30.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

కుకునూర్ పల్లి యదార్థవాది

సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల గ్రామానికి చెందిన బుడగ జంగాలా పర్వతం నర్సయ్య తన టీవీఎస్ ఎక్సల్ పైన కూలి పనికి వెళ్తున్న క్రమంలో రాజీవ్ రహదారి పైన చిన్న కిష్టాపూర్ రోడ్డు వద్ద జనగాం నుండి సికింద్రాబాద్ వెళ్తున్న జనగాం డిపోకి చెందిన ఆర్టీసీ బస్ TS 27 T 0140 డికొని మృతి చెందాడు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుతున్నామని కుకునూర్ పల్లి సబ్ ఇన్సపెక్టర్ పుష్పరాజ్ తెలిపారు. మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా హాస్పిటల్ తరలించారు…

బావండ్ల మల్లేశం మరణం సిపిఐకి అత్యంత తీరనిలోటు.

బావండ్ల మల్లేశం మరణం సిపిఐకి అత్యంత తీరనిలోటు.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

నిరంతరం పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న భారత కమ్యూనిస్టుపార్టీ సిపిఐలో చిన్న తణం నుంచి ఎర్రజెండా పోరాట బాటలో సాగిన అనేక ప్రజా ఉద్యమాలకు అకర్షనీయులైన బావండ్ల మల్లేశం భూస్వాముల పెత్తందారీ వ్యవస్థ రూపుమాపడానికి స్వతగా పాటలు కౌగట్టి గళమెత్తిన పాటలు పాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి హుస్నాబాద్ ప్రాంతంలో సిపిఐ నేతలు ముస్కు రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బద్దం ఎల్లారెడ్డి,
దేశిని చిన మల్లయ్య, చాడ వెంకటరెడ్డి నాయకత్వంలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న బావండ్ల మల్లేశం
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు శుక్రవారం స్వగ్రామమైన పొట్లపల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, గడిపె మల్లేశ్ సిపిఐ నాయకులతో కలిసి శనివారం
ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ఎర్ర జెండాను కప్పి పులమాలలు వేసి బావండ్ల మల్లేశంకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొహెడ కొమురయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం హుస్నాబాద్ మండల కార్యదర్శి అయిలేని సంజివరెడ్డి, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి మౌటం బాలయ్య, జొన్నలగడ్డల కుమార్, నీలం రాజిరెడ్డి, రాదండ్ల ఎల్లయ్య, తదితరులు పాల్గొని బావండ్ల మల్లేశం కుటుంబ సభ్యులైన ఈరవ్వ, రమేష్, నరేష్, పద్మ, అంజవ్వలను ఓదార్చి వారికి సిపిఐ నాయకులు మనోధైర్యం కల్పించారు…

ఘనంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

ఘనంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

ఆర్మూర్ యదార్థవాది

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 70వ వర్ధంతిని పురస్కరించుకొని వారి యొక్క వర్ధంతిని “బలిదాన్ దివస్” గా నిర్వహిస్తూ ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు..ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఈ దేశానికి మొట్టమొదటి పరిశ్రమల మరియు సరఫరాల మంత్రిగా నెహ్రూ యొక్క మంత్రివర్గంలో పని చేయడం జరిగిందని, కొంతకాలానికి నెహ్రూ యొక్క విధానాలు నచ్చక భారతీయ జన సంఘ్ పార్టీని స్థాపించి ఈ దేశం ధర్మం రక్షించబడాలని, మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం సంతుస్టీకరణ విధానం సరైంది కాదని, ఇది దేశానికి ఎంతో ప్రమాదకరమని. కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ “ఏక్ దేశమే దో విధాన్ – దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహి చలేగా — నహి చలేగా” (ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానుల రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదు – ఉండకూడదు) అని నినదించిన ఒక ప్రఖండ దేశభక్తుడని, రాజీలేని పోరాటం చేస్తూ 1953లో కాశ్మీర్ కు వెళ్లి ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని ధర్నా చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అతనిని అరెస్టు చేసిందని అన్నారు. జూన్ 23న కారాగారంలో మరణించినట్లుగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, కాని శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరణం అనుమానాస్పదం కావడంతో దీనిపైన విచారణ చేయాలని అప్పటి జనసంఘ్ నాయకులు డిమాండ్ చేసినా నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆదర్శాలను ఆలోచనలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ ను రద్దుచేయడమే కాకుండా ఈ దేశాభివృద్ధికై భారత ప్రధాని శ్యామ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆలోచనలను, ఆదర్శాలను ముందుకు తిసుకేల్తున్నారని అయన అన్నారు.. కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బిజెపి సీనియర్ నాయకులు బొట్ల విజయ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, విజయానంద్, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వర్, గిరిజన మోర్చ మాజీ జిల్లా అధ్యక్షులు కొర్ర గంగాధర్, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శులు ఖాందేశ్ ప్రశాంత్, పులి యుగంధర్, కేలోత్ పీర్ సింగ్, మిర్యాల్కర్ కిరణ్, సుంకరి రమణ బారడ్ వినోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

