28.2 C
Hyderabad
Friday, April 24, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 126

సంపూర్ణ అంధత్వ నిర్మూలన లక్ష్యంగా కంటి వెలుగు..జిల్లా కలెక్టర్

సంపూర్ణ అంధత్వ నిర్మూలన లక్ష్యంగా కంటి వెలుగు..జిల్లా కలెక్టర్

సిరిసిల్ల: యదార్థవాది ప్రతినిది

సిరిసిల్ల పట్టణం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమన్ని ప్రారంభించిన 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు అనురాగ్ జయంతి..ఈ సందర్బంగా మాట్లాడుతూ సంపూర్ణ అంధత్వ నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమమని, తెలంగాణ కంటి వెలుగు లాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. దృష్టి లోపాలు ఉన్న వారికి అవసరాన్ని బట్టి రీడింగ్ గ్లాస్ లు అందిస్తున్నామని, ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఫేజ్ ల వారీగా అన్ని గ్రామాలు, వార్డులలో కంటి వెలుగు శిబిరాలను, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యకమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం చక్రపాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య ,మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ విజయ్ కుమార్, పలువురు కౌన్సిలర్ లు పాల్గొన్నారు.

మొదలైన రెండో విడత కంటి పరీక్షలు..

మొదలైన రెండో విడత కంటి పరీక్షలు..

సిద్దిపేట: యదార్థవాది ప్రతినిది

మర్కుక్ మండలం అంగడికిష్టాపూర్ గ్రామంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు.. కంటి పరీక్షల తీరును పరిశీలించి కంటి పరీక్షల కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా వైద్య సిబ్బంది సూచనలు చేస్తూ ఫర్ఫెక్ట్ గా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి రీడింగ్ గ్లాస్ లను వెంటనే అందించాలని, ప్రెస్క్రిప్షన్ గ్లాసెస్ ను వారం రోజులలోగా తెప్పించి ఆశా కార్యకర్తల ద్వారా ఇంటి వద్దనే అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను తెలిపారు. ప్రతి కంటివెలుగు నిర్వహణ క్యాంపులో నిబంధనల మేరకు నాణ్యత ఏర్పాట్లను పరిశీలించాలని ల్వాలిటి కంట్రోల్ అబ్సర్వర్ డా. రాకేష్ ను ఆదేశించారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని జిల్లాలో 45 వైద్య బృందాలు పనిచేస్తాయని వాటిలో 35 గ్రామీణ, 10 బృందాలు పట్టణ ప్రాంతాలలో షెడ్యూల్ ప్రకారం కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలను అందిస్తామని తెలిపారు. 18 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేపించుకోవాలని తెలిపారు. రోజుకు ఒక క్యాంపు లో 100 నుండి 150 మందికి కంటి పరీక్ష చేస్తామని ఒక గ్రామంలో మూడు నుంచి నాలుగు రోజుల వరకు క్యాంపు నిర్వహించి చివరి వ్యక్తి వరకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు నిర్వహించుకునేలా ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు… రాష్ట్ర అట అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు గొప్ప కార్యక్రమని, పట్టణాలకు వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకునే స్థోమత లేని గ్రామీణ ప్రజలకు, పట్టణ ప్రాంతాలలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఎంత ఉపయోగకరమైనదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావించి కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారని, నిన్న ఖమ్మంలో పంజాబ్ మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశంసించి ఈ కార్యక్రమాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. కాశీనాథ్, కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర పరిశీలకులు డాక్టర్. శ్రీదేవి, వైద్యాధికారులు శ్రీనివాస్, శశిశ్రీ, ఆశాజ్యోతి, స్థానిక ఎంపీపీ జడ్పిటిసి సర్పంచ్ ఎంపీటీసీ తాసిల్దార్ ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతమైన సంపద వున్నా…ఈ దౌర్భాగ్యనికి కారణం బీజేపీ, కాంగ్రెస్ లే! సిఎం కెసిఆర్

