26.7 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 125

శబరిమల ఆదాయం రూ.318 కోట్లు.!

శబరిమల ఆదాయం రూ.318 కోట్లు.!

కేరళ: యదార్థవాది ప్రతినిది

రెండేళ్లు కరోనా విజృంభణ తర్వాత పూర్తి స్థాయిలో శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులకు అనుమతించారు..2018 లో అత్యధికంగా రూ.260 కోట్లు వచ్చాయని..శుక్రవారంతో వార్షిక తీర్థయాత్ర సీజన్ ముగియనుండగా.. ఈ సీజన్​లో ఇప్పటివరకు రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని, లెక్కింపు పూర్తయ్యేసరికి రూ.330 కోట్లకు చేరవచ్చని అధికారులు తెలిపారు. ఈ సారి భక్తులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని, చిన్నారులు సైతం దర్శనానికి పోటెత్తారని, మొక్కులు, కానుకలను అయ్యప్పకు సమర్పించారు. హుండీల్లో నోట్ల లెక్కింపు పూర్తయిందని,
కాయిన్లను లెక్కించాల్సి ఉందని, మరో రూ.ఏడు కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు..మొత్తం ఆదాయం రూ.330 కోట్ల చేరవచ్చని అధికారులు తెలిపారు..


బస్సులు ఎక్కడ ప్రయాణికులు ఇక్కడ

బస్సులు ఎక్కడ ప్రయాణికులు ఇక్కడ

ఆర్మూర్: యదార్ధవాది ప్రతినిది

బస్సులు ఎక్కడ ప్రయాణికులు ఇక్కడ

ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో బస్సులు లేక ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తూన్నారు స్కూళ్లు, కళాశాలలు, హాస్టళ్లు బుధవారం పునఃప్రారంభంకావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది బస్టాండ్ ప్రాంగణం ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది గంటకు ఒక్కటి బస్సు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారు..

పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు

పిడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు

రామగుండం: యదార్థవాది ప్రతినిది

అక్రమంగా తరలిస్తున్న, నిల్వచేసిన 40 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న రామగుండo టాస్క్ ఫోర్సు పోలీసులు.. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లో పిడియస్ రైస్ చుట్టప్రక్కల గ్రామాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇంటి వద్ద నిల్వ ఉంచిన మోటం రాజు అదుపులోకి తీసుకోవడం జరిగిందని మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

అందరు కంటి పరిక్షలు చేసుకోవాలి..

కంటి వెలుగు కేంద్రాలను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్


నిజామాబాద్: యదార్ధవాది ప్రతినిది

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కేంద్రాన్ని ఆర్మూర్ పట్టణంలో ప్రారంబించిన మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత..ఈ సందర్బంగా చేర్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు పైబడి వృద్ధుల వరకు కంటి వెలుగు కేంద్రాలకు వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకొని సరిపడ మందులు, డ్రాప్స్, అవసరమైతే కళ్లద్దాలు, తీసుకొవలని, కంటి సమస్యల పరిష్కరించులోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ షేక్ మున్ను, స్థానిక కౌన్సిలర్లు, బి.ఆర్.ఎస్. సీనియర్ నాయకులు, ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ, మహిళా సంఘాల ఆర్పీలు, మహిళా అధ్యక్షులు, సిస్టర్స్, ఆశా వర్కర్లు, వార్డ్ ఆఫీసర్లు, స్థానిక వార్డు ప్రజలు హాజరు అయ్యారు..

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన..ఎమ్మెల్యే

కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన..ఎమ్మెల్యే

మెదక్: యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని గురువారం మెదక్ ప్రారంభించిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేందర్ రెడ్డి.. ప్రతి ఒక్కరూ నయనానందకరంగా ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు సమస్య లేకుండా చేయాలన్న లక్ష్యము, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, మనం తినే రసాయన ఎరువులతో కూడుకున్న ఆహార పదార్థాల వల్ల కంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని పద్మా పిలుపునిచ్చారు…

రాష్ట్ర వ్యాప్తంగా 16533 కేంద్రాల్లో కంటి వెలుగు పరీక్షలు..

రాష్ట్ర వ్యాప్తంగా 16533 కేంద్రాల్లో, 1500 బృందాలు పనిచేస్తున్నాయి

హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు… ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత మహంతిలు పాల్గొన్నారు. బుదవారం ఖమ్మంలో కెసిఆర్ ఘనంగా కంటి వెలుగు ప్ప్రారారంబించారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. “రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలు పనిచేస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 16533 కేంద్రాల్లో కంటి వెలుగు పరీక్షలు చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. గ్రేటడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్ వాళ్ళు కావాలంటే జీహెచ్ ఎంసీ కి ట్విట్టర్, వెబ్ సైట్ లో రిక్వెస్ట్ పెట్డిన వెంటనే కంటి వెలుగు బృందాలు వస్తాయని, అంధత్వ సమస్యలు నిర్ములించాలన్నదే మా ప్రబుత్వ లక్షం అని తెలిపారు. 2018 మొదటి విడత కార్యక్రమం 8 నెలలో పూర్తి చేశాం. ఈసారి తెలంగాణలో తయారైన కళ్లద్దాలు మాత్రమే పంపిణీ చేయనున్నాం. 20 లక్షల కళ్ళజోళ్ళు పంపిణీ చేసే అవకాశముందని, స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా అంత కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. తెలంగాణలో కల్యాణ లక్ష్మీ, ప్రభుత్వ మెడికల్ కాలేజి, రైతు బంధు, కేసీఆర్ కిట్ ఇలాంటివి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.

