27.7 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 141

ఉత్తమ పోలీస్ స్టేషన్ గా..జైపూర్

ఉత్తమ పోలీస్ స్టేషన్ గా..జైపూర్

రామగుండం 29 డిసంబర్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2022లో ఉత్తమ స్టేషన్ గా జైపూర్ పోలీస్ స్టేషన్..

తెలంగాణ రాష్ట్ర డిజిపి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న 17 వర్టికల్స్ ఫంక్షనింగ్ సిస్టం, నేరాల నియంత్రణ, పరిశోధన, విచారణ, చట్టాల అమలు, 5S, డయల్ 100, సిబ్బంది విధుల నిర్వహణ, పరిశుభ్రత, లా అండ్ ఆర్డర్,పెట్రోలింగ్ లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ లోఈ సంవత్సరంకు జైపూర్ పోలీస్ స్టేషన్ “ఉత్తమ పోలీస్ స్టేషన్” ఎంపిక చేయడం జరిగింది. ఉత్తమ స్టేషన్ గాఎంపికఅయ్యేలా కృషి సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణను జైపూర్ ఏసిపి జి నరేందర్,శ్ర‌ీరంపూర్ సిఐ బి రాజు, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

వియ్యంకునికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్…

వియ్యంకునికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కెసిఆర్…

హైదరాబాదు 29 డిసంబర్

ముఖ్యమంత్రి వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామ పాకాల హరినాథరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గం వద్ద నివాసానికి వెళ్ళి దివంగత హరినాథరావు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు. తండ్రిని పోగొట్టుకున్న దుఃఖంతో ఉన్న కోడలు శైలిమను, శోకతప్తులైన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి దంపతులు ఓదార్చారు. హరినాథరావు ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ భగవంతున్ని ప్రార్థించారు.

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి..సీపీఐ

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి..సీపీఐ

సిద్దిపేట 29 డిసంబర్

గవర్నర్ వ్యవస్థను రద్దు చేసేంత వరకు ఊరుకోం..

సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తత..

కలెక్టర్ లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసిన సీపీఐ నాయకులు..

సీపీఐ నాయకులను పోలీస్ స్టేషన్ తరలింపు..

బారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యవస్థను విధ్వంసం చేస్తూ, రాజ్యాంగేతర శక్తిగా మారిన గవర్నర్ వ్యవస్థను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు..భారత కమ్యూనిస్టు పార్టీ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని గురువారం సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు.. సీపీఐ నాయకులు కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులకు,నాయకులకు మధ్య తోపులాట జరిగింది… చాడ వెంకటరెడ్డి,మంద పవన్ ను అరెస్ట్ చేసిన త్రీ టౌన్ పోలీసు స్టేషన్అధికారులు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ యేతర రాష్ట్రాల్లో గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ, ఆయ ముఖ్యమంత్రులు పంపిన జివోలను, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని , గవర్నర్ రాజ్యాంగ బద్దంగా పని చేయాలని, రాష్ట్రాల అభివృద్ధి లో ముఖ్యమంత్రులతో కలిసి పని చేయాలన్నారు..గవర్నర్ వ్యవస్థ ను కేంద్రం ఏజెంట్ గా మార్చుకుని, ప్రభుత్వ సంస్థలు అయిన ఈడి,ఐటీ, సీబీఐ ని తమ గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ ఏతర నాయకులను టార్గెట్ చేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆటంకంగా మారిందని అన్నారు. గవర్నర్ వ్యవస్థ ను రద్దు చేసేంత వరకు సీపీఐ పార్టీ ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు..ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మందపవన్, కార్యవర్గ సభ్యులు గడిపే మల్లేష్,వేల్పుల బాలమల్లు,కిష్టపురం లక్ష్మణ్,కనుకుంట్ల శంకర్,యెడల వనేశ్,అందే అశోక్,జిల్లా కౌన్సిల్ సభ్యులు కొమ్ముల భాస్కర్,జేరిపోతుల జనార్ధన్,పార్టీ,ప్రజా సంఘాల నాయకులు బెక్కంటి సంపత్,వేల్పుల శ్రీనివాస్,సంగెం మధు,రామగళ్ల నరేష్,మిట్టపల్లి సుధాకర్,మాడిశెట్టి శ్రీధర్,కర్నాల చంద్రం,మల్లేశం,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

నిరుద్యోగ యువతకు శుభవార్త..

