27.7 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 139

ఎన్ సి సి శిక్షణా..

ఎన్ సి సి శిక్షణా..

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (డిఫెన్స్ వింగ్) భారత ప్రభుత్వం

ఎయిర్ ఫోర్స్ అకాడమీ సీనియర్ డివిజన్ ఎన్ సి సి క్యాడెట్‌ల కోసం శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుంది

సికింద్రాబాద్, 31 డిసెంబర్

ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్, హైదరాబాద్ 18 డిసెంబర్ 22 నుండి 31 డిసెంబర్ 2022 వరకు NCC సికింద్రాబాద్ (ఎయిర్ వింగ్) సమన్వయంతో సీనియర్ డివిజన్ ఎన్ సి సి ఎయిర్ వింగ్ క్యాడెట్‌లకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 50 మంది క్యాడెట్లు ఈ శిబిరంలో పాల్గొన్నారు. శిబిరంలో క్యాడెట్‌లు వివిధ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్యాడెట్‌లు వివిధ విభాగాల సందర్శనల ద్వారా శిబిరంలో ఉన్న సమయంలో భారత వైమానిక దళం యొక్క గ్రౌండ్-లెవల్ పనితీరును బహిర్గతం చేశారు. ఎన్ సి సి, ఐ ఎ ఎఫ్ లో చేరిన అకాడమీలో శిక్షణ పొందిన వారితో కూడా వారు సంభాషించారు. శిబిరంలో పొందిన అభ్యాసం క్యాడెట్‌లకు జీవితకాల అనుభవం. ఈ అకాడమీలో శిబిరంలో పాల్గొంటున్నప్పుడు వారు అత్యంత ప్రేరణ మరియు ఉత్సాహంతో ఉన్నారు. జీవితంలో చాలా ప్రారంభ దశలోనే వారిలో సరైన విలువలు మరియు క్రమశిక్షణను పెంపొందించడం ద్వారా క్యాడెట్ జీవితంలో ఎన్ సి సి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వైమానిక దళ అకాడమీలో ఎక్స్‌పోజర్ దేశానికి సేవలో సాయుధ దళాలలో చేరడానికి క్యాడెట్‌లను ఖచ్చితంగా ప్రేరేపిస్తుంది

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

హైదరాబాదు 30 డిసంబర్

హైదరాబాద్ మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త యాడాది సందర్భంగా మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని, జనవరి ఒకటో తేదీ అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు ఉంటాయి. మొదటి స్టేషన్లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటు ఉంటాయి. చివరి స్టేషన్ చేరే వరకు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు నగర వాసులు వినియోగించుకోవచ్చుని తెలిపారు.

విద్యార్థుల ధర్నా..

విద్యార్థుల ధర్నా..

పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా

నిజామాబాద్ 30 డిసంబర్

ఆర్మూర్ లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, విద్యార్థులు సమస్యలు పర్ష్కరించాలని శుక్రవారం ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయంలో ధర్నా నిర్వహించిరు. ఏఐఎస్ఎఫ్ సుబోధ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బాకయిలు 3200 కోట్ల విడుదల చేయక పోవడంతో పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు.అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులలు, సొంత భవనాలు కేటాయించాలని ఆర్మూర్ డివిజన్ లో SC. ST.BC సంక్షేమ హాస్టల్స్ కూడా సొంత భవనాలు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సోనియా, మమత,అంజలి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


భోదకాలు వ్యాది పై..

భోదకాలు వ్యాది పై..

సిరిసిల్ల 30 డిసంబర్

సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు అద్వర్యంలో శుక్రవారం బోదకాలు వ్యాధిగ్రస్తులు మార్బిడిటీ మేనేజ్మెంట్ డిజబులిటీ ప్రివెన్షన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో 3595 మంది బోదకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ (MMDP) కిట్స్ లోప్లాస్టిక్ టబ్బు, మగ్గు, టావెల్, సబ్బు యాంటీ ఫంగల్ క్రీమ్ ఉంటాయన్నారు. కిట్స్ ఏవిధంగా ఉపయోగించుకోవలో వివరించారు. కార్యక్రమంలో జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ డాక్టర్ శ్రీరాములు, NCVBDC సిబ్బంది శ్రీనివాస్, లింగం MPHEO, వాణి కమ్యూనిటీ ఆర్గనైజర్, భూమయ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఆపరేషన్ స్మైల్ IX..డిఐజి సుమతి

ఆపరేషన్ స్మైల్ IX..డిఐజి సుమతి

హైదరాబాదు 30 డిసంబర్

రాష్టంలో అన్ని జిల్లాల్లో విడియో కాన్ఫెరెన్స్ ఆపరేషన్ స్మైల్ IX..

తెలంగాణ రాష్ట్ర ఉమెన్ సెఫ్టీ వింగ్ డిఐజి సుమతి హైదరాబాదు నుండి ఆపరేషన్ స్మైల్ IX వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు…సుమతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తేది: 01-01-23, 31-01-23 వరకు ఆపరేషన్ స్మైల్ IX ” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, 18 సంవత్సరాల లోపు బాలబాలికలు తప్పిపోన, వదిలివేయబడిన, కార్మీకులుగా ఉన్న, ఉంటె వారి సమాచారం సేకరించి, తల్లి దండ్రులకు అప్పగించాలని, బిక్షాటన, వెట్టి చాకిరి చేయించిన వారిపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్ననారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్, ద్వారా డిపార్ట్మెంట్కు మంచి పేరు వచ్చిందని, ఈసారి అధికారులు సిబ్బంది వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో కలసి సమన్వయంతో విధులు నిర్వహించి రాష్ట్రానికి పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు, తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించి వారి కడుపుకోత తీర్చాలని సూచించారు… తెలంగాణ రాష్టంలో బాల కార్మికులతో పని,వెట్టిచాకిరి చేయిస్తూకనిపిస్తే వెంటనే డయల్ 100, సంబదిత పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు..