అనంతమైన సంపద వున్నా…ఈ దౌర్భాగ్యనికి కారణం బీజేపీ, కాంగ్రెస్ లే.! సిఎం కెసిఆర్

ఖమ్మం: యదార్థవాది ప్రతినిది

బిన్నమైన మూడు వాతావరణాలు, కష్టించే మానవ సంపద, కోట్ల ఎకరాల సాగు భూమి, వేల టీఎంసిల జలరాశి, అనతంమైన సూర్యరశ్మి, విశాల తీరం ఉన్న మనదేశం ఎవరినో అడుక్కోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకోచిందని, ఈ దుర్మార్గానికి కారణభూతులు కాంగ్రెస్, బీజేపీ లే కారణమని బుదవారం ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.. ప్రపంచస్థాయి బెస్ట్ ఫుడ్ చైన్ గా ఉండాల్సిన మనం కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకోవడం విచారకరం కాదా? పామాయిల్ మనమే ఉత్పత్తి చేసుకోలేమా? అని ప్రశ్నించారు. 75 సంవత్సరాల తర్వాత కూడా దేశప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వలేమా? ఎవరి పాపం ఇది? అని అడిగారు. ఇవన్నీ సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని ఉద్గాతించారు. దేశంలో 4,10,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండీ … 2,10,000 మించి వాడడంలేదని, పంచాయితీలు పెట్టి ఉత్పాదక లేకుండా చేస్తున్నారని అన్నారు. ఉచితాల పేరుతో రైతులు, పెదలనూ అవమానిస్తున్నారు. భారతదేశం అంతా 24 గంటలు కరెంటు ఇచ్చినా లక్ష కోట్లకు మించి ఖర్చు కాదని, దీనికి మాత్రం మోడీకి మనసు రాదని అన్నారు. తెలంగాణ రైతుబంధు, 24 గంటల కరెంటు దేశమంతా ఇవ్వడం బీఆర్ఎస్ విధానమాని కెసిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, డిల్లి ముఖ్యమంత్రి కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్, సిపిఐ జాతీయ నేత డి రాజ మాట్లాడారు..

లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న..సీఎంలు

లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న..సీఎంలు

యాదాద్రి: యదార్థవాది ప్రతినిది

లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఢిల్లీ సీఎం కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవత్ మాన్, కేరళ సీఎం పినరాయి విజయం, ఉత్తప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర సినిమా ఆటోగ్రాఫి మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్ఎంబి శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత, ఎం ఎల్ సి శ్రీ జోగునపల్లీ సంతోష్ , జిల్లా కలెక్టర్ పమేలా సపతి , మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలిపిన మహనీయుడు రామారావు:

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలిపిన మహనీయుడు రామారావు:

విశాఖపట్నం: యదార్థవాది ప్రతినిది

తెలుగు జాతిని ప్రపంచం గౌరించేలచేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఖ్యాతి స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కే దక్కుతుందని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. విశాఖపట్నం గాజువాక పశ్చిమ నియోజకవర్గం లో రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ తరతరాలుగా ప్రతి మనిషి గుండెల్లో కొలువై ఎంతో పేరుగడించారని, పేదవాడికి తినడానికి తిండి రెండే రూపాయలకు కేజీ బియ్యం ప్రవేశపెట్టిన వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు. సినీ రంగంలో ఎన్నో కళ్ళలను పోషిస్తూ పోషిస్తూ కళా పోషకుడిగా నటసార్వభౌముడుగా నటనతో ప్రజలను మెప్పిస్తూ అటు రాజకీయంగా ఇటు సినీ రంగంలో తనదైన శైలిని చూపిస్తూ ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎన్టీ రామారావు అని చెప్పారు.

