ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరగాడంతో రోడ్డు పక్కనున్న చెట్టుకు బస్సు డికొని అదుపుతప్పింది..బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఆరుగురికి గాయాలయ్యయి మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ శివారులో సోమవారం జరిగిన ఈ సంఘటనను అటువైపుగా వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చూసి గాయలైన వారిని తన వాహనంలో ఎక్కించుకొని మంథని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి సైబర్ క్రైం పోలీసులు 41 సీఆర్సీసీ కింద నోటీసులు.. కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది..సైబర్ క్రైం పోలీసులు మల్లు రవికి జనవరి 12న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వూహకర్త సునీల్ కనుగోలు స్టేట్మెంట్ను సోమవారం నమోదు చేశారు.
తెలంగాణాలో మతలకతితంగా శాంతి సౌభాగ్యలతో వెలసిల్లాల్సిన సమయం ఆసున్నమైందాని తెలంగాణ జమాయితే ఉలేమా సంస్థ అధ్యక్షులు నిసార్ ఖాస్మి అన్నారు..జమయితే ఉలేమల ఆధ్వర్యంలో నిర్వహించిన సిరత్ ఖ్విజ్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సిద్దిపేట ఈద్గాఅహ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త బోధనలు అందరికి తెలవాలి, హిందువులు మస్జీద్ లోకి రావాలి, మతం కాదు మానవత్వం గొప్పదని అందరు గుర్తించాలని అన్నారు. తప్పు దారిపడుతున్న యువత సరైన దారిలో నడిచి ఉన్నతంగా ఎదగాలని, ఇస్లాం బోధనే శాంతి, సమానత్వం మొహమ్మద్ ప్రవక్త చూపిన దారిలో నడవాలన్నారు. జమయితే ఉలేమా సిద్దిపేట సంస్థ అద్భుతంగా పనిచేస్తుందని, రాష్ట్ర శాఖ ఆదేశాలతో ప్రతి జిల్లాలో సిరత్ పోటీలు నిర్వహించామని ఇందులో 40 శాతానికి పైగా ముస్లిమేతర విద్యార్థులు పాల్గొనడం శుభపరిణామామన్నారు. ఈ కార్యక్రమంలో జమయితే ఉలేమా జిల్లా అధ్యక్షులు ముఫ్తి సలాం, తంజీముల్ మసాజిద్ అధ్యక్షులు జావేద్,మిల్లతే ఇస్లామియా అధ్యక్షులు ఖాదర్, బిఆర్ఎస్ మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఫక్రుద్దీన్,ఉలేమాలు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనార్థం వచ్చే లక్షలాది భక్తులకు అన్నప్రసాదాలు అందించే టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది.. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాదం కోసం రూ.33 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుందాని ట్రస్టు తెలిపింది. దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సమయంలో దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారని టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు తెలిపింది.
శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు ఆహ్వానించిన ఎమ్మెల్యే అరూరి రమేష్.. వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 13నుండి కానున్నాయని, బ్రహ్మోత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి, ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు సిఎం కెసిఆర్ కు వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు.. ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఆలయ ఈఓ నాగేశ్వర రావు, ప్రధాన అర్చకులు రవీందర్, విక్రంత్ జోషి, మధుకర్ శర్మ, పురుషోత్తమ శర్మ తదితరులు పాల్గొన్నారు..
రాష్ట్ర ప్రభుత్వం 35 వేల కోట్ల సర్పంచ్‌ల నిధులను దొంగిలిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.. హైదరాబాద్‌లో ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ‘నిధులు, విధులపై సర్పంచ్‌ల శంఖారావం’ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామా పంచాయతీల అభివృద్ధి కోసం ఆస్తులు అమ్మి, అప్పులు చేసి సర్పంచ్‌లు పనులు చేశారు, ప్రభుత్వం సకాలంలో బిల్లులు రాక.. కొందరు సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. గ్రామపంచాయతీల నిధులను గుత్తేదారులకు ఇచ్చారని, గ్రామాల్లో చెట్లు చనిపోతే సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీ లోపాల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని, దీనిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ప్రశ్నించారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్‌కే చెందుతుందని రేవంత్ అన్నారు. ఈ ఏడాది కేవలం జీతాల కోసమే ఇప్పటి వరకు రూ.28 వేల కోట్లు అప్పుతెచ్చిన కేసీఆర్.. ఇంకా మూడు నెలలపాటు ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంగా పేరొందిన తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని, ఇప్పటి వరకు రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారని, కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తిపై రూ.1.5 లక్షల అప్పు మోపిందని, జీహెచ్‌ఎంసీకి బ్యాంకుల్లో రూ.600 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉండేవని, కేసీఆర్ పాలనలో జీహెచ్‌ఎంసీకి అప్పు పుట్టని పరిస్థితులు వచ్చాయని తెలిపారు. రాష్టం నెంబర్ వాన్ అంటూ గొంతు చించుకుంటున్న కేసీఆర్ రాష్ట్రానికి ఏమిచేయలేదు. కాంగ్రెస్, తెదేపా అధికారంలో ఉన్నాప్పుడు సర్పంచ్‌లకు గౌరవం ఉండేదని, ఎంఆర్వో ఆఫీసుకు వెళ్లినా, ఎంపీడీవో ఆఫీసు వెళ్లినా సముచిత గౌరవం దక్కేదని అన్నారు.
హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ వార్‌రూమ్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు సోమవారం రెండు గంటల పాటు విచారించిన పోలీసులు.. సోషల్ మీడియా వేదికగా పోస్టుల వివరాలను సునీల్ నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలో మరోసారి సునీల్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.. విచారణ అనంతరం సునీల్ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించాడు.. రాష్ట ముఖ్యమంత్రిపై కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పై సోషల్ మీడియాలో కించ పరిచేవిదంగా పోస్టులు పెట్టాడని సునీల్‌పై ఆరోపణలు ఉన్నాయి.. గత ఏడాది నవంబర్ 24న జూబ్లీహిల్స్‌లో సునీల్ నిర్వహిస్తున్న కార్యాలయంలో సైబర్ క్రైం పోలీసులు అక్కడున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. సునీల్ కనుగోలు వద్ద పనిచేస్తున్న మెండా ప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు. విరు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్ కనుగోలును ప్రధాన నిందితుడిగా హైదరాబాద్ అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌మాన్ పేర్కొన్న విషయం మనకు తెలిసిందే…
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలలో పలుకుల సంఘాల ఫంక్షన్ హాల్ లకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భుమిపుజా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కుల సంఘాలకు గౌరవ ప్రదమైన రీతిలో ఫంక్షన్ హాల్ మంజూరు చేశారని, రాష్ట్రస్థాయిలో ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధిలో దుసుకపోతుందాని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు.. సిరిసిల్ల: 9 యదార్థవాది ప్రతినిది వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల 2023-24 ప్రవేశాల కోసం అర్హత పరీక్ష టి TGUGCET 2023 కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్ పద్మజ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల పోస్టర్ను ఆవిష్కరించారు. జనవరి 5నుండి, ఫిబ్రవరి 5వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినీలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు www.tswreisac.in వెబ్ సైట్ సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్ జాక్రిన్, కళాశాల ప్రిన్సిపాల్ పద్మజ, కళాశాల అధ్యాపకుల బృందం పాల్గొన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు.. మంత్రి కార్యాలయంలో కలిసి తెలంగాణ రాష్ట్రానికి, ఆర్థికంగా ఆదుకోవాలని, పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని మంత్రి నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం సమర్పించారు…