26.7 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 124

ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..

ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం..

కారు, లారీ ఢీకొని నలుగురు మృతి..

భద్రాద్రి కొత్తగూడెం: యదార్థవాది క్రైమ్ ప్రతినిది

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇల్లందు నుంచి మహబూబాబాద్ వెళ్లే మార్గంలో కోటి లింగాల సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.గాయపడినవారిని చికిత్స కోసం ఇల్లందు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే రణధీర్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతులు నలుగురు హన్మకొండ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. కమలాపూర్ కు చెందిన అరవింద్, వరంగల్ కు చెందిన రాము, కళ్యాణ్, శివగా గుర్తించారు. వీరంతా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం మోతేకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే..

కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే..

న్యుడిల్లి: యదార్ధవాది ప్రతినిది

కరోనా మహమ్మారి గురించి పరిశోధకులు ఓ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ వచ్చిన పోయిన వారిలో కనీసం 18 నెలల వరకు మరణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడి రికవరీ అయిన వారు ఏడాదిన్నర పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారు తమ ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచాలన్నారు. లేదంటే వారిలో మహమ్మారి శరీరంలో ఏదో ఒక ప్రాంతంలో ఉంటుందని తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడని వారితో పోలిస్తే, ఇన్ఫెక్షన్ కు గురైన వారు పలు గుండె సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. ఇది మరణానికి దారితీయవచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీకి చెందిన కార్డియో వాస్క్యులర్ రీసెర్చ్ అనే జర్నల్ లో ఈ అధ్యయన ఫలితాలు నమోదయ్యాయి. శాస్త్రవేత్తలు లక్ష అరవై వేల మందిపై తమ పరిశోధనలు నిర్వహించారు. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారిని ముఖ్యంగా సంవత్సరం పాటైనా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని వీరు సూచిస్తున్నారు. ఆ కాలంలో గుండె సంబంధిత సమస్యలు బయటపడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా ఇన్ఫెక్షన్ కు గురైన తర్వాత మొదటి మూడు వారాల్లో మరణించే ముప్పు 81 రెట్లు అధికమని, ఆ తర్వాత 18 నెలల కాలంలో మరణ రిస్క్ ఐదు రెట్లు అధికంగా ఉంటుందని వీరు అంటున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ కు లోనై, తీవ్ర దశలో ఉంటే గుండె జబ్బులు ఏర్పడే ప్రమాదం నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత దశలో 40 శాతం గుండె జబ్బులు ఏర్పడే రిస్క్ ఉంటుంది. మొత్తానికి దీర్ఘకాలంలో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, డీప్ వీన్ థ్రోంబోసిస్ ఏర్పడే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: రామకృష్ణ

రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: రామకృష్ణ

న్యుడిల్లి: యదార్థవాది ప్రతినిది

జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైకోర్టులోనే కేసు విచారణ జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలను ఇబ్బంది పెట్టేందుకే జీవో నంబర్‌ 1ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఆ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం

ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం

న్యుడిల్లి: యదార్ధవాది ప్రతినిది

జీవో నంబర్‌1పై సుప్రీంకోర్టు..

ఏపీలో రహదారులపై రోడ్డుషోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 1పై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఆ జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్‌ 1పై జోక్యం చేసుకోలేమని.. ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం దీనిపై విచారణ చేపడుతుందని సీజేఐ ధర్మాసనం తెలిపింది. వాద, ప్రతివాదులిరువురూ డివిజన్‌ బెంచ్‌ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 23న జీవో నంబర్‌ 1పై విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది…

గిరిజన యువత ఉన్నతవిద్యావకాశాలు పొందాలి..

గిరిజన యువత ఉన్నతవిద్యావకాశాలు పొందాలి..

