30.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే పీడి యాక్ట్ నమోదు చేస్తాం: పోలీస్ కమిషనర్

శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే పీడి యాక్ట్ నమోదు చేస్తాం: పోలీస్ కమిషనర్

-రియల్ ఎస్టేట్ వ్యాపారి పై పీడీ యాక్ట్ నమోదు

-శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే పీడి యాక్ట్ నమోదు

మంచిర్యాల యదార్థవాది

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య చేసి, బెదిరింపులకు పాల్పడుతున్న మామిడి శ్రీనివాస్ పై సోమవారం పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీచేసిన పోలీస్‌ కమిషనర్‌ రెమా రాజేశ్వరి.. మామిడి శ్రీనివాస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ క్రూరమైన హత్య, నేరపూరిత బెదిరింపులకు, నేరాలకు పాల్పడటంతో ఇక్కడి ప్రాంతంలో నివసించే సాధారణ ప్రజల తీవ్ర భయాందోళనలు సృష్టించడం తద్వారా చట్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ శాంతి భద్రతలకు విఘాతం సామాజిక శాంతి సామరస్యతలకు భంగం కల్పించడంతో రామగుండం కమిషనరేట్ పరిధిలో శాంతి సామరస్యాలపై ప్రతికూల ప్రభావం కలిగించిన్నాయని, ఈ క్రమంలో నడిపెల్లి లక్ష్మి కాంతారావు హత్య, ఇంకా కొంతమందిని బెదిరింపులకు పాలపడుతున్నాడని నిందితునిపై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదు చేసి నిందితుడిని చర్లపల్లి జైలు తరలించినట్లు కమిషర్ తెలిపారు. నేరస్తుని పై పీడీ యాక్ట్‌ అమలు చేయుటకు కృషి చేసిన బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, మందమర్రి సర్కిల్ ఇన్స్ స్పెక్టర్‌ మహేందర్ రెడ్డి, రామకృష్ణ పూర్ ఎస్ఐ అశోక్ లను కమిషనర్ అభినదించారు..

ప్రాజెక్టుతో రైతుల ఆనందం: ఎమ్మెల్యే

గౌరవెల్లి ప్రాజెక్టుతో రైతుల ఆనందం: ఎమ్మెల్యే

-గౌరవెల్లి ప్రాజెక్టులో రెండో ట్రయల్ రన్ ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్…

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి రెండో ట్రయల్ రన్ ను లాంఛనంగా ఎమ్మెల్యే సతీష్ ప్రారంభించి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా 62,000 ఎకరాలకు సాగునీరు అందుతుందనిన పది రోజుల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభింపజేసి, లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం లక్ష 6000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, జడ్పీటీసీలు, ఎంపిటిసిలు, స్థానిక ప్రజా ప్రతినిదులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

కుమారులు లేక కూతురే అగ్గి పట్టి….

కుమారులు లేక కూతురే అగ్గి పట్టి….

-కన్నీరు మున్నిరైన గ్రామస్తులు

సిద్దిపేట యదార్థవాది

సిద్దిపేట సమీపంలోని ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామం లో మంగళవారం దరిపల్లి సతవ్వ అనే వృద్ధురాలు కన్ను మూసింది. ఆమెకు కుమారులు ఎవరు లేక పోవడం తో కన్న కూతురే అగ్గి పట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. సతవ్వకు ఐదుగురు కూతుర్లు. అయితే కుమారులు ఎవరు లేక పోవడం తో చిన్న కూతురు చిన్న కూతురు లావణ్య దహన సంస్కారాలు నిర్వహించేందుకు అగ్గి పట్టింది. కుమారులు ఎవరూ లేక కూతురే అంతిమ సంస్కారాలు నిర్వహించే దృశ్యం గ్రామస్తులను కలచి వేసింది.

