36.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

సరదాలు ముద్దు- విషాద వద్దు

సరదాలు ముద్దు- విషాద వద్దు

– వేసవి సెలవులలో పిల్లలు జాగ్రత్త
– పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత

సిద్ధిపేట యదార్థవాది

కమిషనర్ కార్యాలయం పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టులలో చెరువులలో పుష్కలంగా నిరు నిండుగా ఉంది సరదా కోసం చెరువులు.. బావులకు ఈతకు వెళ్లే పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. ఈత నేర్పించాలని ఉద్దేశం ఉంటే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వెళ్లాలని సూచించారు. ఒంటరిగా ఫ్రెండ్స్ తో పిల్లలను ఈతకు పంపవద్దని
పిల్లల గురించి తల్లిదండ్రులు సమయం కేటాయించాలన్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని ద్విచక్ర వాహనాలు, కార్లను మైనర్లకు ఇవ్వక పోవడం మంచిదని ఏదైనా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. మైనర్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరమని స్నేహితులతో కలిసి దూరప్రాంతాలకు పంపకండి ఇంట్లో పిల్లలు పెద్దలతో వారు ఎక్కువ సమయం గడిపేలా చూడాలని తెలిపారు.

గౌరవెళ్లి కల్పవల్లి – మంత్రి కేటీఆర్

గౌరవెళ్లి కల్పవల్లి – మంత్రి కేటీఆర్

– ఈ ప్రాజెక్టు తో హుస్నాబాద్ నియోజకవర్గం సస్యాశామలం

– హుస్నాబాద్ అభివృద్ధి కి మరో 25 కోట్లు

– హుస్నాబాద్ లో ప్రజా ఆశీర్వాద సభ గులాబీమయం

హనుమంతుని గుడి లేని ఊరు లేదు, అలాగే కేసీఆర్ పథకాలు అందని ఇల్లు లేదని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఉద్ఘాటించారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపో గ్రౌండ్లో శుక్రవారం జరిగిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ లో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కల్పవల్లి గౌరవెల్లి ప్రాజెక్టు అన్నారు, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్  నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రాజెక్టులన్ని పూర్తి చేశారని, గోదావరి జలాలతో తెలంగాణ రైతుల కాళ్లు కడిగారని అన్నారు. గత ప్రభుత్వాలు కనీసం 6 గంటలు కరెంట్ ఇవ్వలేదని కానీ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తుందని అన్నారు. తండావాసులతో మాట్లాడి నీళ్లు వస్తున్నాయా అడుగుతే వారు హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఎట్ల నీళ్లు వస్తున్నాయో మా బంజారా తండాలలో ఆ విధంగానే నీళ్లు వస్తున్నాయని సంతోషంగా చెప్పారని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 11 తండాలు గ్రామపంచాయతీలు అయ్యాయని,నియోజకవర్గంలో 11,000 మందికి కళ్యాణ లక్ష్మి వచ్చిందని అన్నారు. సతీష్ కుమార్ను ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండి అని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికిప్పుడే హుస్నాబాద్ నియోజకవర్గానికి వివిధ అభివృద్ధి పనుల కోసం 25 కోట్లు మంజూరు చేస్తున్నానని సభా వేదికగా కేటీఆర్ ప్రకటించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ భవనం, జూనియర్ కాలేజ్ భవనం, హాస్పిటల్ ,ఇండోర్ స్టేడియం ఇట్లా… చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపైనా సరిపోదు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ చేసిన అభివృద్ధి గురించి అని కితాబు ఇచ్చారు. సతీష్ అన్న చాలా మంచోడని చల్లని మనిషిని అన్నారు.

