36.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తాం

విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తాం

– విధుల్లో చేరేందుకు ఈ నెల 9 వ తేదీ డెడ్ లైన్

– జేపీఎస్ లకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు

రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను. క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జేపీఎస్ సమ్మెపై సోమవారం ప్రభుత్వ తాజాగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా స్పందించారు.సమ్మె విరమించి విధుల్లో చేరాలని స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేశారు.

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రేపు ( 09-05-2023) సాయంత్రం 5 గంటల వరకు జేపీఎస్ లు విధుల్లో చేరాలని అదేశాలు జారీ చేశారు.
ఒకవేళ విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేశారు.

హోంగార్డ్స్ కు హెల్త్ కార్డ్స్ అందజేసిన జిల్లా ఎస్పీ మహాజన్..

హోంగార్డ్స్ కు హెల్త్ కార్డ్స్ అందజేసిన జిల్లా ఎస్పీ మహాజన్..

సిరిసిల్ల యదార్థవాది

జిల్లాలో పని చేస్తున్న 202 మంది హోం గార్డ్స్ కుటుంబాల సంక్షేమం దృష్ట్యా సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవ తీసుకొని ఇండయన్ మెడికల్ కౌన్సిల్ వారి సహకారంతో హోం గార్డ్స్ సిబ్బందికి చికిత్స సమయంలో హాస్పిటల్స్ లో ఫీజు రాయితి ఇచ్చి హోం గార్డ్స్ కుటుంబ సభ్యులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో జిల్లాలోని 43 హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడారు… డాక్టర్స్ సానుకూలంగా స్పందించి హాస్పటల్ ఖర్చులలో రాయితీ ఇవ్వడం జరుగుతుందని వాటికి సంబంధించిన హెల్త్ కార్డ్స్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాయంలో హోం గార్డ్స్ కు జిల్లా ఎస్పీ అందచేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని హోం గార్డ్స్ సిబ్బందికి మునుపెన్నడు లేనివిధంగా హెల్త్ కార్డ్స్ అందించడం జరిగిందని రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి వారి కుటుంబ ఆరోగ్య సమస్యల గురించి హెల్త్ ట్రీట్మెంట్ కోసం వారి సంక్షేమం కోసం మావంతు సహాయంగా ఈ హెల్త్ కార్డ్స్ అందజేయడం జరిగిందని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని 30, వేములవాడ లో 10, ముస్తాబద్ లో 02, ఎల్లారెడ్డిపేట్ లో 01 ప్రవేట్ ఆసుపత్రిలలో హెల్త్ కార్డ్స్ ఉండటం వలన ఉచితంగా OP చూస్తారని, ఇన్ పేషేంట్ కి ల్యాబ్ ఫీజులలో రాయితి ఇవ్వడం జరిగుతుందని అన్నారు.. పోలీస్ సిబ్బంది చికిత్స పేమెంట్ లో ఖర్చులు రాయితీ అడగగానే ఇవ్వడానికి ఒప్పుకున్న హాస్పిటల్ యాజమాన్యనికి, డాక్టర్లకి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్.ఐ యాదగిరి,సి.ఐ అనిల్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ హోమ్ గార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు..

ప్రమాదాల నివారణకే ట్రాఫిక్ సిగ్నల్స్

ప్రమాదాల నివారణకే ట్రాఫిక్ సిగ్నల్స్

– ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహాజన్..

సిరిసిల్ల యదార్థవాది

ట్రాఫిక్ సమస్యల నివారణకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ను రాష్ట్ర పవర్ లూమ్ & టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా లతో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పాటైన నాటి నుంచి అధిక వాహనాల రాకపోకలు రద్దీ పెరిగిందని సిగ్నల్స్ వలన ప్రమాదాలను నియంత్రించవచ్చని, ట్రాఫిక్ రేగ్యులైజేషణ్, ట్రాఫిక్ మేనేజ్మేంట్ కు ఉపయోగపడుతుందని అన్నారు. ఒక సిగ్నల్స్ ఏర్పాటు వలన పది మంది ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ కి సమానంగా ఉంటుందని ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు వలన ప్రమాదాల నివారణ, అధిక వేగంగా ప్రయాణం చేసేవారిని నియంత్రణ చేయవచ్చు అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు తో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు, పాదచారులకు ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు హెల్మెంట్ ధరించి వాహనాలు నడపాలని ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర పవర్ లూమ్ & టెక్స్ టైల్ కార్పోరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు సిగ్నల్ వ్యవస్థను ఉపయోగించుకోవాలని, పట్టణంలో ట్రాఫిక్ నియాత్రణకు సిగ్నల్ వ్యవస్థను ప్రజల సౌకర్యం కోసం పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు..

