33.2 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 135

జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

యదాద్రి: 6 జనవరి

ఆత్మకూరు మండలం సింగారం గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య.. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ. యువత ఆదర్శంగా ఉంటూ క్రీడలను స్ఫూర్తిగా తీసుకొని ఈ టోర్నమెంట్లతో క్రీడలను బతికిస్తున్నారని అన్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితి లో సెల్ ఫోన్ తో అన్ని రంగాల్లో ముందుఉన్న ఈ క్రీడలను నిర్వహిచటం ఈ సింగారం గ్రామ యువత ఆదర్శమన్నారు.క్రీడల్లో గెలుపు ఓటములు అనేవి సహజం కానీ ఈ క్రీడలు శారీర దారుడ్యానికి స్నేహభావం,గ్రామల మధ్య ప్రేమ పెంచుతుందని అన్నారు..ఆప్పటి ప్రభుత్వం ఉన్నప్పుడు పాటశాలలో ప్రత్యేక సమయం క్రీడలకు వుండేదని అన్నారు.యువత ఐక్యమత్యంగా ఉంటే దేనినైనా సాధించవచ్చని అన్నారు.సింగారం గ్రామం ఏర్పాటు చేసిన ఈ టోర్నమేంట్ తో రాష్ట్రంలో, జిల్లా లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు..యువతకీ ఎప్పుడు ఏ అవసరం ఉన్న నేను ముందు ఉండి మీకోసం కృషి చేస్తానని బీర్ల అయిలయ్య తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్, స్థానిక సర్పంచ్ జామ యాదయ్య, పాక్స్ చైర్మన్ శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు బత్తిని ఉప్పలయ్య, పోతగాని మల్లేశం, దేవరపల్లి ప్రభాకర్ రెడ్డి,పల్సం రాజు,ఎలగందుల శ్రీను, కోరే మల్లేశం అంబటి కిరణ్, విఘ్నేష్, సురేందర్, సుభాష్, కిరణ్, భరత్, పవన్, తదితరులు పాల్గొన్నారు.

అరెస్ట్ పై కండన..

అరెస్ట్ పై కండన..

నిజామాబాద్: 6 జనవరి

తొర్లికొండ PACS కాటిపల్లి గంగారెడ్డి తెల్లన్న మాజీ అధ్యక్షున్ని గురువారం రాత్రి జక్రన్ పల్లీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని కోటపాటి ఖండిచారు…1964 Co-op చట్టం ప్రకారం ఏదైనా సొసైటీలో అక్రమాలు జరిగితే జిల్లా కో ఆపరేటివ్ అధికారి దర్యాప్తు చేసి రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ కమిషనర్ నివేదిక ఇవ్వాలి. కమిషనర్ ప్రాసిక్యుషన్ కు అనుమతి ఇస్తే, అప్పుడు DCO పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలి. పోలీసులు లేదా DCO నోటీసు ఇచ్చి జవాబు తీసుకొని అనంతరం అరెస్టు చెయ్యాలి. కానీ ఇవేమీ పాటించకుండా జిల్లా కో-ఆపరేటివ్ అధికారి ( DCO ) తనకు లేని అధికారాలు ఉపయోగించి పోలీసులను తప్పుదోవ పట్టించి కాటిపల్లి గంగారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారు. శుక్రవారం జిల్లా కారాగారవాసంలో దక్షిణ భారతదేశ రైతు సంఘాల అధ్యక్షులు కోటపాటి నరసింహం నాయుడు, తాటిపల్లి గంగారెడ్డిని కలిసి వివరాలు తెలుసుకొన్నారు. ఆయన హయాంలో ఇచ్చిన రుణాల విషయం కానీ , కట్టిన మడిగెలు కానీ , ఏ విధమైన అక్రమాలు జరగలేదు . నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్య తీసుకోలేదు స్థానిక రాజకీయాల కోసం తన పై అక్రమంగా కేసు పెట్టారని తెలిపారు. తనపై అక్రమంగా కేసు పెట్టిన జిల్లా DCO , మరియు ప్రస్తుత సొసైటీ చైర్మన్ లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. కాబట్టి కాటిపల్లి గంగారెడ్డిని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోటపాటి డిమాండ్ చేశారు.

