33.2 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 131

రైతులకు శిక్షణ తరగతులు

రైతులకు శిక్షణ తరగతులు

సంగారెడ్డి: 11 యదార్థవాది ప్రతినిది

* శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ..

సంగారెడ్డి జిల్లాలో వాటర్‌ సంస్థ అద్వర్యంలో జహీరాబాద్‌ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు క్షేత్ర స్థాయిలో బుదవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో శాస్త్రవేత్త సురేష్‌ దడిగే మాట్లాడుతూ కంది, పత్తి పంటలకు సేంద్రియ ఎరువులు, చిడపురుగుల నివారణ, దశపరని, పంచగావ్వ, ఘన. ద్రవ జీవామృతం వాడాలని తక్కువ పెట్టుబడితో అదిక లాబాలు ఆశించావచని రైతులకు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం లో రమేష్ స్నేహాలత, వాటర్‌ సంస్థ మేనేజర్‌ రవి ప్రసాద్‌, నాగూర్‌కే సర్పంచ్‌ నీలమ్మఇరప్పా, టెక్నికల్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌, వసుందర సేవక్‌ గుండప్ప, రైతులు నర్శప్పు, శర్షప్పు పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

మీలక్ష్యం మీచేతిలో వుంది..రాహుల్ హెగ్డే

మీలక్ష్యం మీచేతిలో వుంది..ఎస్పీ రాహుల్ హెగ్డే

సిరసిల్ల: 11 యదార్థవాది ప్రతినిది

* మెదడుకు శిక్షణ ఇవ్వండి ఉద్యోగాన్ని పొందండి..ఎస్పీ రాహుల్ హెగ్డే

సిరిసిల్ల జిల్లా గ్రంధాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సిద్దం అవుతున్న యువకులకు మెదడుకు, శిక్షణ ఇవ్వండి ఉద్యోగాన్ని పొందండి అనే అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే హాజరైయారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న యువకులు మానసిక ఆందోళన చెందకుండా పట్టుదలతో సాధన చేసి అనుకున్న లక్షాన్ని చేరుకోవాలని, పోటీ ప్రపంచంలో సమకాలీన అంశాలను, చరిత్ర, ఎకానమీ, సామాజిక, రాజకీయ, భౌగోళిక అంశాల పట్ల నిరంతరం అవగాహనా ఏర్పర్చుకోవలన్నారు. జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలను చూసి జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరు శంకరయ్య ను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, గ్రంథ పాలకులు బి శంకరయ్య, కే మల్లయ్య వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువతీ, యువకులు పాల్గొన్నారు..

జిల్లాలో అథ్లెటిక్స్ క్రీడలు ప్రారంభం..

జిల్లాలో అథ్లెటిక్స్ క్రీడలు ప్రారంభం..

సిద్దిపేట: 11 యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్.. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి పురస్కరించు కొని సిద్దిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ 100, 400, 800 ల మీటర్ల రన్నింగ్ హాయ్ జిమ్ లాంగ్ జంప్ సిద్దిపేట జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ బుధవారం నిర్వహించామన్నరు. జిల్లా నలుమూలల నుండి మహిళలు 48, పురుషులు 89 పాల్గొన్నారని తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం రోజున క్రీడాకారులైన యువతను ప్రోత్సహించామని, యువ క్రీడాకారులకు గురువారం బహుమతులను జిల్లా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీ టీచర్స్ రామేశ్వర్ రెడ్డి, లక్ష్మణరావు, శ్రీనివాసులు, ఉప్పలయ్య మహిళా పీఈటి టీచర్స్ రజిత, సుశీల సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, సిసిఆర్పి, ఏసిపి చంద్రశేఖర్, ఆర్ ఐ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ మెట్టమొదటి మహిళా సిఎస్ గా శాంతి కుమారి

తెలంగాణ మెట్టమొదటి మహిళా సిఎస్ గా శాంతి కుమారి

హైదరాబాద్: 11 యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్ర మెట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శి (సిఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎ.శాంతి కుమారిని ముఖ్యమంత్రి కెసిఆర్ బుధవారం నియమించారు. సిఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావు కలిసి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు…ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతి కుమారి అమెరికాలో ఎంబిఏ కూడా పూర్తి చేసి. మూడు దశాబ్దాలుగా ఐఏఎస్ గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, మిల్క్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపనిచేశారు. నాలుగేళ్లపాటు సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్ లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా, ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శాంతికుమారి సేవలందించారు.

