38.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

రాజకీయ రంగ ప్రవేశంపై ఊహగానాలు: జగన్ క్యాంప్ కార్యాలయానికి అంబటి రాయుడు

రాజకీయ రంగ ప్రవేశంపై ఊహగానాలు: జగన్ క్యాంప్ కార్యాలయానికి అంబటి రాయుడు

అమరావతి యదార్థవాది

ప్రముఖ క్రిరెటర్ అంబటి రాయుడు గురువారం ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. కొంత కాలంగా ఏపీ సీఎం జగన్ పై ఆయన ప్రశంసలు కురిపిస్తున్నారు..అంబటి రాయుడు సోషల్ మీడియా వేదికగా జగన్ ను ప్రశంసిస్తున్నారు. అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం సాగుతుంది. ఈ తరుణంలో అంబటి రాయుడు సీఎం క్యాంప్ కార్యాలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది..

దిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే..

దిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే..

నూడ్లి యదార్థవాది

దేశ రాజధాని దిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో అరవింద్‌ కేజ్రీవాల్ సర్కారుకు సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది..
ప్రభుత్వాధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది..

డ్వాక్రా గ్రూపులో దోపిడీ దారులు?

డ్వాక్రా గ్రూపులో దోపిడీ దారులు?

నిర్లక్షరాస్యులైన గ్రూప్ సభ్యులకు తెలియకుండానే వారిపై లోన్లు?

పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమా?

సి.ఏ.ల విధులేంటి?

యధార్థవాది ఐనవోలు

గ్రామీణ ప్రాంతాల మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పొదుపు ప్రోత్సహించే ఉద్దేశ్యంతోనే డ్వాక్రా సంఘాలు ఏర్పడ్డాయి. మహిళలు ఒక సమూహంగా ఏర్పడి తమకు తాము అభివృద్ధి చెందే ఉద్దేశ్యంతో 1982 లో ఇది కార్యరూపం దాల్చింది. ప్రస్తుత సమాజంలో డ్వాక్రా పాత్ర గణనీయంగా ఉంది. ఈ సంఘాలపై ఆధారపడి అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇదే క్రమంలో మహిళ సంఘాల్లో ఉద్యోగ కల్పన జరిగి వేలాది మందికి ఉపాధి సైతం దొరికింది. అయితే క్షేత్ర స్థాయిలో మూల స్తంభాలుగా ఉన్న మహిళలు డ్వాక్రా సంఘాలు ప్రజాప్రతినిధులు, నిరక్షరాస్యత, అవగాహన లేమి వల్ల పలు చోట్ల మోసాలకి గురువుతున్నారు. ఇటీవలే మండలంలోని ఓ గ్రామనికి చెందిన సీ.ఏ లక్ష రూపాయల మేరకు నిధుల దుర్వినియోగం చేసిన సంఘటన మండల వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో, సాధారణ మహిళల్లో పలు అనుమానాలు ఏర్పడ్డాయి. మా గ్రూపులో కూడా ఇలా జరిగిందంటూ ఒకరు….మా గ్రూపు లో కూడా ఇలానే జరిగిందంటూ మరొకరు చర్చించడం గమనార్హం…

సి.ఏ ల విధులేంటి..?

గ్రామ సమైక్య సంఘాల ద్వారా సి.ఏ లు, వివో సంఘాలు తద్వారా మండల స్థాయిలో మండల సమైక్య కార్యాలయం జిల్లా స్థాయిలో గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా విధులు నిర్వహిస్తుంది. ఇదంతా క్షేత్ర స్థాయిలో మహిళల్లో ఆర్థిక స్వావలంబన సాధించడమే పని చేస్తున్నాయి. అయితే మహిళా సంఘాలకు క్షేత్ర స్థాయిలో బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించడంలో సి.ఏ లు ప్రాథమిక పాత్రను పోషిస్తారు. వీరు సమైక్య సంఘం లీడర్, సభ్యులకి బ్యాంకుకు మధ్య అనుసంధాన కర్తగా పనిచేస్తారు. వీరి ఆధీనంలో పదుల సంఖ్యలో సమైక్య సంఘాల పొదుపులు, రుణాల పద్దుల నిర్వహణ చేస్తున్నారు. వివిధ రకాల రికార్డులు వీరు రాయడం, అలాగే వాటిని వీరికి ప్రభుత్వం ద్వారా ఇవ్వబడిన టాబ్‌లో నమోదు చేయడం చేయాలి. అలాగే ప్రతి నెల డ్వాక్రా సంఘాలతో సమావేశం నిర్వహించి వాటి ఫొటోస్, వివరాలు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు స్త్రీ నిధి, ఇతర లింక్ బ్యాంక్ లోన్లు ఇప్పించే బాధ్యతని వీరు నిర్వహిస్తారు .

