తెలంగాణలో ప్రతి సంవత్సరం 20వేల ఉద్యోగాలు ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ HCL టెక్నాలజీ ఇంటర్ పూర్తయిన వెంటనే ఉద్యోగం కల్పిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సబ్జెక్టు చదివిన విద్యార్థులకు మాత్రమే అని తెలిపారు.
క్యాన్సర్‌తో పీలే కన్నుమూత.. మూడు ప్రపంచ కప్‌లను గెలుచుకున్న.. గత శతాబ్దపు అత్యంత కమాండింగ్ స్పోర్ట్స్ ఫిగర్‌లలో ఒకరిగా నిలిచిన బ్రెజిలియన్ ఫుట్‌బాల్ కింగ్ పీలే( 82) మృతి చెందారు. ఇటీవల పెద్దప్రేగు క్యాన్సర్‌కు చికిత్స జరిగిన.. ఇతర వ్యాధులతో ఆసుపత్రిలో చేరిన పీలే గురువారం రాత్రి మరణించారు.
గాంధీనగర్ లో ప్రధాని మోదీ తల్లి హీరా బేన్ అంతిమయాత్ర ప్రారంభమైంది. హీరాబెన్ పార్థీవదేహానికి నివాళి అర్పించిన ప్రధాని మోదీ.. అంత్యక్రియల్లో తల్లి పాడె మోశారు. కాసేపట్లో హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి..
అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హీరాబెన్ కన్నుమూత.. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ (100) మృతి చెందారు. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరారు.. గురువారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజును జరుపుకున్నారు. హీరాబెన్ మృతిపై ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని నా తల్లి ఈశ్వరుడి పాదాల వద్దకు చేరిందని. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది’’ అని ట్వీట్ చేశారు.
వైద్య సేవలో దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ: హరీష్ రావు
బెల్లంపల్లి 29 డిసంబర్
దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా వైద్య సేవలో దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ ఉందని ఇది ఎంతో గొప్ప రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణలో అమలవుతున్న వైద్య సేవలను చూసే తమిళనాడు డయాలసిస్ సేవలను ప్రారంభించిందని చెప్పారు. అత్యధిక మెడికల్ కిట్లు ఉన్న రాష్ట్రం కూడా తెలంగాణనె అని, అవసరాన్ని బట్టి జిల్లాలలో క్రిటికల్ పేర్లు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య, స్థానిక చేసిన సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
హైదరాబాద్ 29 డిసంబర్
శీతాకాల విడిదిలో భాగంగా సమతామూర్తి బంగారు ప్రతిమను దర్శించుకున్న రాష్ట్రపతి. తెలంగాణలోని ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీరామనగరంలో దిగిన రాష్ట్రపతికి త్రిదండి చినజీయర్‌స్వామి సహా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సమతామూర్తి కేంద్రంలోని దివ్యక్షేత్రాలను, సమతామూర్తి బంగారు ప్రతిమను దర్శించుకున్న రాష్ట్రపతి.. స్ఫూర్తి కేంద్రంలో శ్రీరామానుజాచార్యుల చారిత్రక విశేషాలను తెలుసుకున్నారు. సమతామూర్తి భారీ విగ్రహం వద్ద ఆసీనులైన ద్రౌపదిముర్ముకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం విశిష్టతలు, ప్రత్యేకతలను చిన జీయర్ స్వామి స్వయంగా వివరించారు. ఆ తర్వాత సమతామూర్తి చెంత నిర్వహించిన లేజర్ షోను వీక్షించిన రాష్ట్రపతి ముగ్దులయ్యారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళి సై, మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు 783 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసింది. జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఐపీఎస్ ల పోస్టింగ్ లలో తెలంగాణకు అన్యాయం జరగడం పై ట్విట్టర్ వేదికగాపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. స్పందించారు. డీజీపీతో సహా ఆరుగురు సీనియర్ ఐపీఎస్ లకు ప్రభుత్వం పోలిస్ ఉన్నత పదవులు కట్టబెట్టారు.ఇందులో ఒక్కరు కూడా తెలంగాణ మూలాలు ఉన్న అధికారులు లేకపోవడం పై “కల్వకుంట్ల రాజ్యంలో నిన్న పార్టీలో… నేడు పరిపాలనలో మాయమైపోయిన “తెలంగాణం” అని ట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ గా అంజనీ కుమార్ ను నియమిస్తు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంజనీ కుమార్ 1990 బ్యాచ్ ఐపిఎస్ అధికారి, ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న అంజనీ కుమార్ ను పుల్ అడిషనల్ చార్జ్ గా బాద్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారిచేశారు. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్ గా పని చేశారు ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరపున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. బిహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఐపిఎస్ ట్రైనింగ్ లో మంచి ప్రతిభ కనపబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు. గతంలో జనగామ ఏఎస్పీగా పనిచేశారు. కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఛీఫ్ గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ఛీఫ్ గా, నిజామాబాద్ డీఐజీగా,వరంగల్ ఐజీగా చేశారు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ గా, తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా, 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్ గా, 2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ, ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేశారు.
నెల్లూర్ జిల్లా కందుకూరు సంఘటనలో మృతి చెందిన ఉచ్చులూరి పురుషోత్తం గురువారం ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. బుధవారం జరిగిన ఘటనలో పురుషోత్తం ప్రాణాలు కోల్పోగా… మృతుని ఇంటికి వెళ్ళి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న దివ్యాంగుడు తిరుపతయ్య గురించి అడిగితెలుసుకున్నారు. రాష్ట ప్రభుత్వం ఇచ్చే దివ్యాంగుల పెన్షన్ తిరుపతయ్య కు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు కు తెలిపారు.