38.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: పోలీస్ కమిషనర్

నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: పోలీస్ కమిషనర్

సిద్ధిపేట యదార్థవాది

పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత గజ్వేల్ డివిజన్ పోలీస్ అధికారులతో బుధవారం కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల వివరాలను ఎసిపి, సిఐలను, ఎస్ఐలను అడిగి తెలుసుకొన్నారు.. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2022 సంవత్సరం లో పెండింగ్ ఉన్న కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలని మిస్సింగ్ కేసులను అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ట్రేస్ అవుట్ చేయాలని సూచించారు. పెండింగ్ నాన్ బేలబుల్ వారెంట్స్ పై రివ్యూ నిర్వహించి వారి యొక్క అడ్రస్ కనుక్కొని ఎగ్జిక్యూటివ్ చేయాలని
ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి, రౌడీలు, కేడీలు, సస్పెక్ట్ ల యొక్క కదలికలపై నిరంతరం నిఘాపెట్టాలని తెలిపారు. కేసుల్లో శిక్షల శాతం పెంచాలని నూతన టెక్నాలజీని పోలిస్ సిబ్బంది అందిపుచ్చుకోవాలని ఎస్సీ ఎస్టీ, ఫోక్సో, క్రైమ్ అగ్నిస్ట్ ఉమెన్, కేసులలో 60 రోజుల లోపు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి తప్పకుండా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.. పాత రౌడీలు కేడీలపై నిరంతరం నిఘాపెట్టాలి. దొంగతనాల కేసుల్లో ప్రతిరోజు కేసు చేతన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ గంజాయి, డ్రగ్స్ సమూలంగా నిర్మూలించడానికి ప్రతి గ్రామాలలో పట్టణాలలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.. ఈఎంఆర్ఐ ఫస్ట్ రెస్పాండెంట్ ప్రధమ చికిత్స, సిపిఆర్ ఏఈడి గజ్వేల్ డివిజన్ లో శిక్షణ పొందిన 93 మంది పోలీస్ సిబ్బంది, గజ్వేల్ డివిజన్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 103 మంది యువతకు/వాలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేసిన కమిషనర్. సమావేశంలో గజ్వేల్ ఎసిపి రమేష్, గజ్వేల్ సిఐ వీరాప్రసాద్, రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, తొగుట సిఐ కమలాకర్, గజ్వేల్ ట్రాఫిక్ సిఐ తిరుపతి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ గురుస్వామి, గజ్వేల్ డివిజన్ ఎస్ఐలు రంగకృష్ణ, కృష్ణమూర్తి, హరీష్, కరుణాకర్ రెడ్డి, మహబూబ్, చైతన్య రెడ్డి, అరుణ్, సీసీఆర్బి, ఐటీకోర్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీల సమస్యలను పరిష్కరిస్తాం…

టీడీపీ అధికారంలోకి వచ్చాక
ముస్లిం మైనారిటీల సమస్యలను పరిష్కరిస్తాం…

కర్నూలు యదార్థవాది

కర్నూలులో బుధవారం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను ముస్లిం మైనారిటీలు కలిసి తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సమస్యలను పరిష్కరించాలన్నారు..
మైనారిటీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన దుల్హన్ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. పేద ముస్లింలు ఉన్నత విద్యను అభ్యసించ లేకపోతున్నారని.. వారికి ఆర్థిక చేయూతనివ్వాలన్నారు. మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం స్వాహా చేస్తోందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రోషిణి, దుకాన్-మకాన్ పథకాలు నేడు రావడం లేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై వేధింపులు అధికమయ్యాయని తెలిపారు. ముస్లింలకు కేజీ టు పీజీ వరకు మైనారిటీ విద్యార్థులకు ఉచిత విద్యనందించాలన్నారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో హజ్ యాత్రకు పంపించాలన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక మైనారిటీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని ముస్లిం మైనారిటీలు కోరారు..
ముస్లిం మైనారిటీల సమస్యలపై లోకేష్ స్పందిస్తూ… జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గమూ ప్రశాంత జీవనం గడిపే పరిస్థితులు లేవు. తాలిబన్ తరహా పాలన కొనసాగిస్తూ మైనారిటీలకు నరకం చూపిస్తున్నారు. తాజాగా మదనపల్లిలో మైనారిటీ యువకుడు అక్రమ్ ను పులివెందుల బ్యాచ్ అన్యాయంగా పొట్టనబెట్టుకుంది. వైసీపీ నాయకులు వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం, మిస్బ ఆత్మహత్య చేసుకున్నారు. మసీదు ఆస్తుల రక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నర్సరావుపేటలో దారుణంగా నరికిచంపారు. మైనారిటీల సబ్ ప్లాన్ నిధులు రూ.5,400 కోట్ల దారిమళ్లించి ముస్లింలకు అన్యాయం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలుచేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తాం..పూర్తి ప్రభుత్వ ఖర్చులపై పేద ముస్లింలను హజ్ యాత్రకు పంపే ఏర్పాట్లు చేస్తాం అని పేర్కొన్నారు..

