33.2 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 130

ఆటో నగర్ లోని సమస్యలు పరిష్కరించిన..జిల్లా కలెక్టర్

ఆటో నగర్ లోని సమస్యలు పరిష్కరించిన..జిల్లా కలెక్టర్

సిద్దిపేట: 12 యదార్థవాది ప్రతినిది

జిల్లలో కొత్తగా నిర్మిస్తున్న ఆటో నగర్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, ముండ్రాయు శివారులో నిర్మిస్తున్న ఆటో నగర్ ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇటీవలే 26ఎకరాల విస్తీర్ణంలో మోడ్రన్ ఆటో నగర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గుర్తు.. ఇక్కడ భూమి ఎత్తు పల్లాలతో చదును చేసి ఒకే లెవల్ చేయడానికి ఎస్టిమేట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది అని కాంట్రక్టర్ జగదీశ్వర్ రెడ్డి తెలపగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. స్థానిక ఇంజనీరింగ్ అధికారులు ముందు స్థలాన్ని చూడకుండా ఎలా తక్కువగా ఎస్టిమేట్ చెస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఆటో నగర్ కి కావాల్సిన అదనపు నిధులను మంజూరు చేస్తామని వీలైనంత తొందరలో నిర్ణీత గడువు లోపు పూర్తి చెయ్యాలని తెలిపారు. ముఖ్యంగా తారు రోడ్డు, డ్రైనేజీ, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్ తప్పనిసరి గా ఏర్పాటు చెయ్యాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ అనంతరెడ్డి, ఆర్బన్ తహసిల్దార్ విద్యాసాగర్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

నాణ్యత ప్రమాణాలు పాటించాలి..జిల్లా కలెక్టర్

నాణ్యత ప్రమాణాలు పాటించాలి..జిల్లా కలెక్టర్

సిద్దిపేట:12 యదార్థవాది ప్రతినిది

ఆసుపత్రి నిర్మాణ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించిన..కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట జిల్లా హెడ్ క్వటార్ లో నిర్మిస్తున్న1000పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లి గ్రామ శివారులో 28ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను గురువారం క్షేత్ర స్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. డిఎంఈ రమేష్ రెడ్డి ఆసుపత్రి కి కావలసిన సూచనలు చేశారు. నిర్మాణ ఏజెన్సీ టిఎస్ఎంఎస్ఐడిసి ఇంజనిర్ కలెక్టర్, అధికారులకు ఆసుపత్రి సంభందిత మ్యాప్ ను చుపిస్తు పూర్తిగా వివరించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, భవిష్యత్ అవసరాల ను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టామని, 1000 పడకల ఆసుపత్రి అనేది చాలా పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా, భవిష్యత్తు అవసరాల అనుగుణంగా కెపాసిటీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లో పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయని తెలిపారు. నిర్ణీత గడువు లోపు నిర్మాణం పూర్తి చేసి అందించాలని ఏజెన్సీలకు ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ అనంతరెడ్డి, ఆర్బన్ తహసిల్దార్ విద్యాసాగర్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, టిఎస్ఎంఎస్ఐడిసి డిఈ విశ్వ ప్రసాద్, ఈఈ శ్రీనివాస్, కాంట్రక్టర్ బాపినీడు మరియు మెడికల్ కళాశాల సిబ్బంది ఉన్నారు..

ఘనంగా స్వామి వివేకానంద జయంతి..

ఘనంగా స్వామి వివేకానంద జయంతి..

వనపర్తి: 12 యదార్థవాది ప్రతినిది

స్వామి వివేకానంద ఆశయాలను నేటి ప్రతి యువత మార్గదర్శకంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు గుర్తు చేశారు.. జిల్లా పోలీసు కార్యాలయములో గురువారం అపూర్వరావు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత భవిష్యత్తులో రాణించేందుకు, స్వామి వివేకనంద సూక్తులు స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం వుందని తెలిపారు. వివేకానంద ఆశయాలకు తగ్గట్లుగానే యువత దేశాభివృద్ధిలో కీలకంకావాలని, వివేకానంద ఆలోచనలను పాటించడం ద్వారా ప్రతి పోలీసు అధికారి తాను నిర్వహించే విధుల్లో రాణించడంతో పాటు, ప్రజల్లో పోలీసుల గౌరవం పెరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాసచారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్, వెంకట్, సిసిఎస్ ఎస్సై, హృషికేశ్, ఐటి కోర్ ఎస్సై, వేణు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి..

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి..

విశాఖపట్టణం: 12 యదార్థవాది ప్రతినిది

విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గంలో పార్టీ వైసిపి కార్పొరేటర్, కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కె కె రాజు..ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఎలా అందుతుందని అడిగితెలుసుకున్నారు. రాష్టంలో జగన్ అన్న చేసే అన్ని కర్యక్రమాలను ప్రజలకు తిసికేల్లె బాద్యత మనమిదేవుందని, ప్రతి ఒక్క వైసిపి కార్యకర్త వార్డ్ సచివాలయంలో ఉండి ప్రజల అవసారాలు తెలుసుకొని, అంకిత భావంతో పని చేయలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్లు బాణాల శ్రీనివాసరావు, కంపా హనుక్, అల్లు శంకర రావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ బర్కత్ అలి, కె.అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గాంధీ భవన్ లో ప్రారంభమైన టీపీసీసీ సమావేశం..