సేంద్రియ వ్యవసాయం ఎంతో మేలు..

సిద్దిపేట 30 డిసెంబర్

* బాల వికాస ఆధ్వర్యంలో సేంద్రీయ రైతుల మార్కెట్..

* దేశ జనాభాకు తగ్గట్టు వ్యవసాయం చేయాలి..

సిద్ధిపేట జిల్లా కేంద్రం ఉన్నత విద్యపాఠశాలలో బాల వికాస ఆధ్వర్యంలో సేంద్రీయ రైతుల మెగా మార్కెట్ మేళాను రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ లతో కలిసి ప్రారంభించారు. దేశ జనాభా అవసరాలకు సరిపోవు ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో రసాయనిక ఎరువులు ఆధునిక విధానంపై రైతులకు అవగాహన కల్పించడంలో దేశాన్ని పాలిస్తున్న మోడీ ప్రభుత్వం విఫలమైందనిరాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రపంచమంతా భూసార సంరక్షణ, టెర్రరిజం నిర్మూలన, పర్యావరణ, రక్షణకు కృషి చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య కుల మతాల చిచ్చు పెట్టిందని మంత్రి అన్నారు.భూసార పరీక్షలు జరపాలని అవసరమైతే తప్ప మందుల వాడకం చేయాలి, సేంద్రియ పద్దతిలో రైతులు సాగుచేయాలి. ప్రపంచానికి ఆహార పదార్థాలను ఒక్క భారతదేశం మాత్రమే సప్లై చేయగలదని, కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడంలేదని అన్నారు. చిన్న ప్రయత్నం తో ప్రారంభమై ఆచరిస్తే చరిత్రలో నిలిచిపోయే నాయకుడు హరీష్ రావు అన్నారు.

రాజన్న ఏర్పాట్లు పై..

రాజన్న ఏర్పాట్లు పై..

వేములవాడ 30 డిసంబర్

వేములవాడ రాజన్న సన్నిదిలో ఫిబ్రవరి 17వ నుండి 19 వరకు మహా శివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్ల పై రాజన్న ఆలయంలో దేవాదాయ, పోలిస్, వివిధశాఖల అధికారులతో కలెక్టర్ అనురాగ్ జయంతి సమావేశం నిర్వహించారు. ఇసామావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, ఎన్ ఖీమ్యా నాయక్, ఆలయ కార్యిర్వహణాధికారి కృష్ణ ప్రసాద్ రాష్టం నుండే కాక ఇతర రాష్టాల నుండి పెద్దేతున జాతరకు వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచారు.

మెరుగైన వైద్యం

మెరుగైన వైద్యం

హుస్నాబాద్ 30 డిసంబర్

* ఆస్పత్రిలో మెరుగైన వైద్యం

ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తునమని సూపరిండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు.. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరిక్షలు, డయాసిస్ సేవలు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులు క్రితం వైద్య సేవలు ప్రజలకు అందని మాట వాస్తవం, ఇప్పుడు అన్ని వసతులు సమకూర్చుకొని మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.

అత్యధిక ఆదాయం..

అత్యధిక ఆదాయం..

సిద్దిపేట 30 డిసెంబర్

* రైతుల మార్పు రావాలి..

* పదివేల కరాల లక్ష్యం..

ఆయిల్ ఫామ్ నర్సరీ క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు…
సిద్దిపేట నియోజకవర్గంలోని చంద్రాపూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగును సందర్శించి రైతులతో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ద్వారా ప్రతినెల జీతం వస్తుందని, వ్యవసాయ సాగులో రైతులు మార్పులు సాధించాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పదివేల ఎకరాలకు సంబంధించి ఫార్ములా మొక్కలు సిద్ధంగా ఎందుకు అనుగుణంగా పెద్ద రైతులకు అవగాహన ఆయిల్ ఫామ్ సాగు కై చైతన్య పరచాలని మంత్రి హరీష్ రావు తెలిపారు. గాతేడాది జిల్లా వ్యాప్తంగా మూడు వేలు, ఈ సంవత్సరం మూడు వేలు కలుపుకొని మొత్తం 6,300 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటామని, ఈ రెండు నెలలు మరో నాలుగు వేల ప్లాంటేషన్ చేసి పదివేల ఎకరాల లక్ష్యంగా సాగు చేయడానికి దృష్టి సారించామని హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రదాని మోదీ తల్లి అంత్యక్రియలు

ప్రదాని మోదీ తల్లి అంత్యక్రియలు

గుజరాత్ 30 డిసంబర్

ముగిసిన హీరాబెన్ మోదీ అంత్యక్రియలు

ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు శుక్రవారం ఉదయం పది గంటల జరిగాయి. సోదరులతో కలిసి మోదీ.. చివరిసారి తల్లి పాదాలకు నమస్కరించి, చితికి నిప్పంటించారు. అంతకుముందు గాంధీనగర్ లో హీరాబెన్ పార్థీవదేహాన్ని తరలించే వాహనం వరకు ప్రధాని మోదీ తల్లి పాడె మోశారు. అంతిమయాత్ర వాహనంలో ఎక్కి తల్లి అంతిమయాత్రలో పాల్గొన్నారు..

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...