ఏపీ సీఐడీ కేసు.. ఆదిరెడ్డి అప్పారావు, వాసుకు హైకోర్టు బెయిల్‌..

ఏపీ సీఐడీ కేసు.. ఆదిరెడ్డి అప్పారావు, వాసుకు హైకోర్టు బెయిల్‌..

అమరావతి యదార్థవాది

జగజ్జననీ చిట్‌ఫండ్‌ కేసులో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు.. తెదేపా నేత శ్రీనివాస్‌ (వాసు)కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది..రెండు రోజుల క్రితం వాదనలు ముగియగా.. తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. జగజ్జననీ చిట్‌ఫండ్ వ్యవహారంలో అప్పారావు, వాసులను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. చిట్‌ఫండ్‌ చట్టం ఈ కేసుకు వర్తించదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. డిపాజిట్‌ దారుల ఫిర్యాదు లేకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. చందాదారుల సొమ్మును చట్ట విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించారని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు..

మన ఊరు మన బడి పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చెయ్యాలి: జిల్లా కలెక్టర్

మన ఊరు మన బడి పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చెయ్యాలి: జిల్లా కలెక్టర్

సిద్ధిపేట యదార్థవాది

సిద్దిపేట నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకంలో కేటాయించిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. జిల్లా సమీకృత కార్యాలయంలో మంగళవారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్ఎమ్ సి చైర్మన్ లు ఎంఈవో ఎంపిడిఒ ఎంపిఓ ఇంజనీరింగ్ విభాగం ఈఈ డిఈ ఎఈ నిర్మాణ ఎజెన్సీ సర్పంచ్ లతో సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు మన బడి పథకంలో పాఠశాలలను ఈనెల చివరికి పనులు పూర్తి చేయ్యాలని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నకోడూరు, నంగునూరు మండలం లో లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసెందుకు పంచాయతీ రాజ్ ఈఈ డిఈ లు పర్యవేక్షణ చేయాలని అన్ని విభాగాల అధికారులందరూ సమిష్టిక పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఒ చంద్రమోహన్ రెడ్డి డిఇఓ శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ సిద్దిపేట మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఫలితాలు సాధించాం.

ఉత్తమ ఫలితాలు సాధించాం.

సిద్ధిపేట యదార్థవాది

సిద్దిపేట పట్టణ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన సందర్భంగా మంగళవారం కళాశాలలో ఆయన మాట్లాడారు. ద్వితీయ సంవత్సరానికి చెందిన 362 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 66 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. అందులో 52 మంది విద్యార్థులు 1000 మార్కులకు గాను 900లకు పైగా మార్కులు సాధించినట్లు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఫలితాల సాధనలో ప్రత్యేక దృష్టి సారించిన అధ్యాపకులను పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు అశోక్, నంట శ్రీనివాస్ రెడ్డి, వెంకటరమణ, రఘురాజు, గంగాధర్ రాజశేఖర్, షహనా కౌసర్, రాజ్యలక్ష్మి, వెంకటేష్, రమేష్ తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.

సైన్స్ పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించు కోవాలి

సైన్స్ పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించు కోవాలి

-జనవిజ్ఞాన వేదిక జిల్లా కన్వీనర్ బూట్ల రాజ మల్లయ్య

హుస్నాబాద్ యదార్థవాది

మన విశ్వంలో జరిగే మార్పులపై విద్యార్థిని, విద్యార్థులు ప్రజలు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని జనవిజ్ఞాన వేదిక సిద్దిపేట జిల్లా శాఖ కన్వీనర్ బూట్ల రాజమల్లయ్య పిలుపునిచ్చారు.. మంగళవారం తెలంగాణ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సంవత్సరంలో ఒక రోజు జీరో షాడో ఏర్పడుతుండగా ఈసారి హైదరాబాదు పరిసర ప్రాంతాలలో జీరో షాడో ఏర్పడిందని హుస్నాబాద్ పట్టణంలో ఓ ఇంటి మిద్దె పైన మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల నుండి 14 నిమిషాల పాటు ఒక పీటపై రోకలిబండ ను నిలువుగా ఏర్పాటు చేసి జీరో షాడోను చిత్రీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. సైన్స్ పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకొని విశ్వంలో జరిగే మార్పులను మూఢనమ్మకాలతో చూడకుండా సత్యమును గ్రహించి ప్రజలు సమాజ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని తెలిపారు.

