27.7 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 137

నిరుపేదలసేవే నిజమైన తృప్తి

నిరుపేదలసేవే నిజమైన తృప్తి

చేర్యాల: 4 జనవరి

చేర్యాల పట్టణంలోని మనో చేతన పాఠశాలకు సముద్రాల చారిటబుల్ నుండి వాటర్ ప్యూరిఫైడ్ కోసం రూ 20 వేల నగదును మనో చేతన పాఠశాలకు అందజేశారు. నిరుపేదలకు సేవలందించడంలోనే నిజమైన తృప్తి కలుగుతుందని సముద్రాల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సముద్రాల భూమయ్య జ్ఞాపకార్థం సముద్రాల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని చిన్నచిన్న ఆర్థిక సహాయాన్ని, మనో చేతన పాఠశాలలో ఉన్న మతిస్థిమితం, ఆర్థోపెడిక్ పిల్లలకు సేవ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దుర్గ, సాయి శ్రీహస్, మన చేతన పాఠశాల ఫౌండర్ వెంకట్ చుక్క, పాఠశాల ఉపాధ్యాయులు రమాదేవి కాశెట్టి, భాగయ్య, ముస్త్యాల బాల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూముల సర్వే చేయాలి..

రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూముల సర్వే చేయాలి..

హుస్నాబాద్: 4 జనవరి

తెలంగాణ రాష్ట్రంలో సర్వే నెంబర్ ల వారిగా భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి చొరవ చూపాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి పాతిన హద్దు రాళ్ల మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని భూ సమస్యల పరిష్కారానికి కొర్టుల చుట్టూ తిరుగుతూ నష్ట పోతున్నారని ప్రభుత్వం చోరవ తీసుకొని భూ సమస్యల పరిష్కారానికి,ధరణి వెబ్ సైట్ వల్ల అనేక నష్టలు జరుగుతున్నాయని సిఎం కెసిఆర్ వెంటనే భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేసి పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పూర్తికోసం 3 లక్షలు ఇచ్చేందుకు, అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఫించడ్లు ఇవ్వాలని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం సిపిఐ సమగ్ర అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించి కావాల్సిన ప్రజా పోరాటాలు నిర్వహించేందుకు రూపకల్పన చేసామని సిపిఐ నిర్వహించే ప్రజా ఉద్యమాల్లో ప్రజలు భాగస్వామ్య కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్, యెడల వనేష్, సృజన్ కుమార్, భాస్కర్, బద్దిపడగ రాజారెడ్డి, సంజివరెడ్డి, బెక్కంటి సంపత్,భారత తదితరులు పాల్గొన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు

రామగుండము: 4 జనవరి

* బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు…

* అనుమతి లేని డ్రోన్, డిజె సౌండ్స్ పై చర్యలు..

* డీజే ,డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడగింపు…

ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి (ఐజి) ప్రకటనలో అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకుఇబ్బదుల దృశ్య మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంలో పాటు ప్రజల రక్షణ కోసం నిషేధాజ్ఞలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు 01జనవరి 23, 01 పిబ్రవరి 23 కొనసాగుతాయని అన్నారు. ipc,188, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీజే, డ్రోన్ లపై, నిషేధాజ్ఞలు పొడగింస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె సౌండ్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు.

ఆపరేషన్ స్మైల్-9

ఆపరేషన్ స్మైల్-9

* జనవరి 01 నుండి 31 వరకు స్పెషల్ డ్రైవ్..

* అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఆపరేషన్ స్మైల్-9 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

* చిన్న పిల్లల్ని ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు..అదనపు ఎస్పీ చంద్రయ్య.

సిరసిల్ల: 3 జనవరి

జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు జనవరి1 నుండి 31 వరకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్-9 విడత నిర్వహణలో, చేపట్టబోయే కార్యక్రమాలపై వివిధ శాఖల యొక్క విధులు, ప్రణాళికలు గురించి ఆపరేషన్ స్మైల్ పోలీస్ బృందం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటు అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ 0-18సంవత్సరాల లోపు తప్పిపోయిన, బాల కార్మికులు, కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తూ, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే, అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుంది. ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేసి లేదా పోలీస్ లకు సమాచారం తెలపాలని విజ్ఞప్తి చేశారు.సిరిసిల్ల,వేములవాడ సబ్ డివిజన్లలో ఎస్సై నేతృత్వంలో మహిళా ఏ. ఎస్.ఐ తో సహా నలుగురు కానిస్టేబుళ్లకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.., వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి సమిష్టిగా ఆపరేషన్ స్మైల్ నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ లు శ్రీనివాస్, ప్రేమ్ దీప్ జిల్లా సక్షేమా అధికారి లక్ష్మిరజాం ,మెంబెర్స్ – పూర్ణచంద్రం, షీ టీం సిబ్బంది పాల్గొన్నారు.

రేంజర్ల రాజేష్ పై రెండు ఫిర్యాదులు..

రేంజర్ల రాజేష్ పై రెండు ఫిర్యాదులు..

నిర్మల్: 3 జనవరి

బాసర సరస్వతి అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేష్ కోసం గాలింపు ముమ్మరం, ప్రత్యేక టీంల ఏర్పాటు, రేంజర్ల రాజేష్ పై రెండు ఫిర్యాదు, ఐపీసీ 153,504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామన్న బాసర పోలీసులు…

కళాకారున్ని స్మరించుదాం..