నంద్యాల: యదార్థవాది ప్రతినిది

ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

రాష్ట్రంలో గిరిజన యువత ఉన్నత విద్య ఉద్యోగాలు పొందేలా నైపుణ్యం సాధించడంలో శిక్షణ పొందాలని పిలుపునిచ్చారు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్. నంద్యాల జిల్లా పాఠశాలలో గిరిజనులు, గిరిజన విద్యార్థులతో గవర్నర్ ముఖాముఖి మాట్లాడారు.28 శాతం గిరిజన జనాభా ఉన్న ఒడిస్సా నుంచి వచ్చానని, గిరిజనుల సమస్యలపై అవగాహన ఉందన్నారాయన. గిరిజనులను ఆధునిక జీవితానికి అలవాటు చేస్తూనే సంస్కృతి సంప్రదాయాలు రక్షించడానికి సమతుల్యత పాటించడం ఒక సవాల్ ఉందన్నారు గవర్నర్.ఏపీలో గిరిజనుల విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజన ప్రాంతాలలో ప్రాథమిక విద్య, ఆరోగ్యంపై దృష్టి సారిస్తోందన్నారు, విద్య , ఆరోగ్యం అతి ముఖ్యమైన విషయాలని ప్రభుత్వం గుర్తించిందన్నారు గవర్నర్. పరిశుభ్రత, తాగునీటికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గిరిజనులు తమ పిల్లలను బాగా చదివించి దేశానికి ఉపయోగపడేలా చూడాలన్నారు. మారుమూల గిరిజనులు ఆసుపత్రికి వెళ్లాలంటే డోలీల్లో తీసుకెళ్తున్నారని, అలాంటి ప్రాంతాల్లో గిరిజనులు స్వయంగా రోడ్లు వేసుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు గవర్నర్. ప్రధాని సడక్ యోజన నిధులతో గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు నాటికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తవ్వాలి..

ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు నాటికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తవ్వాలి..

రాజమండ్రి: యదార్థవాది ప్రతినిది

పనుల్లో వేగం పెంచాలి.. ఎంపీ భరత్

ఎందుకింత స్లోగా పనులు చేస్తున్నారు.. ఇలాగైతే ఎప్పటికి బ్రిడ్జి పూర్తవుతుంది’ అంటూ ఎన్హెచ్ఏ 1 ప్రాజెక్టు డైరెక్టర్ సురేందర్ పై వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం మోరంపూడి జంక్షన్ వద్ద సృష్టి కాంట్రాక్టు ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ భరత్ పరిశీలించారు. అదే సమయంలో అక్కడ ఉన్న పీడీ సురేందర్ ను ఉద్దేశించి ఎందుకింత స్లోగా పనులు సాగుతున్నాయని ఎంపీ ప్రశ్నించారు. పండుగ వల్ల అని పీడీ సమాధానం చెప్పడంతో.. పండుగ కాదు..పనులు ప్రారంభించడమే చాలా ఆలస్యంగా ప్రారంభించారు.. పనులూ స్లోయే అన్నారు. ఎప్పటికి పనులు పూర్తవుతాయని పీడీని ఎంపీ భరత్ ప్రశ్నించారు. డిసెంబరు నాటికి పూర్తవుతాయని పీడీ చెప్పడంతో.. మీ పై అధికారులేమో అక్టోబర్ నాటికి అన్నారు..మీరేమో డిసెంబరు నాటికని అంటున్నారు.. ఏది కరెక్ట్ అని పీడీ సురేందర్ ను ఎంపీ సీరియస్ గా ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితులోనైనా ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై డిసెంబరు నెలలో వెహికల్స్ వెళ్ళాలి..త్వరగా చేపట్టండని డీఈని ఎంపీ భరత్ ఆదేశించారు. పిల్లర్స్ నిర్మాణ పనులు పరిశీలించారు. విద్యుత్ లైన్లు మార్పును పరిశీలించారు. మిగిలిన బ్రిడ్జి లకు సంబంధించి డీపీఆర్‌లు నాకు ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా ఢిల్లీ వెళ్ళి శాంక్షన్ చేయించుకుంటానని పీడీ సురేందర్ కు ఎంపీ భరత్ తెలిపారు. టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లు రావడం ఇదంతా పెద్ద పనని, ఆలస్యం కాకుండా డీపీఆర్ లు పంపమని పీడీకి ఎంపీ భరత్ ఆదేశించారు. ‌కొద్దిసేపు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ భరత్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్మితా శుక్లా, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ సురేష్ గౌడ్, ప్రాజెక్ట్ కంట్రోలర్ చెన్నకేశవ, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

మల్లన్న బ్రహ్మోత్సవాలకు కట్టు దిట్టమైన భద్రత..

మల్లన్న బ్రహ్మోత్సవాలకు కట్టు దిట్టమైన భద్రత..