విద్యార్థిని బలిగొన్న ఇంటర్ భూతం

విద్యార్థిని బలిగొన్న ఇంటర్ భూతం

హైదరాబాద్ నారాయణ కాలేజీ
విద్యార్థి ఆర్మూర్ లో ఆత్మహత్య

ఆర్మూర్ యదార్థవాది

ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణ ఘోషకు ఇంకా ముగింపు పలకనట్లే ఉంది. అటు కార్పొరేట్ కాలేజీల ఒత్తిళ్లు, తల్లిదండ్రులు పిల్లలపై పెట్టుకున్న ఆశలు ఆశలు వెరసి విద్యార్థులు ఒత్తిడులకు లోనవుతూ చివరకు తనువు చాలిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే రీతిన చాలా మంది పరీక్ష ఫలితాల్లో ఆశించిన మార్కులు రాలేదన్న భేంగతో పరీక్షల్లో తప్పమనే రోదనలతో ఉరితాల్లకు భాలైన సంగతి విదితమే. యేసారి కూడా అదే పరిస్తితి పునరావృత అయింది. ఫలితాలు వెల్లడించే ముందు విద్యార్థుల్లో కనీసం వారిని మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం వుంది.

ఉరికి వెల్లాడిన ఆశలు

ఆర్మూర్ లో నారాయణ కాలేజ్ విద్యార్థి ఇంటర్ ఫెయిలైన కారణంగా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆర్మూర్ మునిసిపాలిటీ పరిధిలోని శాస్త్రి నగర్ లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు లక్ష్మణ్ కుమారుడు ప్రజ్వల్ (17) ఇంటర్ ఫస్టియర్ హైదరాబాద్ లోని నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ప్రజ్వల్ ఫెయిల్ అయిన కారణంగా మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్ఎంపీ వైద్యుడు లక్ష్మణ్ కు ఒక కుమార్తె, ఓ కుమారుడు సంతానం. ఎదిగిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడడంతో బాధిత కుటంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రజ్వల్ మృతి చెందడంతో ఆర్మూర్ లోనలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు…

గుర్తు తెలియని మృతదేహం

గుర్తు తెలియని మృతదేహం

కుక్కునూరుపల్లి యదార్థవాది


సిద్ధిపేట జిల్లా కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న కిష్టాపూర్ గ్రామ శివారులో ఉన్నటువంటి మర్రి శేరి కుంట ఎవరో గుర్తు తెలియని వ్యక్తి శవం నీటిలో తేలడంతో అది గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ తరలించారు. మృతుని వయస్సు సుమారు 32 సంవత్సరాలు ఎత్తు: 5′ అడుగుల చామనచాయ రంగు నలుపు షార్ట్ నలుపుచుక్క వేసుకొని ఉన్నాడు. ఈ క్రింది ఫోటోలోని గుర్తుతెలియని మృతుడిని ఎవరైనా గుర్తు పట్టిన చో డయల్ 100 లేదా కుకునూరుపల్లి ఎస్ఐ మొబైల్ నెంబర్- 8712667345 సమాచారం అందించలని పోలీసులు తెలిపారు.

నకిలీ విత్తనాలు జిల్లాలో లేకుండా రూపుమాపాలి

నకిలీ విత్తనాలు జిల్లాలో లేకుండా రూపుమాపాలి

సిద్ధిపేట యదార్థవాది

వ్యవసాయ పోలీస్ అధికారులతో నకిలీ విత్తనాలు, పెస్టిసైడ్స్ సీడ్స్ పై పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ తో సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు… ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు పురుగుల మందులు కట్టడికి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని మండల స్థాయిలో మండల అగ్రికల్చర్ అధికారి సబ్ ఇన్స్పెక్టర్ ఇరువురు సమన్వయంతో విధులు నిర్వహించాలని ప్రతి గ్రామం నుండి నకిలీ విత్తనాలు పురుగుల మందుల పై ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా రైతులతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు. నకిలీ విత్తనాలు కలిగి ఉన్నా అమ్మిన వ్యక్తుల పై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని అన్నారు.. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్, సిద్దిపేట ఏసిపి దేవారెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్, గజ్వేల్ సిఐ వీరా ప్రసాద్ ఎస్ఐలు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ అధికారులు అనిల్ కుమార్, బాబు, మహేష్, పద్మ, రాధిక,జిల్లాలోని మండలాల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ఇలాకలో డాక్టర్లదే ఇష్టారాజ్యం

