34.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

ఉపాధి హామీ కూలీల పట్ల అధికారుల నిర్లక్ష్యం

ఉపాధి హామీ కూలీల పట్ల అధికారుల
నిర్లక్ష్యం

-ఇందల్వాయి ఎంపీడీవో కార్యాలయం ముట్టడించిన ఉపాధి హామీ కూలీలు

-ఉపాధి హామీ పనులలో కార్యాలయం అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనబడుతుంది

నిజమాబాద్ యదార్థవాది

ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామం ఉపాధి హామీ కూలీల పట్ల అధికారుల
నిర్లక్ష్యంతో రోజు 20 మంది కూలీలు పనిచేస్తుంటే 30 మంది కూలీలకు డబ్బులు ఖాతాలో జమవుతున్నట్లు తెలుసుకొని ఎంపీడీవో కార్యాలయన్ని ముట్టడించిన కూలీలు…
చేసిన వారికి తక్కువ డబ్బులు రావడంతో కూలీలు వారి యొక్క ఆరోపణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నవని మంగళవారం ఎంపీడీవో ఆఫీస్ ని ముట్టడించారు. కూలి పని చేయని వారికి ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని కూలీలు తెలిపారు. 20 రోజుల పనికి నాలుగు రోజుల డబ్బులు పడుతున్నాయని తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుండి వెళ్ళదే లేదని వారు ఆందోళన చేశారు..ఎంపీడీవో రాములు నాయక్ సెలవు వుండటంతో ఎంపీఓ పోశెట్టి మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు ఎవరు కూడ ఆందోళన పడవదని ఇట్టి విషయంలో సమగ్రంగా విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు…ఈ విషయం పై గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ లు మాట్లాడుతూ ఉపాధి హామీల కష్టాలు ఎంపీడీవో ఆఫీస్ వచ్చేంతవరకు తన దృష్టికి రాలేదని ఫీల్డ్ అసిస్టెంట్ రాము అనారోగ్యంతో ఉండడంతో సమస్యలు వచ్చాయని ఇక నుండి ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతను మేము సర్దుబాటు చేసుకుని ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేస్తామని, ఇప్పటి నుండి ఉపాధి హామీ కూలీలను గ్రూపులుగా తయారు చేసి సమస్యల్ని రాకుండా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఅర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ నాయకులు కూలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

మన ఊరు మన బడి పథకంఫైన సమీక్ష సమావేశం నిర్వహించిన. జిల్లా కలెక్టర్…

మన ఊరు మన బడి పథకంఫైన సమీక్ష సమావేశం నిర్వహించిన. జిల్లా కలెక్టర్…

సిద్దిపేట యదార్థవాది

హుస్నాబాద్ నియోజకవర్గం, బెజ్జంకి మండలంలో మన ఊరు మన బడి పథకంఫైన సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్….
సమీకృత జిల్లా కార్యాలయంలో మంగళవారం మన ఊరు మన బడి పథకం కింద కేటాయుంచిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంఎసి చైర్మన్లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈ లు మరియు సర్పంచ్, కౌన్సిలర్లు, నిర్మాణ ఏజెన్సీలతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మొత్తంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథక పనులు నత్తనడకన సాగుతుందని అసహనం వ్యక్తం చేశారు. బెజ్జంకి మండలంలో ఇంకా మెరుగుపర్చుకోవాలని ఈ పథకం లో ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్ మైనర్ (కిటికీలు, డోర్లు, స్లాప్, ఫ్లోర్) రిపేర్లు తప్పని వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఎన్ఆర్ఈజిఎస్, ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షేడ్ పూర్తి చేశాకే మిగతా ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు పూర్తి చెయ్యాలని, ఎంపిడిఓ, ఎంపిఓ లు రోజు వారిగా పాఠశాలల్లో జరుగుతున్న ఈజీఎస్ పనులను పర్యవేక్షణ చేసి పూర్తి చేపించాలని అన్నారు.
ఎఈలు ఇప్పటి వరకు అయిన పనులకు ఎప్టిఓ జనరేట్ చెయ్యాలని, కలరింగ్ ఏజెన్సీ కి మెథర్ మెంట్ షిట్ అందించాలని, ఎంపిడిఒ ఎంపిఓ లు ఏఈ లకు ఎప్పటి కప్పుడు తోడ్పాటునందించాలని, మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ రాములు తదితరులు పాల్గొన్నారు..

మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్..

మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్..

రూ.504 కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్‌ ను త్వరలోనే ప్రారంభించనున్నారు.

సిరిసిల్ల యదార్థవాది

కోనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో ప్యాకేజీ – 9 లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీ సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది…

మంత్రి ఆదేశాల మేరకు మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ ను చేపట్టేందుకు అధికారులు పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు..

అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పంపుహౌస్‌లో మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను మంగళవారం మల్కపేట జలాశయంలోకి నీటిని ఎత్తి పోశారు..

