29.7 C
Hyderabad
Wednesday, April 22, 2026

పేదలకు అందని సర్కారు వైద్యం

పేదలకు అందని సర్కారు వైద్యం.

– దశాబ్ది ఉత్సవాలల్లో
ప్రజా వైద్యంపై ఎమ్మెల్యేవి
పచ్చి అబద్ధాలు..

– సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజా వైద్యం అందరికి అందుబాటులో ఉందని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ పచ్చి అబద్ధాలు చెప్పారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హుస్నాబాద్ లొ ఉన్న 50 పడకల ఆసుపత్రిలో 50 పడకలు లేవని ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు అందరూ రోజు డ్యూటీకి రాకుండా సమయపాలన పాటించకుండ సక్రమంగా విధులకు రావడంలేదని డాక్టర్ లు వంతుల వారీగా డ్యూటీలు చేస్తున్నారని అనేక సార్లు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల, ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ దృష్టికి పోయిన ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కూడా ఎమ్మెల్యే దశాబ్ది ఉత్సవాల ప్రచారం కోసం ఆసుపత్రిలో రోగులకు సరిపడా మందులు, వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో హుస్నాబాద్ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైధ్యులను, వసతులు, రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అనువుగా ఉండేటట్లు ఎమ్మెల్యే సతీష్ కృషి చేయాలని గడిపె మల్లేశ్ కోరారు.

తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి..

తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి..

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

భారత చరిత్రలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన పల్లెప్రగతి దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు వెలుగొందుతున్నాయని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా జడ్పీ కార్యాలయంలో గురువారం జాతీయ పతాకావిష్కరణ చేసిన అనంతరం జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొత్త పంచాయితీ రాజ్ చట్టం తెచ్చి గ్రామ పంచాయితీ విధులు, నిధులు, బాధ్యతలు పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం , ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని అన్నారు. పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయని
సర్పంచులు, అధికారులు సమష్టిగా కృషిచేయడం వల్లనే మంచి ఫలితాలు వస్తున్నాయని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 20 ఉత్తమ గ్రామపంచాయతీలను ప్రకటిస్తే అందులో 19 పంచాయతీలు తెలంగాణ రాష్ట్రానికి చెందినవి కావడం మన కావడం గర్వకారణమని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా పరిషత్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ జడ్పిగా అవార్డుకు ఎంపికైందని, 255 గ్రామపంచాయతీలు, 13 మండలాలు ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా స్వచ్ఛ సర్వేక్షన్ లో వరుసగా మూడుసార్లు ఫోర్ స్టార్ రేటింతో తో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, జడ్పీటిసి లు, కొమిరిషెట్టి విజయ లక్ష్మణ్, గుగులోత్ కళావతి సురేష్ నాయక్, గుండం నర్సయ్య, జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

తుఫాన్ బీభత్సంతో విమానాల రాకపోకలకు అంతరాయం!

తుఫాన్ బీభత్సంతో విమానాల రాకపోకలకు అంతరాయం!

ముంబై యదార్థవాది ప్రతినిది

అరేబియా సముద్రంలో బిపార్జోయ్ తుపాను బీభత్సం సృష్టించడంతో ముంబైలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది..
తీవ్ర తుపానుగా మారిన బిపర్జోయ్ తుపాను తీవ్రత పెరగడంతో ముంబైలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయి వందలాది మంది ప్రయాణికులు తము ప్రయాణించే విమానాల కోసం గంటల తరబడి నిరీక్షించడంతో ముంబై విమానాశ్రయంలో ఆందోళన, గందరగోళం నెలకొంది. వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాలు రద్దవడంతో పాటు ఆలస్యమయ్యాయి. కొన్ని విమానాల ల్యాండింగ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. కాగా.. ఈ అసౌకర్యంపై కొందరు ప్రయాణికులు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడం, రన్ వేను తాత్కాలికంగా మూసివేయడంతో ముంబై నుంచి నడిచే కొన్ని విమానాలు ఆలస్యమవుతాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ముంబై విమానాశ్రయంలో రన్ వే 09/27ను తాత్కాలికంగా మూసివేయడం వల్ల కొన్ని కొన్ని విమానాలు ఆలస్యం అవుతాయి. మరి కొన్ని విమనాలు రద్దు అయ్యాయి. మా అతిథులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. అంతరాయాలను తగ్గించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము’’ అని ఎయిరిండియా ట్వీట్ చేసింది.

కేసీఆర్ పాలనలో అవినీతి ఎక్కువ: ప్రకాశ్ జవదేకర్

కేసీఆర్ పాలనలో అవినీతి ఎక్కువ: ప్రకాశ్ జవదేకర్

-2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయం.

-మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి 1 లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించాం.

