29.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

సీఎం కేసీఆర్ మానస పుత్రిక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం

సీఎం కేసీఆర్ మానస పుత్రిక కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం

_నియోజకవర్గ వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు అందజేత

యదార్థవాది హుస్నాబాద్ ప్రతినిది

అక్కన్నపేట మండల పరిధిలోని 45 మంది లబ్ధిదారులకు శుక్రవారం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వొడిశాల సతీష్ కుమార్…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మండలంలో 1594 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 14 కోట్ల 58 లక్షల 75 వేల 432 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేనమామ కట్నంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని, పేద మధ్య తరగతి కుటుంబాలకు పెళ్లి ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఆడబిడ్డలకు ఎంతగానో ఉపయోగపడుతుందని,  పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావద్దని గత ప్రభుత్వాలు ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఆలోచించ లేదని ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే త‌ల్లిదండ్రులకు త‌ల‌కు మించిన భారంగా ఉండేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ,ఆసరా ఫింఛ‌న్‌ , రైతుల కోసం రైతు బంధు. రైతు భీమా, 24 గంటలు ఉచిత కరెంట్ , పేదల కోసం షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మి వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని మహిళల రక్షణ కోసం షీ టీం లను ఏర్పాటు చేసి గర్భినీ స్ర్తీల కోసం, పుట్టిన పసిబిడ్డల కోసం కేసీఆర్ కిట్టు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు కావాలసిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందని రాబోయే రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సతీష్ అన్నారు. జడ్పీటిసి భూక్య మంగ, ఎంపీటీసీ మాలోతి లక్ష్మి, ఎమ్మార్వో ,ఎంపీడీవో, మండల బీ ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ

నిజమాబాద్ యదార్థవాది

ఇందల్వాయి మండలం తిర్మపల్లీ గ్రామపంచాయతీలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీటీసీ చింతల దాస్.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన ప్రభుత్వం పేదల ప్రభుత్వ మని పేద ప్రజల్ని ప్రత్యేకంగా గుర్తుంచుకొని తన వంతు సహకారంగా ప్రతి ఒక్కరి కంటి చూపులు మంచిగా ఉండాలని ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా
కంటి వెలుగును శిబిరాన్ని నిర్వహిస్తున్నారని, సీఎం కేసీఆర్ మాత్రమే తెలంగాణ అభివృద్ధి తో పాటు ఆరోగ్య సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారని భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన
దగ్గర అమలవుతున్నాయని అన్నారు. 18 సంవత్సరాలు నుండి 55 సంవత్సరాల వరకు ఈ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరి పింఛన్ రైతుబంధు లాంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం చేయలేదని ఆయన గుర్తు చేశారు. మన ప్రభుత్వం వచ్చాక ప్రతి బీదవానికో గుర్తింపు వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్పల్లి ప్రభాకర్, బిరేశ్ శెట్టి, ఇమ్మడి సాయిలు, క్రాంతి కుమార్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు..

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు..

గజ్వేల్ యదార్థవాది

గజ్వేల్ వ్యవసాయ డివిజన్ పరిదిలోని గజ్వేల్ కోండపాక రాయిపోల్ మండలాల ఎరువులు విత్తనాల డీలర్లతో గురువారం వ్యవసాయ శాఖ అధికారులు సమావేశం నిర్వహించరు. సమావేశానికి సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్ హాజరై పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైసన్స్ కల్గిన కంపనీల విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను మాత్రమే అమ్మాలని సూచించడం జరిగింది. విత్తనాల, ఎరువుల ధరల పట్టిక షాపుల మందర రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు.రైతులకు సరుకులు కొన్న వేంటనే రశీదు తప్పని సరిగా ఇవ్వాలన్నారు. నఖిలి విత్తనాలు అమ్మితే పిడి చట్టం ద్వార కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. అధిక ధరలకు విత్తనాలను, ఎరువులను అమ్మితే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.స్టాకు రిజిష్టరు తప్పనిసరిగ రాయాలన్నారు.కాలం చేల్లిన విత్తనాలు అమ్మితే చట్టం ప్రకారం శిక్షించబడతారన్నారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఎడిఎ బాబు నాయక్,ఎఓ నాగరాజు,ఎఓ ప్రియదర్శిని,ఎఓ నాగేందర్,ఎఓ వసంత్,డీలర్లు పాల్గొన్నారు.

