28.2 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 127

ఆలయం అభివృద్ధి జరగాలి..

ఆలయం అభివృద్ధి జరగాలి..

సిద్దిపేట: 16 యదార్థవాది ప్రతినిది

దుబ్బాక నియోజకవర్గం లోని పెద్ద గుండవెల్లి రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలోకి నియోజకవర్గం పలువురు ప్రజలు కోరుతున్నారు..రేణుక ఎల్లమ్మ దేవాలయానికి సిద్దిపేట జిల్లా కాకుండా ఇతర రాష్ట, జిల్లాల నుండి ప్రతి ఆదివారం, మంగళవారాల్లో జాతర సందడి, పెద్ద సంఖ్యలో అమ్మవారిని భక్తులు దర్శనం చేసుకుంటారు.
ఈ దేవాలయాన్ని దేవదాయ శాఖ అధీనంలోకి తీసుకుంటే సంబంధిత అధికారి, చైర్మన్ ఆలయ అభివృద్ధి వారి ఆధీనంలో ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇలాంటి అధికారి లేక, పాలకవర్గం లేక ఇస్తాను సరంగా, అక్కడ వుండే నాయకులదే పెత్తనం. ఇప్పటికైనా పెద్ద గుండా వెళ్లి రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖలో చేర్చి ఆలయ అభివృద్ధికి పలువురు కోరుతున్నారు..

ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కళ్యాణ్

ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కళ్యాణ్

వారాహికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు గాను పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రచార రథాన్ని సిద్దం చేసుకన్నారు. ఈ ఎన్నికల ప్రచార రథానికి వారాహి అని నామకరం చేశారు. ఈవాహనానికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తెలంగాణ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అనుష్టువ్ నరసింహ యాత్రను చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని నరసింహస్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు.

యువకులే లక్ష్యంగా హనీట్రాప్

యువకులే లక్ష్యంగా హనీట్రాప్

ఇద్దరు మహిళలు సహా 12 మంది అరెస్ట్

హైదరాబాద్: యువకులను లక్ష్యంగా చేసుకొని హనీట్రాప్ చేస్తున్న ముఠాను హైద్రాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.ఈ ముఠా నుండి రెండు డమ్మీ పిస్టళ్లతో పాటు రూ. 1.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ ముఠాకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర ఇవాళ మీడియాకు వివరించారు. మహిళలతో వ్యాపారులు, యువకులకు వల వేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా డీసీపీ చెప్పారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా ఈ తరహా ఘటనలు మరో మూడు కూడా వెలుగు చూశాయని డీసీపీ తెలిపారు. అమాయకంగా ఉండే యువకులను లక్ష్యంగా చేసుకొని మహిళతో హనీట్రాప్ చేయిస్తున్నారని పోలీసులు చెప్పారు. తాము ఎంచుకున్న యువకుడు లేదా వ్యాపారుల వద్దకు మహిళను పంపి పరిచయం పెంచుకొనేలా చేస్తారు . మహిళ …బాధితులతో ఫోటోలు దిగుతుంది. బాధితుడు మహిళను నమ్మినట్టుగా భావించిన తర్వాత ఈ ముఠాలోని ఇతర సభ్యులు రంగంలోకి దిగుతారని డీసీపీ రాజేష్ చెప్పారు. తాము ఎంచుకున్న వారిని హోటళ్లకు వచ్చేలా ప్రేరేపిస్తారని కూడా తమ దర్యాప్తులో గుర్తించినట్టుగా పోలీసులు చెప్పారు. హోటళ్ల వద్దకు వచ్చిన సమయంలో ఫోటోలు తీసి బ్లాక్ మెయిళ్లకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.మహిళతో బాధితుడి దిగిన ఫోటోను చూపి బెదిరింపులకు పాల్పడుతారని పోలీసులు తెలిపారు. పోలీస్ శాఖ, మీడియా అంటూ బాధితులను నిందితులు బెదిరించేవారని పోలీసులు చెప్పారు. గత ఏడాది జూన్ నుండి డిసెంబర్ వరకు సెంట్రల్ జోన్ పరిధిలో ఆరు కేసులు నమోదైనట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఇంకా ఎవరెవర్ని మోసం చేసిందనే విషయమై ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ముఠా ఇప్పటికే సుమారు రూ. 8.5 లక్షలను దోచుకుందని తమ దర్యాప్తులో గుర్తించామని పోలీసులు వివరించారు.