-గత 70 ఏళ్లలో తెలంగాణలో 2 వేల కి.మీల మేరకు రోడ్లు నిర్మించింది.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

తెలంగాణలో రాష్ర్టంలో ప్రభుత్వ మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్ ఉందని కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు..
మోదీ 9 ఏళ్ల పాలనలో తెలంగాణలో రోడ్ల నిర్మాణానికి 1 లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించారని చెప్పారు. గత 70 ఏళ్లలో తెలంగాణలో 2 వేల కి.మీల మేరకు రోడ్లు నిర్మిస్తే… మోదీ 9 ఏళ్ల పాలనలో అంతకుమించి రోడ్ల పనులు ఈ కొనసాగుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మోదీ పాలనలో 50 వేల కి.మీల మేరకు రోడ్ల పనుల నిర్మాణం జరుగుతోందన్నారు. మహజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, దూది శ్రీకాంత్, రావు పద్మ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి హుస్నాబాద్ నియోజకర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామానికి విచ్చేశారు. ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆయన మాట్లాడుతూ ప్రజా సంగ్రామ యాత్రతో బండి సంజయ్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేశారని తెలంగాణలో ప్రభుత్వ మార్పు తీసుకొచ్చే సత్తా బండి మాత్రమే ఉందనే నమ్మకం నాకుందని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎట్లనో బండి సంజయ్ కూడా అట్లనే ఉన్నడని ఎంత పెద్ద పని కానీ మొదలు పెడితే పూర్తి చేసి తీరుతారని ప్రకాశ్ జవదేకర్ అన్నారు.. మోదీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయినందున మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చానని అందులో భాగంగా ఎల్కతుర్తి –సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించేందుకు సముద్రాలలో వచ్చానని, ఈ రహదారి పనులు పూర్తయితే సిద్దిపేట, హుస్నాబాద్, ముల్కనూర్, ఎల్కతుర్తి సహా 14 గ్రామాల ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.. కేసీఆర్ పాలనలో రోడ్ తక్కువ అవినీతి ఎక్కువని, 1948లో నిజాం పాలన నుండి తెలంగాణకు విముక్తి లభించిందని, 2 వేల 500 కిలోమీటర్లు మాత్రమే రోడ్ల పనులు జరిగితే మోదీ హయాంలో 9 ఏళ్లలోనే అంతకుమించి రోడ్ల పనులు జరిగాయని, బీజేపీ సర్కార్ అద్భుతంగా పనచేస్తుందని, మోదీ కేబినెట్ లో ఒక్క మంత్రిపై కూడా అవినీతి మచ్చ లేదని, లక్షా 9 వేల కోట్ల రూపాయలు తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఖర్చు చేసింది. 9 ఏళ్లలో 50 వేల కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల పనులు చేపట్టామని అన్నారు.. మస్కట్ నుండి వచ్చిన వ్యక్తి కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల కోసం రూ.14 వేలు ఖర్చు పెట్టారని మరి మీరెంత ఖర్చు చేశారు.. మీ అందరికీ మోదీ ఫ్రీగా వ్యాక్సిన్ డోసులను అందించారని మూడేళ్లపాటు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్న ఘనత మోదీదే. పీఎం ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2.4 లక్షల ఇండ్లు ఇచ్చింది. మరుగుదొడ్లు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది కేంద్రమే. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానని, ప్రతి ఒక్కరూ 8919847687 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీకి మద్దతు తెలపాలని కోరుతున్నా. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తంగిడి కృష్ణారెడ్డి, హనుమకొండ అధ్యక్షులు రావు పద్మ గుజ్జ సత్యనారాయణ, అసెంబ్లీ ప్రభారీ అసెంబ్లీ పాలక్ సంతోష్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి, కోహెడ మండల అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గన్నారు..

కరువుకు వీడ్కోలు.. చెరువులకు జల సిరులు: మంత్రి తన్నీరు

కరువుకు వీడ్కోలు..చెరువులకు జల సిరులు: మంత్రి తన్నీరు

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

కరువు కు వీడ్కోలు పలికి చెరువులను జలసిరులతో నింపిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ఎనలేని విధంగా పాటుపడిందని అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు గురించి మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసినా కేసులు వేయించిన ప్రభుత్వం ఎక్కడా తగ్గకుండా గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసిందని హుస్నాబాద్ కరువును శాశ్వతంగా పార ద్రోలిందని త్వరలో సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టును హుస్నాబాద్ నియోజకవర్గానికి అంకితం చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. నియోజవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 103 కోట్ల కల్యాణ లక్ష్మి, 695 కోట్ల ఆసరా పెన్షన్స్ 810 కోట్ల రైతుబంధు, 60 కోట్ల రైతు బీమా అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వివిధ లబ్ధిదారులకు.. కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజు 15 కోట్ల రూపాయలు విలువగల చెక్కులు పంపిణీ చేశారు, ‌ రెండవ విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు, గౌరవెల్లి ముంపు ఎస్టి బాధితులు 185 మందికి 8 లక్షల చొప్పున 14 కోట్ల 80 లక్షల రూపాయల విలువగల చెక్కులు పంపిణీ చేశారు.