గడప దాటక ముందే కోరింది తీర్చే మంత్రులు

ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ మనకు ముగ్గురు మంత్రుల అండ ఉంది అని హరీష్ రావు, గంగుల కమలాకర్, కేటీఆర్ లు వారి కడప దాటకముందుకే పని చేసి పెడతారని అన్నారు. శనిగరం ప్రాజెక్టుకు నిధులు కావాలని కేసీఆర్ గారిని కలిస్తే 22 కోట్లు విడుదల చేశారని, సింగరాయ ప్రాజెక్టుకు ఐదు కోట్లు మంజూరు చేశారని, మిడ్ మానేరు ఎడమ కాలువ ద్వారా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు 200 ఎకరాలు సస్యశ్యామలం అయ్యాయని, అలాగే కాకతీయ కాలువ ద్వారా 6 గ్రామాలు దేవాదుల నుండి భీమదేవరపల్లి , ఎల్కతుర్తి మండలాలలో లో పదివేల ఎకరాలు సాగు అవుతుందని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి అయిందని సీఎం కేసీఆర్ గారితో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 161 గ్రామాలు హుస్నాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అలాగే, హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామ, గ్రామాన సిసి రోడ్లు పూర్తయ్యాయని, కొండాపూర్, వెన్నంపల్లి గ్రామాలకు అవార్డులు కూడా వచ్చాయని, హుస్నాబాద్ మునిసిపాలిటీకి కూడా జాతీయ అవార్డు వచ్చిందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాకు మాటలు చెప్పడం రాదు, చేతలు మాత్రమే తెలుసు అని అన్నారు. 10 కోట్లు, అడిగితే 20 కోట్లు కేటీఆర్ ఇచ్చారని, అలాగే మున్సిపల్ అభివృద్ధి కోసం 12 కోట్లు కేటాయించారని చెప్పారు అలాగే గౌరవ మా కేటీఆర్ కొత్తపల్లి నుండి జనగాం హైవే ఇవ్వండి అని ఎమ్మెల్యే గారు కోరగా వెంటనే మంజూరు చేపిస్తాను అని మంత్రి కేటీఆర్ గారు హామీ ఇచ్చారు అని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షలు బి. వినోద్ కుమార్, ఎమ్మెల్సీ రమణ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డా. సుదీర్ కుమార్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు G. V రామకృష్ణా రావు, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

హుస్నాబాద్ గులాబీ మయం

మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణం గులాబీమయం అయింది. హుస్నాబాద్ మొత్తం జన సందోహం నెలకొంది. మహిళలు, పురుషులు, వృద్ధులు, యువత భారీ సంఖ్యలో హుస్నాబాద్ లో కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.

శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

పురపాలక, ఐటి శాఖ మాత్యులు కేటీఆర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ హుస్నాబాద్ లో పర్యటించి మొదటగా 1కోటి రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని,2కోట్ల25 లక్షలతో నిర్మించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్,1కోటి రూపాయలతో నిర్మించిన ఎస్టీ ఉమెన్స్ హాస్టల్,16 కోట్ల 46 లక్షలతో నిర్మించిన రెండు పడకల ఇండ్లను2 కోట్లతో నిర్మించిన టిటిసి సెంటర్ ను10 లక్షలతో నెలకొల్పిన బస్తీ దావఖానా 1కోటి 20 లక్షలతో నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. అలాగే 3కోట్ల50 లక్షలతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ కోసం శంకుస్థాపన చేశారు.
మొత్తం అభివృద్ధి పనుల విలువ 27 కోట్ల 51 లక్షలు.

ప్రైవేట్ ఫైనాన్స్ పై ఉక్కు పాదం

ప్రైవేట్ ఫైనాన్స్ పై ఉక్కు పాదం

-ఖాతాదారులకు సకాలంలో డబ్బు చెల్లించకుంటే కట్టిన చర్యలు
-కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బారాయుడు