నేషనల్ యూనిటీ 2023 అవార్డు..

నేషనల్ యూనిటీ 2023 అవార్డు..

అడ్వకేట్ జి. లక్ష్మణ్ కుమార్‌కు నేషనల్ యూనిటీ 2023 అవార్డు

మెదక్: యదార్థవాది ప్రతినిది

ప్రముఖ న్యాయవాదిగా మెదక్ జిల్లా ప్రజల గుర్తింపు పొందిన లక్ష్మణ్ కుమార్ వృత్తిపరమైన సేవలతో పాటు సామాజికంగానూ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నట్లు తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. రాజనారాయణ్ అన్నారు.. మెదక్ పట్టణానికి చెందిన అడ్వకేట్ జి. లక్ష్మణ్ కుమార్‌ను‌ తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరమ్ (టీఐఎఫ్) నేషనల్ యూనిటీ అవార్డుకు ఎంపిక చేసింది. సామాజిక సేవా సంస్థ అయిన టీఐఎఫ్ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుకునే నేషనల్ యూత్ డే కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్‌కు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. గురువారం హైదరాబాద్‌ బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత పరిషత్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ డాక్టర్ జి. చంద్రయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన పలువురు ప్రముఖులకు జాతీయ ఐక్యతా అవార్డులతో పాటు సామాజిక రంగంలో ఉత్తమ సేవలు అందించిన యువతకు యూత్ అవార్డ్స్ కూడా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగానే న్యాయ సేవలు అందించడానికి లక్ష్మణ్ ఎప్పుడూ ముందుంటారని సమాజంలోని పేద వర్గాలకు అండగా ఉండే వివిధ సంస్థలకు ఆయన వీలైనంత ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తుంటారని తన చుట్టూ ఉన్న సమాజానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకునే లక్ష్మణ్ కుమార్‌కు ఈ అవార్డు లభించడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మెదక్ న్యాయవాదుల సంఘం తెలిపింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అవార్డుకు ఎంపిక కావడం తనకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రేరణ ఇచ్చిందని ఈ పురస్కారంతో నా బాధ్యత మరింత పెరుగుతుంది అని అన్నారు.

రాపిడ్ యాక్షన్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్..

రాపిడ్ యాక్షన్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్..

ఆదిలాబాద్: యదార్థవాది ప్రతినిది

* పట్టణంలోని అన్ని సమస్యత్మక కాలనీలలో కవాతు నిర్వహణ.

* శాంతిని కోరుకుంటున్న జిల్లా ప్రజలు

రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల కవాతును ప్రారంబించిన జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్.. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల కవాతు గురువారం నుండి ఈ నెల 24 వరకు ఆదిలాబాద్ పట్టణం, ఉట్నూర్, బోథ్, నేరడిగొండ, జైనథ్, ఇచ్చోడా లలో వారం రోజులపాటు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలియజేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ప్రశాంతమైన వాతావరణంలో శాంతిభద్రతల సమస్యలు తల్లేత్తకుండా ముందస్తుగా, ర్యాలీలు నిర్వహిస్తుంటామాని, ఆర్ఏఎఫ్ శిక్షణలో భాగంగా వారం రోజులపాటు ఆదిలాబాద్ లో శాంతిని కోరుకుంటున్న జిల్లా ప్రజల విశేష స్పందన, కేంద్ర బలగాలను ఘనంగా స్వాగతించలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి పరిపాలన ఎస్ శ్రీనివాసరావు, అదిలాబాద్ పట్టణ డిఎస్పి వి ఉమేందర్, ఆర్ ఎ ఎఫ్ డి ఎస్ పి శశాంక్, ఒకటవ పట్టణ సీఐ కె సత్యనారాయణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ భద్రాతే మాకు ముఖ్యం..

మీ భద్రాతే మాకు ముఖ్యం..

విశాఖపట్నం: యదార్థవాది ప్రతినిది

విశాఖపట్నం మల్కాపురం పోలీస్ స్టేషన్ ట్రాపిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తులసీదాస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.. ఈ సంబదర్బంగా మాట్లాడుతూ పెండిగ్ లో ఉన్న చలనాలు కట్టలని, ప్రతి వాహనానికి రిజిస్టేషన్ పత్రాలు, ఇన్సరెంస్ పత్రాలు, వాహనాదారుని డ్రైవింగ్ లైసన్స్ తప్పకుండ వుండాలని తులసీదాస్ తెలిపారు. మీ యొక్క పాత ఈ చలానా పెండింగ్ లో ఉన్న వాటిని చెల్లించి పోలీసుల విధులకు సహకరించాలని, ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఈ చలనాలు ఒక్కసారే కట్టమని కాదు, సర్దుబాటు చేసుకుని స్వచ్ఛందంగా కట్టలని తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరాలి..కంటి వెలుగు కార్యక్రమం: సిఎస్ శాంతి కుమారి

రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరాలి..కంటి వెలుగు కార్యక్రమం: సిఎస్ శాంతి కుమారి

హైదబాద్: యదార్థవాది ప్రతినిది

రాష్ట్రం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి.. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ” తెలంగాణ కంటి వెలుగు ” మని, నేడు నుండి 33 జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రాష్ట్రం సంపూర్ణ అంధత్వ నిర్మూలన లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత కంటి వెలుగు ప్రారంబిచం, రాష్ట్రంలో మెదటి విడతలో సుమారు కోటి 75 లక్షల మందికి నిర్వహించం అన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...