ఈ ముఠాలో ముగ్గురు మహిళలున్నారని పోలీసులు తెలిపారు. ముఠాలో సభ్యరాలిగా ఉన్న ఓ మహిళ పరారీలో ఉందని డీసీపీ రాజేష్ చెప్పారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా చెప్పారు. అరెస్టైన నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

మానవత్వం చాటుకున్న పోలీసులు

మానవత్వం చాటుకున్న పోలీసులు
ములుగు జిల్లా
పందికుంట స్టేజి మల్లంపల్లి మధ్య మూల మలుపు వద్ద అదుపు తప్పి కారు బోల్తాపడి హైదరాబాద్ కి చెందిన మేడిశెట్టి సారంగ పాణి,చందర్, ప్రతిమలు తీవ్ర గాయాల పాలయ్యారు, పాలంపేట రామప్ప సందర్శన కి వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రమాదం చోటు చేసుకుంది.అటువైపుగా ఖమ్మం సభకు బందోబస్తుకు వెళ్తున్న వెంకటాపూర్ ఎస్సై తాజుద్దీన్, ములుగు ఎస్సై పవన్ క్షతగాత్రులను కారులో నుంచి బయటికి తీసి 108 సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదాం..

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదాం..

సిద్దిపేట:16 యదార్ధవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లాలో కంటి వెలుగు ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. గజ్వేల్ నియోజకవర్గం అన్ని మండలాలలో కంటి వెలుగు ఏర్పాట్లను సోమవారం అధికారులతో పరిశీలించారు. సెంటర్ పనిచేసే అప్తామెట్రిక్ డాక్టర్, డాటా ఎంట్రి ఆపరేటర్, సుపర్ వైజర్, ఎఎన్ ఎమ్, ఆశా సిబ్బందితో మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చెయడంలో ప్రజాప్రతినిధులు, భాగస్వామ్యం కావాలన్నారు. ఇంత గోప్ప కార్యక్రమం ప్రజలకు వివరించలని, ప్రతి సెంటర్ రప్పించెలా చర్యలు తీసుకోవాలని, సిబ్బంది రోజు 8:30వరకు సెంటర్ కి చేరుకోవాలి. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం గా పూర్తి చేసి సిద్దిపేట జిల్లాను ప్రథమ స్థానంలో నిలపలాని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కలెక్టర్ వెంట డిఎంఎచ్ ఒ కాశీనాథ్, గజ్వేల్ డివిజన్ డిప్యూటీ డిఎంఎచ్ ఓ విజయరాణి, ఎంపిడిఒ లు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

పసుపు రైతులను ఆదుకోవాలి..

పసుపు రైతులను ఆదుకోవాలి..

నిజామాబాద్: యదార్థవాది ప్రతినిది

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు సోమవారం పత్రిక సమావేశం నిర్వహించారు.. పసుపు రైతులకు మద్దతు ధర ప్రకటించాలి, 2019 పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన రైతులు సమావేశం నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుండి పసుపు కు మద్దతు ధర లేక నష్టపోతున్నామని, ఇప్పటికైనా పసుపు రైతులకు లాభం చేకూర్చే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర క్వింటాలుకు రూ. 15000 ప్రకటించాలని, ఎర్రజొన్న రైతులు చేసిన విధంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తామని తెలిపారు. క్వింటాల్గు 6000 రూపాయల కంటే ఎక్కువ రావటం లేదు, ప్రక్కనున్న రాష్ట్రాలు ఇచ్చినట్లు క్వింటాల్కు మూడు వేల రూపాయల బోనస్ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని లేకుంటే ఎమ్మెల్యేలను ఊర్లలో తిరగనియ్యమని పసుపు రైతులు తెలిపారు. ఈ విషయంలో ఎంపీ అరవింద్ రైతులకు మేలు చేయలని తెలిపారు. ఈ సమావేశంలో కొమ్ముల సంతోష్, పడిగల ప్రవీణ్, బద్దం సురేష్, తిరుపతి వన్నెల్, సంటి లింగారెడ్డి, సంటోల్ల గంగారెడ్డి,
గంగారెడ్డి ,సాయిరెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

సిరిసిల్ల: యదార్థవాది ప్రతినిది

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 14 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఇంచార్జి డి.ఆర్.ఓ టి. శ్రీనివాస్ , ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదల.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదల.

తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు… రెండో విడత మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్‌ 6 వరకు సమావేశాలు.
ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12 వరకు తాత్కాలిక విరామం.
జనవరి 31 నుండి ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.
తొలిసారి పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.