గాంధీ భవన్ లో ప్రారంభమైన టీపీసీసీ సమావేశం..

హైదరాబాద్: 12 యదార్థవాది ప్రతినిది

ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అద్యక్షతన ప్రారంభమైన టీపీసీసీ సమావేశం.. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, సభ్యులు హాజరయారు.

సిటీ సర్వీసెస్ ప్రారంభించిన..పువ్వాడ అజయ్

సిటీ సర్వీసెస్ ప్రారంభించిన..పువ్వాడ అజయ్

ఖమ్మం: యదార్థవాది ప్రతినిది

ప్రజల సౌకర్యయర్థం ఖమ్మం సిటీ బస్ స్టాండ్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ..ఖమ్మం పాత బస్ స్టాండ్ ఆధునీకరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సంకల్పింతో సిటీ బస్ స్టాండ్ గా మార్చి లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఎంతో చరిత్ర ఉన్న ఖమ్మం బస్స్టాండ్ ను రూ.50 లక్షలతో ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. సిటీ బస్స్ సర్వీసెస్ లను గురువారం జెండా ఊపి ప్రారంభించారు. పాత బస్టాండ్ ను పునరుద్ధరణ చేయడం పట్ల స్థానిక వ్యాపారులు, వివిధ పనుల నిమిత్తం ఖమ్మం వచ్చే ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ గజ మాలలతో మంత్రి అజయ్ కుమార్ ని సత్కరించారు. ఎంపి నామా నాగేశవరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా మొదలైన సంక్రాంతి సంబరాలు..

ఘనంగా మొదలైన సంక్రాంతి సంబరాలు..

తిరుపతి: యదార్థవాది ప్రతినిది

తిరుపతి జిల్లా పోలీస్ పేరెడ్ మైదానంలో పోలిస్ శాఖ ఆధ్వర్యంలో బుదవారం ఘనంగా మొదలైన సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి రోజా, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను పోలీస్ కుటుంబ సభ్యులతో మొదలుపెట్టారు.. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ముందుగ క్రీడా మైదానంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, పోలీసు వ్యవస్థ నిత్యం శాంతిభద్రతలలో తల మునకలై ఉంటారని, ఈ సంక్రాంతి సంబరాలు ఆటవిడుపుగా ఉంటుందని పోలీస్ అధికారులకు కుటుంబ సభ్యులకు, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో ఉండాలని తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, పురుషుల విభాగంలో కబడ్డీ పోటీలు నిర్వహించి, విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రధానం చేశారు..

ప్రేక్షకులతో సందడి చేసిన..బాలయ్య

ప్రేక్షకులతో సందడి చేసిన..బాలయ్య

హైదరాబాద్‌: 12 యదార్థవాది ప్రతినిది

రెండు తెలుగు రాష్టాల్లో ‘వీరసింహా రెడ్డి’ విడుదలైంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో భ్రమరాంబ థియేటర్‌లో ‘వీరసింహా రెడ్డి’ బెనిఫిట్‌ షోలో సీనియర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రేక్షకులతో సందడి సందడి చేశారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడానికి ఆయన అక్కడికి చేరుకున్నారు.. దీంతో బాలయ్య ఫ్యాన్స్‌తో థియేటర్‌ నిండిపోయింది. జై బాలయ్య నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. డప్పులు, బ్యాండ్‌బాజాలతో తమ అభిమానహీరోకు ప్రేక్షకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించడం సంతోషంగా ఉందని బాలయ్య తెలిపారు. ఈ సంక్రాంతి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా గురువారం వీరసింహా రెడ్డి సినిమా భారీ స్థాయిలో విడుదలైంది.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. విదేశాల్లో తెల్లవారుజామున 2 గంటలకే షోలు మొదలయ్యాయి…

నాణ్యతలో రాజి వద్దు

నాణ్యతలో రాజి వద్దు

దుబ్బాక: 11 యదార్థవాది ప్రతినిది

దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల కెసిఆర్ చదువుకున్న స్కూల్లో మన ఊరు, మనబడి నిర్మాణ పనులు క్షేత్ర స్తాయిలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి శ్రీనివాసరావు.. వీలైనంత తొందరగా కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, డైనింగ్ పనులను పూర్తి చేయాలని సంబందిత కంట్రాక్టర్ తెలిపారు. డిప్యూటీ ఇంజనీర్ విజయ ప్రకాష్, అసిస్టెంట్ ఇంజనీర్ రిజ్వాన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాజుల రామచంద్రం తదితరులు పాల్గొని పనుల నాణ్యతను పరిశీలించారు..

కూడవెల్లి జాతర వేలం పాట..

కూడవెల్లి జాతర వేలం పాట..

దుబ్బాక: 11 యదార్థవాది ప్రతినిది

దక్షిణ కాశీగా కొలిచే కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర ప్రతిఏటా మాగ అమావాస్య రోజు నుండి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు వచ్చే భక్తులకు కొబ్బరికాయలు, లడ్డు ప్రసాదం, పుట్నాలు పేలాలు, పూలదండలు, ఇతరత్రాన దుకాణ సముదాయం కోసం గురువారం 12:30 ఆలయ ఆవరణలో వేలం పాట నిర్వహించడం జరుగుతుందని, ప్రధాన పూజారి సాకేత్ శర్మ తెలిపారు. ఈ వేలం పాట జనవరి 26 వరకు నిర్వహిస్తామని తెలిపారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...