ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది… ఈ ఘటనలో ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ మైసూరులోని ఎస్‌జే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం 2గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని బందిపురా వెళ్తుండగా.. మైసూరు సమీపంలో ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రహ్లాద్ మోదీతో పాటు భార్య, కొడుకు, కోడలు, మనుమడు ఉన్నారు. ప్రమాదంలో అందరికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న మైసూరు ఎస్పీ సీమా లట్కర్ ఆస్పత్రికి వెళ్లారు…
ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలి..చాడ వెంకటరెడ్డి
హుస్నాబాద్ 27 డిసంబర్
సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని చెప్పి గద్దెనేక్కిన పాలకులు పేదల సంక్షేమం మరిచారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మంగళవారం పలుకాలనిలు సందర్శించారు. కోమటి రాజవీరు, బస్ డిపో, కరీంనగర్ మడత రోడ్డు లొని కాలనీలల్లొ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటి నివేశన స్థలల్లో ప్రభుత్వం ద్వారా పేదలకు పక్క ఇండ్లు ముంజూరి చేయకపోవడం, అప్పుడు 3విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో పేదలకు తీరని అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రం ఎర్పడిన,పేదలకు న్యాయం జరగలేదని, కెసిఆర్ ప్రభుత్వం పేదలకు పక్కఇండ్లు ముంజూరి చేయకపోవడం అన్యాయమని, పక్కఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేసి అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పూర్తి చేసుకునేందుకు, 3 లక్షలు మంజూరు చేయాలని, పట్టణంలోఉన్న పేద మధ్యతరగతి కూలీలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 300 రోజులు పని కల్పించి ఆదుకోవాలని ప్రజా సమస్యలు పట్టించుకొకుంటే కెసిఆర్ ప్రభుత్వంపై తీరుగుబాటు ప్రజా ఉద్యమాలు తప్పవని బిఆర్ఎస్ ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు,హుస్నాబాద్ మాజీ వైస్ గడిపె మల్లేశ్,సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి యెడల వనేష్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి ఏగ్గొజు సుదర్శన్ చారి, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, జనగాం రాజు కుమార్, అయిలేని మల్లారెడ్డి, జంగ విజయ, ఏలురి స్వాతి,పెరాల లక్ష్మి,మాడిశేట్టి శ్రీదర్,వంగోజు భాస్కరాచారి, నగునూరి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గం, బెజ్జంకిలో మన ఊరు మన బడి పథకంఫై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్….
సిద్దిపేట 27 డిసంబర్
సిద్దిపేట సమీకృత జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గం, బెజ్జంకి మండలలో మన ఊరు మన బడి పథకనికి కేటాయుంచిన పాఠశాలల హెచ్ ఎం, ఎస్ఎంఎసి చైర్మన్లు, ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈ లు మరియు సర్పంచ్, కౌన్సిలర్లు, నిర్మాణ ఏజెన్సీలతో కలెక్టర్ జీవన్ పాటిల్ సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ….జిల్లా మొత్తంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి, బెజ్జంకి మండలలో ఇంకా మెరుగుపర్చుకోవాలని తెలిపారు. ఎలక్ట్రిసిటీ, తాగునీటి వసతి, మేజర్ మైనర్ (కిటికీలు, డోర్లు, స్లాప్, ఫ్లోర్) రిపేర్లు తప్పని సరిగా వేగంగా పూర్తి చేసిలని, ఎన్ఆర్ఈజిఎస్, ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షేడ్ పూర్తి చేశాకే మిగతా ప్రహరీ గోడ, అదనపు తరగతి గదులు పూర్తి చెయ్యాలని, ఎంపిడిఓ, ఎంపిఓ లు రోజు పాఠశాలల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షణ చేపించాలని. పాత భవనాలను కూల్చి వేయడానికి గ్రామ పంచాయతీ, పల్లె ప్రగతి నిధుల నుండి చేయాలని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీలు పనులు పూర్తి అయిన తర్వాత పాఠశాల లోపల కాని బయట మైదానంలో కాని ఎలాంటి చెత్త, చెదారం, పాత సామాను, రాళ్ళు, రప్పలు లాంటివి ఎలాంటివి ఉండకూండ శుభ్రంగా ఉంచాలని సూచించారు. భవనం అన్ని సదుపాయాలు కల్పించి రంగులు వేస్తే సరిపోదు పాఠశాలల్లో మైదానంలో గడ్డి కార్పెట్ పెంచి సుందరంగా తీర్చిదిద్దాలి.ఎంపిడిఒ ఎంపిఓ లు ఏఈ లకు తోడ్పాటునందించాలి. పనులు పూర్తి అయ్యేవరకు సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటాం కావున మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో డీఆర్డీఏ పిడి గోపాల్ రావు, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన..కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట 27 డిసెంబర్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం-వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్…
