29.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

ధాన్యగారంగా తెలంగాణ

ధాన్యగారంగా తెలంగాణ

సిద్ధిపేట యదార్థవాది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యగారంగా తెలంగాణ మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం సిద్ధిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో నూతన పోచమ్మ దేవాలయ విగ్రహా ప్రతిష్ఠ ఉత్సవం, బోడ్రాయి పండుగలో ఆయన పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాన్ని అనేక రకాలుగా అన్నీ రంగాలలో అభివృద్ధి చేసుకున్నామని, గ్రామానికి డబుల్ లేన్ రోడ్డు-బైపాస్ రోడ్డు రావడంతో సరికొత్త అందమొచ్చిందని, వారం రోజుల్లో రూ.2 కోట్ల వ్యయంతో గ్రామ ఎస్సీ కాలనీ నుంచి రామంచ వెళ్లే రహదారికి పనులు ప్రారంభం చేసుకుందామని అయన అన్నారు. అనంతరం గ్రామ నాభి శిల బొడ్రాయి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవానికి మంత్రి హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేశ్ గౌడ్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్, ఎంపిటిసి లతా, పిఎసిఎస్ డైరెక్టర్ ఒగ్గు మురళి ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాం..

ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాం..

-ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్.

దౌల్తాబాద్ యదార్థవాది

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతోపాటు నిరుపేదల పక్షాన ఎస్ఆర్ ఫౌండేషన్ నిలబడి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తుందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన బాలుడు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్సహాయస్థితిలో ఉండే నిరుపేద ప్రజలకు భరోసా కల్పించడానికి సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని పేర్కొన్నారు. చెట్ల నర్సంపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పసుల రేణుక-స్వామి దంపతులకు కూతురు మధుప్రియ, కుమారుడు వినయ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో ఇంటి దగ్గర విద్యుత్ వైర్లు తెగిపడి బాలుడు విద్యుత్ షాక్ గురై మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.పిల్లలను పెంచి పెద్ద చేసి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులను పోషిస్తారని ఎన్నో కలలు కన్న తల్లిదండ్రుల ఆశలు నిరాశలై అర్ధాంతరంగా కుమారుడు మృతి చెందడం విషాదకరం. ఇలాంటి కడుపుకోత ఏ తల్లిదండ్రులకు రాకూడదని, తల్లిదండ్రుల రోదనలు అక్కడ ఉన్న వారందరికి కంటనీరు తెప్పిస్తున్నాయన్నారు. ఎస్ఆర్ ఫౌండేషన్ వారికి భరోసా కల్పించడానికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఇంకా మానవతాహృదయులు ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ కోశాధికారి మహమ్మద్ ఉమర్, ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, గ్రామస్తులు వేమ శ్రీనివాస్, పసి నర్సింలు తదితరులు పాల్గొన్నారు…

ఇంట్లో సంక్షేమం.ఇంటి ముంగిట అభివృద్ధి.: ఎమ్మెల్యే వొడితల సతీష్

ఇంట్లో సంక్షేమం.ఇంటి ముంగిట అభివృద్ధి.: ఎమ్మెల్యే వొడితల సతీష్

-సైదాపూర్ మండల కేంద్రంలో 50 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం

-గౌరవెళ్లి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో 1 లక్ష 6 వేల ఎకరాలకు సాగునీరు

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలానికి వరద కాలువ కాదు జీవ కాలువ ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు…
సైదాపూర్ మండలంలోని 13 గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలం అన్నీ రంగాల్లో అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మిడ్ మానేరు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలతో సైదాపూర్ మండలం సస్యశ్యామలం అయిందని, మొలంగూర్ నుండి హైదరాబాద్ వెళ్ళు డబుల్ రోడ్ నిర్మాణం, ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్లు, మిషన్ భగీరథతో ఇంటి ఇంటికి నీరు అందిచడం జరుగుతుందని, తెలంగాణ ఉద్యమం సమయంలో పోరాట స్పూర్తి నింపిన మండలం సైదాపూర్ అని గుర్తు చేసుకున్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత చైతన్య పరిచేందుకు పార్టీ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయనుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తారో చెప్పకుండా కేవలం కులం, మతం పేరిట ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని, రోజు రోజుకు శ్రుతి మించుతున్న బిజెపి దుర్మార్గాలను ఎండ గట్టి ఎక్కడి కక్కడ బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.. కరీంనగర్ జిల్లాలో 2 లక్షల 50 వేల పార్టీ సభ్యత్వం కలిగి రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మన కార్యకర్తల సంక్షేమం విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అగ్ర భాగాన ఉంటుందని తెలిపారు. ప్రతి కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అందించడంతోపాటు ఆపదలో అండగా ఉంటున్నామని తెలిపారు.. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జి.వి రామకృష్ణ రావు మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్షణ్ రావు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