సిద్ధిపేట: యదార్థవాది ప్రతినిది

కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి ఆదివారం పట్నం వారం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత.. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొదటి ఆదివారం సందర్భంగా వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయడం జరిగిందాని, టెంపుల్ ఆవరణలో 80 సీసీ కెమెరాలతో పటిష్టమైన చేస్తున్నామని తెలిపారు. టెంపుల్ ఆవరణ చుట్టుపక్కల దర్శన ప్రదేశాలు ఒక సెక్టరుగా, పార్కింగ్ ప్రదేశాలు రెండవ సెక్టార్గా విభజించమని, విఐపి దర్శనం, శీఘ్ర దర్శనం, సాధారణ దర్శనం మూడు విభా మూడు విభాగాలుగా విభజించడం జరిగిందాని, భక్తులకు అన్నివేళలా అందుబాటులో ఇద్దరు ఏసీపీలు, 14 మంది సీఐలు, 17 మంది ఎస్సైలతో పాటు 273 పోలీస్ అధికారులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, హుస్నాబాద్ ఏసిపి సతీష్, ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, చేర్యాల సిఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, సీఐలు ఎస్సైలు పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఎన్సిసి స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు..

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోర్టులో మెడికల్ క్యాంప్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోర్టులో మెడికల్ క్యాంప్.

సిద్దిపేట: యదార్థవాది ప్రతినిది

లైన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట ఆధ్వర్యంలో ఆర్విఎం హాస్పిటల్ సహకారంతో సిద్దిపేట బార్ అసోసియేషన్ కోర్టు కాంప్లెక్స్ లో శుక్రవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఈ క్యాంపు ను జిల్లా జడ్జి ప్రిన్సిపల్ టి.రఘురాం జిల్లా అదనపు జడ్జి భవాని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ స్వాతి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి టి.రఘురాం మాట్లాడుతూ అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్యాంపులో 467 మంది ఓపి చెక్ అప్ చేసుకున్నారని, అందరు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.కార్యక్రమంలో జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జనార్దన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అడ్వకేట్లు సాయిబాబా, శ్రీకాంత్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, హరిహర రావు, రాములు, కమాలుద్దీన్, లైన్స్ క్లబ్ సిద్దిపేట్ అధ్యక్షుడు గంప రమేష్ జిఎస్టి కోఆర్డినేటర్ జోజి డైరెక్టర్ చింత భాస్కర్ కోఆర్డినేటర్ లగిశెట్టి నర్సింహులు ఆర్విఎం హాస్పిటల్ డాక్టర్స్ బృందం పాల్గొన్నారు..

కూడవెళ్ళి జాతర ఏర్పాట్లు పూర్తి

కూడవెళ్ళి జాతర ఏర్పాట్లు పూర్తి

సిద్దిపేట: యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కూడవెళ్ళి రామలింగేశ్వర స్వామి జాతర భద్రత ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్.. కూడవెళ్ళి వాగు పరివాహక పరిసరాలను, భక్తుల దర్శనం ఏర్పాట్లను పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దర్శన ప్రదేశాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని టెంపుల్ ఈఓ విశ్వనాధ శర్మ, పోలీస్ అధికారులకు సూచించారు. భూంపల్లి చౌరస్తా కూడవెళ్ళి కమాన్ నుండి వచ్చే వాహనాలు గ్రామ శివారులో చెరువు పక్కన పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రామేశ్వరం పల్లి నుండి వచ్చే వాహనాలు వాగు అవతల రామేశ్వరం పల్లి గ్రామ శివారులో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆర్టీసీ బస్సులకు టెంపుల్ సమీపంలో వాగు దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని, దర్శనానికి వచ్చే భక్తులు పోలీసుల సలహాలు సూచనలు తప్పక పాటించలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసిపి దేవారెడ్డి, ట్రాఫిక్ ఏసిపి ఫణీందర్, దుబ్బాక సీఐ కృష్ణ, టెంపుల్ ఈఓ విశ్వనాధ శర్మ, టెంపుల్ చైర్మన్ చంద్రం, మరియు పూజారులు కార్యవర్గ సభ్యులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం

ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం

జగిత్యాల: యదార్ధవాది ప్రతినిది

జగిత్యాల పురపాలక సంఘం అత్యవసర కౌన్సిల్ మీటింగ్ నిర్వహించి మాస్టర్ ప్లాన్ రద్దు చేసింది.. పట్టణంలోని మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేయడంతో శుక్రవారం కౌన్సిల్ మీటింగ్ నిర్వహించి మాస్టర్ ప్లాను రద్దు చేయలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సభ్యులు.. గ్రామాలను పట్టణంలో అనుసంధానం చేయకుండా, మళ్లీ మాస్టర్ ప్లాన్ కొరకు కమిటీ వేయాలని, ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలని కౌన్సిల్ ప్రభుత్వానికి పత్రం పంపింది….

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...