నిధుల దుర్వినియోగం ఇలా..

సీ.ఏగా పని చేసే వారికి క్షేత్ర స్థాయిలో ప్రతి మహిళతో నేరుగా పరిచయం ఉంటుంది. ఇదే క్రమంలో మహిళల్లో నిరక్షరాస్యత, అప్పు అంటే భయం ఉండడంతో కొంతమంది సి.ఏ లు రాసిందే లెక్క, చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్‌లో అప్పు అవసరం లేని వారి పేరు మీద డబ్బులు తీసుకోవడం, వాడుకోవడం, తిరిగి చెల్లించకపోవడం వీరికి పరిపాటిగా మారింది. బ్యాంక్ సిబ్బంది కూడా కట్టేది లేనిది కూడా చూసి చూడనట్లు ఉండడం లేదా ఉన్న డబ్బుల్లోనే సి.ఏ లే సర్దుబాటు చేసి ఎప్పటికప్పుడు నెట్టుకొస్తున్నారు. వీరు పుస్తకాలు అప్డేట్ చేయకున్నా తీసుకునే చర్యలు లేవు. పర్యవేక్షించే వ్యవస్థ సరిగా పని చేయట్లేదు.ఇక లోన్‌ల కోసం సదరు సి.ఏ లు కొంతమంది లేని సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు సైతం వస్తున్నాయి. దీనికి తోడు రుణాలు ఇప్పించినప్పుడల్లా సభ్యుల నుండి మంచితనంతో కొందరు డిమాండ్ చేసి రూ.500 నుండి రూ.1000 వరకు కమిషన్ తీసుకుంటున్నారు. ఇక స్త్రీ నిధి లోన్ అయితే అవతల వారి అవసరం బట్టి వీరి ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది.

ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం..కరెంట్ కోతలు తప్పవా !

ఏపీలో పెరిగిన విద్యుత్ వినియోగం..కరెంట్ కోతలు తప్పవా !

అమరావతి యదార్థవాది

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులు ఎండలు మండిపోతుండటంతో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగింది..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగడంతో.. సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభం అయింది.దీంతో అందుబాటులోకి రెండు వేల మెగావాట్లు వచ్చాయి. ఇటీవల కురిసిన వర్షాలకు విద్యుత్ వినియోగం తగ్గడంతో యూనిట్లను అండర్ రిజర్వ్ షట్ డౌన్ లో పెట్టింది NTPC. ఇక ఇప్పుడు సింహాద్రి ఎన్. టి.పీ.సీ లో నాలుగు యూనిట్లలోను ఉత్పత్తి ప్రారంభించారు. ఏపీలో కరెంట్‌ కోతలు లేకుండా.. ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు. ఇది ఇలా ఉంటే, నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణ, ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కోస్తాంధ్ర జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది..

కాలేజీ కట్టారు అధ్యపకున్ని మరిచారు

కాలేజీ కట్టారు అధ్యపకున్ని మరిచారు

-కళాశాల ఏర్పాటైన సివిక్స్ అధ్యాపకుడు లేక విద్యార్థులు ఫెయిల్

కామారెడ్డి యదార్థవాది

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు కొరకు మండల ప్రజలు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడగా తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో 2021సంవత్సరం బీర్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటయింది. కళాశాల ఏర్పటైన సివిక్స్ అధ్యాపకుడు లేక ఈ సంవత్సరం 2023లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సివిక్స్ సబ్జెక్టులో 33 మంది గాను 20 మంది విద్యార్థులు పాస్ కాగా మిగతా 13 మంది ఫెయిలయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులంతా నిరుపేద కుటుంబానికి చెందినవారే. స్థానిక ప్రజా ప్రతినిధులు తరచూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తనిఖీలు చేయాలన్న తెలంగాణ సీఎం కెసిఆర్ ఆదేశాలు పాటించడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారనడంలో ఆచార్యాం లేదు. అధ్యాపకుడు లేకనే తాము సివిక్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యామని, కనీసం పరీక్షల వరకైనా అధ్యాపకుడు వస్తారని ప్రభుత్వం ఇచ్చిన సివిక్స్ పుస్తకం తెరవ లేదని, ఈ విషయంలో చదువుల తల్లి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సివిక్స్ సబ్జెక్ట్ లొ ఫెయిల్ అయిన 13 మంది విద్యార్థులకు తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ జూనియర్ కళాశాల లో కనీసం జూనియర్ అసిస్టెంట్ కూడా లేరని విద్యార్థులు వాపోతున్నారు.

