29.7 C
Hyderabad
Wednesday, April 22, 2026

క్షేత్ర స్థాయిలో రైల్వే ట్రాక్ పనులు పరిశీలించిన. మంత్రి హరీష్

క్షేత్ర స్థాయిలో రైల్వే ట్రాక్ పనులు పరిశీలించిన. మంత్రి హరీష్

– సిద్ధిపేటకు తొందరలో రైలు వచ్చేలా యుద్ధప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయలి.

– రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా, పనుల వేగం పెంచాలి.

సిద్ధిపేట యదార్థవాది

సిద్ధిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైను పనులను క్షేత్ర స్థాయిలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్ లతో పరిశీలించారు.. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మనోహరాబాద్‌ నుండి కొత్తపల్లి వరకు 151.4 కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ పనులు జరుగు చున్నాయని, మనోహారబాద్‌ గజ్వేల్‌ వరకు 32 కిలోమీటర్ల రైల్వే లైన్‌ పనులు పూర్తయ్యాయి గజ్వేల్ వరకూ రైలు రావడం, రైతులకు మేలు జరిగేలా రేక్ పాయింట్ ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయని, గజ్వేల్‌-దుద్దెడ వరకు 32.1 కిలో మీటర్లు సైతం ట్రాక్ నిర్మాణం పూర్తయ్యిందని అన్నారు. కుకునూరుపల్లి-దుద్దేడ మధ్య రైల్వే శాఖ అధికారులు ట్రయల్ రన్ చేశారని, దుద్దెడ-సిద్ధిపేట మధ్య ఎర్త్‌వర్క్‌కూడా పూర్తయ్యిందని, దుద్దెడ-సిద్ధిపేట-సిరిసిల్ల 48.65 కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మాణ పనులు పురోగతితో శరవేగంగా జరుగుతున్నాయని, వీటిలో దుద్దెడ-సిద్ధిపేట రైల్వే స్టేషన్ వరకూ రైల్వే ట్రాక్ దాదాపు పూర్తయ్యిందని అన్నారు. ఇకమిగిలింది సిద్ధిపేట-సిరిసిల్ల నుంచి కొత్తపల్లి వరకు 38.6 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ పనులు చేపట్టాల్సి ఉన్నదని తెలిపారు.
దుద్దెడ నుండి సిద్ధిపేట వరకు ట్రాక్‌ నిర్మాణ పనులు పూర్తయి మరో 60 రోజులలో సిద్ధిపేట రైల్వే స్టేషన్‌ వరకూ రైల్వే సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహణ ఉంటుందని, ఈ క్రమంలో సిద్ధిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ నిర్మాణ పనులకు రూ.500 కోట్లు కేటాయింపు చేసినట్లు టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందని, సిద్ధిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ పనులు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్ధన్ బాబు, సిద్ధిపేట ఆర్డీఓ రమేశ్ బాబు, ఇతర అధికార యంత్రాంగం పాల్గొన్నారు..

దశాబ్ది ఉత్సవాలను పెద్ద పండగల నిర్వహించాలి..

దశాబ్ది ఉత్సవాలను పెద్ద పండగల నిర్వహించాలి..

– 2 నుంచి 22 వరకు జరిగే దశాబ్ది ఉత్సవాలను ప్రజలు ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించాలి.

దౌల్తాబాద్ యదార్థవాది

దశాబ్ది ఉత్సవాలను అన్ని గ్రామాల్లో
ఈ నెల 2 నుంచి 22 వరకు ప్రజలంతా పండగ వాతావరణంలో నిర్వహించాలని ఎంపీపీ గంగాధరి సంధ్య అన్నారు.. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాజేష్ కుమార్ అధ్యక్షతన దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ 33 జిల్లాలుగా చేసి ప్రజల ముంగిట్లో పరిపాలన సౌలభ్యం చేశారని, కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు అందుతున్నాయని, దేశం చూపు తెలంగాణ వైపే ఉందని అన్నారు. దశాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసి దశాబ్ది ఉత్సవాలను గ్రామాల్లో పండుగ వాతావరణం లో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యులు రహిమొద్దిన్, ఐకెపి ఎపిఎం కిషన్, ఎం పి ఓ సయ్యద్ గఫూర్, వైస్ ఎంపీపీ అల్లిశేఖర రెడ్డి, మండలంలోని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష సమావేశం..