సిద్దిపేట రూరల్ మండలం ప్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. సిద్దిపేట రీజనల్ రింగ్ రోడ్డు విశ్వవిద్యాలయంకు కేటాయుంచిన భూమిలో నుండి వెళ్తుందని,రింగ్ రోడ్డు వల్ల కళాశాలకు కేటాయుంచిన భూమి నష్టం చేకూరుతుందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆర్&బి ఇంజనీరింగ్ అధికారులు ఎస్ఆర్ఆర్ వెళ్తున్న క్రమాన్ని మ్యాప్ ద్వారా కలెక్టర్ కు తెలిపారు. ఎస్ఆర్ఆర్ మార్గాన్ని విశ్వవిద్యాలయ పాలిటెక్నీక్ కళాశాల మద్యలో ఉండడం వల్ల ఇబ్బంది ఉందని, మద్య నుండి కాకుండా, చివర్నుండి వెళ్లేలా క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రణాళికలు రూపోందించాలని ఆర్ & బి ఇంజనీర్ అధికారులకు, రూరల్ తహసీల్దార్, సర్వేయర్ సూచించారు. ఇలా చేయడం వల్ల ఎవ్వరికీ నష్టం,ఉండకుండా త్వరగా వెరిఫై చెయ్యాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్&బి ఈఈ సుదర్శన్ రెడ్డి, డిఈ బాల ప్రసాద్, రూరల్ తహసీల్దార్ శ్రీనివాస్ గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
స్వగ్రామంలో సొంత పొలంలో పనులు జరుగుతుంటే, పొలంలో గొర్రు కొట్టిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. నాడు రైతులు వ్యవసాయం దండగ అంటే నేడు రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ పండగా చేసిండు.. వ్యవసాయాన్ని మంత్రులు పొలం పనులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధనలో అడుగులు వేస్తాం అనడమే కాదు..వ్యవసాయం చేస్తాం.. రైతు రాజు అయితే… రాజు కూడా రైతే అని మంత్రి రుజువు చేశారు. కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులు, మంత్రులు కూడా ఇష్టంగా వ్యవసాయం చేయడంతో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా మారిందని, గతంలో నెర్రెలు పారిన పొలాలు… స్వరాష్ట్రంలో పచ్చని పంట పొలాలతో కళకళ లాడుతున్నాయి.. అన్నదాత కళ్లలో ఆనందం నిండింది, అపర భగీరధుడు కేసీఆర్ ఆలోచనలతో ప్రాజెక్టులలో, నీళ్లు పరవళ్ళు తొక్కుతుంటే… చెరువులు కుంటలు, నిండి ఉప్పొంగుతుంటే… మంత్రులు సొంత పొలాల్లో దిగి వ్యవసాయం చేస్తుంటే…ఊరు వాడ, చేను చెలక మళ్ళీ ప్రాణం పోసుకుని పరవశిస్తున్నాయి… నా తెలంగాణ కోటి ఎకరాల మగాణా అన్న నినాదం మల్లి నిజం అయ్యింది.
సిరిసిల్ల జిల్లా మూడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.. కారుని ఎరువుల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఎరువుల లోడ్‌తో కోరుట్ల వైపు వెళ్తుండగా మూడపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రుద్రంగి మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
దేవదేవునికి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశాం..అనిల్‌కుమార్ సింఘాల్
తిరుమల 26 డిసంబర్
తిరుమలలో జనవరి 2 నుంచి 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని సీనియర్ అధికారి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. వైకుంఠ ద్వారదర్శన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 9 చోట్ల జనవరి 1న సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. రోజుకు 50 వేల చొప్పున 10 రోజులకు 5 లక్షల టోకెన్లు జారీ చేస్తామని,10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇస్తామన్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్, తిరుపతి రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, రైల్వేస్టేషన్ వెనకున్న 2, 3 సత్రాలు, ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్ హైస్కూల్, భైరాగి పట్టెడలోని రామానాయుడు మున్సిపల్ హైస్కూల్, ఎంఆర్ పల్లి జడ్‌పి హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో టోకెన్లు ఇస్తామన్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులు తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్టు చేయాలని సింఘాల్ తెలిపారు. భక్తులు తితిదే వెబ్‌సైట్, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా టికెట్ల లభ్యతను ముందే తెలుసుకుని తిరుమల ప్రయాణాన్ని ఖరారు చేసుకోవాలని, భక్తులు ముందుగానే వచ్చి క్యూలైన్లలో నిరీక్షించకుండా టోకెన్‌పై తమకు కేటాయించిన ప్రాంతానికి నిర్దేశించిన సమయానికి మాత్రమే రావాలని తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పై రి-సర్వే చేయాలి.. పేదల ఫిర్యాదులను స్వీకరించేందుకు 10 రోజుల గడువు ఇవ్వాలి..
