26.7 C
Hyderabad
Wednesday, April 22, 2026

శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ

శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ

పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన, పోలీసులు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవు

సిరిసిల్ల యదార్థవాది

జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తుందని, పోలీస్ వారి విధులకు అడ్డు వస్తే ఉపేక్షించేది లేదు అని జిల్లలో 20 కేసులల్లో 54 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని,ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీల, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీస్ విధులకు ఆటంఖం కలిగించిన, చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీస్ సిబ్బంది పై దురుసుగా ప్రవర్తింస్తూ జీవన విధానానికి ఆటంఖం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ కారణాలతో మరణించిన డెడ్ బాడీలను తీసుకువచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ప్రజా రవాణాకు, ప్రజానీకానికి, పోలీస్ అధికారులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి సమస్యలు ఉంన్న శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు..

ఘనంగా ఎల్లమ్మ బోనాలు

ఘనంగా ఎల్లమ్మ బోనాలు

రామగిరి యదార్థవాది

రామగిరి మండల పరిధిలోని రామయ్యపల్లిలో ఆదివారం ఎల్లమ్మదేవి బోనాలు వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా గ్రామంలోని వీధుల గుండా ఊరేగించి గ్రామ దేవత ఎల్లమ్మతల్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. రామగిరి ఎంపీపీ ఆరెళ్ళి దేవక్క కొమురయ్య గౌడ్ దగ్గరుండి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి కరుణా కటాక్షములు గ్రామ ప్రజలకు ఎల్లవేళల అందాలని కోరినట్లు తెలిపారు. ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండాలని సర్వాయి పాపన్న గౌడ్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని గీత కార్మికులంతా ఒకే తాటి మీదికి రావాలని పార్టీలకు అతీతంగా గౌడ్ అంటే సర్వాయి పాపన్న సాసాలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవుని రజిత శ్రీనివాస్, గౌడ సంఘ0 అధ్యక్షులు ఆరెల్లి శ్రీనివాస్ గౌడ్, సిరి శెట్టి, అశోక్, కోయడ కిషోర్ గౌడ్, పూదరి శ్రీనివాస్ గౌడ్ గ్రామంలోని ప్రజలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం మరిచారు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం మరిచారు..

మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

హాథ్ సే హాథ్ జోడో యాత్ర లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ అక్కన్నపేట్ మండలంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి చేపట్టిన పల్లె పల్లె కు గడప గడప కు ప్రవీనన్న కాంగ్రెస్ కార్యక్రమం ఆదివారం అంతక్ పేట్ లో మహిళలు,  గ్రామస్తులు ప్రవీణ్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు.. మొదటగా ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం పట్టించు కోవడం లేదని, తానూ రైతేనని ముఖ్యంగా హుస్నాబాద్ ప్రాంత రైతాంగం బాధలు తనకు తెలుసు అని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో మాత్రమే రైతులకు సరైన న్యాయం జరిగిందని స్థానీకేతరుడైన ఎమ్మెల్యే కు ఇక్కడి రైతుల గోస పట్టడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లోనే గౌర వెళ్ళి ప్రాజెక్టుకు శంఖు స్థాపన చేశారని, ప్రాజెక్టు పూర్తి చేయక పోగా ఇటు భూ నిర్వాసితులకు సైతం సరైన న్యాయం చేయలేదని, పేద వానికి సంక్షేమ ఫలాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి తీసుకు రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాం లో జరిగిన అభివృద్ధి తప్ప.ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ధాన్యం కొనుగోలు విషయం లో తేమ పేరు మీద తరుగు తీసి మిల్లర్లు రైతుల పొట్ట కొడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ఏక కాలంలో రూ. 2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తాం అని, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం చేస్తామని రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పించన్ రూ.5000 ఇస్తామని, అధికారం లోకి వచ్చిన మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల సాయం, భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు రూ.12 వేల సాయం అందిస్తామని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ అధికారం లోకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన సోనియా గాంధీ ఋణం తీర్చు కోవాలని కోరారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కేడం లింగ మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బోలిషెట్టి శివయ్య, అక్కన్నపేట మండల పార్టీ అధ్యక్షులు జంగపల్లి అయిలయ్య, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక చందు, కోహెడ మండల పార్టీ అధ్యక్షులు మంద ధర్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పాందరాల దామోదర్,ఎస్సీ సెల్ ఆకునూరి వెంకట్రాజం,బిక్యా నాయక్, హుస్నాబాద్ కౌన్సిలర్లు వల్లెపు రాజు, పున్న లావణ్య సది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, లీగల్ సెల్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, లీగల్ సెల్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ

హుస్నాబాద్ యదార్థవాది

మహిళలు స్వశక్తితో ఎదగాలని మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సెషన్ జడ్జ్ టి. రఘు రామ్, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి స్వాతి రెడ్డి,
సర్పంచ్ పేరియాల నవ్య ప్రభుత్వం అందించిన మూడు నెలల కుట్టు శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న వారి కి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యం లో మహిళలకు కుట్టు మిసిషన్లు సర్టిఫికేట్ ను ప్రధానం చెయ్యడంతో పాటు న్యాయ సేవల గూర్చి వారు వివరిస్తూ స్త్రీలు అన్ని రంగాలలో ముందుండాలని, ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయ్యులని నిరుపేద కుటుంబంలో అమ్మాయిలు ఎదగాలన్నారు.. సర్పంచ్ మాట్లాడుతూ మహిళలూ తమ ఆదాయాన్ని పెంపొందించే విధంగా కుట్టు మిషన్లు దోహదపడుతయని, లీగల్ సర్వీసెస్ ను కూడా ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మెన్
పెర్యాల దేవేందర్ రావు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మహమ్మద్ వికార్ బాబా, బీఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

చెరువులు నీటితో కలకలాడితే రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతం: జిల్లా కలెక్టర్

చెరువులు నీటితో కలకలాడితే రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతం: జిల్లా కలెక్టర్

గజ్వేల్ యదార్థవాది

జిల్లాలో రిజర్వాయర్ ద్వారా చెరువులకు నీరు అందించడానికి కావలసిన కాలువల భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..
గజ్వేల్ ఐఓసీలో శనివారం నీటిపారుదల, రెవెన్యూ అదికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.. సమావేశం లో జిల్లా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికి పెద్ద ఎత్తున రిజర్వాయర్లు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేశారని జిల్లాలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్, తపాస్ పల్లి రిజర్వాయర్
ల నుండి కాలువల ద్వారా ప్రతి చెరువు నీటిని నింపడానికి కావలసిన భూసేకరణ మండలాల వారిగా అధికారులతో చర్చించారు. భూసేకరణలో రెవెన్యూ, సర్వేయర్ ల పాత్రఅని ప్రతి గ్రామంలో ఏ ఒక్క చెరువు కుడా ఎండకుండా ఎండాకాలంలో సైతం నీటితో కలకలాడితే రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్లంఅవుతమని అన్నారు.
గ్రామాల్లో మండల తహసీల్దార్, సర్వేయర్లు ఆర్డీఓల సహకారంతో కాలువల భూసేకరణ ప్రక్రియ వేగవంతం పూర్తి చెయ్యాలని, సర్వేయర్ అందించిన భూసేకరణ సంబంధిత ఇరిగేషన్ అనుమతులను వెంటనే తహశీల్దార్ లకు అందించిన వెంటనే రైతులకు నష్ట పరిహారం అందజేసి భూమిని ఆధీనంలోకి తీసుకోవాలి. ఈ పక్రియ యుద్ధ ప్రాతిపదికన జరగాలి. అధికారులు పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడబోమని తెలిపారు. కాలువలకు భూమిని కోల్పోయిన రైతులు అధైర్య పడవద్దని మంచి నష్ట పరిహారం ఇప్పిస్తామని తెలపాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి అవరోధాలు ఎదురైన పక్కా ప్రణాళికతో పకడ్బందీగా పూర్తి చెయ్యలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏప్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట, గజ్వేల్ ఆర్డిఓలు రమేష్ బాబు, విజేందర్ రెడ్డి, గడా అధికారి ముత్యం రెడ్డి, గజ్వేల్ ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వేణు, ఎడి సర్వేల్యాండ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నగరంలో నకిలీ ఐటి అధికారుల హల్ చల్.?

నగరంలో నకిలీ ఐటి అధికారుల హల్ చల్.?