ఘనంగా చత్రపతి సాహుమహారాజ్ జయంతి

ఘనంగా చత్రపతి సాహుమహారాజ్ జయంతి

హుస్నాబాద్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు వేల్పుల రాజు ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ కేంద్రంలో రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి డేగల వెంకటేష్ మాట్లాడుతూ సామాజిక న్యాయం అమలుకు 28 ఏళ్ల వయసులోనే తన రాజ్యంలో బ్రాహ్మణేతరులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి సమాన అవకాశాలకు పునాదులు వేసిన మహనీయులు చత్రపతి సాహు మహారాజు విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి విద్యాసంస్కరణ కమిటీ ఏర్పాటు చేసి 1917 లోనే ఉచిత నిర్బంధ విద్యా అమలు చేశారని, అంతేకాకుండా తన రాజ్యంలో కులాంతర మతాంతర వివాహాల చట్టం తీసుకువచ్చి ప్రజాస్వామ్య విలువలకు పునాదులు వేశారు హిందూ పిల్లల జోగిని వ్యవస్థను నిరోధించే చట్టం తెచ్చి వివక్ష అంటరానితరం నిషేధించి కొల్లాపూర్ సంస్థానాన్ని ఎన్నో మిగతా రాజ్యాల కంటే ఆధునిక భావాలతో అభివృద్ధి పదంలో నడిపారని అన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఎలగందుల శంకర్, ప్రధాన కార్యదర్శి తొందూర్ సాయి, తేజ, నియోజకవర్గ కార్యదర్శి మైల తిరుపతి, నియోజకవర్గ ఈ సి మెంబర్స్ మారపల్లె సుధాకర్, జేరిపోతుల రవీందర్, హుస్నాబాద్ అధ్యక్షుడు దుండ్రా రాంబాబు, మల్లంపల్లి సెక్టార్ అధ్యక్షుడు సంచల విక్రం, సుధాకర్, కిషన్, తదితరులు పాల్గొన్నారు..

కార్మికులకు పెంచిన వేతనం వెంటనే అమలు చేయాలి

కార్మికులకు పెంచిన వేతనం వెంటనే అమలు చేయాలి

కొండపాక /కలెక్టరేట్ యదార్థవాది

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 2022 మార్చి 15న ముఖ్యమంత్రి అసెంబ్లీలో రూ.2000 పెంచుతున్నట్లు ప్రకటించి జీవో విడుదల చేశారు. కానీ నేటికీ 18 నెలల అయినప్పటికీ వేతనాలజీవో అమలు కావడం లేదని వెంటనే అమలు చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) ఉపాధ్యక్షురాలు దాసరి కళావతి డిమాండ్ చేశారు.. సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కార్యాలయ ఏవో రహమాన్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి కళావతి మాట్లాడుతూ జీవో ఎంఎస్ నెంబర్ 8 విడుదల చేసినప్పటికీ ఆ జీవోలో నిర్దిష్టంగా ఎప్పటినుండి జీవో అమలు చేస్తారో స్పష్టత లేదన్నారు. 2022 మార్చి అసెంబ్లీలో వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించినప్పటి నుండి ఏరియర్స్ తో సహా కార్మికులకు చెల్లించాలన్నారు. కొత్త వెనూకి బడ్జెట్ పెంచాలని పెండింగ్ బిల్లు తక్షణ విడుదల చేయాలని, కోడిగుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని మధ్యాహ్న భోజన నిర్వహణకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులే తక్కువ అవి కూడా నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులు అప్పులు చేసి వంట చేయడంతో అప్పులపాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అప్పుల ఊబిలో కోరుకు పోతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రోజు మూడు కోడి గుడ్లు పెట్టలేదన్న సాకుతో కార్మికులను వేధిస్తూ తొలగిస్తున్నారని మరోపక్క గుడ్డు పెట్టడానికి అంగీకరించని స్వచ్ఛంద సంస్థ పై ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. అక్షయపాత్రకు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని ఈ నిర్ణయం అమలు అయితే కార్మికులందరూ రోడ్డున పడతారని తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వమే పాఠశాలలకు గుడ్డును అదనంగా బడ్జెట్ ను కేటాయించలని అన్నారు. జూన్ 20 నుండి కొత్త మెనూ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని ఇప్పుడు మేనూకే కేటాయించిన బడ్జెట్ సరిపోడం లేదని పైగా కొత్త కిచిడి మిక్స్ డ్ వెజిటేబుల్ కర్రీ వెజిటేబుల్ బిర్యానీ వారానికి ఒకసారి, మూడు కోడిగుడ్లు పెట్టాలని నిర్ణయించిందని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొండపాక మండల కార్యదర్శి అమ్ముల బాల్ నర్సయ్య మధ్యాహ్న భోజన కార్మికులు శశిరేఖ, కనకలక్ష్మీ, యమునా, లలిత, రేణుక, నాగలక్ష్మి, పద్మ, రేణుక, భాగ్యలక్ష్మి, భూలక్ష్మి, రమేష్ తదితరులు పాల్గొన్నారు..