కరీంనగర్ యదార్థవాది

ప్రైవేటు ఫైనాన్స్ లు చిట్ ఫండ్ కంపెనీల యాజమాన్యాలు ఖాతాదారులకు సకాలంలో డబ్బులు చెల్లించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు..
కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో ప్రైవేట్ ఫైనాన్స్ లు, చిట్ ఫండ్ యాజమాన్య ప్రతినిధులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ గడువు ముగిసిన అవసరమైన సమయాల్లో చిట్ గ్రూప్ లోని సభ్యులకు సకాలంలో డబ్బు చెల్లించట్లేదని తమ దృష్టికి వచ్చిందని ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కోసం చిట్ ఫండ్ సంస్థలను నమ్మి, డబ్బులు కూడపెట్టుకుంటారని అవసరానికి వారికి అందించకుండా పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కొన్ని సంస్థలు ఏకంగా డబ్బుకు బదులు తక్కువ ధర గల భూములను ఎక్కువగా చూపిస్తూ బలవంతపు రిజిస్ట్రేషన్ చేయించి గ్రూప్ సభ్యులకు కట్టబెడుతున్నారని ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైంది కాదని ఆయన అన్నారు.
ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు కరీంనగర్ పోలీస్ శాఖ బాధితుల వెంట ఉంటుందని తెలిపారు. నిర్ణీత గడువు లోపు డబ్బులు చెల్లించక ఇబ్బందులకు గురిచేసే సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్ని ప్రైవేట్ చిట్ ఫండ్ యాజమాన్యాలు వారి సంస్థల యొక్క పూర్తి వివరాలను కోరిన విధంగా అందజేయాలని ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థలకు తాము వ్యతిరేకం కాదని చట్ట పరిధిలో పరిమితులకు లోబడి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. పరిమితులను ఉల్లంఘించిన లేదా గ్రూపు సభ్యులకు సకాలంలో డబ్బు చెల్లించక ఇబ్బందులకు గురిచేసే సంస్థల యాజమాన్యాలకు కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో పలువురు ప్రైవేటు ఫైనాన్స్, చిట్ ఫండ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే

మంచిర్యాల యదార్థవాది

మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపల్ పరిధిలోని సీతారాం పల్లి, విలేజ్ నస్పూర్, హాజిపూర్ మండలం లోని వేంపల్లి లో శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన రైతు కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ సందేల వెంకటేష్, నస్పూర్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, హాజిపూర్ ఎంపీపీ స్వర్ణలత సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా గౌతమ బుద్ధుని జయంతి..

ఘనంగా గౌతమ బుద్ధుని జయంతి..

ఆర్మూర్ యదార్థవాది

భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ హౌసింగ్ బోర్డ్ పార్కులోని గౌతమ బుద్ధుని జయంతిని పురస్కరించుకొని బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించరు… ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ హిందూ ధర్మంలోని ఓ మతమే బౌద్ధ మతం అని శాంతి, ప్రేమలే ప్రజలకు సరైనమార్గమని గౌతముడు బౌద్ధ మతాన్ని స్థాపించడంతో గౌతమున్ని గౌతమ బుద్ధ అని పిలవడం జరుగిందని ఆయన ఆశయాలను, ఆదర్శాలను పునికిపుచ్చుకున్నటువంటి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించరని గౌతముని మార్గంలోనే నడుస్తున్నటువంటి మోడీ ప్రపంచ శాంతి కోసం తనవంతు కృషి చేస్తా ఉన్నారని అంతే కాకుండా సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే ప్రేమ మార్గంలో నడుస్తూ దేశాభివృద్ధికై కృషి చేస్తున్నారని తెలిపారు.. నేటి యువత ఆవేశాలకు వెళ్లి అనర్థాలు తెచ్చుకోకుండా, చెడు మార్గంలో వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోకుండా గౌతమ బుద్ధున్ని ఆదర్శంగా తీసుకొని ప్రేమ,శాంతితో తమ లక్షాలను సాధించుకోవడానికై కృషి చేయాలని ఈ సందర్భంగా ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్ అన్నారు. కార్యక్రమంలో కర్ణం కృష్ణ గౌడ్, కేలోత్ పీర్ సింగ్, బట్టు రాము, ఎలిగేటి విట్టల్, వేముల లింగోజి, తదితరులు పాల్గొన్నారు.