నిరుద్యోగ యువతకు శుభవార్త..

న్యుదిల్లి 28 డిసంబర్

ఇంటర్‌ అర్హతపై కేంద్ర హోం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఏఎస్సై (స్టెనో), హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) మొత్తం 1,458 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు తెలిపింది. వచ్చే జనవరి 4 నుండి 25వ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్) ఉద్యోగాలు 143, హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులు 1,315 ఉన్నాయి. ఏఎస్సైలకు వేతనం రూ.29,200 – రూ.92,300, హెడ్‌కానిస్టేబుల్‌ రూ.25,500-రూ.81,100గా ఉంటుందని తెలిపింది. 2023 జనవరి 25 నాటికి వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలని, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, సీబీటీ అడ్మిట్‌ కార్డులను ఫిబ్రవరి 15న విడుదల చేయనున్నారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఫిబ్రవరి 22 నుంచి 28 తేదీల్లో జరుగుతుంది. తెలుగు రాష్టాలలో దగ్గర పరీక్షా కేంద్రాలివే..అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపుం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్ ఉన్నాయి.

కందుకూరులో విషాదం.. ఎనమిది మంది మృతి..

కందుకూరులో విషాదం.. ఎనమిది మంది మృతి..

నెల్లూర్ 28 డిసంబర్

* చంద్రబాబు మీటింగ్ లో అపశ్రుతి. ఎనమిది మంది మృతి..

* టిడిపి సభాకు బారిగా తరలివచిన జనం …

* తొక్కిసలాటలో ఎనమిది మంది మృతి.. మరికొందరికి గాయాలు..

* తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టిడిపి అదినేత చంద్రబాబు.

* మృతులకు ఒక్కొక్కరికి పదిలక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన చంద్రబాబు..

* మృతుల పిల్లల చదువులకు టిడిపి అండగా వుంటుంది..

నెల్లూర్ జిల్లా కందుకూరులో బుదవారం ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగిన తోపులాటలో మురుగు కాలువలో పడి అయిదుమంది మృతి, హాస్పత్రి లో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తుంది, మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది

దురదృష్టం ముందు ..విదిరాత ఎంత..

దురదృష్టం ముందు ..విదిరాత ఎంత..

శేరిరనికే వైకల్యిం కానీ ఆశయానికి కాదని రాజేశ్వరి నిరుపించిందని మంత్రి కేటిఅర్ అన్నారు.

సిరిసిల్ల 28 డిసంబర్

చేనేత నిరుపేద కుటుంబంలో పుట్టిన రాజేశ్వరి, తన వైకల్యాలను జయించి కాళ్లనే చేతులుగా మల్చుకొని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు ప్రశ్జంసనియమని మంత్రి అన్నారు. వైకల్యం శరీరానికే కానీ, మనసుకు, ఆలోచనకి, ఆశయానికి కాదని రాజేశ్వరి తన జీవితం ద్వారా నిరుపించిందని అన్నారు. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శమైన జీవనం ఆదర్శం అని కేటీఆర్, రాజేశ్వరి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం చిన్న భిన్నం చేసింది. ఎక్కడ చెదరని గుందేనిబ్బరం తో కాళ్ల ను చేతులుగా మలచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారు. చెదరని ఆత్మవిశ్వాసం తో రాజేశ్వరి ఎన్నో కవితలు.రాశారు.”సంకల్పం ముందు వైకల్యం ఎంత! దృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత! ఎదురీత ముందు విధిరాత ఎంత. పోరాటం ముందు ఆరాటం ఎంత.రాజేశ్వరి రాసిన కవిత ను గమనిస్తేఆమె అక్షరాల పదును అర్థమవుతుంది. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవిత సంకలనాన్ని తెచింది.2014 లో వచ్చిన ఈ కవిత సంకలనానికి జీవితమే కవిత్వం అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలాలోలిత చివర్లో చెప్పిన మాటలు “బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే కానీ అమే మాత్రం జీవిస్తుంది అనుభవిస్తుంది. అనుభవల నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రాజేశ్వరి బుధవారం శాశ్వతంగా నిష్క్రమించారు. సిరిసిల్ల ప్రాంతం నుంచి వైకల్యాన్ని సైతం ధిక్కరించి ఆత్మవిశ్వాసపు అక్షరలను కవిత్వంలో ఆవిష్కరించిన సిరిసిల్ల రాజేశ్వరి ఇక లేరు.