పోలీసు ఉద్యోగాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు 483 మంది గైర్హాజరు: పోలీస్ కమిషనర్ శ్వేత

పోలీసు ఉద్యోగాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు 483 మంది గైర్హాజరు: పోలీస్ కమిషనర్ శ్వేత

సిద్దిపేట యదార్థవాది

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్, ఎస్ఐ పోలీసు ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పకడ్బందీగా పారదర్శకంగా పూర్తి చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు.. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్, ఎస్ఐ పోలీసు ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షలో అర్హత సాధించిన (3926) మంది అభ్యర్థులకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. వెరిఫికేషన్ నోడల్ అధికారిగా నియమింపబడిన అడిషనల్ డిసిపి అడ్మిన్ ఎస్. మహేందర్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ కొనసాగిందని గత పది రోజుల నుండి అభ్యర్థులు తమ కేటాయించిన స్థలాలలో వేచి ఉండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను ప్రశాంతంగా చేయించుకున్నారు. మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతగా కేటాయించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయడం జరిగింది. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఫైనల్ రాత పరీక్షలో అర్హత సాధించిన 4409 మంది అభ్యర్థుల ఉండగా, వెరిఫికేషన్ కు హాజరైన అభ్యర్థులు 3926, మిగత 483 మంది గైరాజరైనారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వెరిఫికేషన్ నిర్వహించిన పోలీస్ అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో సూపరిండెంట్లు ఎస్.కె జమీల్ పాషా, మహ్మద్ ఫయాజుద్దీన్, మహ్మద్ అబ్దుల్ ఆజాద్, సీనియర్ అసిస్టెంట్లు సతీష్, సాగర్, శ్రీధర్, మరియు జూనియర్ అసిస్టెంట్లు, ఐటీ కోర్ ఎస్ఐ శ్రీకాంత్, మహిళ ఆర్ఎస్ఐ పుష్ప, ఆర్ఐ శ్రీధర్ రెడ్డి, ఐటీ కోర్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు..

రెండు పడకల జాడ ఏది

రెండు పడకల జాడ ఏది

ఆర్మూర్ యదార్థవాది

డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు పూర్తి కాని నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఆర్మూర్ నియోజకవర్గమే అని కాంగ్రెస్ నాయకుడు కోలా వెంకటేష్ విమర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పై కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు పూర్తి అయిన ఇప్పటివరకు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఒక్క డబుల్ బెడ్ ఇళ్ళు ఇవ్వలేదని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను అవహేళన చేస్తూ అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటారని, అంటూ మేము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాం అని అన్నారు. కాని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాత్రం తన కోసం అంకాపూర్ లో హైదరాబాద్ లో రాజభవనాలు నిర్మించుకున్నాడని ఇవికాక మినిస్టర్ క్వాటర్స్ లో ఎమ్మెల్యే క్వాటర్స్ లో ఇళ్ళు పొందాడని అన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు మాత్రం ఇప్పటివరకు ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదని ద్వాజమేతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇస్తాం అనగానే భయపడి కెసిఆర్ కొత్తగా గృహలక్ష్మి పథకం తెస్తున్నాడు అని సొంత స్థలం ఉన్నవారికి 3 లక్షలు ఇస్తాం అని అంటున్నాడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జిల్లాకు చెందిన వ్యక్తి అయ్యుండి కూడ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు లబ్ది చేకూర్చటం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విఫలమయ్యారని, ఎమ్మెల్యే కొద్దీ రోజుల క్రితం జర్నలిస్ట్ కు జూన్ 18న వారి కుటుంబాలతో గృహలక్ష్మి ప్రవేశం పెడతా అని మీకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తానని అన్నారు. మరి ఈరోజు 24వ తేదీ కానీ ఇప్పటివరకు ఎటువంటి ఇండ్లు ఇవ్వలేరు జర్నలిస్టులకు ఇండ్లు ఎక్కడా అని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజ్జు, జిమ్మి రవి, మందుల పోశెట్టి, బట్టు శంకర్, బాల కిషన్, పాషా, పెద్ద పోశెట్టి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్ ల జోలికొస్తే గోరి కడతాం

