34.2 C
Hyderabad
Thursday, April 23, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 142

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శగా..నల్గొండ బిడ్డ

తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శగా..నల్గొండ బిడ్డ

నల్గొండ కు చెందినా కుతాటి గోపాల్ తమిళనాడు రాష్టానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. తెలంగాణలో పుట్టిన గోపాల్ 1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన వారు, తమిళనాడులోనే మొట్టమొదటి పోస్టింగ్, జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా పలు కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం, నేడు ప్రభుత్వ ప్రధాన కార్శదర్శి స్థాయికి వెళ్లారు…పేద కుటుంబంలో పుట్టి ఐఏఎస్‌ గా సీఎస్‌ స్థాయికి ఎదగడంతో శాలిగౌరారం వాసులు అన్నదలు వేక్తం చేస్తున్నారు.

మానవసేవే మదవసేవా…

మానవసేవే మదవసేవా…

దుబ్బాక 28 డిసంబర్

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో బుధవారం సల్కం మల్లేశం యాదవ్ 400 వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మల్లేశం యాదవ్ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నావంతు సహాయంగా వాటర్ క్యాన్లు పంపినిచేయడం జరిగిందని, స్వంత గ్రామానికి సహాయం చేయడం నాకెంతో తృప్తిని ఇస్తుందని తెలిపారు.

ఘనంగా కాంగ్రెస్‌ 138వ ఆవిర్భావ దినోత్సం..

ఘనంగా కాంగ్రెస్‌ 138వ ఆవిర్భావ దినోత్సం..

హైదరాబాద్ 28 డిసంబర్

కాంగ్రెస్‌ 138వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా గాంధీ భవన్‌లో పార్టీ జెండాను ఎగరవేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి..

ఇసందర్భంగా మాట్లాడుతూ దేశం, రాష్ట్రం ప్రమాదంలో ఉందని..ఈ సమయంలో వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త ప్రజల కోసం పోరాడాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్‌ ఉందని, రాహుల్‌ గాంధీ దేశ భద్రతకు ముప్పుందని కేంద్రానికి తెలిపిన, బిజెపి ప్రభుత్వానికి పట్టడం లేదని తెలిపారు. ‘‘దేశాన్ని ముప్పు నుంచి కాపాడేందుకే.. మహాత్ముడి స్ఫూర్తితో రాహుల్‌ పాదయాత్ర చేస్తున్నారు.. రాహుల్‌ పాదయాత్ర మోదీ భయంతో కొవిడ్‌ రూల్స్‌ తీసుకొచ్చారని, దేశ సమగ్రతను సంపదను పెత్తం దారులకు దార దతం చేయాలని భాజపా పార్టి కుట్రలు చేస్తోందని అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు దోచుకున్నారు, ఇప్పుడు దేశం దోచుకోవాలని చుస్తోన్నారని అని రేవంత్‌ రెడ్డి అన్నారు.

భారత దేశంలో 456 భాషలు వాడుకలో ఉన్నాయి..

భారత దేశంలో 456 భాషలు వాడుకలో ఉన్నాయి..

వరల్డ్ ఇండెక్స్ సంస్థ విడుదల చేసిన ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న 456 భాషలతో భారతదేశం నాలుగోవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో పసిఫిక్ ద్వీప దేశం 840 భాషలు వాడుకలో ఉన్నట్లు తెలిపింది. 715 భాషలతో ఇండోనేషియా రెండవ స్థానంలో, 527 వాడుక భాషలతో నైజీరియా మూడవ స్థానంలో, 337 భాషలతో అమెరికా 5వ స్థానంలో ఉన్నాయి.

రైతుబంధు జమ..మంత్రి హరీశ్‌

రైతుబంధు జమ..మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌ 28 డిసంబర్

తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయం రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో వేసింది.. యాసంగి పెట్టుబడి సాయం రైతుబంధు జమచేశామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. పదో విడుత రైతుబంధు ద్వారా 70.54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని,తొలిరోజున 1 ఎకరం ఉన్న 21,02,822 మంది రైతులకు అకౌంట్లలో రూ.607.32 కోట్లు జమ చేశాం అని మంత్రి హరీశ్‌ రావు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

సంక్రాంతి పండుగాకు 94 ప్రత్యేక రైళ్ల..