ఉరుకులో పరుగుల జీవితంతో అనారోగ్యం

ఉరుకులో పరుగుల జీవితంతో అనారోగ్యం
– మంత్రి తన్నీరు హరీష్ రావు

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

వ్యాయామంతో ఆరోగ్యం నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో శరీర దారుఢ్యం లేక ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురౌతున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో శ్రీలక్ష్మి భూలక్ష్మి నాభిశిల (బొడ్రాయి) ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ లు పాల్గొని శుక్రవారం పూజలు జరిపించారు అనంతరం 8 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ యువత, ప్రజలందరూ ఈ ఓపెన్ జిమ్ ను ఉపయోగించుకొని ఆరోగ్యవంతులు కావాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సిద్దిపేట్ జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ
ఎంపీపీ కొక్కుల కీర్తి, గ్రామ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య, సామల సంతోష్, బండి సంపత్, మాంకాల అంజయ్య, టి హెచ్ ఆర్ యువసేన అధ్యక్షులు వరికోలు గణేష్ లు పాల్గొన్నారు..

గౌరవెల్లి మరో అద్భుతం

గౌరవెల్లి మరో అద్భుతం

వొడితల సతీష్ కుమార్

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన చెరువులు కుంటలు దర్శనమిచ్చేవని, కానీ నేను పరిస్థితి ఎందుకు భిన్నంగా మారిందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 7 నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవ సంబరాలు పోతారం (ఎస్) శుభం గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. గతంలో బతుకమ్మలు వేయాలన్న, వినాయకుని దుర్గామాతల నిమజ్జనం చేయాలన్న నీళ్లు ఉండేవి కావన్నారు. కానీ నేడు హుస్నాబాద్ నియోజకవర్గంలో చెరువులు కుంటలు జలకళ ఉట్టిపడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ గారు దూర దృష్టితో ఆలోచించి 10 టిఎంసిలకు పెంచడం ద్వారా హుస్నాబాద్ కు జలహారంగా గౌరవెల్లి ప్రాజెక్టు నిలుస్తుందని, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యిందని త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభించి గోదావరి జలాలతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని 1’06000 ఎకరాలకు నీరు అందిస్తామని అన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ విధానం అసెంబ్లీలో కేసీఆర్ గారి ప్రసంగం) పుస్తకాన్ని, సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం( తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నివేదిక) పుస్తకాన్ని ఎమ్మెల్యే గారు ఆవిష్కరించారు. హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన సీనియర్ న్యాయవాది రచయిత గులాబీల మల్లారెడ్డి రచించిన ఎద్దు ఏవుసం, సురుకుల వైద్యం అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

గ్రామాలే దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు

గ్రామాలే దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలు

– ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్

హుస్నాబాద్ యదార్థవాది

గ్రామాలే దేశ సౌభాగ్యానికి పట్టు కొమ్మలని ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం 40 లక్షల వ్యయంతో నిర్మించే నూతన గ్రామపంచాయతీ భవనానికి, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం భవనానికి భూమి పూజ, శంకుస్థాపన సి మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను నిర్మిస్తున్నామని, కొన్ని గ్రామపంచాయతీలు నూతన భవనాలను ప్రారంభం చేసామన్నారు. గ్రామం అన్ని రకాల మౌలిక వసతులు సిసి రోడ్ లు, విద్యుత్ దీపాలు , డ్రైనేజీలు, సామాజిక భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు ,పల్లె ప్రకృతి వనాలు, చెరువు కట్టలు, కుంటలు మరమ్మతులు ఇలా అనేక రకాల అభివృద్ధి పనులు గ్రామాల రూపురేఖల్ని మార్చాయని గ్రామ స్వరాజ్యం రాష్ట్ర సౌభాగ్యంగా అభివృద్ధిలో ముందుండి కొన్ని గ్రామపంచాయతీ లు రాష్ట్రస్థాయి అవార్డులు కూడా అందుకోవడంలో అధికారుల ,ప్రజల సహాయ సహకారాలతో సాధ్యమైందని ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అన్నారు. అలాగే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లిమిటెడ్ కరీంనగర్ బ్యాంకు సేవలు అభినందనీయమని సహకార రంగ బ్యాంకులలో కరీంనగర్ సహకార బ్యాంకు సభ్యులు విశేషమైన సేవలు అందిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభినందనలు పొంది నూతన ఒరవడితో ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు అనే సహకార నినాదంతో బ్యాంకు ఖాతాదారులకు వివిధ రకాల రుణాలు అందిస్తూ సంఘ సభ్యులకు పంట రుణాలు ,వ్యవసాయ పనిముట్ల కోసం, ట్రాక్టర్లు ,హార్వెస్టర్లు వివిధ రకాలైన యంత్రాలు, వ్యక్తిగత రుణాలు కూడా అతి తక్కువ వడ్డీ రేటు తో అందింస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు తదితరులు మాట్లాడారు. ఎంపీటీసీ భూపతి సుధేష్ణ ,సర్పంచ్ జిల్లల అశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ బొల్లి శ్రీను, వార్డు మెంబర్లు, కోపరేటివ్ చైర్మన్ పంజా రాజయ్య ,వైస్ చైర్మన్ ముకుంద రెడ్డి,గ్రామస్తులు పాల్గొన్నారు.

