* రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4 లక్షల 36 వేల 544 మంది ఓటర్లు..
* 2లక్షల 23వేల 905 మహిళా ఓటర్లు..
సిరిసిల్ల: 5 జనవరి
జిల్లాకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా గురువారం వెల్లడైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 4 లక్షల 36వేల 544మంది ఓటర్లు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లలో 2లక్షల 12వేల 469మంది పురుష ఓటర్లు ఉండగా, 2లక్షల 23వేల 905మంది మహిళా ఓటర్లు, ఇతర ఓటర్లు 14, సర్వీస్ ఓటర్లు 156 మంది ఉన్నారు.
ఆర్మూర్ గాయత్రి బ్యాంకు శాఖ యొక్క ఖాతాదారులైన ఉప్పు శ్రీనివాస రావు ప్రమాదవశాత్తు మృతి చెందగా, గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాదబీమా మృతుని తండ్రికి ఉప్పు రాములుకు 1లక్ష చెక్కు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, గాయత్రి బ్రాంచి మేనేజర్ శ్రీరామోజి లింబాద్రి లు అందజేశారు…ఎమ్మెల్యే మాట్లాడుతు మధ్యతరగతి, వ్యాపార, ఉద్యోగ ప్రజలకు ఋణాలను ఇస్తున్నారని, నామమాత్రపు చార్జీలతో లక్ష రూపాయల -ప్రమాదబీమా ద్వారా ఖాతాదారుల కుటుంబాలకు ఏంటో మేలౌతుందని తెలిపారు. బ్రాంచి మేనేజర్ శ్రీరామోజి లింబాద్రి మాట్లాడుతూ ఖాతా దారులకు MI- CM AcPS సేవల ద్వారా వినియోగదారులకు చెల్లింపులు చేయడం జరుగుతుంది. సేవింగ్ ఖాతాలు ప్రారంభించుటకు కావలసిన అన్ని బ్యాంకు యందే ఉచితంగా అందిస్తున్నామని, వ్యాపార వృద్ధికై ఋణాలను అందిస్తున్నామని, ఆర్మూర్ పరిసర గ్రామాలలో 17 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించామని, తద్వారా పెన్షనర్లు, ఖాతాదారులు బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద బ్యాంకు లావాదేవీలను నిర్వహించుకోవచ్చని తెలియజేశారు.
నూతన డిఐజిగా గురువారం కె. రమేష్ నాయుడు కరీంనగర్ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు..సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు… ఈ సందర్భంగా నూతన డిఐజి జిల్లా భౌగోళిక పరిస్థితులు శాంతిభద్రతల గురించి సిపి శ్వేత ను అడిగి తెలుసుకున్నారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతఅడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్
ఈశాన్య రాష్ట్రాల్లో త్వరలో జరుగనున్న శాసన సభ ఎన్నికలపై కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా గురువారం పలు రాష్ట్రాల డీజీపీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సున్నితమైన ప్రాంతాలుగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోఈ సంవత్సరం (2023 ) లో శాసన సభ ఎన్నికలు జరుగనున్న నేపద్యంలో ఆయ రాష్ట్రాల్లో ఎన్నికలు బద్రత సాఫీగా, నిర్వహించడానికి, అదనపు పోలీస్ బలగాలు కావాలని హోం శాఖ కార్యదర్శి తెలిపారు.
నియోజకవర్గంలో ప్రజలకు చేరువైన వైద్యం..ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆర్మూర్: 5 జనవరి
ఆర్మూర్ నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ గురువారం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్మూర్ కు కోటి రూపాయల వ్యయంతో డయాలిసిస్ సెంటర్ ను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లకు నియోజకవర్గ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు వైద్యం చేరువైందన్నారు. ఆర్మూర్ ఆసుపత్రిలో 22వేలకు పైగా ప్రసవాలు, ప్రతి నెల 500 ఉచిత ప్రసవాలు జరగాలని, త్వరలో డాక్టర్ల భర్తీ జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్, వైస్ చైర్మన్ మున్ను, పలువురు కౌన్సిలర్లు, డాక్టర్లు నాగరాజు, అమృత్ రెడ్డి, స్రవంతిలతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
* జాతీయ స్థాయిలో తెలంగాణ మళ్ళీ అగ్రస్థానంలో ఉంది..
