శించి ప్రజలందరికీ కిరణం టోల్ ఫ్రీ నెంబర్ తెలిసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని ప్రజలందరు ఇట్టి సౌకర్యాన్ని సద్వినియాగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రావు, సైకాలజిస్ట్ కె. పున్నం చందర్, శ్రీనివాస్, సైకియాట్రిస్ట్ లు డాక్టర్ సతీష్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ నయీమ, వైద్యాధికారులు పాల్గొన్నారు.

మంచు వర్షంలో.. చిక్కుకుపోయిన యాత్రికులు

మంచు వర్షంలో.. చిక్కుకుపోయిన యాత్రికులు

కేదార్ నాథ్ యదార్థవాది

కేదార్‌నాథ్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఎక్కువమంది వయస్సు మీద పడినవారే కావడంతో కొందరికి ఊపరి అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో కేదార్‌నాథ్‌ను నిలిపివేశారు. అక్కడి నుంచి భక్తులు వీలైనంత తర్వగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యాత్రలో దాదాపు 150 మంది తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆలయ పరిసరాల్లో భారీగా మంచు వర్షం కురుస్తుండటంతో ఆలయ పరిసరాల్లో క్షణాల్లో వాతావరణం మారిపోతోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేదార్‌నాథ్‌ యాత్రను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు.

 

సీతారామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

సీతారామ కళ్యాణ మహోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

వేములవాడ యదార్థవాది

కోనరావుపేట మండలం నాగారం శ్రీ కోదండ రామస్వామి దేవాలయ పునః ప్రతిష్ట, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, పవర్ లూమ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, అధికారులు , జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఆర్డీఓ పవన్ కుమార్, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, ఎంపీపీ చంద్రయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

నేరాల నియంత్రణకు ఇంటర్‌సెప్టర్ పోలీస్ వాహనాన్ని ప్రారంభించిన: జిల్లా ఎస్పీ అఖిల్

నేరాల నియంత్రణకు ఇంటర్‌సెప్టర్ పోలీస్ వాహనాన్ని ప్రారంభించిన: జిల్లా ఎస్పీ అఖిల్

సిరిసిల్ల యదార్థవాది

సిరిసిల్ల జిల్లాలో ధర్నాలు రాస్తారోకోలు వద్ద అవాంఛనీయ సంఘటనలు రికార్డు చేసే అధునాతన టెక్నాలజీ పోలీస్ వాహనాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణనే ప్రధాన ఉద్దేశ్యంతో ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల గౌరవం నమ్మకం మరింత పెరిగేలా జిల్లాలో మొట్టమొదటగా ఇంటర్‌సెప్టర్ పోలీస్ వాహనాన్ని ప్రారంభించామని సిరిసిల్ల టౌన్, వేములవాడ టౌన్ లో నిత్యం తిరుగుతూ ర్యాలీలు, ధర్నాలు, అల్లర్లు జరిగినప్పుడు ఈ వాహనంలో 360°గలా కేమెరా తో ఇద్దరు డ్రిస్టిక్ గార్డ్ సిబ్బంది రికార్డ్ చేసి ఉన్నత అధికారులకు తెలియజేస్తారని అన్నారు. కార్యక్రమంలో ఆర్.ఐ రజినీకాంత్, టౌన్ సి.ఐ అనిల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.

మైనర్ వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమాని పై కేసు నమోదు చేస్తాం: పోలిస్ కమీషనర్

మైనర్ వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమాని పై కేసు నమోదు చేస్తాం: పోలిస్ కమీషనర్