పదిలో మరో సారి రెండవ స్థానం సిద్దిపేట జిల్లా..

పదిలో మరో సారి
రెండవ స్థానం సిద్దిపేట జిల్లా..
– జిల్లాలో 10/10 జీపీఏ 126
– 219 ప్రభుత్వ పాఠశాలల్లో 100%
– 8 మండలాలు 100% ఉత్తీర్ణత
– విద్యార్థులకు మంత్రి హరీశ్ రావు అభినందనలు

బుధవారం విడుదల అయిన పది ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రెండవ స్థానంలో నిలిచింది.. గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది.గత సంవత్సరం 97.85% ఉత్తీర్ణత శాతం రాగ ఈ సంవత్సరం 98.65% తో గత సం కంటే 1.4% పెరిగింది..మంత్రి హరీష్ రావు నిరంతరం పర్యవేక్షణ , విద్యార్థులకు డిజిటల్ క్లాస్ లు, ప్రత్యేక తరగతులు స్నాక్స్ , తల్లి తండ్రులకు ఉత్తరం అదేవిధంగా కాన్ఫరెన్స్ ద్వారా నింపిన ఆత్మవిశ్వాసం తో పదిలో పంథా తగ్గలేదు , హెడ్మాస్టర్స్ తో సమీక్ష లు , అదే స్ఫూర్తితో మరో సారి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది… అంతకు ముందు రెండు సంవత్సరాలు 2, 3 స్థానాల్లో, గత సంవత్సరం ప్రథమ స్థానంలో నిల్వగా ఈ సారి రెండవ స్థానం లో నిలవడం వరసుగా నాలుగు సార్లు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది అభివృద్ధి లో సిద్దిపేట అగ్రస్థానంలో ఉండటం ఎంత ముఖ్యమో విద్య లో ముందు ఉండాలి అనే మంత్రి హరీష్ రావు సంకల్పానికి నిదర్శనం..

25 వేల చొప్పున పురస్కారాలు

– 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు 25 వేలు, 100% ఉత్తీర్ణత శాతం సాధించిన ప్రభుత్వ పాఠశాలలకు 10వేలు నగదు పురస్కారం మంత్రి హరీష్ రావు అందిచనున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 126 మంది 10/10 సాధించారు, 219 ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత , 8 మండలాలు 100% ఉత్తీర్ణత సాదించారు.

– మంత్రి హరీష్ చొరవ తోని ఉత్తమ ఫలితాలు

నిరంతరం ఫలితాల పై మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపారు.. పాఠశాల స్థాయి ఉపాధ్యాయుని నుండి జిల్లా కలెక్టర్ వరకు కూడా సమీక్షలు నిర్వహించారు.. పలుమార్లు హెడ్మాస్టర్స్ తో , అధికారులతో సమీక్ష లు , విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేల తల్లి తండ్రులకు, కాన్ఫరెన్స్ , ఉత్తరం , డిజిటల్ క్లాస్, ప్రత్యేక తరగతులు ,స్నాక్స్ ఏర్పాటు చేయడం వలన ఇది సాధ్యం అయింది..

బస్సులో గొడవ – తలదూర్చిన ఎస్సైపై కేసు

బస్సులో గొడవ – తలదూర్చిన ఎస్సైపై కేసు
ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం గొడవ
– చిలికి చిలికి గాలివానై
– ఎస్సై, కానిస్టేబుల్ తో పాటు మహిళపై కేసు