19న పాదుకా పూజ మహోత్సవం

19న పాదుకా పూజ మహోత్సవం

సిద్దిపేట: యదార్థవాది

వార్షికోత్సవ పాదుకా పూజ మహోత్సవం గురువారం జరుగుతుందని శ్రీధర శివరామ దీక్షిత అచల గురు తెలిపారు. శ్రీమద్ బృహద్వాశిష్ట శ్రీధర శివరామ దీక్షిత అచల గురు పీఠము సిద్దిపేట వారి అద్వర్యంలో ఈ కార్యక్రమములు జరుపబడును ఇట్టి కార్యక్రమమునకు ఆంధ్ర తెలంగాణ మరియు మహారాష్ట్ర కర్ణాటక నుండి అచల గురువులు విచ్చేస్తున్నారన్నారు. సిద్దిపేట పట్టణంలోని పటేల్ పుర కాలనీ శ్రీ గురు నిలయంలో జరుగుతుందని తెలిపారు.

కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకుందాం..

కంటి వెలుగు’ను సద్వినియోగం చేసుకుందాం..

సిరిసిల్ల: యదార్థవాది ప్రతినిది

దృష్టి లోపాలను సంపూర్ణంగా సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కంటి వెలుగు” కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అన్నారు.. బుధవారం కలెక్టరేట్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో రెండో విడత కంటి వెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను వివరించారు.. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఐఏఎస్, ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 19 తేదీన ప్రారంభించబోయే 26 కంటి వెలుగు క్యాంపులలో డ్రై రన్ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అలాగే ఈ క్యాంపులకు నిర్వహించడానికి కావలసిన సామాగ్రి ఆటో రిఫ్రాక్టర్ మిషన్ రీడింగ్ కళ్లద్దాలు ఐఇసి మెటీరియల్ సిబ్బంది మరియు ఇతర ముఖ్య అన్ని అంశాలను ఇప్పటికే సమకూర్చుకున్నామని తెలిపారు.

రోడ్డు విస్తరణపై పునరాలోచించాలి..

రోడ్డు విస్తరణపై పునరాలోచించాలి..

హుస్నాబాద్: యదార్థవాది ప్రతినిది

జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో అర్ అండ్ బి అధికారులు చేపడుతున్న రోడ్ల క్షేత్ర స్తాయిలో పరిశీలించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు. హుస్నాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఇండ్లను కోల్పోతున్న భాధిత కుటుంబాలతో కలిసి గడిపె మల్లేశ్ ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందచేశారు.. మాట్లాడుతూ ఆర్ అండ్ బి అధికారులు మార్కింగ్ చేసిన ఇండ్లు, ఇండ్ల స్థలాలను పరిశీలించాలని, హుస్నాబాద్ పట్టణంలో రద్దీలేని బస్ డిపో రోడ్ వెడల్పు చేపట్టావద్దని, ఈ విషయమై ఉన్నతాధికారుల క్షేత్ర స్తాయిలో పరిశీలించాలని మల్లేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు పూర్తిగా కొల్పోతున్న ఆడేపు సూర్యం, వెల్డండి రామ్మోహన్, వెల్డండి భాస్కర్, యాదమ్మ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు…

మూడు రాష్టాల్లో ఎన్నికలు..

మూడు రాష్టాల్లో ఎన్నికలు..

న్యూఢిల్లీ: యదార్థవాది ప్రతినిది

మూడు రాష్ట్రాల ఎన్నికల తేదీలను బుదవారం ఎన్నికల సంఘం విడుదల చేసింది.. త్రిపుర రాష్టంలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుండగా, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్టలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయితెలిపింది. మూడు రాష్టల ఫలితాలు మార్చి 2న ప్రకటించబడతాయి..

ఉక్రెయిన్‌ మంత్రి డెనిస్ మోనాస్‌టిస్కీ మృతి.!

ఉక్రెయిన్‌ మంత్రి డెనిస్ మోనాస్‌టిస్కీ మృతి.!

ఉక్రెయిన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది..హెలికాప్టర్ కూలిపోవడంతో ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి డెనిస్ మోనాస్‌టిస్కీ సహా 16 మంది మృతి తెలుస్తుంది.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు..కీవ్‌ రాజధాని నగరం సమీపంలోని బ్రోవరీ ప్రాంతంలో ఒక కిండర్‌గార్డెన్‌ పాఠశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన అనంతరం దృశ్యాలు వైరల్‌గా మారాయి… ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక అధికారులు వెల్లడించారు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...