తెలుగు రాష్టాలపై పట్టు సదింపు చర్య..!

* తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి..ఏపీకి కూడా..

* రేస్‌లో ఉన్నది వీళ్లే.!

న్యూఢిల్లీ: 6 జనవరిి

ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ.. దక్షిణాదిన మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. కర్నాటక మినహా మిగత రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. ఐతే తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది..
ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తున్న కమలం నేతలు.. ఇక్కడ పార్టీ బలోపేతంపై సీరియస్‌గా దృష్టి సారించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో పెద్ద పీఠ వేయాలని యోచిస్తోంది. తెలంగాణ, ఏపీకి చెరో కేంద్రమంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.
తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవిలో ఉన్నారు. ఈసారి మరొకరికి కూడా కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టే యోచనలో ఉంది బీజేపీ. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను బీజేపీ గెలిచింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు విజయం సాధించారు. యూపీ నుంచి లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వీరిలో కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఐతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టి పెట్టుకొని.. రాష్ట్రానికి మరో కేంద్రమంత్రి పదవి ఇచ్చే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. త్వరలో జరిగే కేంద్ర కేబినెట్ విస్తరణలో.. ధర్మపురి అర్వింద్, రాజ్యసభ్యుడు లక్ష్మణ్‌లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. బీసీ కోటాలో లక్ష్మణ్, ఉత్తర తెలంగాణ నుంచి ధర్మపురి అర్వింద్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ గెలిచిన మొత్తం నాలుగు ఎంపీ సీట్లలో మూడు సీట్లు.. ఉత్తర తెలంగాణ నుంచే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి నేతల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టాలని కేంద్రం భావిస్తుందట. హైదరాబాద్ నగరం నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి పదవిలో ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణ్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తే.. మళ్లీ హైదరాబాద్‌కే ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందనే కోణంలోనూ ఆలోచిస్తున్నారట. అలా కాకుండా.. బీజేపీకి మూడు సీట్లు ఇచ్చిన ఉత్తర తెలంగాణకు.. ఈసారి కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని యోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కేంద్రమంత్రి పదవి దక్కవచ్చని తెలుస్తోంది. అటు ఏపీలో మాత్రం బీజేపీకి లోక్‌సభ సభ్యులు ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా బీజేపీ గెలవలేదు. కానీ ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రం ఉన్నారు. సీఎం రమేష్‌తో పాటు జీవీఎల్ నరసింహారావు. జీవీఎల్ యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ.. ఆయన ఏపీకి చెందినవారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఒకిరి కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోందట. సీఎం రమేష్.. టీడీపీ నుంచి వచ్చిన నేత. కానీ జీవీఎల్ మాత్రం ముందు నుంచీ బీజేపీలో ఉన్నారు. పార్టీలో నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఆయనకు పేరుతుంది. ఈ నేపథ్యంలో జీవీఎల్ నరసింహారావుకే కేంద్రమంత్రి పదవి రావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గీతం కాలేజ్‌ పరిసరాల్లోని ప్రభుత్వ భూమికి కంచె..

భారీగా పోలీసుల మోహరింపు..

గతంలోనే మార్క్‌ చేశాం: ఆర్డీవో..

