26.7 C
Hyderabad
Wednesday, April 22, 2026

ప్రతిష్టాత్మకంగా దశాబ్ది ఉత్సవాలు

ప్రతిష్టాత్మకంగా దశాబ్ది ఉత్సవాలు

ఆర్మూర్ యదార్థవాది

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దశాబ్ది ఉత్సవాలు
జూన్ 2 నుండి 22వ తేదీ వరకు, జరగబోయే కార్యక్రమాలు, విధి విధానాలను పకడ్బందీగా రూపకల్పన చేసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రజా ప్రతినిధులతో, ప్రజలతో మమేకమై దశాబ్ది ఉత్సవాలను విజయవంతం అయ్యే విధంగా కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పొందిన లబ్ధిదారుల సైతం భాగస్వామ్యం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో యంపిడిఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇసుక రవాణాను నిలిపివేయాలి

ఇసుక రవాణాను నిలిపివేయాలి

-అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

నిజామాబాద్ యదార్థవాది

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఖండ్గాం గ్రామంలో అక్రమ ఇసుక రవాణా గురించి ఏదైతే పర్మిషన్ లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా అధిక మొత్తంలో టిప్పర్ లోడింగ్ మా గ్రామం నుంచి వెళ్లడం జరుగుతుందని, 12 టైర్ల లారీలు అంబేద్కర్ విగ్రహం నుండి వెళ్లడం వలన విగ్రహం వునికికే ప్రమాదమని దీనిపై మండల తహసిల్దార్, ఆర్డీవో కి వినతిపత్రం ఇచ్చినప్పటికీ నేటికీ చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం అంబేద్కర్ విగ్రహానికి కే వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అధికారులు ఉండి కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ఇటువైపు దృష్టి పెట్టకుండా ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఈ యొక్క అక్రమ ఇసుక రవాణా జరగనివ్వకుండా కట్టడి చేస్తారని కోరుతున్నాం ఇంతటితో ఆపకపోతే ఎందాకైనా పోతామని మంజీరా నుండి అక్రమ ఇసుక రవాణా జరగనివ్వకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు అలాగే అంబేద్కర్ విగ్రహానికి అధిక మొత్తంలో టిప్పర్లు వెళ్లడం వలన అంబేద్కర్ విగ్రహానికి డ్యామేజ్ కావడం జరిగింది. దీనిపై కూడా దృష్టి వహించి దీనిపై ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఖండ్గాం గ్రామ యువకులు మీసాలే నాగేష్, అశోక్, నరసింహ, దిక్శాంత్, పిరాజి చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు..

కాలువలో మునిగిన యువకుడి మృతదేహం వెలికితీత

కాలువలో మునిగిన యువకుడి మృతదేహం వెలికితీత

బాల్కొండ యదార్థవాది

నిజామాబాద్ జిల్లా బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ నగర్ గ్రామంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువలో మంగళవారం మునిగిన సాయిరామ్ బుధవారం పోలీసులు గజగీతగాళ్లతో వెలికి తీయించారు. కాలువలో పడి చనిపోయిన సాయిరాం శవాన్ని వెలికి తీయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు కొద్దిసేపు NH63 జాతీయ రహదారిపై రాస్తారో నిర్వహించారు. బాల్కొండ తహసిల్దార్ వినోద్, ఆర్మూర్ రూరల్ సిఐ గోవర్ధన్ రెడ్డి, బాల్కొండ ఎస్సై గోపి, తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకుని విరమించేశారు. పోచంపాడు నుండి గజ అయితే గాలను రప్పించి శవాన్ని వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం అని ఎస్సై గోపి తెలిపారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్ నమోదు చేస్తాం..

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్ట్
నమోదు చేస్తాం..

-విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి.