బస్టాండ్ తో దుబ్బాక కు కొత్త శోభ

బస్టాండ్ తో దుబ్బాక కు కొత్త శోభ
-త్వరలో నూతన హంగులతో బస్టాండ్ పునప్రారంభం..
-పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు

దుబ్బాక 28 డిసెంబర్

దుబ్బాక పట్టణం కొత్త అందాలను సంతరించుకొనుంది. ఇక్కడ బస్టాండు పునర్ నిర్మాణ పనులు చేపట్టి పూర్తికావస్తుండడంతో నూతన కళ సంతరించు కొనుంది. దశాబ్దాల క్రితం నిర్మించిన దుబ్బాక బస్టాండ్, దుబ్బాక ఎన్నికలు రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత వందలాది మంది ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలు కల్పనతో ప్రారంభానికి సిద్ధమవుతున్నది. ఈ మేరకు బస్టాండ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న దరిమిలా బుదవారం సాయంత్రం బస్టాండ్ పనులను అధికారులతో కలిసి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండే వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు, విజన్ కు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం వచ్చినట్లు ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. విశాలవంతమైన స్టాపులతో నిర్మితమవుతున్న పనులు క్షుణ్ణంగా పరిశీలించి, మిగులు పనులు వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
బస్టాండుకు వచ్చే ప్యాసింజర్లు-ప్రయాణీకులకు మోడ్రన్ టాయిలెట్స్, క్యాంటీన్, దుకాణ సముదాయం, బస్టాండులో ప్లాట్ ఫామ్స్ డిజైన్లకు అనుగుణంగా పనులు ఆర్టీసీ అధికారులు వివరించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ను తనిఖీ చేసిన..రైల్వే శాఖ సహాయ మంత్రి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ను తనిఖీ చేసిన..రైల్వే శాఖ సహాయ మంత్రి

సికింద్రాబాద్ 28 డిసంబర్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ది ప్రణాళికలను కేంద్ర రైల్వే శాఖ సహాయ, జౌళి శాఖ మంత్రి దర్శన జర్దోష్ బుదవారం తనిఖీ చేసారు. సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్దికి సంబందించిన ప్రణాళిక, ప్రాజెక్ట్‌పై పురోగతిపై మంత్రి సమీక్షించారు. రైల్ స్టేషన్ ను వచ్చే,రాబోయే 40 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని అవసరాలకు అనుగుణంగా పనులను చేపట్టినట్టు తెలిపారు. అనంతరం మీడియా ప్రతినిధులతో గౌరవ మంత్రి మాట్లాడుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జంట నగరాల్లో ప్రధాన రవాణా కేంద్రంగా ఉందని, అంతర్జాతీయ ప్రమాణాలతో పునరాభివృద్ధికి ఈ స్టేషన్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. షెడ్యూల్,నిర్దేశించిన కాలపరిమితి ప్రకారం పునర్నిర్మాణ పనులను మూడేళ్లలోపు పూర్తి చేస్తామన్నారు. మంత్రి టి. సి ఏ .ఎస్ (ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్, రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినా డీ కొనకుండా ప్రమాదాన్ని నియంత్రించే వ్యవస్థ ) ను దేశీయంగా దక్షిణ మధ్య రైల్వే లో ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి పర్చేందుకు ఇది భారతీయ రైల్వే అంతటా పెద్ద ఎత్తున అమలు చేయబడుతుందని మంత్రి తెలిపారు. 700 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు చేపడుతున్నట్టు, పర్యావరణహితంగా, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఈ ప్రాజెక్టు పనులు చేపడుతునందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఆమె అభినందించారు. వందే భారత్ సేవలను దేశమంతటా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశానికి జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్, అదనపు జనరల్ మేనేజర్, దక్షిణ మధ్య రైల్వే అమిత్ గోయెల్ మరియు అన్ని శాఖల ముఖ్య శాఖా ప్రధానాధికరి హాజరయ్యారు.

