31.2 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 128

పర్యావరణానికి హనిచేస్తే కట్టినా చర్యలు..ఎస్పీ సింధూ

పర్యావరణానికి హనిచేస్తే కట్టినా చర్యలు..ఎస్పీ సింధూ

జగిత్యాల: 14 యదార్థవాది ప్రతినిది

* ప్రభుత్వ నిషేధిత మాంజా ఉపయోగిస్తే కట్టినా చర్యలు…

జగిత్యాల జిల్లాల్లో సంక్రాంతికి ఆకాశంలో గాలి పటలతో పాటు పక్షులను ఎగరనిదామని జిల్లా ఎస్పీ సింధూ శర్మ అన్నారు. గాలి పటాలు ఎగరడం కోసం వినియోగించే గాంజా పూత పూసిన నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి ముప్పని, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా పూర్తిగా నిషేధించడం జరిగిందని, చైనా మాంజా నిల్వచేసిన, రవాణా చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సింధూ శర్మ తెలిపారు. జిల్లలో వున్నా అన్ని పోలిస్ స్టేషన్ పరిదిలో తనికిలు చేస్తున్నామని, ప్రజలు ఎవరైనా చైనా మాంజా నిల్వచేసిన, రవాణా చేసినట్లు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లకు గాని డయల్ 100 గాని ఫోన్ చేసి తెలపాలని తెలిపారు.

ఏసిబి వలలో బహదూర్ పుర యస్ ఐ

కస్టడీ లో ఉన్న ఫోన్ తిరిగి ఇవ్వడానికి 10 వేల రు లంచం అడగగా ఏ సి బి నీ ఆశ్రయించిన పాత బస్తీకి చెందిన యువకుడు అనంతరం యస్ ఐ కి 8000 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రిమాండ్ కు తరలించిన ఏ సి బి

మానవత్వం చాటుకున్న దుబ్బాక ఎమ్మెల్యే

మానవత్వం చాటుకున్న దుబ్బాక ఎమ్మెల్యే

సిద్దిపేట: 14 యదార్థవాది ప్రతినిది

దుబ్బాక నియోజకవర్గం లోని అక్బర్ పేట భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన బండకాడి నర్సింలు కొన్ని రోజుల క్రితం చిట్టాపూర్ గ్రామం వద్ద ప్రమాదవషాత్తు బావిలో పడి మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులకు అండగా నిలబడతానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాటిచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే 50,000 అందజేసిన ఎమ్మెల్యే రఘునందన్ రావు శనివారం మిగతా 50 వేలు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం వారి కుటుంబసభ్యులకు సహాయం అందజేశారు. వారి కూతురు ఉన్నత చదువులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తన సొంత ఖర్చులతో చదివిపిస్తానని వారి కూతురు కోరిక మేరకు బీఎస్సీ నర్సింగ్ చదివిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

భారత్‌ జోడో యాత్ర’లో విషాదం

భారత్‌ జోడో యాత్ర’లో విషాదం

చండీగఢ్‌: 14 యదార్థవాది ప్రతినిది

కాంగ్రెస్‌ రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్‌ జోడో యాత్ర’లో విషాదం అలుముకుంది.. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్‌ చౌధరీ గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర పంజాబ్‌లోని ఫిలౌర్‌ ప్రాంతంలో శనివారం ఉదయం యాత్రలో పాల్గొని రాహుల్‌ గాంధీతో కలిసి నడిచిన జలంధర్‌ ఎంపీ సంతోఖ్‌ సింగ్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను లూధియానాలోని ఆసుపత్రికి తరలింగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంపీ మరణవార్త విన్న రాహుల్‌ యాత్రను నిలిపివేసి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. సంతోఖ్‌ సింగ్‌.. 1946 జూన్‌ 18న జలంధర్‌లోని ధలివాల్‌ ప్రాంతంలో జన్మించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ హయాంలో కేబినెట్‌ మంత్రిగా పనిచేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. ఎంపీ సంతోఖ్‌ సింగ్ కు ప్రముఖుల సంతాపం..తెలిపిన వారిలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, ఎంపీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సంతోఖ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు..