కరీంనగర్ యదార్ధవాది 

మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్స్తున్నట్లు కరీంనగర్ పోలిస్ కమీషనర్ ఎల్. సుబ్బారాయుడు తెలిపారు.. కరీంనగర్ కమీషనర్ కార్యాలయములో గురువారం వాహనాలు నడిపిన మైనర్ లకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా, పట్టణంలో ప్రతి రోజు వాహనాల
చెకింగ్ నిర్వహిస్తమని అందులో భాగముగా మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని మైనర్లకు వాహనాలు ఇస్తే వారు రోడ్డు నిబంధనలు తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలలో చాలామంది అవయవాలు కోల్పోతు కుటుంబాల వారు నష్ట పోతున్నారని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఒకవేళ మైనర్ కు వాహనం ఇచ్చి ఏదైనా ప్రమాదం జరిగితే మైనర్ డ్రైవింగ్ చేస్తూ వాహనం తో పట్టుబడితేవాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రతిరోజు కరీంనగర్ లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కోర్టులో హాజరు పరుస్తున్నామని ఒకవేళ ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సార్లు మద్యం సేవించి దొరికితే జైలు శిక్ష తప్పదని జైలు శిక్ష పడిన వాహనదారుల లైసెన్స్ రద్దుకై రవాణా సంస్థ వారికి సిఫారసు చేస్తామని కమిషనర్ తెలిపారు. కరీంనగర్ లో ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తూ, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్న కరీంనగర్ ట్రాఫిక్ ఏ సి పి విజయకుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు తిరుమల్, నాగార్జున రావు ట్రాఫిక్ సిబ్బందిని ఆయన అభినందించారు.

పోలీస్ రిక్రూట్మెంటు బోర్డు నియమావళి పాటించాలి: కమీషనర్ ప్రవీణ్ కుమార్

పోలీస్ రిక్రూట్మెంటు బోర్డు నియమావళి
పాటించాలి: కమీషనర్ ప్రవీణ్ కుమార్

నిజామాబాద్ యదార్థవాది

నిజామాబాద్ గిరిరాజు ప్రభుత్వ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఆడిటోరియంలో గురువారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నాం 2 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంటు బోర్డు నియమావళి పరీక్షా కేంద్రాల ఛీఫ్ సూపరింటెంటులకు అబ్జర్వరులకు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు అవగాహణ కార్యక్రమం నిర్వహించిన
ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి.హెచ్, ప్రవీణ్ కుమార్… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 30న నిర్వహించబోయే కానిస్టేబుల్ పోస్టుల నియామక ఫైనల్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలో మొత్తం 5285 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. మొత్తం 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని ఈపరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారిని అభ్యర్థులు హాల్టికేటు మీద ఫోటో అంటించుకొని పరీక్ష కేంద్రానికి రావాలని బ్లూ లేదా బ్లాక్ బాల్పాయింటు పెన్ తీసుకొని రావాలని, ఎలాంటి గుర్తింపు కార్డులు తీసుకురాకూడదని, అన్నిపరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. రాత పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్థుల గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని 9 గంటల నుండే అభ్యర్థులను పరీక్ష కేంద్ర ములోనికి అనుమతించడం జరుగుతుందని 10 గంటల తర్వాతా అభ్యర్థులకు 1 నిమిష మేము ఆలస్యం అయిన పరీక్ష కేంద్రములోనికి అనుమతించరని తెలిపారు. ఎంపిక విధానం పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని అభ్యర్థులు గుర్తించాలని, ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, అటువంటి మోసగాళ్ల సమాచారం పోలీసులకు తెలుపాలని అన్నారు. బస్టాండ్ వద్ద అభ్యర్థులకు పరీక్షకేంద్రాల రూట్ మ్యాప్ గుర్చి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం జరుగుతుందని అన్నారు. రాత పరీక్ష పూర్తిగా రీజినల్ కో-ఆర్డినేటర్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ పి.రామ్ మోహన్ రెడ్డి, నిజామాబాద్ నోడల్ ఆఫీసర్ అదనపు పోలీస్ కమీషనర్ ( అడ్మిన్) జి. మధుసుదన్ రావు సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని ఎవరికి ఎలాంటి సందేహాలుఉన్నను వీరి దృష్టికి తీసుకు వచ్చి, వారి సందేహాలు నివృత్తి చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో
అదనపు డి.సి.పి ఎ.ఆర్ గిరిరాజు, అదనపు పోలీస్ కమీషనర్ అడ్మిన్ జి. మధుసుదన్ రావు, నిజామాబాద్ ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఎ.సి.పిలు ఎమ్. కిరణ్ కుమార్, ప్రభాకర్ రావు, కె.ఎమ్. కిరణ్ కుమార్, నారాయణ, అసిస్టెంటు ప్రొఫెసర్ కెమిస్ట్రీ విభాగం డా॥ ఎమ్. సునిత అదనపు రీజినల్ కో-ఆర్డినేటర్ డా|| కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు..