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు నియాత్రణకు పోలీస్ శాఖ ప్రతిపాదన మేరకు సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పీ విశ్వప్రసాద్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహశీల్దార్ విజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, సి.ఐ లు అనిల్ కుమార్, ఉపేందర్, లిడ్స్ ఫేస్ కంపెనీ అధికారి మురళి, ట్రాఫిక్ ఎస్.ఐ రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

యువత వ్యాయామంపై దృష్టి సారించాలి..

యువత వ్యాయామంపై దృష్టి సారించాలి..

సిద్ధిపేట యదార్థవాది

సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం వరల్డ్ అథ్లెటిక్స్ డే సందర్భంగా రూబీ నెక్లెస్ రోడ్డుపై 5కే రన్ జుంబా డాన్స్ నిర్వహించారు.. రన్నర్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజిరెడ్డి ఉపాధ్యక్షుడు పరంధాములు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరిని వ్యాయామంలో భాగం చేసేందుకు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ పనిచేస్తుందని అన్నారు. రాబోవు రోజుల్లో యువతకు అవగాహన కల్పించడానికి వివిధ రకాల పరుగు పందెం పోటీలు నిర్వహిస్తామని
సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ప్రోత్సాహంతో రన్నర్స్ అసోసియేషన్ స్థాపించబడిందని ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో రన్నర్స్ అసోసియేషన్ ముందుకు వెళుతుందని తెలిపారు. భారత దేశము అత్యధికంగా యువతను కలిగి ఉన్న దేశం అని ఎక్కువ మంది యువత డ్రగ్స్ కు చెడు వ్యసనాలకు బానిసలు అవుతునరని యువతను చెడు వ్యసనాల వైపు బానిసలు కాకుండా వ్యాయామం వైపు దృష్టి సారించే కార్యక్రమాలు చేద్దామని రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని రన్నింగ్ లో కానీ వివిధ వ్యాయామలవైపు వచ్చే విధంగా కార్యక్రమాలు చేద్దాం అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సభ్యులు రమేష్, రాజు, మురళి, స్వామి, విజయ్ శ్రీనివాస్ ,దేవేందర్, కృష్ణారెడ్డి, రవి, నరెష్, రమేశ్, హరి, భాను, శ్రీనివాస్, ఆనంద్, నవీన్ మరికొందరు పాల్గొన్నారు.

భారీగా నగదు స్వాధీనం.!

భారీగా నగదు స్వాధీనం.!

బెంగళూరు యదార్థవాది

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10న జరగనున్న విషయం తెలిసిందే..

దీంతో ఓటర్లను మభ్యపెట్టేందుకు పలువురు కోట్లాది రూపాయలను వెదజల్లుతున్నట్టు తెలుస్తోంది..

తాజాగా బెంగళూరు, మైసూరులో ఏకకాలంలో బడా ఫైనాన్షియర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వీరు ఆర్థిక సాయం చేస్తున్నారనే సమాచారంతో సోదాలు చేపట్టారని ఈ దాడుల్లో రూ.15 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన బంగారం సీజ్ చేసినట్లు తెలుస్తోంది..