తెలంగాణ గవర్నర్ మరనుందా..!

తెలంగాణ గవర్నర్ మరనుందా..!

హైదరాబాద్: 10 యదార్థవాది ప్రతినిది

తెలంగాణ గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ ను మహారాష్టకు బదిలీ చేయనున్నట్లు తెలుస్తుంది… కెసిఆర్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించక పోవడంతో గవర్నర్ తమిళ్సై సౌందర్ రాజన్ అడుగుఅడుగున అవమానాలు ఎదురుకోంటున్న, గవర్నర్ తమిళ్సై ప్రభుత్వంపై విమర్శలు సందిస్తున్నారు. అటు ప్రభుత్వం ఆమెను కీలకమైన విషయాలలో ప్రక్కనపెడుతుంది కూడా. కేంద్ర ప్రభుత్వాన్ని మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోషియారి తనను భాద్యతనుండి తప్పియాలని కోరినట్లు తెలుస్తోంది.. కేంద్రంలోని పెద్దలు అతనికి విశ్రాంతి నిస్తూ… మహారాష్టకు తమిళ్సై సౌందర్ రాజన్ పప్పనున్నట్లు తెలుస్తుంది…

తొందరలో ఐటి టవర్..మంత్రి హరీష్ రావు

తొందరలో ఐటి టవర్..మంత్రి హరీష్ రావు

సిద్దిపేట: 10 యదార్థవాది ప్రతినిది

* యువత చెంతకు ఐటి టవర్..

* సిద్దిపేట యువతకు ఉద్యోగ అవకాశాలు..

* మార్చ్ నెలాఖరులో ఐటి టవర్ పూర్తి..

జిల్లలో నిర్మిస్తున్న ఐటి టవర్ పనులను క్షేత్ర స్ధాయిలో పరిశీలించిన మంత్రి హరీష్ రావు..సిద్దిపేట జిల్లా నిరుద్యోగ యువతకు అతి తొందరలోనే రాబోతునాయని మంత్రి అన్నారు.. సిద్దిపేట లో ప్రభుత్వ పరంగా నిర్మిస్తున్న ఐటి టవర్ నిర్మాణ పనులను, సంబదిత అధికారులతో క్షేత్ర స్ధాయి లో క్షుణ్ణంగా పరిశీలించి, పనుల మరింత వేగవంతంగా, వచ్చే మార్చి కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట ప్రాంత యువతకు గొప్ప వరంలాంటిదని ఏప్రిల్ మొదటి వారం ప్రారంభించు కుందామని మంత్రి తెలిపారు. ఈ పర్యటనలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, జనగామ ఏమ్మేలే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, జిల్లా పరిపాలన అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ తో పాటు సంబధిత అధికారులు పాల్గొన్నారు.

రైతులకు డెయిరీ రుణాలు..

రైతులకు డెయిరీ రుణాలు..

హుస్నాబాద్: 10 యదార్థవాది ప్రతినిది

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో రైతులకు డెయిరీ రుణాలు ఇవ్వనున్నట్లు సహకార సంఘం అధ్యక్షులు పేర్యాల దేవేందర్ తెలిపారు.. కోహెడ మండలంలోని అరుహులైన రైతులకు డెయిరీ, చేపల పెంపకం కొరకు మార్టిగేజ్ రుణాలు ఇవ్వనున్నట్లు దేవేందర్ తెలిపారు. మంగళవారం ఆరేపల్లి గ్రామనికి చెందిన చెంద్ర నాయక్ తండా రైతులకు కరీంనగర్ పాల ప్రోడక్ట్ కంపెనీ లిమిటెడ్ వారు ట్రై పాడ్ అగ్రిమెంట్ ద్వారా 18 మంది రైతులకు రూ.10,80,000/- ఇవ్వడం జరిగిందనిఅన్నారు. రుణాలు కావలసిన రైతులు కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సి ఈ ఓ ముంజ మల్లికార్జున్, డైరెక్టర్ బానోతు బాలు, మిల్క్ డెయిరీ అద్యక్షులు లావుడ్య లకపతి, రైతులు లావుడ్య దేవేందర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మా పొట్ట కొట్టొద్దు..

