27.7 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 138

రజతోత్సవలు..

శృంగేరి శంకరమఠంలో రజతోత్సవలు..

సిద్దిపేట: 2 జనవరి

సిద్దిపేట శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో జనవరి 9న 25 సంవత్సరాల రజతోత్సవం కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు జరిగే శ్రీ కృష్ణ యజుర్వేద స్వాహాకార సప్తాహం సోమవారం శృంగేరి వేద పాఠాశాలలో తొలి రోజు పూజ కార్యక్రమంలో పాల్గొని గణపతి పూజ, పుణ్యావాచనం స్వామి వారికీ నిర్వహించిన స్థానిక మంత్రి హరీష్ రావు.. ఈ సందర్భంగా వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు మంత్రి ఆశీర్వదించారు.

స్వామివారికి స్వర్ణ కిరీటం..

స్వామివారికి స్వర్ణ కిరీటం..
సిద్దిపేట: 2 జనవరి
సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సోమవారం ఉత్తర ద్వార దర్శనం చేసుకొన్నా స్థానిక మంత్రి హరీష్ రావు.. స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.. తెల్లవారుజాము నుండే భక్తులు భారీ సంఖ్యలో శ్రీనివాసుడిని భక్తులకు దర్శనమిస్తున్నారు.

తెలంగాణలో మద్యం జోరు

తెలంగాణలో మద్యం జోరు

హైదరాబాద్: 1 జనవరి

రాష్ట్రంలో మద్యం ద్వారా 6 రోజులలో రికార్డ్ స్థాయిలో రూ.1,111.29 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని ఆప్కారి శాఖ లెక్కలు వెల్లడించాయి. డిసెంబర్ 30న అత్యధికంగా 254 కోట్లు, డిసెంబర్ 31న రూ.216 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని ఆప్కారి శాఖ గుణంకాలు తెలుస్తున్నాయి. గత సంవత్సరం డిసెంబర్ 31న రూ. 171.93 మద్యం విక్రయాలు జరిగినట్లు ఆప్కారి శాఖ తెలిపింది.కొత్త ఏడాది సందర్భంగా ప్రభుత్వం మధ్య విక్రయాల వేళలు పొడిగించడంతో మందుబాబులకు కలిసొచ్చి డిసెంబర్ 31 అర్ధవా రాత్రి 12 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించి దీంతో మద్యం అమ్మకాలు బాగా జరిగాయి అప్కారి శాఖ తెలిపింది.

వ్యక్తి ఆత్మహత్య

వ్యక్తి ఆత్మహత్య

సిరిసిల్ల: 1 జనవరి
సిరిసిల్ల జిల్లాలో విషాదం తంగళ్ళపల్లి మండలం అంకుషాపూర్ గ్రామానికి చెందిన మామిళ్ళ బాబయ్య ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నమోదు చేశారు. మృతునికి భార్య ఇద్దరు కొడుకులు కూతురు వీరందరికీ వివాహాలు జరిగాయి, నూతన సంవత్సరం కావడంతో కుటుంబ సభ్యులందరూ ఈరోజు మధ్యాహ్నం పనులకు వెళ్లారు.. సాయంత్రం వచ్చి చూడగా బాబయ్య ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడని తెలుస్తుంది.

అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది..

ఆవేశంతో మాట్లాడిన తమ్మినేని

ఆవేశంతో మాట్లాడిన తమ్మినేని

* తొడగొట్టి చెప్తున్నా మల్లి జగనే సిఎం..

శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలంలో నిర్వహించిన వాలంటీర్ల సమావేశంలో మాట్లడుతూ ఆంధ్రలో మల్లి జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి అవుతారని స్పీకర్ తమ్మినేని సీతారాం తొడ కొట్టి చెప్పారు.. రాష్టంలో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమా పలలు అందిస్తున్న సిఎం జగన్ ను అబిమనిస్తున్నారు. గడప గడప కార్యకమంలో మహిళలు, పింక్షన్ దారులు బామ్మారథం పడుతున్నారని తెలిపారు.

రాజన్నను దర్శించుకున్న పొన్నం

రాజన్నను దర్శించుకున్న పొన్నం

సిరసిల్ల: 1 జనవరి

వేములవాడ రాజన్నను ఆదివారం దర్శించుకున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ శ్రీ రాజరాజేశ్వర స్వామిదర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరంలో రాష్ట ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సాగరం వెంకటస్వామి, చందుర్తి జెడ్పిటిసి నాగం కుమార్, నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, పండుగ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

గోరెగావ్ అమర వీరులకు నివాళి

గోరెగావ్ అమర వీరులకు నివాళి

నిజామాబాద్: 1 జనవరి

ఆర్మూర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బీమా గోరెగావ్ యుద్ధ అమర వీరులకు నివాళులు అర్పించిన దళిత సంఘాలు.. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొక్కెర భూమన్న మాట్లాడుతు జనవరి 01_1818లో గొరేగావ్ యుధ్ధం తర్వాత బహుజనులకు విద్యా హక్కు, సామాజిక గుర్తింపు వచ్చి కొంచమైన బ్రతుకులు మారాయి…బారత దేశ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరలైన దళితులు, గిరిజనులు, బిసిలు అందరు ఏకతాటిపై వచినప్పుడే బహుజనులకు అభివృద్ధి అందుతుంది. బహుజనులందరు కలిసికట్టుగా లేనంత వరకు మతాల పేరుతో కులాల పేరు మీద ఎస్సి ల పై బిసి లను, బిసిల పై ఎస్సి లను. ఎగదోసి పాబ్బం గడుపుకొనే రాజకీయ నాయకులకు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్,షెట్ పల్లి నారాయణ, ఆవుల అశోక్, పింజ అశోక్, పింజ భుమేష్ తదితరులు పాల్గొన్నారు

లారీ లోంచి ఆటోపై జారిపడిన గ్రానైట్ రాయి

లారీ లోంచి ఆటోపై జారిపడిన గ్రానైట్ రాయి

* నలుగురు మృతి
* మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
* పరిస్థితి విషమం

మహబూబ్నగర్ జిల్లా కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి గోరా రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. మంగోలి గూడెంకు చెందిన కూలీలు ఆటోలో తిరిగి వారి ఇళ్లకు వెళుతుండగా పక్కనే భారీ గ్రానైట్ రాయి లోడుతో వెళుతున్న లారీ నుంచి గ్రానైట్ రాయి జారీ ఆటో పై పడింది.అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వారి పరిస్థితి విషమంగా ఉంది.

జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు..కలెక్టర్

జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు..కలెక్టర్

సిద్దిపేట 31 డిసెంబర్

నూతన సంవత్సరంలో జిల్లా ప్రజల జీవితాలలో నూతన కాంతులు విరబూయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆకాంక్షించారు. 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2023 కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభసందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, స్థానిక మంత్రి తన్నీరు హరీష్ రావు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో జిల్లా అధికార యంత్రాంగం ముందుకు సాగుదాం.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జిల్లాలోని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరు ఆయురారోగ్యంతో జీవిస్తూ, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు విరబూయాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో ఆకాంక్షించారు.

కేసీఆర్ ను కలుసుకున్న డిజిపి

కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డిజిపి అంజనీ కుమార్

హైదరాబాదు 31 డిసంబర్

తెలంగాణ రాష్ట డిజిపి అంజనీ కుమార్ పదవి బాధ్యతలను స్వీకరించి మర్యాదపూర్వకంగా రాష్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును శనివారం ప్రగతి భవన్ లో కలిశారు. డిజిపిగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ ను అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...