ప్రజలకు శుద్ధమైన విజయ డైరీ పాలు అందుబాటులోకి: అధర్ సిన్హా

ప్రజలకు శుద్ధమైన విజయ డైరీ పాలు
అందుబాటులోకి: అధర్ సిన్హా

సిద్ధిపేట యదార్థవాది

సిద్దిపేట పట్టణంలోని విజయ డైరీని, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య అభివృద్ధి, డైరీ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి సందర్శించారు…

ఆదివారం పట్టణంలోని విజయ డైరీ నిర్వహణ, పాల సేకరణ శీతలీకరణ ఇతర వివరాలను, విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ సింగ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా వివరిస్తూ ఈ సందర్భంగా ఏప్రిల్ 1 నుండి పెరిగిన పాల సేకరణ ధరల వివరాల చార్టుల ఆవిష్కరించరు.. ఏడు శాతం వెన్న కలిగిన పాల ధరను ఈ సంవత్సరం 1 ఏప్రిల్ నుండి 55 రూపాయల నుండి 60 రూపాయలుగా పెంచడం జరిగిందని దానితో రోజుకు 32 వేల లీటర్ల నుండి 42 వేల లీటర్లకు పాల సేకరణ అభివృద్ధి చెందిందని తెలిపారు.. ఈ సందర్భంగా అధర్ సిన్హా మాట్లాడుతూ పాల సేకరణ ధర పెరిగినందున రైతులకు అదనంగా ఆదాయం సమకూరుతున్నందున పాడి రైతులకు పెరిగిన పాల ధరల పై అవగాహన కలిగించి రోజువారి సేకరణ 60 వేల లీటర్లకు పెరిగేలా కృషి చేయాలని తద్వారా ప్రజలకు శుద్ధమైన పాలను మరింత అందించవచ్చు అని అన్నారు. కార్యక్రమంలో విజయ డైరీ సిద్దిపేట మేనేజర్ శ్రీజ, జూనియర్ మేనేజర్ మురళి, అసిస్టెంట్ మేనేజర్ రామస్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్నేహమంటే ఇదేరా..

స్నేహమంటే ఇదేరా..

దివ్యాంగుడైన స్నేహితునికి 30 వేల రూపాయల ఆర్థిక సహాయం..

హుస్నాబాద్ యదార్థవాది

సుమారు 21 సంవత్సరాల తర్వాత మిత్ర బృందం ఏకమైంది ఆపదలో ఉన్న తమ బాల్య మిత్రునికి మిత్ర బృందం అండగా నిలిచింది… సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వజ్రోత్సవాల్లో 2001-02 పదవ తరగతి మిత్ర బృందమంతా కలిశారు. మిత్రులంతా ఏకమై ఆనాటి రోజులను స్మరించుకొని, తమలో ఆపదలో ఉన్న మిత్రులకు చేతనైనంత సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హుస్నాబాద్ లోని ఆరేపల్లికి చెందిన తమ మిత్రుడు పోలు రాజుకు కాలు విరిగి శస్త్ర చికిత్స చేయించుకొని ఇంటివద్దె ఉంటున్నాడని తెలుసుకున్నారు. 90 శాతం దివ్యాంగుడైన పోలురాజుకు అండగా నిలవాలని మిత్రులు భావించారు. మిత్ర బృందామంతా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని, విషయాన్ని గ్రూప్ లో పోస్ట్ చేశారు. స్పందించిన మిత్రులు తమ మిత్రుడికి తలింత చేయి వేసి ఆదివారం రోజు 30 వేల రూపాయల నగదు, 50 కిలోల బియ్యాన్ని అందించారు. మిత్రుల సహాయానికి పోలు రాజు సంతోషం వ్యక్తం చేశాడు. చాలా రోజుల తర్వాత మిత్రులందరు వచ్చి తనతో మాట్లాడి తనకు అండగా నిలిచినందుకు మిత్రులకు ధన్యవాదాలు తెలిపాడు. భవిష్యత్తులో కూడా మిత్రుడు పోలు రాజుకు అండగా ఉంటామని మిత్రబృందం ధైర్యాన్ని కల్పించింది. ఇందులో మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.

గాంధీ చౌక్ వ్యాపార సంఘం అధ్యక్షులుగా కాముని నగేశ్ ..

గాంధీ చౌక్ వ్యాపార సంఘం అధ్యక్షులుగా కాముని నగేశ్ ..