జగిత్యాల యదార్థవాది

ఆర్టీసీ బస్సులో సీట్ల సర్దుబాటు వద్ద ప్రయాణికుల మధ్య తలెత్తిన చిన్నపాటి సర్దుబాటు గొడవ చిలికి చిలికి గాలి వానై పెద్ద గొడవకు దారి ఓ ఎస్ ఐ తో పాటు ఆయన భార్య మరో కానిస్టేబుల్ పై శుభాకాంక్షలు కేసు నమోదుకు దారి తీసిన సంఘటన జగిత్యాలలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాలకు ఓ సామాజిక వర్గానికి చెందిన ఓ విద్యార్థిని ప్రయాణిస్తునడగ బెజ్జంకి వద్ద ఓ మహిళ బస్సు ఎక్కింది. అయితే సీట్లు లేకపోవడంతో విద్యార్థిని కూర్చున్న సీట్లో సర్దుబాటు చేసుకుని కూర్చునది. అయితే మరింత సీటు కోసం తోటి ప్రయాణికులను పక్కకు ఒత్తి కూర్చుంది ఈ క్రమంలో సదరు ప్రయాణికురాలిపై బూతులు తిట్టింది. ఇది ఇలా ఉండగా బస్సు జగిత్యాలకు చేరుకోగానే పోలీసు వాహనం బస్సుకు అడ్డంగా నిలిపి అందులోంచి సివిల్ డెస్క్ లో ఉన్న వ్యక్తితో పాటు కానిస్టేబుల్ విద్యార్థినిపై దాడికి దిగి కిందకి లాగేశారు. మిగతా అందరు ప్రయాణికులు చూస్తుండగానే అవమానకర రీతిలో వారు ప్రవర్తించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనిపై జగిత్యాల టౌన్ పోలీసులు దాడి చేసిన జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ తో పాటు మరో కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌ఆర్‌ఏ పెంపు..

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. హెచ్‌ఆర్‌ఏ పెంపు..

అమరావతి యదార్థవాది

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.. కాగా, కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే ఉద్యోగులకు ఇది వర్తించనుంది..
ఇక, హెచ్‌ఆర్‌ఏను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు పెంపు వర్తించనుంది..

అంజన్న అనుగ్ర‌హంతో మనమందరం సుభిక్షంగా ఉండాలి..

అంజన్న అనుగ్ర‌హంతో మనమందరం సుభిక్షంగా ఉండాలి..

కొండ‌గ‌ట్టు ఆంజ‌నేస్వామి అనుగ్ర‌హంతో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉండాల‌ని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆకాంక్షించారు..

జగిత్యాల యదార్థవాది

కొండ‌గ‌ట్టు ఆల‌యంలో బుధవారం ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత
ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం, అక్క‌డ నిర్వ‌హించిన హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణంలో పాల్గొన్నారు..
హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం ముగిసిన అనంత‌రం ఆమె మాట్లాడుతూ మంచి జీవితాన్ని ప్ర‌సాదించేట‌టు, ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేట‌టువంటి, విజ‌యాన్ని అందించే ఆంజ‌నేయ స్వామిని కొలిచిన‌ట్టు అయితే ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉంటార‌ని మ‌నంద‌రం బ‌లంగా న‌మ్ముతామని ప్ర‌తి గ్రామంలో ఆంజ‌నేయ‌స్వామి గుడి ఉంటుందని క‌రోనా క‌ష్ట‌స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌జ‌లంద‌రూ సుభిక్షంగా ఉండాలంటే హ‌నుమాన్ పారాయ‌ణం చేయాల‌ని కొండ‌గ‌ట్టు ఆలయ పూజారి జితేంద్ర‌య్య సూచించారని తెలిపారు.
ఆంజ‌నేయ స్వామి పారాయ‌ణానికి మించిన మందు లేదని ఆనాటి నుండి నేటి వ‌ర‌కు కొండ‌గ‌ట్టు అంజ‌న్న సేవా స‌మితి పేరుతో జితేంద్ర‌య్య నేతృత్వంలో అంద‌రం కూడా పారాయ‌ణం చేస్తున్నామని అమే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

14న గోదాగోకులంలో హనుమజ్జయంతి వేడుకలు..

14న గోదాగోకులంలో హనుమజ్జయంతి వేడుకలు..

కర్నూలు యదార్థవాది

తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని గోదాగోకులం ఆంజనేయ స్వామి ప్రాంగణంలో హనుమజ్జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, శ్రీగోదా రంగనాథ రామానుజ కూటమి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నాగరాజు గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు తెలిపారు. ఇందుకు సంబంధించిన సాహిత్యాన్ని వివిధ భక్తసమాజాలతో కలిసి శ్రీ గోదాగోకులంనందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమజ్జయంతి సందర్భంగా ఈ నెల 14న ఉదయం పంచామృతాభిషేకం, ఆకుపూజ, సుందరాకాండ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, మన్యుసూక్త హోమం, వడమాలాలంకరణ, తీర్థప్రసాద గోష్ఠి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మారం లలిత, ఇల్లూరి సింధు, పాలాది సునీత, చిత్రాల నాగజ్యోతి, పెరుమాళ్ళ సునీత, మేడా సరిత, శ్యామల, శివ జ్యోతి, పెరుమళ్ళ బాల సుధాకర్, మహేశ్వరరెడ్డి, ఇటిక్యాల పుల్లయ్య, చిత్రాల వీరయ్య, శ్రీనాథ్, మాకం శ్రీనివ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...