రూ. లక్ష చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం

రూ. లక్ష చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం

అనంతపుర్: 14 యదార్థవాది ప్రతినిది

రూ. 30ఇవ్వాలని డిమాండ్ చేసిన డెలివరీ బాయ్..

రూ. లక్ష చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం

రూ. 30 ఇవ్వనందుకు గ్యాస్ డెలివరీ బాయ్ సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిన ఘటనలో వినియోగదారుల ఫోరం కీలక తీర్పు చెప్పింది. వినియోగదారుడికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అనంతపురంలో జరిగిందీ ఘటన. బాధిత వినియోగదారుడికి స్థానిక గుత్తిరోడ్డులోని హనుమాన్ ఏజెన్సీలో హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉంది. 7 అక్టోబరు 2019లో రీఫిల్ సిలిండర్ బుక్ చేశాడు. సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ అదనంగా రూ. 30 ఇవ్వాలని కోరాడు. అందుకు వినియోగదారుడు నిరాకరించడంతో తెచ్చిన సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిపోయాడు. దీంతో వినియోగదారుడు పౌరసరఫరాల అధికారికి ఫిర్యాదు చేయడంతో డెలివరీ బాయ్ తిరిగి సిలిండర్‌ను తీసుకొచ్చి ఇంటిముందు పెట్టి వెళ్లిపోయాడు. ఈ మొత్తం ఘటనను ఆయన ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లాడు. వారు దీనిని లైట్‌గా తీసుకున్నారు. సరఫరా ఖర్చులు ఉంటాయని, వాటిని ఇవ్వాల్సిందేనంటూ డెలివరీ బాయ్‌ను సమర్థించారు. అంతేకాక, వినియోగదారుడిని ఆ తర్వాతి నెలలో మరో ఏజెన్సీకి బదిలీ చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన వినియోగదారుడు ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత జిల్లా వినియోగదారుల ఫోరాన్ని కూడా ఆశ్రయించారు. సిలిండర్‌ను సరైన సమయంలో డెలివరీ చేయకపోవడం వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఫోరం దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన ఫోరం గ్యాస్ ఏజెన్సీకి, ఏపీ పౌర సరఫరాల సంస్థకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. అయితే, డెలివరీ బాయ్‌ను తొలగించామని, కాబట్టి పరిహారం చెల్లించాల్సిన పనిలేదని ఏజెన్సీ వాదించింది. వాదనలు విన్న ఫోరం వినియోగదారుడికి జరిగిన నష్టానికి గాను పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది..

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

25,050 మంది అభ్యర్థులు అర్హులు

మెయిన్‌ పరీక్ష విధానం 18వ తేదీన వెల్లడి

హైకోర్టు ఆదేశాలతో సమాంతర రిజర్వేషన్లు

ప్రతి సామాజిక వర్గంలో 1:50 మంది ఎంపిక

హైదరాబాద్‌ : గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఫలితాలను టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. జూన్‌లో మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. దేశంలోనే తొలిసారిగా సామాజికన్యాయాన్ని అనుసరించి మెయిన్‌కు అభ్యర్థులను ఎంపిక చేశారు. దేశంలో తొలిసారిగా అన్ని సామాజికవర్గాలకు సమన్యాయాన్ని టీఎస్‌పీఎస్సీ అమలు చేసింది. ప్రతి సామాజికవర్గం నుంచి 50 మందిని ఎంపిక చేయగా, మొత్తం 25,050మంది మెయిన్‌కు అర్హత సాధించారు. తొలుత 1:50 నిష్పత్తిలో మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 503 ఉద్యోగాలకు ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తే.. 25,150 మంది మెయిన్‌కు అర్హత* *సాధించాలి.అయితే మల్టీజోన్‌-2లో మహిళల క్యాటగిరీలో దృష్టిలోపం, జనరల్‌ క్యాటగిరీలో వినికిడిలోపం ఉన్న* *అభ్యర్థులు 111 మంది తక్కువగా ఉన్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న కమిషన్‌ మెయిన్‌కు 25,050* *మందిని ఎంపిక చేసింది.హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో సమాంతర విధానంలో ఎంపిక చేపట్టింది. ఏ క్యాటగిరీలోనూ క్వాలిఫై మార్కుల ప్రకారం* *మెయిన్‌కు ఎంపిక చేయలేదు. యూపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ వంటి కమిషన్లు ప్రిలిమ్స్‌ పరీక్షా ఫలితాల విడుదలలో అభ్యర్థులు సాధించిన క్వాలిఫై మార్కులను
వెల్లడించవు.