ఆర్మూర్ యదార్థవాది

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజ గంగారాం కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నడుపుతూ సుప్రీంకోర్టు జీవో 91విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్- ప్రైవేట్ విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్స్ బుక్స్ ఇలా పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా మార్చి బహిర్గతంగా అమ్ముతూ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు పాటించని కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని అయన అన్నారు. ఆర్మూర్ కేంద్రంలో పలు కార్పొరేట్-ప్రైవేట్ విద్యాసంస్థలు శ్రీ చైతన్య, నలంద, నారాయణ, బ్రిలియంట్ గ్రామర్, క్షత్రియ, నారాయణ, శ్రీ భాషిత, కృష్ణవేణి, సెంట్ పాల్, ఆల్ ఫోర్సెస్ నియమ నిబంధనలను పాటించకుండా అక్రమంగా డొనేషన్లు, ఫీజులు అధికంగా వసూలు చేయడంతో తల్లిదండ్రుల పై ఒత్తిడి తెస్తూ ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా అయినా అధికారులు చర్యలు తిసులోవాలని ప్తీరభుత్సువాన్కోని కోరారు..

గంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత

ఆర్మూర్ యదార్థవాది

ఆర్మూర్ పట్టణంలోని ఎక్సైజ్ ఆఫీస్ ఆర్మూర్ R.కిషన్, A. C. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ నిజామాబాద్ డివిజన్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది హనిషన్ ఎక్సైల్ స్టేషన్, ఆర్మూర్ సిబ్బంది కలిసి సామూహికంగా నిర్వహిస్తున్న రూట్ వాక్ లో గంజాయి సరఫరా చేస్తున్నారని సమాచారంలో ఆర్మూర్ నుండి మునిపల్లి మార్గంలో గస్తీ నిర్వైంచుచుండగ రంజన్ కుమార్ అనే వ్యక్తి. మెడ శివ కుమార్ అనే వ్యక్తి సహకారంతో TS16 FG 4576 ఎలక్ట్రిక్ టూ వీలర్ పై 7.50 గ్రాముల గంజాయ్ తరలిస్తూ పట్టుబడటం జరిగింది. ఈ ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేసి ప్రోహినిషన్ ఎక్సైజ్ స్టేషన్, ఆర్మూర్ కు తరలించడం జరిగింది. ఇట్టి గస్తీలు ఎన్ఫోర్స్మెంట్ సిఐ స్వప్న, ఆర్మూర్ సీఏ స్టీవెన్సన్, ఎస్సైలు ప్రమోద్ చైతన్య. చంద్రమౌళి, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, ఎక్సైజ్ స్టేషన్, ఆర్మూర్ సిబ్బంది పాల్గోన్నారు.

