31.2 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 129

మహిళకు చదువు ఎంతో అవసరం

మహిళకు చదువు ఎంతో అవసరం

సిద్దిపేట: 13 యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట సబ్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జ్, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ స్వాతి రెడ్డి సిద్దిపేట పట్టణంలోని భరోసా సెంటర్ సందర్శించారు.. భరోసా సెంటర్, సఖి సెంటర్, స్నేహిత మహిళ సహాయక కేంద్రం సిబ్బందితో మాట్లాడుతూ మహిళలు, పిల్లల రక్షణ, లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాల చేపట్టి, లైంగిక వేధింపు కేసులను తగ్గించవచ్చని తెలిపారు. తెలిసి తెలియని వయస్సులో తప్పులు చేస్తుంటారని, ఎలాంటి పొరపాట్లు చేయవద్దని, పిల్లలు మహిళా మనుగడకు చదువు చాలా ముఖ్యమని, చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, భరోసా, సఖి, స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్, నిర్వాహకులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కోడి పందాలు ఆడితే చర్యలు తప్పవు

కోడి పందాలు ఆడితే చర్యలు తప్పవు

రామగుండం: 13 యదార్థవాది ప్రతినిది

తెలంగాణలో కోడి పందాలు, జూదం, పేకాట అనుమతి లేదు..

సంక్రాంతి పండగా సందర్భంగా కోడి పందాలు, జూదం, పేకాట ఆడినా నిర్వహించిన చట్టప్రకారం కట్టినా చర్యలు తీసుకుంటామని చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ విద్యా సాగర్ తెలిపారు. నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమానిత కోడి పంద్యలు ఆడెవారికి కౌన్సిలింగ్ నిర్వహించి, వారిని బైండొవర్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా ఉంటుందని, కోడిపందాలు, పేకాటకు అనుమతులు లేవని విద్యా సాగర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పేకాట కోడి పందాలకు దూరంగా ఉండాలని తెలిపారు.

పరీక్షల్లో మార్పు చేసిన పోలీస్‌ నియామక మండలి

పరీక్షల్లో మార్పు చేసిన పోలీస్‌ నియామక మండలి..

హైదరాబాద్‌: 13 యదార్థవాది ప్రతినిది

పోలీస్‌ నియామక మండలి నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి తుది రాత పరీక్షల (మెయిన్స్‌) తేదీల్లో మార్పులు చేసింది. ఎస్సై (ఐటీ), ఏఎస్సై (ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది. పరీక్షల సమయంలో ఇతర పరీక్షలు ఉన్నాయని, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చేసిన విజ్ఞప్తి మేరకు తేదీల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30వ తేదీకి, కానిస్టేబుల్ (ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి, ఎస్సై(ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసినట్లు టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ వెల్లడించింది… తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుచేసుకోగా 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు. ప్రాథమిక పరీక్షా ఫలితాలను కూడా టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ ఇదివరకే వెల్లడించింది. సివిల్‌ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్‌ కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్షలో 31.40శాతం, రవాణా కానిస్టేబుల్‌ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిందరికి దేహధారుడ్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి తుది పరీక్ష నిర్వహించి, ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తుది పరీక్షను తొలుత ప్రకటించిన తేదీల్లో కాకుండా కొత్త తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించింది…

బిజెపి కార్పొరేటర్ మృతి..

బిజెపి కార్పొరేటర్ మృతి..

హైదరాబాద్: 13 యదార్థవాది ప్రతినిది

దేవర కరుణాకర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన..మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జి హెచ్ ఎం సి కమిషనర్.. గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 71 వార్డు గుడి మల్లాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణం పట్ల మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి దేవర కరుణాకర్ మరణ సమాచారం అందిన వెంటనే హుటాహుటిన సిటీ న్యూరో హాస్పిటల్ కు వెళ్లి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కరుణాకర్ గుడి మల్కా పూర్ కార్పొరేటర్ గా రెండు పర్యాయాలు పనిచేశారని ఏంతో సామ్యుడు గా పేరు గాంచినట్లు ఆయన మృతి బాధాకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. సీనియర్ కార్పొరేటర్ మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని,
కార్పొరేటర్ గా, నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే వారనీ.. అన్ని పార్టీల కార్పొరేటర్ల తో మంచిగా, సఖ్యతగా సౌమ్యుడు గా ఉండే వారని కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. అయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కమిషనర్ ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు మేయర్, కమిషనర్ సానుభూతిని వ్యక్తం చేశారు.