* స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ 2023 ర్యాంకింగ్ లో.. * బారతదేశంలో టాప్ మూడు స్థానాలు తెలంగాణ జిల్లాలే..
* ట్విట్టర్ వేదికగా మంత్రి కే తారక రామారావు ప్రశంస..
స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ – డిసెంబర్ ర్యాంకింగ్ లో బారతదేశంలోనే మొదటి మూడు స్థానంలో తెలంగాణ జిల్లాలే ఉండటం ఏంటో ఆనందాన్నిచ్చిందని మంత్రి కే తారక రామారావు మంగళవారం రాత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్వచ్చ భారత్ మిషన్ (గ్రామీణ) 2023 డిసెంబర్ నెలలో పారామీటర్ల ఆధారంగా దేశం లోనే 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరి లో టాప్ 3 జిల్లాలు తెలంగాణ వే… తెలంగాణ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచిందంటూ మంత్రి ట్వీట్ చేశారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయితీ శాఖ అధికారులు, సిబ్బందికి, రాజన్న సిరిసిల్ల,పెద్దపల్లి కరీంనగర్ జిల్లాల కలెక్టర్లకు మంత్రి ట్విట్టర్ వేదికగా గురువారం శుభాకాంక్షలు తెలిపారు.
* నిరుపేద విద్యార్థిని చిరుసాహాయం.. సిద్దిపేట:5 జనవరి
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థినికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చేతుల మీదుగా ఆమె చదువు ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా రైస్ మిల్లర్స్..సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలానికి చెందిన నిరుపేద విద్యార్థిని గొల్లచిన్నోళ్ల స్రవంతి హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని హార్టికల్చర్ యూనివర్సిటీలో బిఎస్సి నర్సింగ్ లో ప్రవేశం సాదించింది. హాస్టల్ ఫీజు చెల్లించడానికి ఇబ్బంది.. సిద్దిపేట జిల్లా రైస్ మిలర్స్ అసోసియేషన్ అద్వర్యంలో స్రవంతి చదువుకు 3 లక్షల44 వేల రూపాయల చెక్కును గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్రవంతికి అందజేశారు. హార్టి సెట్లో రాష్ట్రవ్యాప్తంగా 3 వ ర్యాంకు సాధించి జిల్లాకు పేరు తెచ్చిన స్రవంతిని కలెక్టర్ అభినందించరు. విద్యలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. విద్యార్థిని స్రవంతి జిల్లా కలెక్టర్ కు సిద్దిపేట జిల్లా రైస్ మిలర్స్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి హరీష్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, సెక్రెటరీ బుచ్చయ్య, సభ్యులు చింతా రాజు, ప్రభాకర్, బాల కిరణ్ రావు, శివకుమార్, కాశీనాథ్, రమేష్, రాజేష్, రవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా యువజనోత్సవాలు సిద్దిపేట విపంచి కళా నిలయంలో జిల్లా యువజన సంక్షేమ, క్రీడా శాఖ అధికారి నాగేందర్, సెట్విన్ కోఆర్డినేటర్ అమీనా భాను పర్యవేక్షణలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధకృష్ణ శర్మ, ట్రైనింగ్ కలెక్టర్ ఫైజన్ అహ్మద్ హజరై జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని యువత యొక్క శక్తి సామర్థ్యాలను దేశాభివృద్ధికి పునరంకితం చేయాలని దేశానికి యువశక్తి బలమని యువత సన్మార్గంలో నడిచి వారి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనరు. జానపద నృత్యాల విభాగంలో గెలుపొందినవారికి భాహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, న్యాయ నిర్ణేతలు చంటి,నరసింహులు,సుభాష్, స్వామి,జిల్లా యువజన సంఘాల సమితి జిల్లా ఉపాధ్యక్షుడు అధికం రాజుగౌడ్, చేపూరి విజయ్ కుమార్ గౌడ్,అర్జున్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
* నిఘా నీడలో రాజీవ్ రహదారి, సుల్తానాబాద్ మున్సిపాలిటీ..