-విత్తనాల ఉత్పత్తి కేంద్రాన్ని తనిఖీ చేసిన. పోలీస్ కమీషనర్, వ్యవసాయ శాఖ అధికారి

కరీంనగర్ యదార్థవాది ప్రతినిది

రైతులు నాణ్యత ప్రమాణాలు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని, విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు… కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో మానకొండూరు కేంద్రంలో నూజివీడు విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిల్వ ఉంచిన విత్తనాలతోపాటు ప్యాకింగ్ తీరును విత్తనాల నిల్వల రికార్డులను తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పంటల దిగుబడిలో ఎలాంటి నష్టాలకు గురవ్వకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం పోలీస్ కమీషనర్ విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని తనిఖీ చేశారు. గత సంవత్సరం ఈ కేంద్రం నుండి విత్తనాలను కొనుగోలు, దిగుబడుల ఎలా వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విత్తన ఉత్పత్తి కేంద్రాల నిర్వాహకులు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని, కాలం గడువు ముగిసిన విత్తనాలను విక్రయించకూడదన్నారు. రైతులు దిగుబడి సాధనలో సఫలీకృతమయ్యేందుకు ప్రభుత్వం రైతులకు భద్రత కల్పిస్తూ నాణ్యమైన విత్తనాలు మాత్రమే వారికి అందజేయాలనే ఉద్దేశంతో పలు పగడ్బందీ చర్యలను తీసుకున్నదని తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సందర్భంలో సదరు కంపెనీలకు చెందిన విత్తనాల నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలని, ఏవైనా అనుమానాలు ఉన్నట్లయితే సంబంధిత వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు పంటల సాగులో ఎలాంటి నష్టాలకు గురవ్వకుండా ఉండేందుకు పోలీసు, వ్యవసాయ, రెవెన్యూశాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసేపోయే బదులు పంటల సాగు ప్రారంభంలో నిపుణులను సంప్రదించి వారి సూచనల ప్రకారం కొనుగోలు చేసి అధిక దిగుబడులను సాధించాలని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహార మందులను విక్రయించే వ్యాపారులు, మధ్యదళారీలు, ఏజెన్సీల నిర్వాహకులపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తీవ్రతను బట్టి పిడియాక్ట్ లను అమలు చేస్తామని, నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించే వారికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఏసిపి ఫోన్ నెంబర్ 87126 70760, ఇన్స్పెక్టర్ నెంబర్ 87126 70708 లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచి నగదు పారితోషికాన్ని అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, జిల్లా టాస్క్ ఫోర్స్ ఏసిపి విజయసారధి, ఇన్స్ పెక్టర్లు సృజన్ రెడ్డి, యం రవి కుమార్, మానకొండూరు ఇన్స్ పెక్టర్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

సరికొత్త అధ్యాత్మిక శోభ..

సరికొత్త అధ్యాత్మిక శోభ

– సుందరంగా ముస్తాబైన వేములవాడ నంది కమాన్ కూడళి

– అభివృద్ధి చేసిన కూడలి ఫోటోల ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన మంత్రి కే టి ఆర్

సిరిసిల్ల యదార్థవాది

నంది కమాన్ కూడళి, కొండగట్టు జంక్షన్ ను జిల్లా కలెక్టర్ మార్గదర్శనం మేరకు మున్సిపల్ అధికారులు సుందరంగా ముస్తాబు చేశారు..

ఇటీవలే అభివృద్ధి చేసిన నంది కమాన్ కూడలి ఫోటోల ను మంత్రి కే తారకరామారావు తన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం పోస్ట్ చేశారు..

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సరికొత్త అధ్యాత్మిక శోభ నంది జంక్షన్ మీకు స్వాగతం పలుకుతోంది.. అంటూ మంత్రి కే తారకరామారావు తన ట్విట్టర్, ఫేస్ బుక్ లో సదరు ఫోటోలను పోస్ట్ చేశారు..

గుడ్ జాబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి అంటూ మంత్రి కే తారకరామారావు అభినందించారు…..