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష సమావేశం..

దుబ్బాక యదార్థవాది

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై పురపాలిక కార్యాలయంలో బుధవారం కౌన్సిలర్లు పురపాలిక అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన చైర్పర్సన్ గన్నె వనితా భూమి రెడ్డి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు దాదాపు 20 రోజులపాటు జరగనున్నాయని, జూన్ రెండు నుంచి జూన్ 22 వరకు జరిగే ఈ దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పురపాలిక కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి కౌన్సిలర్లు కూరపాటి బంగారయ్య, ఆశ యాదగిరి దుబ్బాక బాలకృష్ణ మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రమకు దక్కిన సన్మానం

శ్రమకు దక్కిన సన్మానం

ఆర్మూర్ యదార్థవాది

ఆర్మూర్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు సుంకేట గంగు పదవీ విరమణ చేశారు.. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్, కమిషనర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికురాలిని సుంకేట గంగు ను ఘనంగా సన్మానించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల యొక్క కృషి వారి గొప్పతనాన్ని వేలకట్టలేమని, వారు మనకోసం వారి జీవితాలను ఉదయం నుండి సాయంత్రం వరకు పని జసే తప్ప వేరేలోకం ఉండదని, ఇప్పుడైనా వారి కుటుంభంతో గడపాలని అన్నారు. కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ శేఖర్ జేఏవో విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది తోటి కార్మికులు తదితరులు పాల్గొన్నారు..

ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన

ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన

సిద్దిపేట యదార్థవాది

తెలంగాణ అవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పనులను క్షేత్ర స్థాయిలో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జూన్-2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మైదానంలో స్టేజి, వేడుకలను నలుమూలల తెలిపేలా ప్లేక్సిలు, మైదానంలో ఏల్ మాదిరిగా విఐపి కారిడార్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వేడుకలను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులు అందరికి సరిపడే గాలరీ లను నిర్మించాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. అందరికి సరిపడే తాగునీటి వసతి కల్పించాలని స్థానిక తహసిల్దార్ విజయసాగర్ కి తెలిపారు. రంగథాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద చుట్టూ కలర్లు వేసి, పూలతో అందంగా ముస్తాబు చెయ్యాలని మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్ కు తెలిపారు. మైదానంలో పరేడ్, బందోబస్తు, కార్ పార్కింగ్ లాంటి విషయాలను చూసుకోవాలని పోలిస్ అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్ కు సుశించారు. ఎలాంటి పోరపాట్లు జరగకుండా అందరి సమన్వయంతో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లను చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

ఛాయాచిత్ర ప్రతిభకు ప్రశంసా పత్రాన్ని అందించిన. జిల్లా కలెక్టర్..

ఛాయాచిత్ర ప్రతిభకు ప్రశంసా పత్రాన్ని అందించిన. జిల్లా కలెక్టర్..

జగిత్యాల యదార్థవాది

జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ మండలోజు శ్రీనివాస్ తన ఛాయాచిత్ర ప్రతిభకు. ఆర్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ కలకత్తా వారు అందించిన ప్రశంసా పత్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాష, జిల్లా ఎస్పీ భాస్కర్ చేతులమీదుగా అందుకున్నారు. శ్రీనివాస్ తీసిన ఫోటోలను చూసి కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఫోటోగ్రఫీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ పాల్గొన్నారు..

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా!

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా!

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లకు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు.. ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మను పార్టీ శ్రేణులతో కలిసి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన సమవేశంలో మాట్లాడుతూ తెలంగాణ సాధించుకొని తొమ్మిదేళ్లు గడుస్తున్న ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణను సోనియా గాంధీ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరిందో లేదో గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేర్పుకై జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దశాబ్ద కాలంలో వందేళ్లు బ్రతికేంత ఆస్తులను కేసిఆర్ కుటుంబం సంపాదించుకుందని ఆరోపించారు. తెలంగాణ విభజన అప్పుడు ఉన్నటువంటి 60 వేల కోట్ల అప్పు, ఇప్పుడు ఆరు లక్షల కోట్లకు చేరి ప్రజలకు భారంగా మారిందే తప్ప, తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగళి అక్కడి లాగానే ఉందని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ అంటే ట్యాంక్ బండ్లు, రోడ్డు డివైడర్లు, స్ట్రీట్ లైట్లు తప్ప మరేమీ లేదన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పూదరి లక్ష్మీనారాయణ పిసిసి సభ్యులు కేడo లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు, కౌన్సిలర్ వల్లపు రాజు, విశ్వతేజ, ఆలయ అర్చకులు పరమేశ్వర శర్మ, సిబ్బంది రమేష్, కుమార్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