సికింద్రబాద్ యదార్థవాది

రోజు రోజుకు పెరిగి పోతున్న నకిలీ అధికారులు శనివారం మోండా మార్కెట్ పిఎస్ పరిధిలో నకిలీ ఐటి అధికారుల హల్ చల్ చేశారు..

హర్ష జ్యువలరీ షాప్ లో ఐటి అధికారులమని చెప్పి రెండున్నర కిలోల బంగారాన్ని దోచేసి పరారైన కేటుగాళ్లు..

ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పి నలుగురు వ్యక్తులు తనిఖీలు చేపట్టి బంగారం తీసుకెళ్లినట్లు మోండా మార్కెట్ పి ఎస్ లో ఫిర్యాదు చేశారు.

సైబర్ నేరాలను నివారించ వచ్చు: జిల్లా ఎస్పీ అఖిల్

సైబర్ నేరాలను నివారించ వచ్చు: జిల్లా ఎస్పీ అఖిల్

-సైబర్ నేరాలకు గురైతే టోల్ ఫ్రీ 1930కు, డయల్ 100 చేయాలి

సిరిసిల్ల యదార్థవాది

సమాజంలో ప్రతి వ్యక్తి రెండు (ఆశ, భయం) అంశాలపై నియంత్రణ ఉండాలని, దీనివల్ల సైబర్ నేరాలను తగ్గించవచ్చని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.. అదునతన టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారాన్ని మనం వాడే పోన్ లో మనకు తెలియకుండానే మనం మన ఎప్పుడో అవసరం వుంది కదా అని సామాజిక మాధ్యమాలలో పెట్టుకుంటాం అదే అదునుగా భావించి దొంగిలిస్తున్నరని ఆయన అన్నారు. మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఫోన్, మెసేజ్, మెయిల్స్ ఓపెన్ చేయవద్దని, సోషల్ మీడియా లో వచ్చే నకిలీ జాబ్ నోటిఫికేషన్లు నమ్మి మోసపోవద్దని, తక్కువ సమయంలో డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశ,నమ్మకంగా స్నేహం చేసి వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నయని, మన బలహీనతే సైబర్ నేరగాళ్ల బలం అని మనం అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చునీ అన్నారు.. ఏదైన సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే బాధితులు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్, www.cybercrime.gov.in లో సమాచారం ఇవ్వాలని ఈ విషయం జిల్లా ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్ పై అవగాహన కల్పించేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో పట్టణాలలో విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, అంతే కాకుండా జిల్లా పరిధిలో ప్రతి రోజు ఏ రకమైన సైబర్ నేరాలు జరుగుతున్నాయో మళ్ళీ అట్టి నేరాలు పురావృత్తం కాకుండా పత్రిక ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు.