హుస్నాబాద్ 26 డిసంబర్
హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై మరోసారి సర్వే చేయించాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజితకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ కోరారు. మున్సిపల్ కార్యాలయంలో అంటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఉన్నవారికి ఓకే ఇంట్లో ఇద్దరికి కొంత మంది ఉద్యోగుల పేర్లే ఉన్నాయని గడిపె మల్లేశ్ తెలిపారు. చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చిన పేదల పేర్లు కూడా మళ్లీ జాబితాలో ఉన్నాయని, ఒక వ్యక్తికి ప్రభుత్వం నుండి ఎన్నిసార్లు లబ్ధి చేకూరుస్తారని, డబుల్ బెడ్ రూం ఇండ్ల జాబితాపై వచ్చిన ఫిర్యాదులను ఇచ్చేందుకు మరో 10 రోజులు గడువు పెంచి ప్రత్యేక సమర్థ వంతులైన అధికారులచే విచారిస్తున్నారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం కట్టిచ్చే డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరి కోసం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ న్యాయం చేయకుంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగీర్ సత్యనారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, కొహెడ కొమురయ్య ఏగ్గొజు సుదర్శన్ చారి, గూడ పద్మ, జనగాం రాజు కుమార్, ఏలురి స్వాతి, కాల్వల ఎల్లయ్య, పోగుల నవ్య,పెద్ది నిర్మల, రాయిళ్ళు శోభ, వంగోజు భాస్కరా చారి, బిచ్చాల శ్రీనివాస్, మాడిశేట్టి శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ లో ఘనంగా సీపీఐ 98 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ఎర్ర జెండాను ఎగురవేసిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.. హుస్నాబాద్ అనభేరి సింగిరెడ్డి అమరుల భవనం లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ మార్క్సిజమ్, లేనీనిజం సిద్ధాంతాలు అజేయమైనవని, సూర్యచంద్రులు, మానవాళి ఉన్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, సీపీఐ పార్టీ లక్ష్యం అని, ఎల్లపుడు పేద ప్రజలకు అండగా సీపీఐ జెండా ఉంటుందని, సీపీఐ త్యాగాల చరిత్ర, 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని ఆయన గుర్తు చేశారు.. నాటి నుంచి నేటి వరకు గత 97 సంవత్సరాలుగా సమసమాజ స్థాపన కోసం ఉద్యమిస్తుందని, దేశ సంగ్రామంలో పాల్గొన్నదని, బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి విముక్తి కలిగించడంలో, భూమి కోసం,భుక్తి కోసం,బానిస బ్రతుకుల విముక్తి కోసం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, భూస్వాములకు, రాజకర్లకు,పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా దున్నేవాడిదే భూమి అని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిదాని అన్నారు. పేద ప్రజలకు10 లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత కుడా సీపీఐ పార్టీదని, దేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలబడి అనేక ఫలితాలను భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిందని, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధన లో సీపీఐ భాగస్వామ్యం అయ్యిందని, ప్రభుత్వాలు అవలంబించే విధానాలపై పోరాటాలు నిర్వహిస్తామని, పేద ప్రజలకు అండగా సీపీఐ పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జాగీర్ సత్యనారాయణ, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, అయిలేని సంజివరెడ్డి, కొహెడ కొమురయ్య ఏగ్గొజు సుదర్శన్ చారి, జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, జనగాం రాజు కుమార్, ఏలురి స్వాతి తదితరులు పాల్గొన్నారు.
జడ్పిహెచ్ఎస్ హైస్కూల్లో మరుగుదొడ్ల పనులు ప్రారంభించిన ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్..
హుస్నాబాద్ 26 డిసంబర్
హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం బస్వాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో ఈజీఎస్ నిధుల తో 12 లక్షలతో మరుగుదొడ్ల,కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు సోమవారం ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ ప్రారంభించరు. టాయిలెట్లకు మూడు లక్షల నలభై వేలు, కాంపౌండ్ వాల్ లక్ష రూపాయలు మంజూరు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నాగరాజు శ్యామల మధుసూదన్ రావు గ్రామ సర్పంచ్ ఎడబోయిన సత్తయ్య, మాజీ ఎంపిటిసి కొక్కుల రమేష్,తాటిపాముల శ్రీనివాస్, చింతల బాలనర్స్, బిక్కయనాయక్ ఏడబోయిన కనకయ్య తదితరులు పాల్గొన్నారు.