37.2 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 133

నిఘా నేత్రాలతో పటిష్టమైన భద్రత..

నిఘా నేత్రాలతో పటిష్టమైన భద్రత..

దుబ్బాక: 9 యదార్థవాది ప్రతినిది

* ప్రజల రక్షణ మాకు ముఖ్యం..

* మూడో కంటితో నేరస్తుల ఆట కట్టు..

దుబ్బాక నియోజకవర్గలోని భుంపల్లి, మిడిదొడ్డి పోలీస్ స్టేషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత.. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాలు తగ్గడానికి సీసీ కెమెరాలు ఎంతో తోడ్పడుతున్నాయని, సిద్దిపేట జిల్లాలో ఎక్కడ నేరం జరిగిన క్షణాల్లో తెలుసుకోవడానికి వీలవుతుందని, సున్నితమైన ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఎంతో కీలక పాత్ర వహిస్తున్నాయని, ప్రజా ప్రతినిధులు, కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలా సొమ్ముతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, దుబ్బాక ఇన్స్పెక్టర్ కృష్ణ, మిరుదొడ్డి సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ గౌడ్, భూంపల్లి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బిక్యా నాయక్, ప్రజా ప్రతినిధులు వ్యాపారం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

భారత్ బస్సులు లంకకు

భారత్ బస్సులు లంకకు

సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు 75 బస్సులను అందించిన ఇండియా..

న్యుడిల్లి 8 జనవరి యదార్థవాది

దివాలా స్థిలోవున్న శ్రీలంకకు సహాయం చేసేందుకు తనవతుగా ప్రయత్నలు చేపట్టింది ఇప్పటికే సహాయం అందిస్తున్న ఇండియా తాజాగా మరో సహాయాన్ని అందించింది. శ్రీలంకకు 75 ప్రజా రవాణా బస్సుల్ని అందజేసింది. శ్రీలంకలో రవాణా వ్యవస్థని మెరుగుపర్చే ఉద్దేశంతో ఈ పని చేసింది. శ్రీలంకలో భారత రాయబారి వీటిని అక్కడి అధికారులకు అందజేశారు.మొత్తం 500 బస్సుల్ని అందజేయాలని భారత్ నిర్ణయించింది.మిగతా బస్సుల్ని కూడా దశలవారీగా అందిస్తారు.గత మేలో తమ దేశం దివాళా తీసినట్లు శ్రీలంక ప్రకటించింది. అప్పట్నుంచి ఇండియా అనేక రకాలుగా శ్రీలంకకు సాయం చేస్తోంది. ‘నేబర్‌హుడ్ ఫస్ట్ (పొరుగు దేశాలకే మొదటి ప్రాధాన్యం)’ అనే విధానం కింద శ్రీలంకకు ఇండియా సాయం చేస్తోంది. శ్రీలంక పోలీసులకు గత డిసెంబర్‌లో 125 ఎస్‌యూవీలు అందజేసింది. అక్కడ సరైన వాహనాలు లేకపోవడంతో పోలీసులు పని చేయడం కూడా కష్టమవుతోంది. అందుకే ఇండియా వీటిని అందజేసింది. అంతకుముందు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల సాయం ప్రకటించింది. తర్వాత 900 మిలియన్ డాలర్ల రుణం అందజేసింది. శ్రీలంక దగ్గర చమురు కొనేందుకు కూడా డబ్బులు లేవు. దీంతో శ్రీలంక చమురు కొనేందుకు 500 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. తర్వాత దీన్ని 700 అమెరికన్ డాలర్లకు పెంచింది.భారత్ అందించిన సాయాన్ని అత్యవసర వస్తువులు, చమురు కొనేందుకు వినియోగించుకుంటోది శ్రీలంక.ఇప్పుడిప్పుడే శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది.వివిధ దేశాలు శ్రీలంకకు ఆర్థిక సాయం అందజేస్తున్నాయి.