ముదిరాజ్ ల జోలికొస్తే గోరి కడతాం

-కౌశిక్ రెడ్డికి అల్టిమేటం

నిజామబాద్ యదార్థవాది ప్రతినిది

ఇందల్వాయి ముదిరాజ్ కమిటీ మండల అధ్యక్షులు మొచ్చే గోపాల్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజ్ కులస్తులపై అనుషిత వ్యాఖ్యలు చేస్తూ బూతు మాటలు తిట్టినందుకు కౌశిక్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న నీకు ఏ కులంపై తిట్టే అధికారం లేదని అన్ని అన్నారు. అని కులాలను గౌరవించే విధానం ముందుగా నేర్చుకోవాలి మరోసారి ముదిరాజ్ కులస్తుల జోలికి వస్తే ట్యాంక్ బండ్ రోడ్ పై గోరి కడతాం అని ఈ సందర్భంలో హెచ్చరించారు. ఎమ్మెల్సీ పదవిలో ఉన్న కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు వాడడం ఎంతవరకు సబబు అని వారు మండిపడ్డారు ముదిరాజ్ కులాలు అంటే నీకు అంత తక్కువ చూప అని మండల అధ్యక్షులు మండిపడ్డారు తక్షణమే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలని లేదా అరెస్ట్ చేయాలి అని ముదిరాజ్ సంఘాలు ఇందల్వాయి మండల హెడ్ కోటర్ బస్టాండ్ పరిధిలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ నీ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్సై నరేష్ కు ముదిరాజ్ కమిటీ సభ్యులు కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మండల ముదిరాజ్ సంఘ సభ్యులు ముచ్చె సాయిలు, ఇర్ల సాయిలు,లోకని గంగాధర్, అశోక్, ఇర్ల సాయందర్, తదితరులు పాల్గొన్నారు.

మోడీ పథకాలు ఇంటింటికి అందుతున్నాయి: ఎంపి అరవింద్

మోడీ పథకాలు ఇంటింటికి అందుతున్నాయి: ఎంపి అరవింద్

ఆర్మూర్ యదార్ధవాది

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహిస్తున్న ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా శనివారం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అంకాపూర్ లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఆశ్రమ వ్యవస్థాపకులు గడ్డం పైపుల రాజారెడ్డి ని కలిసి వారికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోడీ నిస్వార్ధంగా చేస్తున్నటువంటి సేవలను తెలియచేశారు. “మోడీ 20 ఏళ్లు స్వప్నించాడు సాధించాడు”, “తొమ్మిది సంవత్సరాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమం” అనే పుస్తకాలను రాజారెడ్డి కి ఇచ్చరు ఎంపీ ధర్మపురి అరవింద్ వృద్ధులను పలకరించి వారి బాగోగులు తెలుసుకొని మీ యొక్క ఆశీర్వాదం నరేంద్ర మోడీ పై ఉండాలని మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైయ్యే విధంగా మీరందరి ఆశీర్వాదం ఉండాలని, మీరందరు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులనుకోరారు. కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్, బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు

క్రీడాకారుని కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం

క్రీడాకారుని కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం

హుస్నాబాద్ యదార్థవాది

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన క్రీడాకారుడు శనిగరం అంజనేయులు గత ఏప్రిల్ నెల 7వ తేదీ నా హుస్నాబాద్ లో కర్ణకంటి మంజుల రెడ్డి టోర్నమెంట్ లో క్రికెట్ అడుతు అకస్మాత్తుగా మృతి చెందిన సందర్భంగా సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి ఆంజనేయులు కుటుంబానికి అండగా ఉంటానని గతంలోనే తెలిపినా విషయం తెలిసిందే.. కాగా శనివారం హుస్నాబాద్ నియోజకవర్గ సామాజిక సేవకురాలు మంజులరెడ్డి సహృదయంతో బాధిత కుటుంబానికి తన సొంత ఖాతా నుండి రెండు లక్షల రూపాయలు చెక్కును అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో తక్షణమే స్పందించి వైద్య సహాయానికి హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించినప్పటికీ శనిగరం ఆంజనేయులు చనిపోయారు. తదానంతరం మంజులక్క యువసేన సభ్యులు దహన సంస్కారాలకు 50 వేల రూపాయలు ఇచ్చి దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు. 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్నందుకు సుందరగిరి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.. కార్యక్రమంలో సర్పంచ్ మూర్తి రమేష్ ఉప సర్పంచ్ జంగా శ్రీనివాస్ రెడ్డి మంజులక్క యువసేన మండల అధ్యక్షులు మంద శ్రీనివాస్ కంది తిరుపతిరెడ్డి దిలీప్ శంకర్ తాళ్ల పెళ్లి సంపత్ గౌడ్ పెసర శ్రీనివాస్ కొమురయ్య యువసేన సభ్యులు రవీందర్ రెడ్డి, అవినాష్ గౌడ్,సురేష్ గౌడ్, ప్రవీణ్, వంశీ,శ్రావణ్ రెడ్డి, అజయ్, రాజ శేఖర్, కళ్యాణ్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...