వెండితెరపై రాణిస్తున్న సిద్ధిపేట కళాకారుడు

వెండితెరపై రాణిస్తున్న సిద్ధిపేట కళాకారుడు

సిద్ధిపేట యదార్థవాది

తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న జాతీయస్థాయి నాటిక పరిషత్ పోటీల్లో చైతన్య కళా భారతి కరీంనగర్ వారి చీకటిపువ్వు నాటిక ఎన్నో ఉత్తమ ప్రదర్శన అవార్డులు గెలుచుకుంది. ఇందులో సిద్దార్థ్ పాత్రలో నటించిన సిద్దిపేట కు చెందిన రంగస్థల, రేడియో, టీవీ, సినిమా నటుడు గిరిబాబు దేవులపల్లి వరుసగా లింగరావుపాలెం, నరసరావుపేట గూడూరు, గుడివాడ, దర్శి ప్రాంతాల్లో జరిగిన జాతీయ స్థాయి నాటిక పోటీల్లో అద్భుతమైన నటన కనబరిచి వరుసగా 5 చోట్ల ఉత్తమ జ్యూరీ బహుమతులు గెలుచుకున్నారు. చిన్నప్పటి నటన పట్ల ఆసక్తితో నిజం కాలేజి లో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ పూర్తి చేసి ఇప్పటివరకు 100 పైగా నాటక ప్రదర్శనలు చేసి పలువురి నాటక పెద్దలందరితో ప్రశంశలు అందుకుంటున్నాడు. ఆకాశవాణి హైదరాబాద్ లో రేడియో నాటకాలు చేస్తున్నాడు. అలాగే స్టార్ మా లో ప్రసరమయ్యే గృహలక్ష్మీ సీరియల్, ఈటీవీ గీతగోవిందం సీరియల్ లో నటించి పలువురు ప్రశంసలు అందుకున్నాడు… ఒక ఎమోషనల్ ఫ్యామిలీ కథతో తెరకెక్కిన జామెట్రి బాక్స్ అనే సినిమా లో చేసి పలువురి ప్రశంసలు అందుకున్నాడు… రంగస్థల కళాకారుడిగా ఎన్నో నాటకాలు చేస్తూ సినిమాల్లో అవకాశం ఎదురుచూస్తూ ఉన్నాడు.అవకాశం వస్తే ఒక మంచి క్యారెక్టర్ నటుడిగా తనని తాను నిరూపించుకోవాలని ఎదురుచూస్తూ ఉన్నాడు..

ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఔరంగాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

-ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ముల మృతి

హుస్నాబాద్ యదార్థవాది

మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మృతులు గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఎరుకల కృష్ణ, ఎరుకల సంజీవ్, ఎరుకల సురేష్, ఎరుకల వాసు లుగా గుర్తించారు. బ్రతుకుదేరువు కోసం వెళ్లి సూరత్ లో స్థిరపడ్డ నలుగురు అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వగ్రామంలో తమ బాబాయ్ అంత్యక్రియలకు వచ్చి కారులో సూరత్ కు వెళ్తుండగా ఔరంగాబాద్ లో కారు పల్టీ కొట్టిన ఘటనలో నలుగురు అన్నదమ్ములు దుర్మరణం పాలయ్యారు. మృతుల స్వగ్రామం చౌటపల్లిలోని వారి గృహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను స్వగ్రామానికి తీసుకువ రానున్నట్లు బంధువులు తెలిపారు.

మరో ‘వందేభారత్’!

