31.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

మట్టి పాత్రలకు కేరాఫ్ సిద్దిపేట

మట్టి పాత్రలకు కేరాఫ్ సిద్దిపేట

-సిద్ధిపేటలో కుమ్మర్ల ఫైలెట్ ప్రాజెక్ట్ కి 2.20 కోట్ల నిధులు మంజూరు.

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

రాష్ట్రం లోనే మొట్ట మొదటగా మట్టి పాత్రలను యూనిట్ సిద్దిపేట జిల్లా లోనే మట్టి పాత్రల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలానే ఉద్దేశంతో కుమ్మర్ల ఫైలెట్ ప్రాజెక్ట్ కి 2.20 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుమ్మర్ల అభివృద్ధి కోసం, మరుగున పడుతున్న కుమ్మర వృత్తి ని బతికించడానికి, ప్లాస్టిక్ మహమ్మారిని అంతమొందించడానికి ప్రజల అనారోగ్యం నుండి బయట పడటానికి అన్నింటికీ ప్రత్యామ్నాయం మట్టి పాత్రలను వాడకాన్ని పెంచడానికి రాష్ట్రం లోనే మొట్ట మొదటగా సిద్దిపేటలోనే మట్టి పాత్రల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాలానే ఉద్దేశంతో ఈ ఫైలెట్ ప్రాజెక్ట్ లో అన్ని రకాల (చాయి గ్లాస్ లు, వాటర్ గ్లాస్ లు, ప్లేట్స్, బౌగొన్లు, ఇట్లో వాడుకునే అన్ని పాత్రలు, ఇంట్లో అలంకరణకు పెట్టుకునే చిన్న చిన్న బొమ్మలు వంటివి అన్నీ) మట్టి ని ఉపయోగించి ఆదునికరమైన మిషన్లతో తయారు చేస్తారు.. ఈ ఫ్యాక్టరీ వల్ల సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన అన్ని కుమ్మర కుటుంబాలకి లాభం జరుగుతుందని కుమ్మర్ల కు ఉచిత శిక్షణ ని కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ కుమ్మర్లకు గతంలో రెండు ఎకరాల స్థలాన్ని కెసిఆర్ నగర్ లో కేటాయించడం జరిగిందని, కుమ్మర్ల పైలెట్ ప్రాజెక్టును నిర్మించడానికి మంత్రివర్యులు కుమ్మర్ల పైలట్ ప్రాజెక్టు కోసం రెండు కోట్ల 20 లక్షల రూపాయలను నిధుల జీవో కాపీని కుమ్మర జిల్లా అధ్యక్షులు దరిపల్లి శ్రీనివాస్, ఫైలెట్ ప్రాజెక్టు ఇన్చార్జి నెల్లుట్ల విజయ్ లకు మంత్రి అందించారు.. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వర్కోల్ శ్రీనివాస్, జిల్లా నాయకులు గోవిందారం శ్రీనివాస్, ఫైలెట్ ప్రాజెక్ట్ కో ఇంఛార్జి మూడపల్లి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు నార్లపురం తిరుపతి, కట్కూరి రవీందర్,,జిల్లా యువజన అధ్యక్షులు తరిగొప్పుల రామచంద్రం,వక్కింగ్ అధ్యక్షులు శనిగరం ఆంజనేయులు,జిల్లా కోశాదికారి కొలిపాక సంపత్,జిల్లా ముఖ్యనాయకులు,,కృష్ణ మూర్తి, జిల్లా యవజన గౌరవ అధ్యక్షులు శాతరాశి రాజు, శ్రీశైలం,రామ్మోహన్, బాలు,రాజు,రాఘు, నగేష్ ,కిషన్,శ్రీను,భగవాన్,రాములు,కిష్టయ్య మధు, నాంపల్లి కిషన్ ,గోవిందారం శ్రీను,దుంపలపల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు..

గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.

గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.

-కేజీ 550 గ్రాముల గంజాయి స్వాధీనం.