జనవరి 31న ఉదయం గం.11.00లకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఫిబ్రవరి 1న ఉదయం గం.11.00లకు లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని నిరసిస్తూ బోగిమంట

*విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని నిరసిస్తూ బోగిమంట*
*బోగిమంటల్లో ఒక కట్టె వేసి మోడీ విధానాన్ని తిప్పికొట్టండి*
*_ ప్రజలకు ప్రజాసంఘాలు పిలుపు*
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను మోడీ ప్రభుత్వం అమ్మడాన్ని నిరసిస్తూ శుక్రవారం మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియం జంక్షన్‌లో ప్రజాసంఘాలు బోగిమంట ఏర్పాటు చేసాయి. సిఐటియు, ఐద్వా, డివైఎఫ్‌ఐ, ప్రజానాట్యమండలి, వార్వా, నివాస్‌, ఎస్‌.ఎఫ్‌.ఐ తదితర సంఘాలు, కాలనీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని భోగిమంటలో ఒక్కో కట్టె వేసి సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌, స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం, ప్లాంట్‌ అమ్మకం ఆపాలి, అమ్మేదెవడురా` కొనేదెవడురా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, పబ్లిక్‌ సెక్టార్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ కో కన్వీనర్‌ కె.ఎం.కుమార్‌ మంగళం మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు అవుతోందన్నారు. నాటి నుండి నేటి వరకు స్టీల్‌ప్లాంట్‌ రక్షణకోసం ప్రజాసంఘాలు, కార్మికసంఘాలు ఐక్యంగా ప్రజలను, కార్మికులను కదిలించి ఉద్యమిస్తున్నారని గుర్తుచేసారు. ఈ ఏడాది ప్రజా ఉద్యమంగా మలిచేందుకు సంక్రాంతికి ముగ్గులు వేసి సేవ్‌ స్టీల్‌ప్లాంట్‌ నినాదాలు వ్రాయాలని సిఐటియు పిలుపునిస్తే దానిని ప్రజలు అందిపుచ్చుకున్నారన్నారు. భోగి మంటల్లో కూడా ప్రతి ఇంటి నుండి ఒక కట్టె, పిడక వేసి మోడీ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. భోగిమంటల్లో కట్టెలు వేసి నిరసన తెలపాలన్న ప్రచారం ఇప్పటికే సోషల్‌మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మే ప్రతిచర్యను ప్లాంట్‌ కార్మికులు, విశాఖ ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు. ప్లాంట్‌ అమ్మకపు బాధ్యత బిజెపి ప్రభుత్వం ఆ పార్టీ ఎంపి జివిఎల్‌ నరసింహరావుకు అప్పగించడంతో విశాఖకు తరుచూ వస్తున్నారన్నారన్నారు. ప్లాంట్‌ ప్రైవేట్‌పరం అయితే బిజెపిని, ఆ నాయకులను ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని నాయకులు హెచ్చరించారు. ప్లాంట్‌ ఉత్పత్తిని తగ్గించి తద్వారా నష్టాలనే భూతాన్ని చూపి అమ్మేసే చర్యలు విశాఖపట్నంలో చెల్లవన్నారు. ఈ చర్యలు ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించి స్టీల్‌ప్లాంట్‌ను, ఆంధ్రరాష్ట్రాన్ని కాపాడుకుంటారని స్పష్టం చేసారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.మణి, ఎ.సీతాలక్ష్మి, పి.వెంకటరావు, జె.ఆర్‌.నాయుడు, శ్రీను, వరలక్ష్మి, ఐద్వా నాయకులు కె.కుమారి, లలిత, డివైఎఫ్‌ఐ నాయకులు తులసీ, కె.జె.రావు శివ, వార్వా, పెన్షనర్స్‌ నాయకులు వి.తులసీరాం, చలపతి, త్రినాదరావు, దేముడు, అప్పారావు, ప్రదీప్‌, పిఎన్‌ఎం నాయకులు ఎం.చంటి, పివి రమణ తదితరులు పాల్గొన్నారు.

భద్రకాళి సహిత వీరభద్ర స్వామి..జాతర

భద్రకాళి సహిత వీరభద్ర స్వామి..జాతర

హుస్నాబాద్: 14 యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం సముద్రాల గ్రామంలో భద్రకాళి సహిత వీరభద్ర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులు బొమ్మ శ్రీరామ్.. కోహెడ మండలం భద్రకాళి సహిత వీరభద్ర స్వామిని సంక్రాతి జతరలో పాల్గొనడం చాల అనడంగావుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోహెడ బిజెపి అధ్యక్షులు ఖమ్మం వెంకటేశం, మాజీ సర్పంచ్ పిల్లి రాజయ్య, ఉపసర్పంచ్ వంగర ముకుందా రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నాగిరెడ్డి సంజీవరెడ్డి, వైస్ చైర్మన్ గుండా ప్రసాద్, వేముల రమేష్, భాస్కర్, చిన్న మల్లారెడ్డి, చిరంజీవి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...