కళాకారున్ని స్మరించుదాం..
నిజామాాబాద్: 3 జనబరి
అరుణోదయ సాంస్కృతిక సమైక్య సంతాప సభ పోస్టర్ల పి డి ఎస్ యు ఆధ్వర్యంలో విడుదల చేశారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ సుబ్బారావు విప్లవ జోహార్లు అర్పిస్తూ మంగళవారం ఆర్మూర్ లోని కుమార్ నారాయణ భవనం పి డి ఎస్ యు, పి వై ఎల్, పిఓడబ్ల్యు, ప్రతినిధులు పోస్టర్ల విడుదల చేశారు. ఈ సందర్భంగా బి,దేవరం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టులు ఉద్యమానికి, విప్లవోద్యమానికి సుబ్బారావు ఉద్యమానికి ప్రభావితుడై నాలుగు దశాబ్దాలుగా సాంస్కృతిక సైనికుడిగా, అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో ప్రధానంగా పనిచేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ పోరు బాటలో నడిచాడు, కళాకారుడిగా, రచయితగా, ఎదిగి భూ, రైతాంగ, విద్యాహక్కు, మహిళ హక్కు కొరకు తన పాట, కలాన్ని, గలంతో చైతన్య పరిచారు. అరుణోదయ నాయకులు అనిల్ కుమార్ మాట్లాడుతూ అసమానతలు, దౌర్జన్యాలను తన పాటతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎత్తిచూపరని, కామ్రేడ్ సుబ్బారావు సంతాప సభలను కలిసికట్టుగా జయప్రదం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిషన్, డివిజన్ నాయకులు నరేందర్, పద్మక్క. నిఖిల్, వంశీ, మనోజ్, వినోద్, తదితరులు పాల్గొన్నారు

సచివాలయం త్వరలో సిద్ధం..!

సచివాలయం త్వరలో సిద్ధం..!
హైదబాద్:
నూతన సచివాలయం నిర్మాణం పూర్తికావస్తోంది.. జనవరి 18 లోగా నిర్మాణ పనులన్నీ పూర్తి కావాలని ప్రభుత్వం నిర్ణయించింది..అప్పటివరకు సచివాలయ భవనం పూర్తిగా సిద్ధం కాకపోవచ్చు అని తెలుస్తుంది.. 18నా పూజలు నిర్వహించేందుకు కొంత బాగాన్ని సిద్దం చేయాలని అధికారులు నిర్ణయించారు.. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కొన్ని మంత్రిత్వ శాఖ కార్యాలయలు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.. ఇప్పటివరకు ముఖ్యమంత్రి సిఎస్ కార్యాలయాలు 90% పూర్తయినట్లు తెలుస్తోంది.. సచివాలయంలో పాలన కార్యక్రమాలు సాగించేందుకు మరో మూడు నెలల సమయం పట్టవచ్చు.. జనవరి18న ప్రభుత్వం పూజలు నిర్వహిస్తుందా? లేదా? అన్న విషయం త్వరలో తెలియనుంది. రూ.617 కోట్ల అంచనా తో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి 2019 ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

రోడ్ షోలు బంద్..!

రోడ్ షోలు బంద్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

ఇకనుండి నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే రోడ్ షో..

రోడ్లపై పోలీస్ యాక్ట్ 1861 అమలు..

రెండు దుర్ఘటనల నేపథ్యంలో హోమ్ శాఖ ఉత్తర్వులు..

ఆంధ్ర రాష్ట్రం లో రోడ్లపై నిషేధ విధిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.. రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రోడ్లపై పొలిటికల్ షోలు చేయకూడదు అంటూ ఆదేశాలు జారీచేశారు. 1861 సెక్షన్ పోలీస్ యాక్ట్, ఇకపై 13 సెక్షన్ కూడ అమలు చేస్తారు.. ప్రజలకు ఇబ్బంది లేని రోడ్లకు దూరంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే అనుమతి ఇవ్వాలని, అత్యంత అరదైన సందర్భంల్లో షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రత్యామ్నయ ప్రదేశాలు ఎంపిక చేసుకోవాలని రాజకీయ పార్టీలకు సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవు..

తక్షణమే పరిష్కరించాలి

తక్షణమే పరిష్కరించాలి
సిరిసిల్ల: 2 జనవరి
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి సంబంధిత అధికారుల ఆదేశించారు.. జిల్లా సమీకృత కార్యాలయం సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఇన్ భీమ్య నాయక్ లతో కలెక్టర్ ప్రజల నుండి పిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలతో ఎన్నో వ్యాయాప్రయసాలకు ఓర్చుకోని వివిధ ప్రాంతాల నుండి జిల్లా నలుమూలల నుండి వస్తుంటారు వారి సమస్యలు తక్షణమే పరిష్కరిస్తే ప్రజలు కొంతయనం చెందుతారని మన వంతు బాధ్యతగా అధికారులు తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 32 ఫిర్యాదు వచ్చాయి ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ టి శ్రీనివాసరావు, వేములవాడ ఆర్డిఓ పవన్ కుమార్, కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

సత్వర న్యాయం..రాహుల్ హెగ్డే

సత్వర న్యాయం.. రాహుల్ హెగ్డే
సిరిసిల్ల: 2 జనవరి
జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాదివాస్ కార్యక్రమన్ని సోమవారం నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజల నుండి 14 వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపడతామని, చట్ట ప్రకారం సమస్యల పరిష్కరించాలని, సివిల్ సమస్యలను కోర్టు వివాదాల జోలికి వెళ్లకుండా అధికారులకు తెలిపారు. ప్రజలు తమ ఏసమస్య సంబంధి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు, అన్నివేళలా పోలీసులు తమకు రక్షణ కల్పిస్తారని జిల్లా ప్రజలకు తెలిపారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...