సిరిసిల్ల యదార్థవాది

తంగాలపల్లి మండలం సారంపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న గడ్డం నాగేశ్ అరెస్ట్ చేసిన
సిరిసిల్ల రూరల్ సి.ఐ ఉపేందర్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం తంగాలపల్లి మండలం సారంపల్లి గ్రామం శివారులో గంజాయి
అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపించగా అట్టి వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద కేజీ 550 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి విచారించారు నాందేడ్ లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కొనుగోలు చేసి జిల్లా కి తీసుకువచ్చి గడ్డం నాగేశ్ అమ్ముతున్నాడని తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి రిమాండ్
రిమాండ్ తరలించినట్లు సి.ఐ ఉపేందర్ తెలిపారు. గంజాయి నిందితులను పట్టుకోవడం లో తగాలపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో ఎస్.ఐ ఎస్.ఐ లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది నరేందర్ రాజేంద్రప్రసాద్ తడెం స్వామి రామ్మోహన్ పాల్గొన్నారు.

ఘనంగా దొడ్డి కొమురయ్య 77 వ వర్ధంతి

ఘనంగా దొడ్డి కొమురయ్య 77 వ వర్ధంతి

హుస్నాబాద్ యదార్థవాది

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 77 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సురు ఐలయ్య, వీర్ల లింగయ్య, మ్యాకల ఓదయ్య, కోట అశోక్, చెంచు సంపత్, మ్యాకల రమేష్, చెంచు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దు: జిల్లా కలెక్టర్

సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దు: జిల్లా కలెక్టర్

సిద్ధిపేట యదార్థవాది

సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి, శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం
పత్రిక ప్రకటనలో పిలుపునిచ్చారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో జరిగిన సంఘటన పై ఆ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారు విజ్ఞతతో ఆలోచించలని ఎలాంటి పుకార్లు, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ఏదైనా ఆందోళనలు కలిగిన, స్థానిక పోలీసులను సంప్రదించాలని, చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దని జిల్లా అధికార యంత్రంగానికి, పోలీస్ శాఖ వారికి సహకరించలని, జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో హెల్త్ కార్డుల పంపిణీ.

బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో హెల్త్ కార్డుల పంపిణీ.

గోదావరిఖని యదార్థవాది

బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్ లో జ్యోతినగర్ హమాలీ సంఘం సభ్యులకు, అన్నపూర్ణ కాలనీ ట్రాలీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ సంఘాల సభ్యులకు బీఎస్పీ పార్టీ సీనియర్ నాయకులు దేవునూరి సంపత్ కుమార్ అధ్యక్షతన హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. గోదావరిఖని లోని ఫార్చ్యూన్ సిగ్మా హాస్పిటల్ సహకారంతో 150 మందికి హెల్త్ కార్డులను అందజేశారు. కార్యక్రమానికి బీఎస్పీ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ గోలివాడ ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పేద, బడుగు,బలహీన వర్గాల, బహుజన కార్మికులకు వైద్యం నిమిత్తం పదివేల కుటుంబాలకు సిగ్మా హాస్పిటల్ వారిచే హెల్త్ కార్డులను జారీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సిగ్మా హాస్పిటల్ సీఈవో యం.నరేష్ మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ తరపున రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పదివేల కుటుంబాలకు హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నామని, వెనుకబడిన ప్రాంతాలలో 100 హెల్త్ క్యాంపులను నిర్వహించబోతున్నామని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, జింక ఉదయ్, జనగామ మల్లేష్ , కాసర్ల పోషమల్లు, మడ్డి చంద్రయ్య, చిలుక బానేష్,ఆడెపు శ్రీనివాస్, మడ్డి బబ్రువాహన్, రఘునాథరెడ్డి, సంతోష్, లంక‌ మల్లేష్, రామిల్ల సతీష్,పెరుక‌ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

