37.2 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 134

చట్టపరమైన సమస్యలపై చర్చ..

కోర్టు డ్యూటీ అధికారులతో చట్టపరమైన సమస్యలపై చర్చ..

సిరసిల్ల: 7 జనవరి యదార్థవాది

సిరిసిల్ల జిల్లా కోర్ట్ ప్రాంగణంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యుటర్స్ లక్ష్మీ ప్రసాద్, నర్సింగరావు, అదనపు ఎస్పీ చంద్రయ్య, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తెలంగాణ ఆదేశాల మేరకు శనివారం కోర్టు డ్యూటీ అధికారులు తో చట్టపరమైన సమస్యలపై చర్చించారు. ఇటీవల కాలంలో నమోదు అయిన కేసులకు సంబంధించి కోర్టు విధి విధానాల గురించి జిల్లాలోని పోలీస్ అధికారులతో చర్చించరు..పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని నమోదైన కేసులలో నాణ్యమైన దర్యాప్తు చేపడుతూ కోర్ట్ డ్యూటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కోర్టు ట్రయల్ కు ఎప్పటికప్పుడు హాజరవుతో నేరారోపణల శాతం పెంచడానికి అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపిపి సందీప్, సతీష్. డిసీఆర్బీ డిఎస్పీ బాలకిషన్, సి.ఐ అనిల్ కుమార్, మోగిలి, ఉపేందర్, నవీన్ కుమార్, ఎస్.ఐ లు కోర్టు డ్యూటీ అధికారులు, స్టేషన్ రైటర్స్ పాల్గొన్నారు..

కూలింది అక్రమ నిర్మాణమా..?

కూలింది అక్రమ నిర్మాణమా..?

టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంగా కడుతున్న నిర్మాణాలు..!

మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన చట్టాన్ని తుంగలో తొక్కిన అధికారుల తీరుకు సామాన్యుల బలి..

హైదరాబాదు: 7 జనవరి యదార్థవాది
కూకట్పల్లిలో లక్ష్మణరావు అనే వ్యక్తి నిర్మిస్తున్న భవన నిర్మాణం పనులు చేస్తుండగా పైకప్పు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు, భవన యజమాని లక్ష్మణరావు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ప్రమాదానికి గల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది….

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భవతి మృతి..

వైద్యుల నిర్లక్ష్యంతో గర్భవతి మృతి..

ఆర్మూర్: 7 జనవరి యదార్థవాది ప్రతినిది

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డొంకేశ్వర్ గ్రామానికి చెందిన పెంటాల శ్రీలత ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. శనివారం సాధారణ డెలివరీ అయ్యిందని బాబు పుట్టిన తరువాత కాసేపటికి శ్రీలత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే శ్రీలత మరణించిందని, శ్రీలత కుటుంబ సభ్యులు కొద్ది సేపు దర్ననివహించారు. విషయం తెలుసుకున్న పోలీసు బందోబస్తు మధ్య పోస్టుమార్టంకు ప్రయత్నించగా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. శ్రీలత మృతిపై ఆసుపత్రి సూపర్డెంట్ నాగరాజు మాట్లాడుతూ సాధారణ ప్రసవం నిర్వహణలో బాబు పుట్టాడని కొద్ది సేపటికి కార్డియాక్ అరెస్ట్ కావడంతో మరణించిందని తెలిపారు.

డీఎస్పీ వినతిపత్రం అందజేసిన విలేఖరులు

డీఎస్పీ వినతిపత్రం అందజేసిన విలేఖరులు

జోగులాంబ: 7 జనవరి యదార్థవాది ప్రతినిది

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో శుక్రవారం జర్నలిస్టులపై ఇసుక మాఫియా అక్రమార్కులు దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం డీఎస్పీ వినతి పత్రం అందజేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విలేఖరులు..

కోర్టును ఆశ్రయించిన బాధిత రైతులు..

కోర్టును ఆశ్రయించిన బాధిత రైతులు..