సిద్ధిపేట యదార్థవాది

పట్టణ గాంధీ చౌక్ వ్యాపార సంఘం అధ్యక్షులుగా కాముని నగేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా పాల సాయిరాం అధ్యక్షులుగా కాముని నగేశ్ ఉపాధ్యక్షులుగా తిరుణహరి ప్రశాంత్ ప్రధాన కార్యదర్శిగా చేకూరి రాజు సహాయ కార్యదర్శి భాశెట్టి నాగరాజు (రాజు గ్రాఫిక్స్) కోశాధికారి అంబడి పల్లి బాస్కర్ కార్యవర్గ సభ్యులుగా
కొండబత్తిని కన్నయ్య కొత్వాల్ అమర్ నాథ్ గూడూరి భగవాన్ సిరిగాది గణేష్ సయ్యర్ వాజీద్ గౌరవ సలహదారులుగా
పెందోట శ్రీనివాసచారి మరియాల సూర్యప్రకాశ్
సలహా సభ్యులుగా నిమ్మ క్రిష్ణారెడ్డి అబ్బత్తిని మహేశ్
యం.డి. నవాజ్ తౌటి బిక్షపతి పొడిశెట్టి శ్రీనివాస్ యం.డి. కైసర్ నారాయణపేట యాదయ్య అన్నల్ దాస్ రమేశ్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కాముని నగేశ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండవసారి అధ్యక్షులుగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

భరోసా సెంటర్ కాంట్రాక్టు బేస్ నియామకం కోసం..దరఖాస్తు స్వీకరణ…

భరోసా సెంటర్ కాంట్రాక్టు బేస్ నియామకం కోసం..దరఖాస్తు స్వీకరణ…

సిద్ధిపేట యదార్థవాది

సిద్దిపేట భరోసా కేంద్రంలో పనిచేయుటకు సర్వీస్ రెగ్యులరైజేషన్ హక్కు మొదలగునవి లేకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికన (రిసెప్షనిస్ట్ పోస్ట్) ఉద్యోగానికి ఆసక్తిగల అర్హత ఉన్న మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు..

పోస్టు వివరాలు ఇలా వున్నాయి
విద్య, వయస్సు, అర్హతలు..
1.పోస్టు: రిసెప్షనిస్ట్
2. విద్య అర్హత : ఏదైనా డిగ్రీ,
3. రెండు సంవత్సరాల రిసెప్షనిస్ట్ చేసిన అనుభవం
4. కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్.
5. వయస్సు 25 నుండి 35 సంవత్సరాలు

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత మాట్లాడుతూ
పైన చూపిన పోస్టుకు ఆసక్తి కలిగిన విద్య అర్హతలు ఉన్న మహిళలు ఈ నెల 20 తేది సాయంత్రం 5 గంటల లోపు బయోడేటా, విద్యఅర్హత సర్టిఫికెట్ కాపీలతో dbusinessolutionz@gmail.com మెయిల్ చేయాలి లేదా వాట్సాప్ నెంబర్ 9014052175 జిరాక్స్ కాపీలు పంపించాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే పై నెంబర్ ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ నియామకం ఒక సంవత్సరం మాత్రమే అని ప్రత్యేకించి తెలియ చేశారు. అదే కాలవ్యవధి ఆవశ్యకత బడ్జెట్ లభ్యత ప్రకారం ప్రతీ సంవత్సరం పొడిగించబడుతుందని ఉమెన్ సేఫ్టీ అధికారులు తెలిపారు.

జవాన్ అనిల్ భౌతిక కాయానికి ఘన నివాళి..

జవాన్ అనిల్ భౌతిక కాయానికి ఘన నివాళి..

సిరిసిల్ల యదార్థవాది

జమ్మూ – కాశ్మీర్ లో సైనికులు ప్రయాణించిన హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో ప్రమాదానికి గురైన ఘటనలో మృతి చెందిన సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అమర జవాన్ పబ్బాల అనిల్ భౌతిక కాయానికి శనివారం మల్కాపూర్ గ్రామంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినిపల్లి వినోద్ కుమార్, ఎంపి బండి సంజయ్, ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ పవన్ కుమార్ లు, ఆర్మీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పూల మాలలు వేసి నివాళులు అర్పించాను. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అమరులు అనిల్ అంతిమ యాత్ర లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని జై జవాన్….అమర జవాన్ పబ్బాల అనిల్ అమరహే అంటూ నినదించారు. అమరవీరులు అనిల్ త్యాగాన్ని ప్రజలు మరువలేరనీ…

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...