రైల్లో నుండి పడి మృతి..

రైల్లో నుండి పడి మృతి..

రామగుండం: 13 యదార్థవాది ప్రతినిది

జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ మడిపల్లి గ్రామాపరిదిలో గల రైల్వే గేట్ వద్ద గుర్తుతెలియని రైలు బండిలో నుండి పడుటంతో మృతి చెంది ఉంటాడని తెలుసుతోంది.. మృతుని వయస్సు 30-35, ఎరుపు రంగు టీ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంటు, బ్లూ కలర్ స్వేటర్ దరించి ఉన్నాడు నలుపు తెలుపు రంగు తల వెట్రుకలు, చమన రంగు ఛాయా, కొళ ముఖం మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదు శవాన్ని హుజురాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ భద్రపరుచనైనదని, చనిపోయిన వ్యక్తి ఆచూకి ఎవరికైనా వివరాలు తెలిసినచో రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి.తిరుపతి తెలపగాలరని రామగుండం పోలీసులు తెలిపారు. ఫోన్ నెంబర్లు 9949304574. 9440700039.

ప్రయాణంలో తగు జాగ్రత్త..మంచిది

ప్రయాణంలో తగు జాగ్రత్త..మంచిది

హైదరాబాద్: 13 యదార్థవాది ప్రతినిది

* వేగం వద్దు ప్రాణం ముద్దు..

సంక్రాంతి దగ్గర పడడంతో స్వంత గ్రామాలకు ప్రయాణాలు పెరిగాయి..చాలామంది సొంత వాహనాల్లోనే వెళుతున్నారు. సమయం కలిసి వస్తుందని రాత్రివేళ వెళ్లేవారే ఎక్కువమంది ఉంటారు. అసలే చలికాలం.. ఆపై దట్టమైన పొగమంచు.. ఉదయం 10 గంటల వరకూ వీడని మంచుతెరలు.. వీటి మాటున రోడ్డు ప్రమాదాలు పొంచి ఉంటున్నాయి. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మంచు కారణంగా ఎదురుగా ఏముందో కనిపించక రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాలను, డివైడర్లను ఢీకొట్టే ప్రమాదం ఉంది. పొగమంచుతో రాష్ట్రంలో నిత్యం మూడు నాలుగైనా ప్రమాదాలు జరుగుతుండగా.. నెలకు 38 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువగా అర్ధరాత్రి దాటాక తెల్లవారుజాములోపు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

క్రికెట్ ట్రోఫి పోస్టర్ అవిష్కరాణ

క్రికెట్ ట్రోఫి పోస్టర్ అవిష్కరాణ

సిద్దిపేట: 12 యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట మినీ స్టేడియంలో ప్రారంభం కానున్న సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ గోడపత్రికను, అప్లికేషన్ ఫామ్ ను మినీ స్టేడియం గ్రౌండ్లో టిఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో మచ్చ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ టోర్నీ నిర్వహణకు గ్రౌండ్లో ఇంకా కొన్ని సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని….. పనులు పూర్తికాగానే టోర్నమెంట్ ప్రారంభిస్తామని తెలిపారు.టోర్నీలో ఒక్కొక్క గ్రామం నుంచి కానీ, వార్డు నుంచి కానీ ఒకే జట్టు కు అవకాశం కల్పిస్తున్నామన్నారు. టోర్నమెంట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు సంబంధించిన రిఫరీలు ఎంపైర్ లు గా వ్యవహరిస్తారని…… పూర్తి అంతర్జాతీయ నియమ నిబంధనలతో టోర్నీ కొనసాగుతుందన్నారు. అలాగే టోర్నీ విన్నర్ కు రెండు లక్షల రూపాయల నగదు బహుమతి, రెండవ బహుమతిగా లక్ష రూపాయల నగదు తో పాటు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ 50 వేల రూపాయల నగదు బహుమతి ఉంటుందన్నారు.ప్రతి మ్యాచ్ లో ఉత్తమ ప్రథమ కనపరిచిన వారికి ఫ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వెయ్యి రూపాయల నగదు, అలాగే సిక్స్ కొట్టిన వారందరికీ ప్రతి సిక్స్ కు 500 రూపాయలు నగదు బహుమతి ఉంటుందన్నారు.జట్టు సభ్యులు ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డును జత చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒక జట్టులో ఆడిన క్రీడాకారునికి మరొక జట్టులో ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదని, ఒకవేళ అలా గనుక చేస్తే జట్టును క్రాస్ చేస్తామని తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొనాలనుకునే క్రీడాకారులు ఈనెల 13 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కలకుంట్ల మల్లికార్జున్, నాగరాజు రెడ్డి, ప్రవీణ్ కుమార్, సాయికుమార్ గౌడ్, నాయకులు బుచ్చిరెడ్డి, ప్రశాంత్ గౌడ్, ఆకుబత్తిని రాము పలువురు క్రీడకారులు పాల్గొన్నారు.