ఘనంగా భగీరథ మహర్షి జయంతి..

ఘనంగా భగీరథ మహర్షి జయంతి..

జగిత్యాల యదార్థవాది

జిల్లా సమీకృత సముదాయాల భవనంలో గురువారం భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించిన జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, మంద మకరంద.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని అన్నారు. చారిత్రక పురుషుల, సంఘ సంస్కర్తల, మహనీయుల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప సంప్రదాయని, ఆయా వర్గాలకు ఆత్మగౌరవ సూచికగా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దిక్సూచిగా నిలువడం గర్వకారణమని ప్రజల జీవవ ప్రమాణాల పేరుగుదలకు శాశ్వత పరిష్కారందిశగా ప్రణాళికాబద్ధంగా బాటలు వేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయిబాబా, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగార్జున, సూపరింటెండెంట్లు, బిసి సంఘాల నాయకులు హరి అశోక్ కుమార్, ముసిపట్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రోడు ప్రమాదంలో మహిళ మృతి

రోడు ప్రమాదంలో మహిళ మృతి

హుస్నాబాద్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా ములుగు వద్ద రోడు ప్రమాదంలో గుండారం గ్రామనికి చెందిన బూరుగు శారద మృతి..
పల్లెటూర్లలో బతుకుదెరువు కరువై జీవనోపాధి కోసం వలస వెళ్లిన బెజ్జంకి మండలం గుండారం గ్రామనికి చెందిన బూరుగు శారద కోహెడ మండలం బసాపురం తన తల్లి గారి ఇంటికి వచ్చి తిరిగి జీవనోపాధి కోసం వెళుతున్న క్రమంలో గురువారం ఉదయం ములుగు క్రాసింగ్ వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన శారదకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. వివరాలు తెలియాల్సి ఉంది..

వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన: మంత్రి హరీష్

వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన: మంత్రి హరీష్

సిద్ధిపేట యదార్థవాది

సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలో గ్రామాలలో వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న వరి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రైతులతో మాట్లాడుతూ
వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో మొదటి దశలో పర్యటించి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రతీ ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. రైతు నాయకుడు ఉన్నటువంటి రైతు ప్రభుత్వం రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభత్వం ఆదుకుంటుందని ప్రతి గ్రామాలలో నష్టపోయిన ఏ ఒక్కరైతు మిస్ కాకుండా వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు ఫీల్డ్ లో పర్యటించి వివరాలన్నీ ప్రభుత్వానికి వెంటనే పంపాలని అధికారులకు మంత్రి సూచించారు. సిద్ధిపేట జిల్లాలోనే ఇప్పటికే 35 వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు వివరాలు వచ్చాయి. నిన్నరాత్రి జరిగిన ప్రకృతి వైపరీత్యంలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు సాయంత్రం వరకు తెలుస్తాయని, ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, అన్నీ జిల్లాలో మంత్రులు వడగండ్ల వాన పడ్డ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం పక్షాన రైతులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.

జిల్లాలో అకాల వర్షాలపై సమీక్షించిన: మంత్రి కేటిఆర్

జిల్లాలో అకాల వర్షాలపై సమీక్షించిన: మంత్రి కేటిఆర్

సిరిసిల్ల యదార్థవాది

జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలపైన మంత్రి కె. తారక రామారావు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్ పి, వ్యవసాయ అధికారిలతో చరవాణిలో జిల్లా పరిస్థితులపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు.. అనుకోకుండా కురిసిన అకాల వర్షాల వలన నష్టపోయిన జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు బారోస కల్పించాలని మంత్రి తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగంమంతా క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని అధికారులతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులంతా రైతులకు అందుబాటులో ఉండాలని జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రతి ఒక్కరు తమ తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి రైతులకు అండగా ఉండాలని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు భరోసా ఇవ్వాలని మంత్రి సూచించారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...