మరో ‘వందేభారత్’!

హైదరాబాద్ యదార్థవాది

సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే రెండు వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లు నడుస్తుండగా త్వరలోనే మూడోది కూడా రాబోతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణంసికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్-నాగ్‌పూర్ మధ్య రైలును తీసుకురావాలని యోచిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఈ రెండు నగరాల మధ్య ఐదారుగంటల్లోనే ప్రయాణించే అవకాశం లభిస్తుంది…

కాచిగూడ-పూణె, హైదరాబాద్ – బెంగళూరు వంటి పట్టణాలకు వందేభారత్ రైళ్లు నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్‌ విద్యావ్యాపార, ఐటీల కొలువులకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. దీంతో దేశం నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తోందని అధికారులు పేర్కొన్నారు….

గుంటిపెల్లి అశ్వితను అభినందించిన. చాడ వెంకటరెడ్డి…

గుంటిపెల్లి అశ్వితను అభినందించిన. చాడ వెంకటరెడ్డి…

హుస్నాబాద్ యదార్థవాది

హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన స్వర్గీయ గుంటిపల్లి దుర్గేష్ కుమారుడు అజయ్ శైలేజ కూతురు అశ్విత ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో 986 మార్కులు సాధించి జిల్లాలో మొదటి స్థానం తెలంగాణ రాష్ట్రంలో 8వ స్థానం,
TGUGCET లో రాష్ట్ర స్థాయి 11 వ ర్యాంక్ సాధించినందుకు గాను మంగళవారం సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి అశ్వితను ఘనంగా సన్మానించి తల్లిదండ్రులను అభినందించారు… భవిష్యత్తులో ఉన్నతమైన చదువులు చదివి ఐఏఎస్ ఆఫీసర్ కావాలని పేద ప్రజలకు సేవ చేయాలని అశ్వితను చాడ వెంకటరెడ్డి అంబినందించి మనస్పూర్తిగా దీవించారు.. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్, మాజీ ‌సింగిల్ విండో డైరెక్టర్ గుంటిపెల్లి లక్ష్మి, సిపిఐ అక్కన్నపెట మండల కార్యదర్శి కొమ్ముల భాస్కర్ ,సిపిఐ నాయకులు అయిలేని మల్లారెడ్డి, గుంటిపెల్లి దుర్గేశ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో జగిత్యాల శరవేగంగా అభివృద్ధి: మంత్రి కొప్పుల ఈశ్వర్

అన్ని రంగాల్లో జగిత్యాల శరవేగంగా అభివృద్ధి: మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల యదార్థవాది

అన్ని రంగాల్లో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందుకు సాగుతుందని సంక్షేమశాక మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జనరల్ ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ థియేటర్, తెలంగాణ రేడియాలజీ భవన్ ను మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు వైద్యం మరింత చేరువలో ఉందలనే ఉద్దేశ్యం తో కంటి ఆపరేషన్ థియేటర్, ఆలాగే రేడియాలజీ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ తో పాటు జిల్లా కలెక్టర్ శ్రీమతి యాష్మీన్ భాష, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) మంద మకరంద్, గ్రంధాలయ సంస్థ చైర్మెన్ డా చంద్రశేఖర్ గౌడ్, DCMS చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, సంబందించిన వివిధ శాఖ ఆధికారులు, ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు..

పదేళ్లలో అభివృద్ధిలో హుస్నాబాద్ నియోజకవర్గం అగ్రగామిగా నిలిచింది: ఎమ్మెల్యే సతీష్

పదేళ్లలో అభివృద్ధిలో హుస్నాబాద్ నియోజకవర్గం అగ్రగామిగా నిలిచింది: ఎమ్మెల్యే సతీష్

-మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం

-హుస్నాబాద్ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే పార్టీతోనే సాధ్యం అయింది