మోగనున్న సమ్మె సైరన్‌..!

మోగనున్న సమ్మె సైరన్‌..!

ముంబై: 12 యదార్థవాది ప్రతినిది

* బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ – మోగనున్న సమ్మె సైరన్‌
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. తమ వివిధ డిమాండ్ల సాధన కోసం జనవరి 30 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని పలు బ్యాంకు యూనియన్ల గొడుగు సంస్థ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) గురువారం నిర్ణయించినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) వెల్లడించింది,గురువారం ముంబైలో జరిగిన యూఎఫ్‌బీయూ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్‌లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) లేఖలు రాసినా స్పందన రాకపోవడంతో, తము ఆందోళనను పునరుద్ధరించాలని భావించామని, జనవరి 30, 31 తేదీల్లో ( సోమ, మంగళవారం) సమ్మెకు పిలుపు నివ్వాలని నిర్ణయించామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం ఐఏఎన్‌ఎస్‌కు తెలిపారు. ముఖ్యంగా ఐదు రోజుల వర్కింగ్‌ డేస్‌, పెన్షన్ అప్‌డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్) రద్దు, వేతన సవరణ డిమాండ్‌ల చార్టర్‌పై తక్షణ చర్చలు, అన్ని విభాగాల్లో తగిన నియామకాలు తదితర డిమాండ్స్‌తో ఈ సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించారు.

వానరులతో జంకుతున్నా..ప్రజలు

వానరులతో జంకుతున్నా..ప్రజలు

హుస్నాబాద్: 12 యదార్థవాది ప్రతినిది

* గుంపుగా వస్తున్న వానరులు..

హుస్నాబాద్ పట్టణ ప్రజలకు వానరులతో జంకుతున్నారు..తెరచివున్న ఇండ్లలోకి దూరి చిన్న పిల్లలను, మహిళలను బెదిరిస్తూ నాన రాబాస చేస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి పట్టణంలో కోతుల బెడుదను నివారించే ప్రయత్నం చేయాలని కోరుతున్న పట్టణ ప్రజలు.. పట్టణ శివారు లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అందులో కోతుల కోసం పండ్ల మొక్కలను పెంచితే వాటి బెడద కాస్త తప్పుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు…

వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి

వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలి

ఆర్మూర్: 12 యదార్థవాది ప్రతినిది

బీజేవైఎం ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 160 వ జయంతిని “జాతీయ యువజన దినోత్సవం” ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు..బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, బీజేవైఎం అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ మాట్లాడుతూ నేటి యువత వివేకానందున్ని ఆదర్శంగా తీసుకొని ఉక్కు కండలు, వజ్రకఠోరమైన మనసును కలిగి జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొవలని, ధైర్యాన్ని పునికిపుచ్చుకొని లక్ష్యం వైపు, గమ్యం వైపు పయనించాలే తప్ప వెనుకకు అడుగువేయ కూడదని. వివేకానందుని బోధనలు చదివిన నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండమే కాకుండా తమ జీవితానికి ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటారని నేటి యువత వివేకానందున్ని ఆదర్శంగా తీసుకొని, తన బోధనలు చదవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు ద్యాగ ఉదయ్, పల్లె శ్రీనివాస్, విజయానంద్, భూసం ప్రతాప్, సాయికుమార్, పెద్దోళ్ల భరత్, నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...