అంకాపూర్ లో బీజేపీ ఇంటింటి ప్రచారం

అంకాపూర్ లో బీజేపీ ఇంటింటి ప్రచారం

ఆర్మూర్ యదార్థవాది

ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ లో బిజెపి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో తన స్వగ్రామం లో రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.ప్రతి ఇంటికి బీజేపీ పథకాలు అందుతుతున్నయి అని ఈ 9ఏళ్ల లో కేంద్రం ప్రభుత్వం నిజాయతీ పాలన చేసింది అని అన్నారు. ప్రతి పథకంలో కేంద్రం ప్రభుత్వం వాట ఉంది అని మోడీ నాయకత్వంలో దేశం అబివృద్ది వైపు నడుస్తుంది అని అన్నారు. కార్యక్రమంలో నరేష్,రాజేందర్,శివ తదితరులు పాల్గొన్నారు

హుస్నాబాద్ లో ఇంటింటి ప్రచారంలో మాజీ మంత్రి ఈటెల

హుస్నాబాద్ లో ఇంటింటి ప్రచారంలో
మాజీ మంత్రి ఈటెల

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

నరేంద్ర మోదీ గారి 9 సం.ల పాలన పూర్తయిన సందర్భంగా మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పలు పండ్ల షాపుల్లో తిరిగి బిజెపి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 9 సం.ల పాలన పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, సెన్సార్ బోర్డు మెంబర్ లక్కిరెడ్డి తిరుమల, జిల్లా కోశాధికారి, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు యాదవ్, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, మండల అధ్యక్షులు చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి, గోళ్లపల్లి వీరాచారి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మావోయిస్టుకు ఆర్థికసహాయం

మావోయిస్టుకు ఆర్థికసహాయం

కరీంనగర్ యదార్థవాది

మావోయిస్టు డిసియంగా పనిచేసి ఇటీవల లొంగిపోయిన రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం శివంగులపల్లికి చెందిన నేరేళ్ళ జ్యోతి అలియాస్ జ్యోతక్కకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు 5లక్షల రూపాయల ఆర్థికసహాయం చెక్కును శుక్రవారం పోలీస్ కార్యాలయంలో అందజేశారు.. మావోయిస్టు నేరేళ్ళ జ్యోతి గతనెల 12న పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. ప్రభుత్వ అందజేసిన ఆర్ధికసహాయాన్ని శాశ్వత అవసరాలకోసం వినియోగించుకోవాలని పోలీస్ కమీషనర్ సూచించారు.

తిరుపతిలో అగ్ని ప్రమాదం ..

తిరుపతిలో అగ్ని ప్రమాదం ..

మహారథానికి తప్పిన ప్రమాదం..

ప్రమాదానికి గల కారణాలు తెలియల్సివుంది..

తిరుపతి యదార్థవాది ప్రతినిది

తిరుపతి రైల్వే స్టేషన్, గోవిందరాజు స్వామి ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ వర్క్స్‌లో పెను అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలకు మూడంతస్తుల భవనం తగలబడిపోతోంది. భవనంలో అనేకమంది వర్కర్లు ఉండే అవకాశం ఉంది. ఫోటో ఫ్రేములు, ఫోటో చిత్రాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఎగసిపడుతున్న మంటల నేపథ్యంలో గోవిందరాజు స్వామి ఆలయ మహారథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు తరలించారు.. మంటలకు 6ద్విచక్రవాహనాలు, కోటి వరకు ఆస్థి అగ్నికి అవుతి అయినట్లు తెలుస్తుంది. మంటలను అదుపు చేసేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.

మన పల్లెలు ఆదర్శంగా ఉన్నాయి

మన పల్లెలు ఆదర్శంగా ఉన్నాయి

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం గ్రామ పంచాయతీలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమాన్ని సర్పంచ్ పేర్యాల నవ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కొత్త పంచాయితీ రాజ్ చట్టం తెచ్చి గ్రామ పంచాయితీ విధులు, నిధులు, బాధ్యతలు పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం , ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని స్వరాష్ట్రం రాకముందు పల్లెలన్నీ ఎలా ఉన్నాయో వచ్చిన తర్వాత ఎంతగా అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నాయో మనందరికీ తెలుసని అన్నారు. అదేవిధంగా పారిశుద్ధ కార్మికుల సేవలను గుర్తిస్తూ 16 మంది కార్మికులకు శాలువాతో సత్కరించరు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పేర్యాల దేవేందర్ రావు ,ఉపసర్పంచ్ అశోక్ ,వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, ఏఎన్ఎంలు, ఐకెపి సి ఏ లు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, వివోలు, గ్రామస్తులు పాల్గొన్నారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...