మహారాష్ట్ర పాఠ్యాంశాల్లో మన కీర్తి..

మహారాష్ట్ర పాఠ్యాంశాల్లో మన కీర్తి..

పాఠ్యాంశాల్లో బూర రాజేశ్వరి జీవితాన్ని పాఠంగా చేర్చాలి..మంత్రి కేటిఅర్

సిరసిల్ల 28 డిసంబర్

మహారాష్ట్ర లో విద్యార్థుల పాఠ్యాంశాల్లో బూర రాజేశ్వరి జీవితాన్ని పాఠంగా చేర్చిన సందర్భం లో మంత్రి ఐటి, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అభినందిస్తూ ట్వీట్. ఇక్కడ కూడా రాజేశ్వరీ స్ఫూర్తిదాయకమైన కథనీ తెలంగాణ విద్యార్థులకు పాఠ్యాంశo గా బోధించాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి సూచించారు. కాళ్ళతో కవిత్వం రాసి సిరిసిల్లాకు అరుదైన గౌరవం తెచ్చిన కవయిత్రి,బూర రాజేశ్వరి గారి మరణం సాహితీ లోకానికి తీరని లోటు. వైకల్యాన్ని అధిగమించి కవయిత్రిగా రాణించిన ఆమె జీవిత ప్రస్థానం యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.. అనంతర కాలంలో ఆమె స్ఫూర్తిదాయక ప్రస్థానాన్ని ఇక్కడ కూడా పాఠ్యాంశo గా చేర్చడం జరిగిందని మంత్రి అబినందించారు.

మన బడి పథకాన్నిదిక్సూచిలా నిలపాలన్న…జిల్లా కలెక్టర్

మన బడి పథకాన్నిదిక్సూచిలా నిలపాలన్న…జిల్లా కలెక్టర్

సిద్దిపేట 28 డిసంబర్

సిద్దిపేట జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో గజ్వేల్ నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద కేటాయుంచిన పాఠశాలల హెచ్ ఎం, ఎస్ఎంఎసి చైర్మన్లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈ ల, నిర్మాణ ఏజెన్సీలతో పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంన్ని అన్ని రంగాలలో మున్డుంచమని, మన ఊరు మన బడి పథకంతో పాఠశాలల అభివృద్ధి చేసి రాష్టానికే ఆదర్శం గా నిలిచేలా పనిచేయ్యాలని అధికారులనకు కలెక్టర్ తెలిపారు. ఈ పథకంలో ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్ మైనర్ రిపేర్లు వేగంగా పూర్తిచేసి కలర్స్ వేయాలని, ఎన్ఆర్ఈజిఎస్, ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షేడ్ పూర్తి చేశాకే మిగతా ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు పూర్తి చేయాలన్నారు. పాఠశాలలో అన్ని పనులు పూర్తీ చెసుకుని జనవరి మొదటి వారంలో ప్రారంభించడానికి సిద్దం చెయ్యాలని, కొండపాక మండలంలో పథకం అమలుకు పాఠశాలలను పర్యవేక్షణ చెయ్యాలని, ఈడబ్లుఐడిసి ఈఈ, డిఈ లకు తెలిపారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...