అధైర్య పడొద్దు.. ఆందోళన అసలే వద్దు.. ప్రతి తడి గింజను ప్రభుత్వం కొంటుంది : జిల్లా కలెక్టర్

అధైర్య పడొద్దు.. ఆందోళన అసలే వద్దు.. ప్రతి తడి గింజను ప్రభుత్వం కొంటుంది : జిల్లా కలెక్టర్

సిరిసిల్ల యదార్థవాది

అన్నదాతలు అధైర్య పడొద్దని, తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి భరోసాను ఇచ్చారు..
మంగళవారం వేకువ జామున కురిసిన అకాల వర్షానికి కొన్ని చోట్ల ధాన్యం తడిసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. రైతుల్లో నెలకొన్న ఆందోళనను అర్థం చేసుకుని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని ప్రకటించారు..

ఉద్యోగాల పేరిట యువతను మోసగిస్తున్న ముఠా అరెస్టు !

ఉద్యోగాల పేరిట యువతను మోసగిస్తున్న ముఠా అరెస్టు !

కరీంనగర్ యదార్థవాది

నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరిట గాలం వేసి వారి నుండి లక్షల రూపాయలు దండుకుంటున్న, యువతను నిలువునా ముంచి, ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాను కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.. మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన మందల భాస్కర్ పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గంగారపు మధుమూర్తి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన బత్తిని వైకుంఠం మరో ఇద్దరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగ యువకులను ఉద్యోగం ఇప్పిస్తామని వారి వద్ద లక్షల రూపాయలు వసూలు చేసి ముఖం చాటేస్తున్నారు. వీరి వల్ల నష్టపోయిన బాధితుడు ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ శ్రీ నటేష్ నిందితుల, ముఠాను పట్టుకోవడానికి వారి కదలికలపై నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకునుటకు ఒక ప్రత్యేక బృందాన్ని ఎస్సై రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రత్యేక బృందం నిందితుల కదలికలపై నిఘా లో వారిని అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వారు తమ నేరాన్ని అంగీకరించారని, గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నామని తెలిపారన్నారు నిందితుల నుండి 93 వేల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, అరెస్టు చేసిన నిందితులు కోర్టులో హాజరు పరిచి విరి నుండి ఇంకా ఎంతమందిని మోసపోయారని, ఎంత మంది వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేశారనే విషయంపై లోతుగా విచారణ చేసి తదుపరిచర్యలకు ఉపక్రమించడం జరుగుతుందని తెలిపారు.

రన్నర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం

హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వెంకన్న అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చూశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, హాజరయ్యారు.
అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రస్తుత జీవన విధానంలో నడక, వ్యాయామం, పరిగెత్తడం ఒక భాగం కావాలని ప్రతినిత్యం పరిగెత్తడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు.
ఎస్బి ఎస్సై రఘుపతి రెడ్డి మాట్లాడుతూ పరుగు పందాలు నిర్వహించడం వలన ఆత్మసంతృప్తి పొందుతామే తప్ప ఎలాంటి లాభాపేక్ష ఉండదని, అందరి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి నిత్యం పరుగు పొందాలను నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. రాష్ట్ర, జాతీయ దినోత్సవాలను పురస్కరించుకొని, మహనీయుల పుట్టినరోజులను, వివిధ సందర్భాలను పురస్కరించుకొని నిత్యం పరుగు పందాలను నిర్వహించి, యువతను ప్రోత్సహించాలని నిర్వాహకులను కోరారు. అనంతరం హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల వెంకన్న మాట్లాడుతూ నిత్యం పరిగెత్తడం వలన ఆరోగ్యంతో పాటు, ఏకాగ్రత పెరిగి, సత్ప్రవర్తన అలవాటు ఉంటుందని తెలిపారు. హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో రన్నర్స్ అసోసియేషన్ ను మరింత అభివృద్ధి పరుస్తానని,
హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్లో సభ్యత్వం పొందాలంటే 200 రూపాయలు చెల్లించాలని, చెల్లించిన ప్రతి వారికి హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ వ్యక్తిగత పేరుతో టీ షర్టును అందజేయడం జరుగుతుందని తీర్మానించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జూన్ 1వ తేదీన పరుగు పందెం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అమ్మిగల్ల రమేష్, వెంకన్న, డాక్టర్ ధర్మ, చింతకింది శ్రీనివాస్, మహేందర్, తిరుపతి నాయక్ నారాయణరెడ్డి, రామకృష్ణ, లక్ష్మణ్ నాయక్, బాబు, రాజేష్ సంజీవ్, నరేష్, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి కేంద్రాలు. గ్రామపంచాయతీ భవనాలు