503 మొత్తం పోస్టులు

3,80,081 దరఖాస్తుదారులు

2,85,916 ప్రిలిమ్స్‌కు హాజరు

25,050 మెయిన్‌కు ఎంపిక

5 ప్రశ్నల తొలగింపు

రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ గత ఏడాది ఏప్రిల్‌ 26న నోటిఫికేషన్‌ వెలువరించింది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,85,916 మంది హాజరయ్యారు. అక్టోబరు 29న ప్రాథమిక కీ ప్రకటించి, అభ్యంతరాలను ఆహ్వానించింది. నిపుణుల కమిటీతో చర్చించి నవంబర్‌ 14న ఫైనల్‌ కీ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలపై సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలించి 5 ప్రశ్నలను తొలగిస్తూ కమిషన్‌ నవంబర్‌ 15న తుది కీ ప్రకటించింది. మాస్టర్‌ ప్రశ్నపత్రం ప్రకారం 29, 48, 69, 82, 138 ప్రశ్నలను తొలగించింది. గ్రూప్‌ -1 పరీక్షలో మొత్తం 150 మారులకు 5 ప్రశ్నలను తొలగించినందున.. మిగిలిన 145 ప్రశ్నలకు వచ్చిన మారులను 150 మారులకు దామాషా పద్ధతిలో వర్తింపజేసి, తుది మారులను లెకించింది. ఉదాహరణకు.. 145 మారులకు 120 వస్తే 150కి లెకించి 124.137గా నిర్ణయించారు. ఇలా మూడో డెసిమల్‌ పాయింట్‌ వరకు పరిగణనలోకి తీసుకొని తుది మెరిట్‌ జాబితాను కమిషన్‌ రూపొందించింది. ఆ లెక్క ప్రకారమే మెయిన్‌ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే, బబ్లింగ్‌లో పొరపాట్లు చేసిన అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు పరిగణలోకి తీసుకోలేదని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ తెలిపారు. ఒకవేళ రెండు లేదా అంతకంటే ఎక్కువమంది అభ్యర్థులు, స్థానికత సమానంగా ఉంటే.. పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు.

పూర్తి సమాచారం కోసం..

ఈ నెల 18వ తేదీన మెయిన్‌ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను http://ww w.tspsc gov in వెబ్‌సైట్‌లో పొందు పరుస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. పూర్తి సమాచారం కోసం టీఎస్‌పీఎస్సీ హెల్ప్‌లైన్‌ 040-2244 5566, 040-23542185, 040-23542 187 నంబర్లలో (ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) సంప్రదించాలని సూచించారు.

కోర్టు కేసులతో ఫలితాల జాప్యం

అక్టోబర్‌ నెలలోనే ప్రిలిమ్స్‌ ఫలితాలు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో ఆలస్యమైంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలకు బుధవారమే హైకోర్టు బెంచ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో శుక్రవారం టీఎస్‌పీఎస్సీ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల చేసింది. ప్రిలిమ్స్‌ ఫలితాలకు మెయిన్‌ పరీక్షకు కనీసం 3 నెలల సమయం ఇవ్వాలని కమిషన్‌ భావించింది. అయితే.. మే 28వ తేదీన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జూన్‌ నెలలో మెయిన్‌ పరీక్ష నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. అభ్యర్థులకు లభించనున్న 6 నెలల విరామం వారి ప్రిపరేషన్‌కు ఉపకరించనున్నది.