విశాఖపట్నం: 6 జనవరి

విశాఖలోని గీతం వైద్య కళాశాల పరిసరాల్లో గతంలో గుర్తించిన ప్రభుత్వ భూమి చుట్టూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కంచె ఏర్పాటు చేశారు.వేకువజాము నుంచే దీనికి సంబంధించిన కసరత్తును మొదలు పెట్టడంతో కాస్త ఉత్కంఠ ఏర్పడింది. వైద్యకళాశాల భవనాలను కూలుస్తారనే ప్రచారమూ జరిగింది. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు పెట్టి విస్తృతంగా తనిఖీలు చేపట్టడం.. మరోవైపు తెదేపాకు చెందిన ముఖ్యనేతలను గృహనిర్బంధం చేయడంతో ఏం జరగనుందనే ఆసక్తి నెలకొంది. గతంలో స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమిలో కంచె ఏర్పాటు చేస్తున్నట్లు భీమిలి ఆర్డీవోపేర్కొనడంతో ఉత్కంఠకు తెరపడింది.తెల్లవారుజామునే రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది గీతం వైద్యకళాశాల ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. కంచె ఏర్పాటుకు అవసరమైన సామగ్రితో అక్కడికి చేరుకుని పనులు మొదలుపెట్టారు. భీమిలి ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, డీఆర్వో పర్యవేక్షణలో సుమారు 3 గంటలపాటు పనులు కొనసాగాయి. పలుచోట్ల ‘ప్రభుత్వ భూమి’ బోర్డులు ఏర్పాటు చేశారు. కంచె ఏర్పాటు నేపథ్యంలో గీతం వైద్య కళాశాల పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆ మార్గంలో వెళ్లే వారిని తనిఖీలు చేశారు. మీడియాతో పాటు ఎవర్నీ కళాశాల లోపలికి అనుమతించకుండా కంచె ఏర్పాటు పనులు పూర్తిచేశారు. అంతకుముందు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు మరికొందరు తెదేపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.. గతంలోనే మార్క్‌ చేశాం: ఆర్డీవో కళాశాలను ఆనుకుని ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలోనే స్వాధీనం చేసుకున్నామని.. ఇప్పుడు కంచె మాత్రమే ఏర్పాటు చేశామని ఆర్డీవో భాస్కర్‌రెడ్డి తెలిపారు. రుషికొండ గ్రామ సర్వే నంబర్‌ 37, 38లోని స్థలాన్ని అప్పట్లో స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలోనే ఈ స్థలాన్ని మార్క్‌ చేశామని.. ఇవాళ 5.25 ఎకరాల్లో కంచె వేశామని చెప్పారు. మిగిలిన స్థలానికి ప్రభుత్వ భూములే సరిహద్దులుగా ఉండటంతో కంచె ఏర్పాటు చేయలేదని వివరించారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేవన్నారు. పని త్వరగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో తెల్లవారుజాము నుంచి పనులు చేపట్టామన్నారు. పది చోట్ల ప్రభుత్వ భూమిగా బోర్డులు పెట్టామని ఆయన వివరించారు. నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని ఆర్డీవో స్పష్టం చేశారు.

భారీగా పోలీసుల మోహరింపు..

గ్రూపు-1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

గ్రూపు-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి

ఈ ఏడాదిలో మరో గ్రూపు-1 నోటిఫికేషన్‌.. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించే గ్రూపు-1 ప్రిలిమ్స్‌ (స్క్రీనింగ్‌ టెస్ట్‌)కు పకడ్బందీ గా నిర్వహించడనికి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. రాష్టంలోని 18 జిల్లాల్లో 297 కేంద్రాల్లో 1,26,499 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, మూడు వారాల్లోనే ఫలితాలను విడుదల చేస్తామని, గ్రూపు-1 నోటిఫికేషన్‌లో ప్రకటించిన 92 పోస్టులకు అదనంగా మరికొన్ని, పోస్టులను కలిసే ఆస్కారంముందని అన్నారు. కమిషన్‌ ప్రధాన కార్యాలయంలో గౌతమ్‌సవాంగ్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘గ్రూపు-1 ప్రధాన పరీక్షను స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలు వెల్లడించిన 90 రోజుల్లోగా నిర్వహిస్తాం.. ఆగస్టులోగా నియామకాలు పూర్తి చేస్తమంనరు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోస్టుల భర్తీకి ఆమోదం లభిస్తే ఈ ఏడాదిలో కొత్తగా మరో గ్రూపు-1 నోటిఫికేషన్‌ జారీచేస్తాం. త్వరలో గ్రూపు-2 నోటిఫికేషన్‌ ఇస్తాం’ అని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.