మంచి వైపు మనిషి అడుగు వేయాలి

మంచి వైపు మనిషి అడుగు వేయాలి

-అడిషనల్ డీసీపీ మహేందర్

సిద్దిపేట యదార్థవాది

సమాజంలో స్త్రీ, పురుష, కుల, మత భేదాలకు అతీతంగా అందరూ సమానమేనని గుర్తించాలని సిద్ధిపేట అడిషనల్ డి సి పి మహేందర్ అన్నారు… శుక్రవారం షాప్ స్వార్డ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఎస్సై లకు, సిఐ లకు జెండర్ సెన్సీటైజేషన్ పై ఒక రోజు వర్క్ షాప్ కు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణకు రూపొందించిన అన్ని చట్టాలను గౌరవించడంతోపాటు ఇతరులు కూడా గౌరవించేలా శక్తివంచన లేకుండా కృషి చేయాలని తెలిపారు. ప్రతీ పౌరుడు
బాధ్యతాయుతంగా మెలగడానికి మనిషికి ఉండవలసిన లక్షణాలు మానవత్వం నిజాయితీ నిష్పక్షపాతం క్రమశిక్షణగా ఉంటూ అనుకున్న లక్ష్యాలు సాధించాలని, మంచి పనులు చేయడానికి మాత్రమే ముందుండడం ఇతరుల పట్ల గౌరవంగా ఉండడం నమ్మకాలను పెంపొందించు కోవడంలో
బాధ్యతాయుతమైన భావాలను కలిగి ఉండడం సమాజ కోసం పాటుపడే ఒక వ్యక్తి వ్యక్తిలా ఉండడం అంశాల గురించి వివరించారు. మహిళలకు సంబంధించిన కేసులలో స్నేహిత, సఖీ, భరోసా సెంటర్ యొక్క సేవలు మహిళలకు తెలపాలని, మహిళలు గృహహింసకు గురైతే, బయట వేధింపులకు గురైతే వెంటనే స్నేహిత కు సమాచారం అందించేటట్లు చేసి కౌన్సెలింగ్ ద్వారా కాపురాలు నిలబెట్టవచ్చని అన్నారు.. స్నేహిత హెల్ప్ లైన్ నెంబర్ 9494639498 అధికారులందరూ అందుబాటులో ఉంచుకోవాలని మహిళలకు ఏవైనా సమస్యలు ఉంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ ఫోన్ చేసి వారి సహాయం పొందవచ్చని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందని, మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ సీఈవో శివకుమారి మాట్లాడుతూ ఆడ మగ వివక్ష లేకుండా పిల్లలను పెంచాలని, నేటి తరం స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి, దుబ్బాక సీఐ కృష్ణ, గజ్వేల్ ట్రాఫిక్ సిఐ తిరుపతి, సిసిఎస్ సీఐ సంజయ్, ఎస్బి ఇన్స్పెక్టర్ తిరుపతి, హుస్నాబాద్ సీఐ కిరణ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, సిసిఆర్పి ఇన్స్పెక్టర్ గురుస్వామి, ఎస్సై లు పాల్గొన్నారు.

అభివృద్ధిపై డాక్యుమెంటరీ..

అభివృద్ధిపై డాక్యుమెంటరీ..

సిద్దిపేట యదార్థవాది

సిద్దిపేట శాసనసభ్యులు మంత్రి హరీష్ రావు చేసిన అభివృద్ధిపై తెలంగాణ డాక్యుమెంటరీ.. సిద్దిపేట నియోజకవర్గం పలు గ్రామాలలో చిత్రీకరిస్తున్న సందర్భముగా సిద్దిపేట మండలం ఇరుకోడు, సిద్దిపేట అర్బన్ పరిధి ఎన్సాంపల్లి గ్రామాలలో తెలంగాణ డాక్యుమెంటరీ తీయడము ఎంతో గర్వంగా ఉందని ఎల్సంపల్లి గ్రామ సర్పంచ్ బొల్లం రవీందర్ గౌడ్ అన్నారు. గ్రామంలోని మహిళలు బతుకమ్మ పండుగ వేడుకలను చిత్రీకరించడం ఎంతో గర్వంగా ఉందని మహిళలు తెలిపారు.. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట పలు ప్రాంతాల్లో తీయడం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుగా ఉందని తెలియజేయడానికే సర్పంచ్ బొల్లం రవి వైస్ చైర్మన్ అల్లం ఎల్లం ఎంపిటిసి తదితరులు తెలిపారు.

అందత్వ నివారణ మన లక్షం..

అందత్వ నివారణ మన లక్షం..

గజ్వేల్ యదార్థవాది

కంటి వెలుగు కార్యక్రమం చారిత్రాత్మకమని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు..సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డ్ లో శుక్రవారం స్థానిక జిడిఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రిక కంటి వెలుగు చరిత్రలో నిలిచిపోతుందని దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చి అందత్వ నివారణ కోసం నిరుపేదల కళ్ళల్లో వెలుగులు నింపడానికి కంటి వెలుగు కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మండు వేసవిలో చెరువులు నిండుకుండల కళకళలలాడుతు కాలేశ్వరం ప్రాజెక్టుతో నీటి గోస తీర్చిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కిందని రాబోయే రోజుల్లో బి ఆర్ ఎస్ పార్టీ భారత దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజలకు సుపరిపాలన అందించడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా యువజన అధ్యక్షులు ఎన్సీ.సంతోష్ గుప్తా,18వ వార్డ్ బీఆర్ఎస్ అధ్యక్షులు గొంగల్ల శ్రీను, శ్రీధర్, అమరేందర్, కొమురవెల్లి ప్రవీణ్, రాజారామ్, మెడికల్ ఆఫీసర్స్, మెప్మా సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...