ఉపాధ్యాయులకు త్వరలో తీపి కబురు..!

ఉపాధ్యాయులకు త్వరలో తీపి కబురు..!

హైదరాబాద్‌: యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు త్వరలో తిపికబురు మంత్రి హరీశ్‌రావు… ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను చేపట్టేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, సంక్రాంతి కానుకగా త్వరలోనే షెడ్యూల్‌ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పీఆర్‌టీయూటీఎస్‌ నూతన సంవత్సరం డైరీని మంత్రి ఆవిష్కరించి, ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్యే కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కనుమరుగైన సంప్రదాయాలు

కనుమరుగైన సంప్రదాయాలు

సిద్దిపేట: 13 యదార్థవాది ప్రతినిది

* మరీనా సంక్రాంతి సంబరం..

* అడునికతతో అంతరించి పోతున్న పండగలు..

మారుతున్న కాలంలో సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి.. సంక్రాంతి అనగానే మూడురోజుల సబరలతో ప్రజలందరూ జరుపుకునే సంతోషకరమైన సంబరం.. సంక్రాంతి అంటేనే గంగిరెద్దుల నాట్యాలు, హరిదాసుల సంకీర్తనలు, ఇళ్ల ముంగిట రంగవల్లులు, వాటి మధ్య గొబ్బెమ్మలు.. వెరసి పల్లెల్లో సంబురం వెల్లివిరుస్తుండేది. వేర్వేరు ప్రాంతాల్లోని బంధువులందరూ ఒక్క చోటకు చేరి ఆనందంగా గడిపేవారు. కానీ మారుతున్న కాలంలో సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. నేటి తరం పిల్లలు గంగిరెద్దులు, హరిదాసులు అంటే ఏమిటి అనే పరిస్థితి ఏర్పడింది. ఇళ్లలో తయారు చేసే పిండి వంటల స్థానంలో రెడీమేడ్‌ వంటలు చోటు చేసుకుంటున్నాయి. సంక్రాంతి ఎగురవేసే గాలిపటల రెడీమేడ్‌ మంజల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడంతో సంతోషం కాస్త, విషాదంగా మారుతుంది.

సంక్రాంతి ముగ్గుల పోటీలు

సంక్రాంతి ముగ్గుల పోటీలు

హుస్నాబాద్:13 యదార్థవాది ప్రతినిది

గ్రామంలో పండుగా వాతావరణం..

హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ముద్దస్తూ ముగ్గుల పోటీలను నిర్వహించిన కర్ణ కంటి మంజులారెడ్డి.. పెద్దేతున మహిళలు పాల్గొని వారి వారి నైపుణ్యాలతో చూపరులను ఆకర్షిన్చేవిదంగా విదంగా కలర్ కలర్ రంగులతో వివిద రుపాల, చిత్రాల రూపంలో ముగ్గులను వేసి ఒకరు కాదు అందరు బహుమతులు పొందే విదంగా వేయడంతో అందరికి గ్రామ సర్పంచ్ అందె స్వరూప తో కలిసి బహుమతులను అందచేశారు..

ప్రగతి భవన్ లో గోదాదేవి కళ్యాణం..

ప్రగతి భవన్ లో గోదాదేవి కళ్యాణం..

హైదరాబాద్:13 యదార్థవాది ప్రతినిది

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు దంపతుల ఆధ్వర్యం లో..ప్రగతి భవన్ లో ఘనంగా గోదాదేవి కళ్యాణం.. పవిత్ర హృదయంతో శ్రీ రంగనాథుని నిత్య పూలమాలతో సేవించి, ఆ శ్రీవారికే తన జీవితాన్ని అర్పించిన మహా భక్తురాలు గోదాదేవి కళ్యాణ మహోత్సవం, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగింది. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు శోభమ్మ దంపతుల ఆధ్వర్యం లో ఆనందోత్సాహాల నడుమ కన్నుల పండుగ కొనసాగింది. హిందూ సంప్రదాయం ప్రకారం..ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీ ఆండాళ్ అమ్మ వారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో సీఎం గారి సోదరీమణులు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...