లారీల కొరతతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం రాశులు

లారీల కొరతతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం రాశులు

-వేధిస్తున్న లారీల కొరత అయోమయంలో రైతన్నలు..

-సొంత కర్చులతో ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు..

దౌల్తాబాద్ యదార్థవాది

పండించిన వరి పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలతో ఆగమయ్యారు. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి సరైన సమయానికి అమ్ముకుందామంటే నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని నిల్వ ఉన్నాయి. మండలం వ్యాప్తంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనీ ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు లారీల కొరత తీవ్రంగా వేధిస్తుంది. సరిపడ లారీలు రాకపోవడంతో 25 రోజుల్లో పూర్తి కావాల్సిన ధాన్యం నేటికీ కొనుగోలు కేంద్రాల్లోని నిల్వ ఉన్నాయి. ధాన్యం దిగుమతి చేసుకోవాల్సిన మిల్లర్లు మిల్లుల వద్దకు వచ్చిన ధాన్యం లారీలను దిగుమతి చేసుకోకుండా రెండు మూడు రోజులు అక్కడే మిల్లులోనే ఉంచుకుంటున్నారు. కొంతమంది రైతులు లారీలు రాక సొంత కిరాయిలు పెట్టి ట్రాక్టర్లతో మిల్లుల వద్దకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఐకెపి అధికారులు మిల్లర్లతో మాట్లాడితే తరుగు ఉండడంవల్ల లారీలను ఆపుతున్నట్లు మిల్లర్ల యజమానులు అంటున్నారని ఐకేపి అధికారులు తెలుపుతున్నారు. పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండడంతో రైతులు గ్రామాల్లో వేసుకున్న పంట చిట్టీలు కట్టడానికి డబ్బులు లేక ఆగమైతున్న అన్నదాతలు. ధాన్యం కొనుగోలు త్వరగా జరిగి రైతుల ఖాతాలో డబ్బులు జమైతే ఎరువులు,విత్తనాలు తెచ్చుకోవడానికి వీలుంటుంది. వర్షాకాలం దగ్గర పడడంతో అయోమయంలో రైతన్నలు అగమ్య గోచరంగా అన్నదాతల పరిస్థితి ఇప్పటికైనా మిల్లర్లతో, లారీ యజమానులతో అధికారులు మాట్లాడి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని త్వరగా పూర్తి చేయవలసిందిగా రైతులు, ఐకెపి అధికారులు కోరుతున్నారు.

ప్రభుత్వ వైద్య కళాశాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు

ప్రభుత్వ వైద్య కళాశాలకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు

సిద్దిపేట యదార్థవాది

సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు 28 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ, కృషితో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలోని పాథాలజీ (1), మైక్రోబయోలజీ (1), కమ్యూనిటీ మెడిసిన్‌ (2), జనరల్‌ మెడిసిన్‌ (4), పిడియాట్రిక్‌ (3), డివిఎల్‌ (1), సైకియాట్రీ (1), రేడియాలజీ (1), జనరల్‌ సర్జరీ (4), ఆర్థోపెడిక్‌ (2), ఈఎన్‌టీ (1), గైనకాలజీ (4), అనస్థీషియా (3) తో పాటు మొత్తం 28 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రజా వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నదని, పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నదని, మరోవైపు జిల్లాకో మెడికల్‌ కళాశాలను తీసుకొచ్చి వైద్య విద్యను చేరువ చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఏకకాలంలో జిల్లాకు 28 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి హరీశ్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారులు, వైద్యులు, వైద్య విద్యార్థులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

నకిలీ విత్తనాల కంపెనీ గుట్టు రట్టు

నకిలీ విత్తనాల కంపెనీ గుట్టు రట్టు

సంగారెడ్డి యదార్థవాది

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో నకిలీ విత్తనాల కంపెనీ గుట్టు రట్టు 8 కోట్ల విలువ గల నకిలీ మందులు బట్టబయలు..