మంత్రి ఇలాకలో డాక్టర్లదే ఇష్టారాజ్యం

– తొమ్మిది మందికి ముగ్గురే విధుల్లో
– మందుల కోసం తప్పని తిప్పలు
– సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్

హుస్నాబాద్ యదార్థవాది

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వంత జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రమైన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లది రోజు ఇష్టారాజ్యం నడుస్తుంది వారంలో ఒక్క రోజు మాత్రమే డాక్టర్ లు డ్యూటీ చేసి మిగతా పని దినాల్లో స్వంత పనులు చూసుకుంటున్నారని భారత కమ్యూనిస్టుపార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ తెలిపారు. సోమవారం సిపిఐ ప్రతినిధి బృందం హుస్నాబాద్ 50 పడకల ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి వచ్చే రోగులను చూడడానికి డాక్టర్ లు సమయానికి ఆసుపత్రికి వస్తున్నారా వైద్య ఎలా అందుతుందని అడిగితెలుసుకున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి తో కలిసి ఆసుపత్రిలోని  అన్ని వార్డూలు తిరిగిన అనంతరం గడిపె మల్లేశ్ విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ లు అందరు రోజు విధులకు హాజరు కావడం లేదని వంతులవారిగా డాక్టర్ లు డ్యూటీలు చేస్తు ఆసుపత్రికి వచ్చిన వృద్దులైన రోగుల పట్ల డాక్టర్ సుమతి దురుసుగా ప్రవర్తించినతీరు సరైంది కాదని డాక్టర్ అంటే మానవత్వంతో పనిచేయాలని సూచించారు. వివిధ గ్రామాల నుండి ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ స్త్రీలకు సరైన కూర్చుండే వసతులు, ఫ్యాన్ లు, డయాలసిస్ చేయించుకోవడం కోసం వస్తున్నవారి సంఖ్య అధికంగా పెరుగుతుండటంవల్ల అదనంగా మరో 6 బెడ్లు మంజూరు చేసి సంబంధించిన పరికారలను సమకూర్చి అందరికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు. ఆసుపత్రిలో మందులు, వానాకాలం తలపిస్తున్న తరుణంలో పాము, తేలు, విషపు పురుగులు బారినపడేవారికొసం అదనంగా వ్యాక్సిన్, సూదులు, ల్యాబ్ కిట్లు చాలా కాలంగా నిల్వలు లేకపోవడం వల్ల డాక్టర్ లు బయటకు ప్రయివేటు మెడికల్ షాపులో దొరుకుతాయని తెచ్చుకోవాలని డాక్టర్ లు చిటిలు రాయడం సీఎం కేసిఆర్ స్వంత జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఇచ్చేందుకు సూది, మందులు, కిట్లు కూడా కరువైపోయాయని హుస్నాబాద్ ఆసుపత్రిపై ఎందుకింత చిన్నచూపు నిర్లక్ష్యం సరికాదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, జిల్లా కలెక్టర్, సంబంధిత వైద్య విధాన పరిషత్ జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూ, అకస్మిక తనిఖీలు చేసి ఆసుపత్రికి అవసరమైన సూదులు మందులు, ల్యాబ్ కిట్లు సమకూర్చి పేదలకు మెరుగైన వైద్యం కోసం కృషి చేయాలని ఆయన కోరారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అందరూ రోజు విధులకు హాజరై ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు తోడ్పడాలని డాక్టర్ లు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోజు విధులకు హాజరు కాకుండా రిజిస్టర్ లో సంతకాలు పెట్టుకునే సంస్కృతి ఇకనైనా మానుకోవాలని ఆయన డాక్టర్ లకు సూచించారు. కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు పొదిల కుమారస్వామి, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జెరిపొతుల జనార్దన్, ఎఐవైఎఫ్ జిల్లా సహయ కార్యదర్శి చింతకింది కుమార్ సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...