సంక్రాంతి పండుగాకు 94 ప్రత్యేక రైళ్ల…

హైదరాబాద్‌ 27 డిసంబర్

పండుగ సందర్భంగా 94 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లను చేసినట్లు తెలిపింది. పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముఖ్యంగా.. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి అధిక డిమాండ్‌ ఉండడంతో.. అందుకు తగ్గట్లుగా రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. 2023 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేది వరకు వేర్వేరు తేదీల్లో ఈ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రమే కాకుండా.. దేశంలోని రద్దీ గల ప్రాంతాలకు నడుస్తున్నాయని తెలిపింది.

విద్య ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు..బోయినపల్లి వినోద్

విద్య ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు..బోయినపల్లి వినోద్

హైదరాబాదు 27 డిసంబర్

అన్ని వర్గాల ప్రజలకు మనోధైర్యాన్ని నింపిన కేసిఆర్

అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతె నూతన విద్యా విధానం అమలు చేయాలి..

హైదరాబాదు నారాయణగూడ తాజ్ మహల్ హోటల్ లో మంగళవారం పాల్గొన్న 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉపాధ్యాయ సంఘాలతో మండలి సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం లో అనేక లోటుపాట్లు ఉన్నాయని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సమాజంలో ఎవరికైనా ఆత్మవిశ్వాసమే వజ్రాయుధమని, అలాంటి ఆత్మ విశ్వాసాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. విద్య ప్రతి పౌరుని ప్రాథమిక హక్కు అని, విద్యా హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏ ద్వారా అమలులోకి వచ్చిందని, ఉపాధ్యాయులు నిరంతరంగా తమ సబ్జెక్టులలో పునఃశ్చరణ జరుపుకోవాలని, దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాదాయ సంఘాల జాతీయ మండలి సభ్యులకు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఉద్యమ నేపథ్యాన్ని వివరించారు. తెలంగాణ స్వరాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ, జాతీయ స్థాయిలో అవార్డులు – రివార్డులు, సాధించమని వినోద్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు అశ్వని కుమార్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

కొత్తకొండ జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరించిన..ఎమ్మెల్యే సతీష్

కొత్తకొండ జాతర వాల్ పోస్టర్ ఆవిష్కరించిన..ఎమ్మెల్యే సతీష్

వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలను ఘణంగా నిర్వహిస్తాం…

హుస్నాబాద్ 27 డిసంబర్

ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్

కొత్తకొండ వీరభద్రస్వామి జాతర బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాలను ఘణంగా నిర్వహించాలని, అధికారులు, నాయకులు సమన్వయం పనిచేయాలని, భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

.

మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య..

మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య..

యువత మద్యానికి బానిసై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న మరో యువకుడు..

నిజామాబాద్ 27 డిసంబర్

బాల్కొండ నియోజకవర్గం పోచంపాడ్ గ్రామానికి చెందిన జైండ్ల శ్రీకాంత్ మద్యపానానికి బానిసై మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రోజువారీ కూలి పనులు చేస్తూ జీవనంసాగిస్తుండేవాడని, కొన్ని రోజులనుండి పని దొరకకపోవడంతో మద్యానికి బానిసై ఇంట్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు మృతుని భార్య సునిత తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వంత నిదులతో రోడ్డు వేయించిన..జన్నపు రెడ్డి

స్వంత నిడదులతో రోడ్డు వేయించిన..జన్నపు రెడ్డి

గ్రామస్తుల కోరిక తీర్చిన..జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి

హుస్నాబాద్ 27 డిసంబర్

హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సోమరం గ్రామపంచాయతీ, గర్రేపల్లికి స్వంత నిదులతో రోడ్డు వేయించిన బీజేపీ నాయకులు జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి…
రోడ్డు సౌకర్యం లేఖ ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు… గ్రామస్తుల సౌకర్యం కోసం తన సొంత ఖర్చులతో రోడ్డు వేయిస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చిరు…ఇచిన ప్రకారం మంగళవారం రోడ్డు పనులను ప్రారంబించారు. ఈ సందర్భంగా జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గ్రామం సింగపురంకి కూత వేటు దూరంలో వున్నదని, సైదాపూర్ మండలంలో రోడ్స్ ఇలా వుంటే నియోజకవర్గంలో పరిస్థితిని అర్థం అవుతుందని, గతంలో కూడా భీమదేవరపల్లి మండలం మల్లారం, మైసమ్మ వాగు గ్రామాలకు రోడ్డు వేపించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీటీసీ విజయ మొండయ్య, అకునుర్ సర్పంచ్ ముత్యాల రమణా రెడ్డి, సోమారం ఉప సర్పంచ్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి,జెల్ల మల్లేశం,గాజుల రమేష్, భరద్వాజ్, రఘు, అనిల్, రమేష్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...