దొరల రాజకీయాలపై తిరుగుబాటు ఆర్మూర్ నుంచే మొదలు

దొరల రాజకీయాలపై తిరుగుబాటు
ఆర్మూర్ నుంచే మొదలు

భారీ ర్యాలీలో ఎంపీ అరవింద్

-పైడి రాకేష్ రెడ్డి ర్యాలీతో ఆర్మూరులో బిజెపికి కొత్త ఊపు.

నిజామాబాద్ యదార్థవాది

దొరల పోకడ రాజకీయాలపై తెలంగాణలో తిరుగుబాటు ఆర్మూర్ నుంచి మొదలైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బెదిరింపులు 500 కార్లతో ర్యాలీ తీయడంతో ఎమ్మెల్యే కి భయం పట్టుకుంది అని ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత తనపై మాత్రమే పోటీ చేయాలని గతంలో మాదిరిగా మైసమ్మ ముందు పొట్టేలు కావాలని అన్నారు. ఎమ్మెల్యే ఓటమి 50వేల మెజారిటీతో ఖాయం అని అన్నారు. నిజమాబాద్ జిల్లా డిచపల్లి మండల కేంద్రం నుండి 500 కార్లతో చేపట్టిన ర్యాలీ ఆర్మూర్ పట్టణం మీదుగా పెద్ద ఎత్తున సాగింది. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్, పైడి రాకెష్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పులా మాల వేసి నివాళులర్పించారు. అలాగే రాకెష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ గడ్డకు ఈ జీవితం అంకితం అని అన్నారు. ఎంపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ లో బీజేపీ జెండా ఎగురడం ఖాయం అని.
ఆర్మూర్ లో బీజేపీ గెలిచి మోదీ కి కానుకగా ఇస్తాం అని అన్నారు. బీజేపీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ బెదిరింపులు చేస్తే సహించేది లేదని హెచ్చరిక అనుకోండి విన్నపం అనుకోండి ఇక నుండీ ఒక లెక్క ఇప్పుడు ఓ లెక్క అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లె గంగారెడ్డి, నుతుల శ్రీను, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

అభివృద్ధి డాక్యుమెంటరీ వీక్షించిన: మంత్రి కేటిఆర్

అభివృద్ధి డాక్యుమెంటరీ వీక్షించిన: మంత్రి కేటిఆర్

సిరిసిల్ల యదార్థవాది

జిల్లాలో గడిచిన 9 ఎండ్ల లో జరిగిన అభివృద్ధి పై క్షేత్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఉందనీ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు అన్నారు..

శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో
” రాజన్న సిరిసిల్ల
ఏ స్టోరీ అఫ్ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ” అనే శీర్షికతో జిల్లా యంత్రాంగం రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి కే తారకరామారావు ఆవిష్కరించారు.

కాఫీ టేబుల్ బుక్ ను ఆద్యాంతం తిలకించిన మంత్రి జిల్లా సమగ్ర అభివృద్ధినీ తెలిపే చిత్రాలతో అందంగా ఉందన్నారు. బుక్ రూపకల్పనకు ప్రత్యేక చొరవ తీసుకున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ను అభినందించారు..

జిల్లా కలెక్టర్ మార్గదర్శనం లో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి పై ప్రత్యేకంగా రూపొందించి జిల్లా కలెక్టర్ సముదాయంలో నిర్వహించిన దశాబ్ది వేడుకలలో ప్రదర్శించిన 7 నిముషాల నిడివి గల లఘు చిత్రంను మంత్రి కే తారకరామారావు తిలకించారు.. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు,
రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, , రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, అదనపు కలెక్టర్లు బి.సత్య ప్రసాద్, ఎన్.ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి.శ్రీనివాస రావు, మున్సిపల్ చైర్ పర్సన్లు జిందం కళా, రామతీర్థపు మాధవి, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...