డీఈఈ వెంకట రమణారావు మృతి

డీఈఈ వెంకట రమణారావు మృతి

ఆర్మూర్: 6 జనవరి

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నీటి పారుదల శాఖ డీఈఈ వెంకట రమణారావు ఆత్మహత్యకు శుక్రవారం ఉదయం గోదావరి నదిలో వెంకటరమణా రావు మృతదేహం నీటిలో తెలియాడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం నవీపేట్ మండలం పోతంగల్లో అదృశ్యమైనట్టు కుటుంబసభ్యులు నవీపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం ఇంటి నుంచి బైక్పై వెళ్లిన అతను గోదావరి వద్ద బైక్ను వదిలివేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం డెడ్ బాడీని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలసివుంది.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్

హైదరాబాద్: 6 జనవరి

హైదరాబాద్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.. శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల అబివ్రుది ప్రభుత్వ విదానాలను కోతసంకేతితపై హైదరాబాదులో చేర్చించినట్లు కేటీఆర్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు.

టి.పి.టి.ఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రధానోపాధ్యాయులు..

టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రధానోపాధ్యాయులు.

మెదక్ 5 జనవరి

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ హవేలీ ఘణపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూరుగుపల్లి పాఠశాలలో నూతన సంవత్సర (టి.పి.టి.ఎఫ్) క్యాలెండర్ ను ఆవిష్కరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ మధుమోహన్.ఈ సందర్భంగా టి పి టి ఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు కాముని రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం నిరంతర పోరాటం చేస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన 3 విడతల డీఏలు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా బదిలీలు, పదోన్నతులకు సంబంధించి నటువంటి షెడ్యూల్ వెంటనే విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ మెదక్ జిల్లా కార్యదర్శి ఎల్.దేవి సింగ్, హవేలీ ఘన్పూర్ మండల శాఖ అధ్యక్షుడు కే సత్యనారాయణ, కే.రాజు,స్వామి కుమార్, పి.నరేందర్, సురేష్ కుమార్, నగేష్, శివరాములు, వెంకటేశ్వర్లు, గణేష్, సంజీవ్ కుమార్,శ్రీలత,అమృత, సౌజన్య,గిరిజ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

టి.పి.టి.ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ప్రధానోపాధ్యాయులు.

జిల్లాకు దక్కడం గర్వకారణం

జిల్లాకు దక్కడం గర్వకారణం

* జిల్లాకు దక్కడం గర్వకారణం..అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్..

తూప్రాన్ కు ఓ.డి.ఎఫ్.ప్లస్.ప్లస్ సర్టిఫికెట్ దక్కడం గర్వకారణం..అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

మెదక్ 5 జనవరి

మెదక్ జిల్లా తూప్రాన్ పురపాలక సంఘానికి ఓ.డీఎఫ్.ప్లస్,ప్లస్ సర్టిఫికెట్ వచ్చిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. తెలంగాణ రాష్టంలోని మున్సిపాలిటీలలో చేపట్టిన పట్టణ ప్రగతి, పురోగతి పనులపై గురువారం హైదరాబాద్ లో ఎంసీ.హెచ్.ఆర్.డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక రోజు వర్క్ షాప్ డైరెక్టర్ సత్యనారాయణ అద్వర్యంలో నిర్వహించారు. రాష్ట్రం లోని 42 మున్సిపాలిటీలకు ఈ ఓ.డి.ఎఫ్.ప్లస్ ప్లస్ సర్టిఫికెట్ వచ్చాయని, మన జిల్లాలో తూప్రాన్ ఎంపికైదని ప్రతిమ సింగ్ తెలిపారు. ఈ వర్క్ షాప్ లో రాష్ట్రంలో అన్ని మున్సిపల్ కమీషనర్లు అధికారులు పాల్గొన్నారని అన్నారు..

జిల్లాకు దక్కడం గర్వకారణం..అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్..

రాష్టంలో బిజెపి దే అధికారం..!

రాష్టంలో బిజెపి దే అధికారం..!

మెదక్: 5 జనవరి
రాబోయే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని, సునాయాసంగా మేమే అధికారంలోకి వస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.. గురువారం మెదక్ హెడ్ క్వార్టర్ ద్వారక గార్డెన్ లో ఏర్పాటు చేసిన బిజెపి శక్తి కేంద్ర ఇన్చార్జిల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని విధాల తెలంగాణకు సహకరించిన.. కేంద్రంపై విషం చిమ్ముతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాష్టంలో బిజెపి దే అధికారం..!

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...