దశాబ్ది ఉత్సవాలు నింగినంటేలా నిర్వహించాలి: మంత్రి హరీష్

దశాబ్ది ఉత్సవాలు నింగినంటేలా నిర్వహించాలి: మంత్రి హరీష్

సిద్ధిపేట యదార్థవాది

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సిద్ధిపేట నియోజకవర్గంలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీష్ రావు ఆకాంక్షించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి ఆడిటోరియంలో బుధవారం నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని చాటేలా వేడుకలను సిద్ధిపేట జిల్లాలోని ప్రతి పల్లె, పట్టణాల్లో పండుగ వాతావరణంలో జరపాలన్నారు.- 21 రోజుల ఈ దశాబ్ది ఉత్సవాల పండుగలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ.. నాడు-నేడు సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించాలన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల పదవి కాలంలో విద్యుత్ సమస్యలపై ఖర్చులు చేశారు.. తప్ప ఏమీ లేదని గత అనుభవాలు వివరించారు. గతంలో బావులు అద్దెకు తీసుకుని ట్యాంక్ ద్వారా నీరు వ్యవసాయ బావులకు సరఫరా చేసేదన్నారు.. మహారాష్ట్రలో ఇప్పటికీ తాగునీరు సరఫరా ఇబ్బందులు ఉన్నాయని, పక్కరాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పాలన్నారు. మాతృశిశు మరణాలు తగ్గి దేశానికే ఆదర్శంగా నిలిచామని ఇవాళ 14వ స్థానం నుంచి 3వ స్థానంలో తెలంగాణ వైద్యం చేరుకున్నదన్నారు. నిజం ప్రచారం చేయక పోతే అబద్ధాలు రాజ్యమేలుతాయన్నారు. పంట కాలాన్ని ఒక నెల ముందుకు తీసుకు వద్దామణి, రైతుల్లో ఒక మార్పు తెద్దాం. రేపట్నుంచి ప్రతీ రైతు వేదికల్లో ప్రధానంగా చర్చ జరగాలన్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తాయని, ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు, యీ రోజు జరిగిన సాగు ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరిద్దామన్నారు. దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో జరిపేలా అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, అన్నీ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు.

అనాధ అమ్మాయి పెండ్లికి ఆసరాగా పుస్తె మట్టెలు

అనాధ అమ్మాయి పెండ్లికి ఆసరాగా పుస్తె మట్టెలు

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామంలో వేల్పుల అమ్ములు తండ్రి లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు మరణించడంతో జూన్ 1వ తేదీ రోజున వివాహ మహోత్సవం సందర్భంగా బుధవారం పెద్దమనుషుల సమక్షంలో గుండ ప్రభాకర్ ఆధ్వర్యంలో పుస్తె మట్టెలు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో కోహెడ విశాల పరపతి సొసైటీ డైరెక్టర్ గుండ తిరుపతి కానిశెట్టి రాములు టీటీడీపీ దళిత విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి చింతకింది సింగరయ్య కుల పెద్దమనిషి వేల్పుల పెద్దరాజయ్య వేల్పుల వెంకటయ్య మాజీ వార్డు సభ్యులు కనగండ్ల కుమార్ అంగన్వాడి టీచర్ కనగండ్ల ముత్యాలు వేల్పుల భాస్కర్, శ్రీనివాస్, కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సెట్ బ్యాక్ లేని నిర్మాణం పై చర్యలు తీసుకోండి

సెట్ బ్యాక్ లేని నిర్మాణం పై చర్యలు తీసుకోండి

దుబ్బాక యదార్థవాది

దుబ్బాక 20.వ వార్డు కొత్తరోడ్డులో చేపడుతున్న అక్రమ నిర్మాణం పై చర్యలు చేపట్టాలని వార్డ్ ప్రజలు మునిసిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. సెట్ బ్యాక్ లేకుండా చేపడుతున్న నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరారు. గల్లీలో కనీసం ట్రాక్టర్ అయినా వచ్చేలా నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...