ఠాణా దివస్ లో సత్వరమే న్యాయం: జిల్లా ఎస్ పీ మహాజన్

ఠాణా దివస్ లో సత్వరమే న్యాయం: జిల్లా ఎస్ పీ మహాజన్

-ఠాణా దివస్ సద్వినియోగం చేసుకోవాలి

-ప్రజలకు మరింత చేరువలో పోలీసులు

-సామాన్య ప్రజలకు భరోసా కల్పిస్తున్నా జిల్లా పోలీస్ యంత్రాంగం

-జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల యదార్థవాది

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఠాణా దివస్ లో మంగళవారం ప్రజల వద్ద 56 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. ప్రజలకు మరింత చేరువలో పోలీసులు వెళ్ళడానికి, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి వారంలో ఒక రోజున ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహించి ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి అట్టి సమస్యలు పరిష్కరిస్తు ప్రజలకు భరోసా కల్పిస్తు సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులకు ఆదేశాలు జరిచేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ లపై నమ్మకం కలిగేలా, దివ్యాంగులు, వృద్ధులు,దూరప్రాంతల నుండి తన కార్యాలయనికి రాలేని వారి వద్దకే పోలీస్ సేవలు అందలనే ఉద్దేశ్యంతో “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, గ్రామాల్లో ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోగ్రామ్స్ నిర్వహిస్తు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకం అవుతూ గ్రామాలలో శాంతి భద్రతను పరిరక్షణకై కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి వారి సమస్యలలు అడిగి తెలుసుకుని అట్టి సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించడం జరిగిందని, తమ పరిధిలో లేని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకవెళ్తామని, సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని, భూ తగాధాలలో క్రిమినల్ సమస్య ఉన్న ఫిర్యాదులలో FIR నమోదు చేయాలని, సివిల్ సమస్యకు సంబంధించిన పిర్యాదులను కోర్టు లో పరిష్కరించుకోవాలని దానికోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో అవగాహన కల్పిస్తున్నామని, ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ సమస్యలు మేము పరిష్కరిస్తామని డబ్బులు వసూలు చేసే వారిపై మాకు ఫిర్యాదులు వస్తే చట్టపరపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. శాంతి భద్రతలను కాపాడటానికి పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తుదని, శాంతి భద్రతల కు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తప్పవని, శాంతి భద్రతలను పరిరక్షించడంలో జిల్లా పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ రాజేష్ వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు..

మహిళల భద్రత కోసమే షీ టీం లు

మహిళల భద్రత కోసమే షీ టీం లు

గోదావరిఖని యదార్థవాది

మహిళల భద్రత పట్ల మంగళవారం గోదావరిఖని ఆర్జీ వన్ ఏరియా వర్క్ షాప్ లో షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత కొరకే షీ టీం లను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని, మహిళలను ఎవరైనా వేధించిన, అసభ్యకరమైన మెసేజ్ లు పంపిన, షీ టీంకు వాట్సాప్ 6303023700 మెసేజ్ చేస్తే తక్షణమే వారిపై చర్య తీసుకుంటామని షీ టీం ఇంచార్జ్ ఏఎస్ఐ మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు స్నేహాలత, సురేష్ డీజీఎం మదన్మోహన్, జూనియర్ ఇన్స్పెక్టర్ ఉమేష్, మహిళా కార్మికులు పాల్గోన్నారు.

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు

రామగుండం యదార్థవాది

కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్ పల్లె గ్రామం లో గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు కన్నెపల్లి ఎస్ఐ నరేష్, ఎక్సైజ్ ఎస్ఐ నిర్మల సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు..6 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని గుడుంబా తయారు చేస్తున్న డుమ్మా భాగ్యలక్ష్మీ, ఎల్లా శేఖర్, బొక్కలాల శేఖర్, కడల సుధాకర్ నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు..

ఘనంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి

ఘనంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి

ఆర్మూర్ యదార్ధవాది

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు..ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పురస్కారాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణకు రావడాన్ని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతూన్నమని, మన్యం విప్లవ వీరులు శ్రీ అల్లూరి సీతారామరాజు తన చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి ఆధ్యాత్మిక చింతనతో కాషాయంబదారిగా మారి ప్రజలలో ఆధ్యాత్మికంగా ఈ దేశం, ధర్మం పట్ల అవగాహన పెంచుతూ ఉన్న సమయంలో తెల్లదొరలు ప్రజలను నానారకాలుగా హింసించడం, అనవసరంగా రైతుల వద్ద పన్నులు వసూలు చేయడం, రైతులు పండించిన ధాన్యాన్ని సగానికి పైగా బ్రిటిష్ వారు తీసుకెళ్లడాన్ని చూసి జీర్ణించుకోలేని అల్లూరి సీతారామరాజు విల్లంబులు ధరించి తెల్లదొరలకు సింహ స్వప్నమై, ఓ అగ్గి బరాటాల, ఒక అగ్గి కణంగా మారి తెల్లదొరలకు అగ్గి పిడుగు గా మారి ముప్పు తిప్పలు పెట్టారని అన్నారు. పోలీసు కార్యాలయాలపై దాడులు చేసి తుపాకులను ఎత్తుకుపోవడం, మందు గుండు సామాగ్రితో వస్తున్నటువంటి రైళ్లపై దాడులు చేసి వాటిని స్వాధీనపరుచుకోవడంతో ముందున్నారని, సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం పట్టించుకోకుండా తెల్లదొలకు వ్యతిరేకంగా పోరాటం చేశరని, అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకొని ఈ నయా నిజాం సర్కార్ కేసీఆర్ ప్రభుత్వాన్ని పారద్రోలడానికై ఓటు అనే ఆయుధాన్ని ప్రజలు వినియోగించుకొవాలని, తెలంగాణలోని ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్న భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో బిజెపి నిజామాబాద్ పార్లమెంట్ దళిత మోర్చ కన్వీనర్ నల్ల రాజారాం, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి పులి యుగంధర్, బిజెపి పట్టణ నాయకులు భవాని శ్రీకాంత్, కెలోత్ పీర్ సింగ్, బాసెట్టి రాజ్ కుమార్, గటడి శివ, పోహార్ నవీన్, రాము, పసుపుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో అగ్రగామి మన భారత్: రిటైర్డ్ ఆర్మీ గోవిందరాజు

అభివృద్ధిలో అగ్రగామి మన భారత్: రిటైర్డ్ ఆర్మీ గోవిందరాజు

హుస్నాబాద్ యదార్ధవాది ప్రతినిది

ప్రపంచ దేశాలు ఆశ్చర్యపడేలా మన దేశం ఆదర్శం గా ప్రధాని మోదీ చేస్తున్న సుపరిపాలన, అభివృద్ధిలో అగ్రగామి మన భారత్ అని రిటైర్డ్ ఆర్మీ బిజెపి జాతీయ నాయకులు గోవిందరాజు అన్నారు.. సోమవారం కోహెడ మండల హెడ్ క్వార్టర్స్ లో ఇంటింటి ప్రచారంలో బాగంగా ఆయన మాట్లాడుతూ గ్రామ గ్రామాన బూతుల వారీగా శక్తి కేంద్రం ఇన్చార్జీలను కలిసి ప్రధాని మోడీ చేస్తున్న సేవలను అభివృద్ధిని బిజెపి పాలనలో ప్రపంచవ్యాప్తంగా పొందిన ఔన్నత్యాన్ని ప్రజల ముందుకు ఎలా తీసుకువెళ్లాలని తగు సలహాలు సూచనలు చేస్తూ బూత్ కమిటీ శక్తి కేంద్రాల ఇన్చార్జీలతో కలిసి గ్రామ గ్రామాన పర్యటించి ప్రజలతో మమేకమై బిజెపి చేస్తున్న అభివృద్ధిని వారికి వివరించారు కోహెడ మండలంలోని 27 గ్రామాల్లో 50 పోలింగ్ బూత్ కమిటీలు కార్యవర్గాలతో శక్తి కేంద్రం ఇన్చార్జి లతో జూన్ 28న ప్రారంభమై జూలై మూడో తారీకు వరకు మండల కేంద్రంలోని ఉండి క్షేత్రస్థాయిలో విజయవంతం చేశారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి,
మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం, బిజెపి శ్రేణులు పిల్లి నర్సయ్య గౌడ్ గుగ్గిల శ్రీనివాస్ రజనీకాంత్ రెడ్డి తిరుపతి బండ జగన్ శివ కుమార్ సత్యనారాయణ రెడ్డి వెంకటేశ్వర్లు రామచంద్రారెడ్డి సతీష్ రవీందర్ గౌడ్ సాగర్ గౌడ్ అజయ్ సాయి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...