రేపటి సర్పంచ్ ల ధర్నాకు తరలుదాము

రేపటి సర్పంచ్ ల ధర్నాకు తరలుదాము

హైదరాబాద్: 8 జనవరి యదార్థవాది

హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రేపు జరగనున్న ధర్నాకు సర్పంచ్లు పెద్దేతున తరలిరావాలని తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.. ‘సర్పంచ్ సమస్యలపై కేసీఆర్ పోలీసులతో అడ్డుకునడని, కోర్టు సహకారంతో ధర్నాకు అనుమతి వచ్చిందనిఅన్నారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరుష్కరించేల పోరాడుదమని, రాష్టంలోని మారుమూల ప్రాతల నుండి తరలిరావాలని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

విదులనుండి ప్రిన్సిపాల్, వాచ్ మెన్ తొలగింపు

విదులనుండి ప్రిన్సిపాల్, వాచ్ మెన్ తొలగింపు

సిరిసిల్ల: 8 జనవరి యదార్థవాది

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామ ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి లక్ష్మి, వాచ్ మెన్ రామస్వామి విదులనుండి తొలగించారు. ఈ మేరకు కరీంనగర్‌ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డీఎస్‌ వెంకన్న ఆదేశాలు ఇచ్చరు. పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రామారావు కు ప్రిన్సిపల్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

మాధపూర్ వాసులను కలిషిత నీటినుండి కాపాడుదాం..

మాధపూర్ వాసులను కలిషిత నీటినుండి కాపాడుదాం..

యాదాద్రి: 8 జనవరి యదార్థవాది ప్రతినిది

మంచినీరు అందిచడానికి వాటర్ ప్లాంట్ యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాధపూర్ ప్రభుత్వ పాటశాలలో బీర్ల ఫౌండేషన్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ గ్రామాల్లో మంచి నీటిని అందిచాలనే ఉదేశ్యం తో వాటర్ ప్లాంట్ ప్రారంభించమన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పాటశాలల్లో కలుషిత భోజనం కలుషిత వాటర్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, మిషన్ భగీరథ వాటర్ గ్రామ పంచాయతీ వాటర్ రెండు కలసి గ్రామాల్లో వాటర్ అందిచటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. మాధపూర్ గ్రామంలో రెండు వాటర్ ప్లాంట్ ప్రారంభిచడం జరిగిందని తెలిపారు.

ఓటమిని గెలుపుకు మెట్టుగా మార్చుకోవాలి

ఓటమిని గెలుపుకు మెట్టుగా మార్చుకోవాలి

సిద్దిపేట: 8 జనవరి యదార్థవాది ప్రతినిది

* క్రీడలతో మానసిక ఒతిడి తగ్గుతుంది..

* శారీరక దృఢత్వం పెరుగుతుంది..

* సచిన్ మీలో నుంచే మరెన్నో సచిన్ లు రావాలి..అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్..

గెలుపు ఓటములు సహజమని ఓడినవారు క్రున్గిపోవద్దని గెలిచినవారు పొంగిపోవలసిన అవసరం లేదని అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్ అన్నారు. సిద్ధిపేట జిల్లా పొన్నాల కృష్ణసాగర్ శివారులో ఉన్న విరాట్ ఆనంద్ క్రికెట్ అకాడమీ ద్వీతీయ వార్షికోత్సవం లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని, చదువు, క్రీడల్లో ముందంజలో ఉండాలని అన్నారు. మీలో నుండి ఎందరో సచిన్ టెండూల్కర్ లు రావాలని గొప్ప గొప్ప క్రికెటర్స్, రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని, క్రికెట్ అకాడమీ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. అనంతరం క్రికెట్ లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. బెస్ట్ అల రౌండర్ బెస్ట్ బ్యాట్స్ మెన్ బెస్ట్ బౌలర్ విభాగాల్లో విద్యార్థులకు జ్ఞాపికలు అందచేశారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని, విద్యార్థినిలతో కాసేపు ఉల్లాసంగా క్రికెట్ ఆడి వారందరిని ఉత్సవపరిచారు. విద్యార్థులకు అద్భుతమైన కోచింగ్ ఇస్తున్నారని అకాడమీ కోచ్ ముత్యాల ఆనంద్ ని ప్రశంసించారు. అనంతరం మహేందర్ అకాడమీ నిర్వాహకుడు ముత్యాల ఆనంద్ , నవనీత లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెరిడియన్ ప్రిన్సిపాల్ రాజేందర్ రెడ్డి, పెర్క శ్రీనివాస్ జువ్వన రమేష్ అకాడమీ విద్యార్థులు పేరెంట్స్ పాల్గొన్నారు.

సంక్రాంతి సంబరాలు..

సంక్రాంతి సంబరాలు..