తండ్రిని కుమారులు వంతులేసుకోడం ఇష్టం లేక తనువు చాలించాడు

తండ్రిని కుమారులు వంతులేసుకోడం ఇష్టం లేక తనువు చాలించాడు

– తాటి పొదలతో పెట్టుకున్న మంటల్లో దూకి ఆత్మహత్య
– పొట్లపల్లి లో కాలిన గాయాలతో వృద్దిడి మృతదేహం లభ్యం

హుస్నాబాద్ యదార్థవాది

కన్న కొడుకులు పెరిగి పెద్దయ్యాక తనను కంటికి రెప్పలా కాపాడు కుంటారానుకుని కోటి ఆశలతో కొడుకులను పెంచి పెద్ద చేశాడు ఆ అమాయకపు తండ్రి. కానీ ఆ కొడుకులే తనను పోషించడానికి వంతులేసుకోవడం తో అల్లారుముద్దుగా పెంచిన మధుర అనుభూతుల జాడలు కానరాక ఇలా వంతుల పాలయ్యాననే బెంగతో ఆ తండ్రి తాను పేర్చుకున్న చితిలో దూకి తనువు చాలించాడు. ఈ రోజుల్లో మనుషుల ప్రవర్తన, కుటుంబాల్లో వృద్దులు ఏదుర్కొంటున్న విపత్కర పరిస్థితులకు నిదర్శనం యీ విషాదకర సంఘటన. వివరాలు ఇలా వున్నాయి.
వంతుల వారిగా కుమారులు ఆ తండ్రిని పోషించాలనే నిర్ణయాన్ని తండ్రి జీర్ణించుకోలేక తన సొంతూరిని వదిలి మరో ఊరికి వెళ్లడం ఇష్టం లేక, తన పోషణ తనయులకు భారం కాకూడదనుకుని ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయి ఆత్మహతికి పాల్పడి తనువు చాలించాడు ఓ వృద్ధుడు. నెలకు ఒక కుమారుని వద్దకు వంతుల వారిగా వెళ్లడం ఇష్టం లేని వృద్ధుడు ఆత్మహత్యకి పాల్పడిన ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి లో జరిగింది. పొట్లపల్లికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90) కు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలో ఒకరు హుస్నాబాద్ లో మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేట లో నివసిస్తున్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమారులకు పంచి ఇచ్చేశాడు. కుమారులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వెంకటయ్య కు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. గ్రామంలోనే ఆయన పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉండేవాడు. అయితే ఆయన పోషణ విషయంలో ఐదు నెలల క్రితం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. నెలకు ఒకరి చొప్పున నలుగురు కుమారులు వంతుల వారిగా పోషించాలని నిర్ణయించారు. గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద వంతు పూర్తి కావడంతో నవాబుపేటలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది. సొంత ఊరు, ఇంటిని వదిలి అక్కడికి తాను వెళ్ళనని వెంకటయ్య చెప్పేవారు. ఈనెల 2 న మంగళవారం సాయంత్రం ఇంటి నుండి బయలుదేరిన ఆయన గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడ తన బాధ వెళ్లగక్కారు. 3 వ తేదీన నవాబుపేటలోని మరో కుమారుడి ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, నవాబుపేట రోడ్డులో వెతికిన ఆచూకీ లభించలేదు. గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం వెంకటయ్య దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఘటనా స్థలంలో తాటికమ్మలను ఒక చోట కుప్పగా వేసి వాటికి నిప్పంటించి, అందులో దూకి ఆత్మహత్యకి పాల్పడినట్లు భావిస్తున్నారు.

నేడు మంత్రుల పర్యటన ముందస్తుగా సిపిఐ నేతల అరెస్ట్

నేడు మంత్రుల పర్యటన
ముందస్తుగా సిపిఐ నేతల అరెస్ట్

హుస్నాబాద్ యదార్థవాది

రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభవృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సిపిఐ నేతలను అరెస్ట్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో ఇండోర్ స్టేడియం, రెండు పడకల ఇండ్లు, టిటిసి బిల్డింగ్, బస్తిధవాఖాన, గవర్నమెంటు డిగ్రీ కళాశాల, మునిసిపల్ ఆపిస్ కాంప్లెక్స్, ఎస్టి మహీళల వసతి గృహాల ప్రారంభోత్సవాలకు మంత్రులు వస్తున్నారు. అయితే రెండు పడకల ఇండ్ల పంపిణీ లో అవతవకలు జరిగాయని, అనర్హులకు కూడా డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారని, అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలంటూ సిపిఐ నేతలు మంత్రులను అడ్డుకొనున్నారాన్న సమాచారం మేరకు వారిని అరెస్ట్ చేశారు.

ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో అరెస్ట్..

కేటిఆర్ పర్యాటన సందర్భంగా సిపిఐ నాయకులు ఎక్కడున్నారో వారు వాడుతున్న సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా కొండాపూర్ వద్ద సిపిఐ నేతలను
అక్కన్నపెట ఎస్ఐ నేతృత్వం లోని పోలీస్ బృందాలు ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ ఉన్నారు. అనంతరం వీరిని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుండి అక్కన్నపెట పొలిస్ స్టేషన్ కు తరలించారు.

నేడు మంత్రుల పర్యటన పలు శంకుస్థానలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం..

నేడు మంత్రుల పర్యటన
పలు శంకుస్థానలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం..

హుస్నాబాద్ యదార్థవాది

రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభవృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.. హుస్నాబాద్ పట్టణంలో ఇండోర్ స్టేడియం, రెండు పడకల ఇండ్లు, టిటిసి బిల్డింగ్, బస్తిధవాఖాన, గవర్నమెంటు డిగ్రీ కళాశాల, మునిసిపల్ ఆపిస్ కాంప్లెక్స్, ఎస్టి మహీళల వసతి గృహాల ప్రారంభోత్సవాలు, ఎసిపి కార్యలయం, ఎల్లమ్మ ట్యాంక్ సుందరీకరణ శంకుస్థాపనలు చేయనున్నారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘ చైర్మన్ వినోద్ కుమార్ స్థానిక శాసనసభ్యులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు.

డ్రోన్ల వినియోగంపై నిషేదాజ్ఞులు

డ్రోన్ల వినియోగంపై నిషేదాజ్ఞులు

కరీంనగర్ యదార్థవాది

కమీషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు పైన పేర్కొన్న సాంకేతిక పరికరాలను ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగించబడుతున్నాయని తెలిపారు. ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు వీటిని వినియోగించే అవకాశాలుండటంతో సదరు సాంకేతిక పరికరాల వినియోగాన్ని నిషేదించడం జరిగిందని అన్నారు. ఎవరైనా వినియోగించదలచినట్లయితే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని ఈ మేరకు సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపిసి సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎసిపిల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిర్వహించకూడదని ఇతరులను గాయపరిచే విధంగా ఉండే వస్తువులు, మారణాయుధాలను ధరించి సంచరించకూడదని రోడ్లు, ప్రజలకు ఉపయోగపడే ఇతర స్థలాల్లో జనాన్ని సమీకరించకూడదని పేన పేర్కొన్న ప్రాంతాలలో మ్యూజిక్ లు, పాటలు, ప్రసంగాలు చేయవద్దని కోరారు. ఈ ఉత్తర్వులు ఈనెల 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిది: మంత్రి హరీష్

ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేనిది: మంత్రి హరీష్

సిద్ధిపేట యదార్థవాది

నియోజకవర్గ ప్రజల కోసం ఎంతైనా కష్టపడుతానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు… నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో నిర్మించిన రెండు పడకల గృహా ప్రవేశాల కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు కొత్తింట్లోనే లబ్ధిదారులకు ఇళ్ల పట్టా సర్టిఫికేట్లు మంత్రి చేతుల మీదుగా అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 రెండు పడకల ఇళ్లు ఉన్నాయంటే అంటే అది లక్ష్మీదేవి పల్లిలోనే ఒక్క చెమట చుక్క పడకుండా రూపాయి ఖర్చు లేకుండా మీకు ఇల్లు వచ్చిందని తెలంగాణ, కాళేశ్వరం వచ్చుట్ల ఎన్నో మంచి పనులు జరిగాయి తెలంగాణ సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి మన గౌరవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచారు.. దేశమే అబ్బుర పడే విధంగా అంబేద్కర్ పేరు పెట్టడం, హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం చాలా గర్వకారణం. ఇలా ఒకటి రెండు అయితే చెప్పుకోవచ్చు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి, బిడ్డకు కాన్పుకు కేసీఆర్ కిట్ అందిస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ మాత్రమే అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...