మా పొట్ట కొట్టొద్దు..

ఆర్మూర్: 10 యదార్థవాది ప్రతినిది

ఆర్మూర్ పట్టణంలో ప్యాసింజర్ ఆటో డ్రైవర్ లను ఇబ్బడులకు గురి చేస్తున్న ఆర్టీసీ డిపో మేనేజర్ తీరుకు నిరసనగా ఆర్మూర్ అసిస్టెంట్ పోలిస్ కమిషనర్ వినతిపత్రాన్ని సమర్పించిన ఏఐటీయూసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి అరేపల్లి సాయిలు.. జావీద్ భాయ్ మినిస్టేడియం ప్యాసింజర్ ఆటో డ్రైవర్, ఏఐటీయూసీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ స్వయంశక్తితో ఆటో నడుపుతూ, వచ్చే చలి చాలని ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఆటోల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులను బస్సుల్లో ఎక్కిస్తు ఆటోలను సీజ్ చేయిస్తూ, RTO అధికారులను వెంట బెట్టుకుని ఆటోలను సీజ్ చేయిస్తూన్న డిపో మేనేజర్..ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టదని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాలిమ్.శ్రీనివాస్, సదానందం, రాజేశ్వేర్.లజార్. సిరాజోద్దీన్.తాజోద్దీన్..లాగ్గాల నర్సయ్య. నజీర్.రాజు.గంగాధర్. పీర్సింగ్.తదితరులు పాల్గొన్నారు

సిఎస్ సోమేశ్ కుమార్ రాజానామా చేయాలి..బండి సంజయ్

సిఎస్ సోమేశ్ కుమార్ రాజానామా చేయాలి..బండి సంజయ్

హైదరాబాద్: 10 యదార్థవాది ప్రతినిది

* కోర్టు తీర్పును శిరసావహిస్తూ సోమేశ్ కుమార్ ఆంధ్ర కు వెళ్ళాలి..

* కేసీఆర్ ఎప్పుడు చట్టాలను, రాజ్యాంగా నిబంధనలను గౌరవించలేదు..

* తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వరాష్ట్రం తేవాలి..

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట అద్యక్షుడు బండి సంజయ్ మంగళవారం ప్రకటన… ప్రచురణార్థం విడుదల చేశారు. కోర్టు తీర్పును గౌరవిస్తూ సీఎస్ బాధ్యతల నుండి తప్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయాలని, 2014 రాష్ట్ర విభజన తరువాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కిరని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరోజు చట్టాలను, రాజ్యాంగా నిబంధనలను గౌరవించలేదు. ఆంద్ర కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికం అని తెలిపారు. తెలంగాణకు కేటాయించబడ్డ ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డ సోమేశ్ కుమార్ ను చీఫ్ సెక్రటరీగా నియమించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ లబ్ది పొందారు. 317 జీవోసహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారన్నారు. హెచ్ఎండీఏ, రెవిన్యూ, ఇరిగేషన్, హోం శాఖ, తనకు అనుకూలమైన అధికారులను నియమించుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేశ్ కుమార్ ను పావుగా వాడుకున్నారునిబ తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సోమేశ్ కుమార్ తొలగించి తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణ కేటాయించి వ్యక్తిని సీఎస్ గా నియమించాలి, ఏపీకి కేటాయించబడ్డ అధికారులను ఆ రాష్ట్రానికి బదలాయించాలి. అట్లాగే తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని బీజేపీ పార్డి డిమాండ్ చేస్తుందని అన్నారు.

జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్

జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్

సిరిసిల్ల: 10 యదార్థవాది ప్రతినిది

సిరసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ తన వాహనాన్ని తానే నడుపుతూన్నారు. దారిలో కనబడిన పలువురిని పకకరిస్తూ ముందుకు..మంత్రి

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...