ట్రయల్ రన్ పనులను ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎత్తి పోతల సలహాదారు పెంటా రెడ్డి, ఏజెన్సీ ల ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ట్రయల్ రన్ ఎప్పటి కప్పుడు ట్రయల్ రన్ పై అధికారులను ఆరాతీస్తూ సజావుగా జరిగేలా మార్గనిర్దేశం చేశారు.

మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల కొత్త ఆయకట్టు కు సాగునీరు అందడంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది.

మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటిసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. బీడు భూముల సస్యశ్యామలం కానున్నాయి..

రేషన్‌ డీలర్లతో మంత్రి చర్చలు సఫలం

రేషన్‌ డీలర్లతో మంత్రి చర్చలు సఫలం

హైదరాబాద్ యదార్థవాది

రేషన్‌ డీలర్ల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సచివాలయంలో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ రేషన్‌ డీలర్ల ఐక్యకార్యాచరణ కమిటీ(జెఎసి)తో చర్చలు జరిపారు…

పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించవలసిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్‌ డీలర్లపై కూడా అంతే వుందని పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం ఒక సామాజిక బాధ్యత అనే విషయాన్ని డీలర్లు మరవద్దని ఈ బాధ్యతను విస్మరించి రేషన్‌ బియ్యం పంపిణీకి ఆటంకం కలిగించేలా రేషన్‌ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడం బాధాకరం అన్నారు. వచ్చే నెల 5వ తేది నుండి రేషన్‌ డీలర్ల సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో డా. బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో సోమవారం మంత్రి గంగుల తెలంగాణ రేషన్‌ డీలర్ల ఐక్యకార్యాచరణ కమిటీ(జెఎసి)తో చర్చలు జరిపారు… సమావేశంలో శాసనసభ్యులు వినయ్‌ భాస్కర్‌, పద్మాదేవేందర్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమీషనర్‌ వి.అనిల్‌కుమార్‌, జెఎసి చైర్మన్‌ నాయికోటి రాజు, వైస్‌ ఛైర్మన్‌ బంతుల రమేష్‌బాబు, కన్వీనర్‌ దుమ్మాటి రవీందర్‌, కో`కన్వీనర్‌ గడ్డం మల్లికార్జున్‌ పాల్గన్నారు. ఈ సమావేశంలో జెఎసి ఇచ్చిన 22 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్‌ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మొత్తం 22 సమస్యలపై 20 సమస్యల పరిష్కారినికి సానుకూలంగా ఉన్నామని ఇందుకు సంబధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని, గౌరవ వేతనం, కమీషన్‌ పెంపు సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు.. మంత్రి హామీ మేరకు సమ్మెను విరమిస్తున్నట్లు జెఎసి ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై సంపూర్ణ నమ్మకం వున్నందున ముఖ్యమంత్రి తమ సమస్యలను పరిష్కరిస్తారని ఆశతో సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు..

సింగోజు సేవలు అభినందనీయం

సింగోజు సేవలు అభినందనీయం

సిద్దిపేట యదార్థవాది

సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్థానిక ఎన్జీవోస్ కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ గాయత్రీ విశ్వకర్మ భగవాన్ దేవాలయ ప్రాంగణం జయశంకర్  కల్యాణ మండపంలో స్థానిక విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం సింగోజు మురళీకృష్ణ ఆచార్యులను ఘనంగా సన్మానించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ 41వ వార్డు కౌన్సిలర్ సాయన్న గారి సుందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం నాయకులు పబ్బోజు యాదగిరి చారి, పుల్లయ్య గారి శ్రీనివాస్ చారి,
మట్రోజు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఏదైనా ఒక రంగంలో సమయం కేటాయించి గుర్తింపు తెచ్చుకోవడమే అత్యంత కష్టంగా ఉంటుందని అటువంటిది సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు గత కొన్ని సంవత్సరాల క్రితమే సామాజిక సేవలో భాగంగా చేసిన కృషికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముని మనవల్ల చేతుల మీదుగా అంబేద్కర్ రత్న పురస్కారాన్ని కూడా అందుకున్నారని ఇప్పటికీ వివిధ రంగాల్లో సేవలందిస్తూ ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాల్లో అసిస్టెంట్ యోగా మాస్టర్ గా, యువభారత్ జిల్లా అధ్యక్షుడిగా, కులంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడిగా, జర్నలిస్టుగా సమాజంలోని ఎన్నో రుగ్మతలను రూపుమాపడానికి తన వార్తల ద్వారా, వ్యాసాల ద్వారా సమాజానికి అవగాహన కల్పిస్తూ ఇలా పలు రకాలుగా సేవలందిస్తూ తనదైన ఒక గుర్తింపును ప్రత్యేకతను చాటుకుంటున్నాడని ఇటీవల ఢిల్లీలో జరిగిన కులవృత్తులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని తన సామాజిక బాధ్యత నిరూపించుకున్నారని అన్నారు. సన్మాన గ్రహీత సింగోజు మురళీకృష్ణ మాట్లాడుతూ తనను ఘనంగా సత్కరించిన సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ బాల్యం నుండే సామాజిక బాధ్యతను కలిగి ఉన్నానని దాన్ని తుది వరకు కొనసాగిస్తానని సమాజంలో అసమానతలు కొన్ని రకాల రుగ్మతలు రూపు మాపడమే లక్ష్యంగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని అన్నారు.
కార్యక్రమంలో మేడోజు నరసింహ చారి, పెంటయ్య చారి, రంగయ్య చారి,పానుగంటి స్వామి చారి,పోలోజు మహేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన.. చింతా ప్రభాకర్..