హుస్నాబాద్ పట్టణంలో రూ.59 లక్షలు పెన్షన్ల రూపంలో 8వేల మందికి లబ్ది

-హుస్నాబాద్ పట్టణ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వొడితల

హుస్నాబాద్ యదార్థవాది

గడచిన పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచి దేశానికే దిక్సూచిలా నిలిచింన బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు….
హుస్నాబాద్ పట్టణంలోని రాజ్యలక్ష్మి కన్వెన్షన్ లో మంగళవారం బీ ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ పదేళ్ల క్రితం తెలంగాణాలో సాగు తాగునీరు లేదని, ఎప్పుడు వస్తుందోఎప్పుడు పోతుందో తెలియని కరెంట్ కష్టాలను అదికమించని గడచిన పదేళ్లలో ఎన్నో హామీలను సి ఎం కేసీఆర్ అమలు చేశారని ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా కేసీఆర్ నెరవేర్చారని గుర్తు చేసారు.. స్వ‌రాష్ట్ర ఫ‌లాలు క‌ళ్ళ ముందు క‌న‌ప‌డుతున్నాయి. అభివృద్థి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబ‌ర్ వ‌న్ గా ఉందని, ప‌ల్లె, ప‌ట్నం,తండాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు స‌మానంగా అభివృద్ధి చెందయన్నారు. తెలంగాణ లో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ఉచిత విద్యుత్తూ, గొర్రెల పంపిణీ, గురుకుల పాఠశాలలు వంటి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదని బీఅర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బట్టకాల్చి మీద వెస్తున్నయని, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని ప్రతిపక్షాల కల్లిబొల్లి కబుర్లు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, గతంలో ఏనాడూ కనిపించని లేని నాయకులు నేడు ఓట్లకోసం కొత్త వేషాలతో వస్తారని వారికి బుద్ది చెప్తారని అన్నారు.

హుస్నాబాద్ రూపురేఖలు మార్చాం

గత పాలకుల హయాంలో హుస్నాబాద్ పట్టణం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కానీ గడిచిన పదేళ్లలో హుస్నాబాద్ పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళమని, హుస్నాబాద్ ను రెవిన్యూ డివిజన్ గా, నగరపంచాయతీ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశామని, ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డులు వచ్చాయని, కొత్త మున్సిపల్ కార్యాలయ నిర్మాణం జరుగుతోందని, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరుగుతోందని, ఇటీవలే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మున్సిపల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, బస్తి దవాఖాన ఏర్పాటు చేశామని, ఆసుపత్రి లో మాత శిశు సంక్షేమ కేంద్రం, డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు.. గులాబీ పార్టీకి హుస్నాబాద్ నియోజకవర్గం కంచుకోట అని, అభివృద్ధిపై సంక్షేమంపై చిత్తశుద్ధితో పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు గుండెకాయ అని, వారి శ్రమ, కృషి మరువలేనిదని అన్నారు. కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు తప్పకుండ గుర్తింపు ఉంటుందని అయన అన్నారు. ఇక్కడి పార్టీ కార్యకర్తలు నిబద్దతతో, అంకిత భావంతో, పట్టుదలతో పనిచేయడం వల్లే తాను రెండు సార్లు సి ఎం కేసీఆర్ ఆశీస్సులతో గెలిచానని, ఇది వారి కృషి ఫలితమే నని అన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే.. మరోసారి కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని, ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రతి ఇంటికి లబ్ధిదారులు ఉన్నారని వారిని కలవాలని కోరారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకు తీసుకువెళ్లాలని తెలిపారు.. ఆత్మీయ సమ్మేళనంతో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

అమ్మవారికి దర్శించుకున్న భక్త జనులు

అమ్మవారికి దర్శించుకున్న భక్త జనులు

హుస్నాబాద్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణమంతా భక్తజనులతో కిక్కిరిసిపోయింది,భక్తులు అమ్మవారికి ఓడి బియ్యం కుంకుమభిషేకం పట్నాలు బోనాలముక్కలతో శివశక్తులు అమ్మవారి పూలకాలతో అమ్మవారి ఆలయం ప్రాంగణం మారు మ్రోగింది అమ్మవారికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తమ కోరికలు తీర్చాలని పాలు పూలు పండ్లు నిమ్మ దండలు సమర్పించి భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో అర్చకులు పరమేశ్వర శర్మ ఆలయ సిబ్బంది రమేష్, కుమార్, హనుమంతు,రవి, భక్తులు పాల్గొన్నారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...