విత్తనాల సంస్థ ఆలమా ట్రేడింగ్ కంపనీలో గడిచిన నాల్గు రోజులు వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలో 8 కోట్ల విలువ గల నకిలీ మందులు పట్టుకున్న వ్యవసాయ అధికారి అనిత.. ఎరువుల చట్ట ప్రకారం సదాశివపేట పోలీసులు కేసు నమోదు చేసి కంపనీకి సిల్ వేశారు…

రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల తయారీ కంపెనీల పై ఉక్కు పాదం మోపాలని ఆదేశాలు జారీ చేసిన వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్షం వల్ల రైతులు మోసపోతున్నారని రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి అన్నారు. నకిల విత్తనాల తయారీ కంపెనీ పై పిడి యాక్టు పెట్టాలని రాష్ట ప్రభుత్వ చెప్పిన అధికారులు నిర్లక్షం చేస్తున్నారని పేర్కొన్నారు.8 కోట్ల విలువ గల నకిలీ మందులు దొరికిన పిడి యాక్టు అమలు చేయడం లేదని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను నిరుగార్చితే రైతుల పక్షాన ఆందోళనలు చేపడుతామని తెలిపారు.

ఔరంగాబాద్ రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరం

ఔరంగాబాద్ రోడ్డు ప్రమాద ఘటన దురదృష్టకరం

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు సోదరులు మృతి చెందిన సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని, ఈ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు.. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన నలుగురు సోదరులు బుధవారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మృత దేహాలు గురువారం గ్రామానికి చేరుకోగా బాధిత కుటుంబాలను హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పరామర్శించారు. మృత దేహాలకు నివాళులర్పించారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన వీరు సూరత్ లో స్థిరపడ్డారు. వారి బంధువు (చిన్నాన్న) చౌటపల్లిలో మృతి చెందగా అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై నలుగురు సోదరులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఏరుకుల కృష్ణ, సంజీవ్, వాసు, సురేష్ కుటుంబాలను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్బంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.. బంధువులు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి..

ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా..

ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా..

తిరుమల యదార్థవాది

తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా.. మొదటి ఘాట్ రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే డివైడర్ను ఢీకొన్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదలో బస్సులో 45 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకొని అదే మార్గంలో వెళ్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ప్రమాదానికి గురైన బస్సు అద్దాలను ధ్వంసం చేసి భక్తులను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విద్యా సంస్థల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..

విద్యా సంస్థల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..

సిద్దిపేట యదార్థవాది

జీఓ నెంబర్ 1ని తుంగలో తొక్కి అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్రీ చైతన్య, అల్ఫోర్స్ పాఠశాలలను తక్షణమే సీజ్ చేసి యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ పి డి ఎస్ యూ విద్యార్థి నాయకులు జిల్లా విద్యాశాఖాదికారికి వినతి పత్రము అందించారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.విద్యానాథ్ మాట్లాడుతూ విద్యాశాఖ అనుమతులు లేకుండా జిల్లా కేంద్రంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హుస్నాబాద్ లో అల్ఫోర్స్, చేర్యాల లో శ్రీ చైతన్య పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారని తక్షణమే ఈ విద్యాసంస్థల పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ప్రదీప్, పట్టణ అధ్యక్షుడు ప్రణయ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు..

నిరుపేద వధువు వివాహానికి ఆర్థిక సాయం..

నిరుపేద వధువు వివాహానికి ఆర్థిక సాయం..

దుబ్బాక ఎమ్మెల్యే ఆదేశాలతో వధువు వివాహానికి బీజేపీ కార్యకర్తలు ఆర్థిక సాయం అందజేత..

దౌల్తాబాద్ యదార్థవాది

దౌల్తాబాద్ మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన మంగ విజయ్ మంగ సంతోష దంపతులు గత కొన్నిసంవత్సరాల కిందట మృతి చెందారు.. తల్లి తండ్రి మృతితో ముగ్గురు ఆడపిల్లలు ఒక కుమారుడు నలుగురు చిన్నారులు అనాథలయ్యారు. బుధవారం పెద్ద కూతురు శిరీష వివాహం విషయం తెలుసుకున్న గ్రామ బీజేపీ శాఖ అధ్యక్షుడు దుర్గారెడ్డి కార్యకర్తలు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లగా నిరుపేద వధువు వివాహానికి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్ల చందు, మరికంటి భాస్కర్, దాసరి రాజు తదితరులు పాల్గొన్నారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...