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన.. చింతా ప్రభాకర్..

సదాశివపేట యదార్థవాది

సదాశివపేట పట్టణంలోని పలు వార్డులలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన టీఎస్.హెచ్.డి.సి చైర్మన్ చింతా ప్రభాకర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా రోడ్డు సమస్యతో ఇబ్బంది పడ్డారని రోడ్డు సమస్యకు పరిష్కారం అయిందని పట్టణంలో కోటి 80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని త్వరలోనే 3,4వ వార్డులో రోడ్డు సమస్యకు తీరుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడు జయమ్మ, కమిషనర్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు యువకుడి మృతి

చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు యువకుడి మృతి

కొహెడ/జయదేవ్ పూర్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన బొడిగే రాజు జగదేవ్ పూర్ మండలం ధర్మారం గ్రామంలోని బొరబండ చెరువులో చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు..దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు రాజుకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరితో కలివిడిగా వుండే రాజు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దినసరి కూలీగా చేపల వేటకు వెళ్తూ జీవనం సాగించే రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రగతి బాటలో పల్లెలు

ప్రగతి బాటలో పల్లెలు

చిగురుమామిడి మండలంలో 68.7 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వొడితల
సతీష్…

హుస్నాబాద్ యదార్థవాది

హుస్నాబాద్ నియోజకవర్గ చిగురుమామిడి మండలంలోని లంబాడిపల్లి నుండి ముదిమాణిక్యం గ్రామం వరకు 33.50 లక్షల రూపాయలతో నిర్మించనున్న మట్టి రోడ్ పనులకు శంకుస్థాపన, మండల కేంద్రంలో 12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠదామం, రేకొండ గ్రామంలో 10 లక్షలతో మత్స్య పారిశ్రామిక సహకార సంఘభవనం, 12.60 లక్షల రూపాయలతో నిర్మించిన వైకుంఠదామాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీష్ కుమార్..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గ్రామానికి నర్సరీ, వైకుంఠదామం, పల్లెప్రకృతి వనం, సెగ్రీగేషన్ షేడ్, డంపింగ్ యార్డు, క్రీడా ప్రాంగణం వంటి మౌళిక సదుపాయాలు, ఒక ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్ వంటి సదుపాయాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు..

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ…

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ…

జగిత్యాల యదార్థవాది

తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ జగిత్యాల జిల్లా గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్ష ఉచిత శిక్షణ..
బీ.సి.స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గురుకుల ఉపాధ్యాయ పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయి బాబా పత్రిక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ కొరకు జగిత్యాల  జిల్లా కు అర్హులైన BC,SC,ST లకు చెందిన యువతి యువకులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్స్ చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు చివరి తేది ఈ నెల 25-05-2023 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సంప్రదించవలసిన వెబ్ సైట్. http://tsbcstudycircles.cgg.gov.in శిక్షణను పొందగోరే అభ్యర్థులు ఈ దిగువ సూచిoచిన అర్హతలు కలిగి ఉండవలెను.
1. అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయము రూపాయలు 5,00,000/- లోపు  ఉండాలి.

2. గురుకులం పరీక్షకు సంబంధించి నియమాలకు అనుగుణముగా అభ్యర్ధుల విద్యార్హతలు ఉండాలి.

3. ప్రస్తుతం విద్యను  అబ్యాసిస్తున్న అభ్యర్ధులు మరియు ఏదైన ప్రభుత్వ ఉద్యోగం లో ఉన్న వారు బి.సి స్టడీ సర్కిల్ లో  ఉచిత శిక్షణ కు అర్హులు కారు.

4. గురుకులం ఉచిత శిక్షణ కరీంనగర్ నందు నిర్వహించబడుతుందని తెలిపారు.

ఇతరవివరాల కొరకు సంప్రదిచ వలసిన
ఫోన్ నెంబర్ 0878-2268686, బీ.సి.స్టడీ సర్కిల్, కరీంనగర్ కార్యాలయంలో సంప్రదించలని తెలిపారు.

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

సిద్ధిపేట యదార్థవాది

రంగదాంపల్లి చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు దుర్మరణం పాలయ్యారు. వీరిని చిన్నకోడూరు మండలం మైలారం వాస్తవ్యులు గా భావిస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృత దేహాలను అక్కడి నుండి తరలించే పనిలో నిమగ్నమయ్యారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...