అభివృద్ధి కేంద్రాలు. గ్రామపంచాయతీ భవనాలు

-గోవర్ధనగిరి గ్రామ గ్రామపంచాయతీ భవనం ప్రారభించిన ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఈరోజు 16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవర్ధనగిరి గ్రామంలో ఎంతో ప్రాశస్త్యంగల సంజీవరాయ గుట్ట ఉన్నదని కోరిన కోరికలు తీర్చే దేవుడు సంజీవరాయ దేవుడని అన్నారు రానున్న కాలంలో తలాపున గౌరవెల్లి, సంజీవరాయ గుట్టతో గోవర్ధనగిరి గ్రామం మంచి పర్యాటక స్థలంగా మారనున్నదని, గోవర్ధనగిరి గ్రామంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని హుస్నాబాద్ సభలో మంత్రి కేటీఆర్ ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రామం యొక్క సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రచించే కేంద్రాలు గ్రామపంచాయతీ భవనాలని ప్రతి గ్రామానికి గ్రామపంచాయతీ భవనం గుండెకాయ లాంటిదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి పంచాయతీ భవనాలు పంచాయతీ గ్రామనిర్వహణ కోసం ట్రాక్టర్లు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, సిసి రోడ్లు మురుగునీటి కాలువలు, సామాజిక భవనాలు, విద్యాలయాలు ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, సీఎం కేసీఆర్ అన్నట్టు పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలని, పల్లెలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అందుకోసం సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు నిర్వహిస్తూ దేశంలో ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని, బొడిగపల్లె నుండి గోవర్ధనగిరి గ్రామం మీదుగా బంజేరుపల్లి వరకు రోడ్డు నిర్మాణం, బతుకమ్మ ఘాట్ నిర్మాణం, దుర్గమ్మ గుడి నిర్మాణం చేపడుతామని ఎమ్మెల్యే తెలిపేరు. గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు,బీఅర్ఎస్ కార్యకర్తలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభోత్సవం చేయించేదుండే..

పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభోత్సవం చేయించేదుండే..

-ఎన్నికల హామీలు అమలు చేయని కెసిఆర్ ప్రభుత్వం

-సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

భారత పార్లమెంటును నూతన భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభోత్సవం చేయించేదుండేనని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సూచించారు.
సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతు ఈడి, ఐటి అధికారుల చేత దాడులు చేయిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని ఇది సరైంది కాదని చాడ ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించడానికి అనేక పధకాలను ప్రకటిస్తూ గద్దెనెక్కినంక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మెసం చేస్తున్నారని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కెసిఆర్ ఎన్నికల హామీలను అమలు పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు, నిరుద్యోగ భృతి, 57 ఏండ్లకే ఫించడ్లు పధకాలను అమలు చేసేంతవరకు సిపిఐ ప్రజా పోరాటాలను కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు.
జూన్ 4న కొత్తగూడెంలో నిర్వహిస్తున్న సిపిఐ గర్జన విజయవంతం చేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎంపిపి గడిపె మల్లేశ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేష్, జాగీర్ సత్యనారాయణ, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బద్దిపడగ రాజారెడ్డి, అయిలేని సంజివరెడ్డి, ఏగ్గొజు సుదర్శన్ చారి, కొహెడ కొమురయ్య,
ననువాల ప్రతాప్ రెడ్డి, బైరగొని సరోజన, చిగురుమామిడి సిపిఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, కోహెడ మండల కార్యదర్శి ముంజ గోపి, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాల్లు గూడెం లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ,ఏలురి స్వాతి,సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి,పోదిల కనకస్వామి, ఇజ్జగిరి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...