* సిసి కెమెరాతో మనిషిలో మార్పు వస్తుంది..
నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలక పాత్రపోషిస్తాయి పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి.. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 18 కిలోమీటర్ల దూరం రాజీవ్ రహదారి పై 29 సీసీ కెమెరాలు ఏర్పాటు, డివైడర్ కటింగ్ వద్ద హైమాస్ లైట్లు,09 హైవోల్ట్జి లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్” లో సుల్తానాబాద్ మున్సిపాలిటీ ప్రజల సహకారం తో 52, 81 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరినింది. బుదవారం సీసీ కెమెరాలను రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి (ఐజి), పెద్దపల్లి డీసీపీ రూపేష్ లతో కలసి ప్రారంభించరు. ఈ సందర్భంగా ఎస్. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో, కాలనీలలో, కార్పొరేటర్స్, వ్యాపారస్తులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. దేశంలోనే సీసీ కెమెరాల ఏర్పాటు లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ, ఏచిన్న సంఘటన, రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని, నేరా నియంత్రణలో ముఖ్య పాత్ర వహిస్తాయన్నారు. సిసి కెమెరాల వలన మనిషి నడవడిలో క్రమశిక్షణ తో కూడిన మార్పు వస్తుందని తెలిపారు. 81 సీసీ కెమెరాలు ఏర్పాటు కు కృషి చేసిన ఏసీపీ, సీఐ, ఎస్ఐ, ఏర్పాటు కు సహకారం అందించిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి సారణంగాపాణి సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేన రెడ్డి, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్ ఐ ఉపేందర్, వినీత ,అశోక్ రెడ్డి , పోత్కపల్లి ఎస్ఐ మహేందర్ జూలపల్లి వెంకటకృష్ణ ఎస్ఐలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రెడ్డి జె ఎ సి అధ్యక్షులు అప్పన్న రాంరెడ్డి
సిద్దిపేట: 4 జనవరి
రాష్ట్రంలోని రెడ్డిల సమస్యలు పరిష్కారించక పొతే రాష్ట్ర ప్రభుత్వం ఫై పోరాటాలకు దిగుతాము అని హెచ్చరించారు. బుదవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన రెడ్డి జె ఎ సి జిల్లా కార్యవర్గ సమావేశం లో మాట్లాడుతూ బి అర్ ఎస్ ప్రభుత్వం రెడ్డిలకు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలపెట్టుకొవాలని డిమాండ్ చేసారు. ఈ మధ్య కాలములో జరిగిన ఉప ఎన్నికల్లో కుడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటును పరిశీలిస్తాం అని చెప్పి ఓట్లు దండుకోని తప్పించుకొని తిరుగుతున్నారని అన్నారు. రెడ్డిలలో అనేక మంది నిరుపేదలు కనిసం రెండు పూటలు కుడా తీనలేని పరిస్థితిలు ఉన్నాయి . ఆర్థికంగా వెనుకబాటుతో పిల్లలను ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టుతున్న సంక్షేమ పథకాలను రెడ్డిలకు వర్తింపు చేయాలను ప్రభుత్వాన్ని కోరారు. రెడ్డిలను ఏమాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రానున్న రోజుల్లో ప్రభుత్వనికి తగిన గుణపాటం చెప్పుతాము అన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెడ్డి జె ఎ సి అధ్యక్షులు అయిలేని మల్లికార్జున్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు మా రెడ్డి రాంలింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఉపా అధ్యక్షులు లక్ష్మరెడ్డి, జిల్లా మహిళ విభాగాం అధ్యక్షురాలు కెసిరెడ్డి శశికల రెడ్డి, వెంకట రెడ్డి తిరుపతి రెడ్డి, విజయా రెడ్డి అశోక్ రెడ్డి, రాజి రెడ్డి, పద్మ, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.