కామారెడ్డి: 7 జనవరి యదార్థవాది

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పట్టణ నూతన మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ వెంటనే రద్దు చేయాలని గత నెల రోజులుగా రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే, తమ సాగు భూములను పరిశ్రమల జోన్‌ నుంచి తొలగించాలని రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. లాయర్‌ ద్వారా మున్సిపల్‌ కమిషనర్‌కు నోటీసులిచ్చారు.

ఇన్చార్జి కమిషనర్ గా సత్యనారాయణ

ఇన్చార్జి కమిషనర్ గా సత్యనారాయణ

రామగుండం: 7 జనవరి

కరీంనగర్ సిపి సత్యనారాయణ రామగుండం ఇన్చార్జి పోలీస్ కమిషనర్ బాధ్యతలు స్వీకరించారు. రామగుండం సిపిగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డి కి మల్టీ జోన్ వన్ ఐజిగా బదిలీ కావడంతో శనివారం ఆయన రిలీవ్ అయి వెళుతూ కరీంనగర్ సిపి సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం రామగుండం సిపిని నియమించే వరకు సత్యనారాయణ ఇన్చార్జి సీపీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

జల్లికట్టు నిర్వహణకు ఎలాంటి అనుమతి లేదు. జిల్లా ఎస్పీ

జల్లికట్టు నిర్వహణకు ఎలాంటి అనుమతి లేదు.. జిల్లా ఎస్పీ

తిరుపతి: 7 జనవరి

తిరుపతి జిల్లా అన్ని గ్రామాలలో జల్లి కట్టు ఆనవాయితీల పేరుతో మూగజీవులను హింసించడం నేరం గ్రామాలలో జల్లి కట్టు నిర్వహించడానికి ఎలాంటి అనుమతి లేదు జిల్లా ఎస్పీ. జల్లికట్టు నిర్వాహకులదే బాధ్యత.. జల్లికట్టు నిర్వహించే గ్రామాలలో కౌన్సెలింగ్, నోటీసులు కూడా జారీ చేశం, ఆదేశాలను లెక్కచేయకుండా నిబంధనలను అతిక్రమించే చట్టపరమైన చర్యలు తీసుకుంటమని జిల్లా ఎస్పీ పీ. పరమేశ్వర రెడ్డి ఒకప్రకతనలో తెలిపారు.

గంగుల ను పరామర్శించిన.. ఎర్రబెల్లి దయాకర్ రావు.

గంగుల ను పరామర్శించిన.. ఎర్రబెల్లి దయాకర్ రావు.

కరీంనగర్: 6 జనవరి

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ను శుక్రవారం మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించరు.. గంగుల మల్లయ్య (85) ఇటీవల మృతి చెందడంతో నేడు రాష్ట్ర మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు. మంత్రి కమలాకర్ నివాసానికి వెళ్ళి, మల్లయ్య చిత్రపటం వద్ద పూలు చల్లి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు..

క్యాలెండర్ ఆవిష్కరన..

ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరన

యాదాద్రి: 6 జనవరి

తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించరు.. ఈ కార్యకమంలో వైస్ చైర్మన్ శ్రీ ధనావత్ బికు నాయక్, సీఈవో సిహెచ్ కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో బి శ్రీనివాస్ రావు, రాష్ట్ర అధ్యక్షులు ఏపాల సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అప్పల చంద్రమౌళి, TNGO’s జిల్లా అధ్యక్షులు మందడి ఉపేందర్ రెడ్డి, రాంబాబు, రచ్చ ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తెలంగాణ పంచాయతీరాజ్,నిస్టీరియల్ ఇతర ఉద్యోగుల సంఘంల నాయకులు పాల్గొన్నారు..

మహసభల పోస్టర్ ఆవిష్కరణ

మహసభల పోస్టర్ ఆవిష్కరణ

యాదాద్రి: 6 జనవరి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సింహద్వారం వద్ద TUWJ రాష్ట్ర మహసభల పోస్టర్ ఆవిష్కరణ. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య. రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ యాదాద్రి జిల్లా జర్నలిస్టులతో కలిసి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...