సిద్దిపేట: 8 జనవరి యదార్థవాది

సిద్దిపేట పట్టణంలోని ప్రియదర్శిని కాలనీ ఆదివారం సంక్రాంతి సంబరాలు సొసైటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మహిళకు ముగ్గుల పోటీ నిర్వహించి, ఉత్తమ ముగ్గు వేసిన మహిళకు బహుమతులను ఆదివారం అందజేశారు. కార్యక్రమములో అధ్యక్షులు బాలమల్లు, ప్రధాన కార్యదర్శులు కిష్టయ్య, కోశాధికారి మోహన్ , రాజు, అశోక్ రెడ్డి, కొటేశ్, భాస్కర్, నాగరాజు తదితరులు పాల్గొనరు.

రైతుల భూముల జోలికి రావద్దు..

రైతుల భూముల జోలికి రావద్దు..

ఆర్మూర్: 8 జనవరి యదార్థవాది

* ధరణి పోర్టల్ ను రద్దు చేయాలి..సిపిఐ (ఎంఎల్)
* ఒకేసారి రుణమాఫీ అమలు చేయాలి..

కామారెడ్డి జిల్లాలో రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో కెసిఆర్ ప్రభుత్వం పారిశ్రామిక వాడ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలని చుస్తోందని, అధికార పార్టీ నేతల లబ్ధికోసమే తప్ప ప్రజలకు మేలుచేయడానికి కాదని సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఆర్మూర్ లో ఆదివారం పత్రికసమవేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ పేరుతో రైతుల భూములను లాక్కుంటే రైతులు, ప్రజలు, ప్రజా సంఘాలు చూస్తూ ఊరుకోమని, తమ భూముల రక్షణ కోసం రైతులు చేస్తున్న పోరాటానికి ప్రజాపంథా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులతో చర్చించి, వారి వ్యవసాయ భూములకు నష్టం కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి ప్రజలను, రైతులను అనేక గందరగోళాలకు గురిచేసిందని, భూ పరిష్కారం కోసం కోర్టుల, ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ ప్రజలు తిరుగుతున్నారని, ధరణి పోర్టల్ భూస్వాములకు వరంగా, సామాన్య పేద ప్రజలకు సమస్యల నిలయంగా మారిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇనాం భూములను, దేశాసైనికులకు ఇచ్చిన భుములను ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వం లాక్కుంటుందని, ఇప్పటికైనా ధరణి పోర్టల్ రద్దు చేయాలని తెలిపారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసిఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని వాయిదాల పర్వం కొనసాగిస్తుందని, ఒకేసారి రుణమాఫీ అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యకమంలో సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, రాష్ట్ర నాయకులు వి. ప్రభాకర్ జిల్లా నాయకులు ఎం.నరేందర్, బి.దేవారం, ఎం. వెంకన్న, డి.రాజేశ్వర్, బి.మల్లేష్, పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గల్ప్ బాదితులను ఆదుకోండి..

గల్ప్ బాదితులను ఆదుకోండి..

ఇండోర్: 8 జనవరి యదార్థవాది

ఇండోర్లో ప్రవాసి భారతీయ దివాస్ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళిధరన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గల్ఫ్, మస్కట్, ఒమాన్, మలేషియా దేశాలకు తెలంగాణ యువకులు గల్ఫ్ ఏజెంట్లు మోసంచేస్తున్నారని కోటపాటి నరసింహం నాయుడు ఆదివారం మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏజెంట్ల మోసంతో గల్ప్ దేశాలలో ఉన్న వారు గాథ నెలలుగా ఉద్యోగం లేక ఇండియాకు రావాలంటే 1,20,000/- వేలు జరిమానా కట్టాల్సివస్తుందని మంత్రికి వివరించి, వినతిపత్రం అందించారు.

రెండవ విడత కంటి వెలుగుపై..సమీక్షా

రెండవ విడత కంటి వెలుగుపై..సమీక్షా

నల్లగొండ: 7 జనవరి యదార్థవాది

నల్లగొండ జిల్లా పట్టణంలో రెండవ విడత కంటి వెలుగు అవగాహన సదస్సు కార్యకమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొన్నరు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో కంటి వెలుగు అవగాహన సదస్సు కార్యక్రమన్ని శనివారం MNR గార్డెన్స్ నిర్వహించారు. ఈ కార్యకమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఏమ్మేలే శ్రీమతి గొంగిడి సునీత, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, సూర్యాపేట నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...