36.2 C
Hyderabad
Wednesday, April 22, 2026
హోమ్ బ్లాగ్ పేజీ 144

శగుఫ్తా సైఫ్ ముమ్మాటికీ హత్యే …

శగుఫ్తా సైఫ్ ముమ్మాటికీ హత్యే …

* కట్నం కోసమే హత్య చేశారు.

సిద్దిపేట 26 డిసంబర్ 22

శగుఫ్తా సైఫ్ ది ఆత్మహత్య కాదు, కట్నం కోసమే మా హత్య చేశారని, శగుఫ్తా సైఫ్ తండ్రి సైఫుద్దీన్ సోమవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లోఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. 15 రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని ఖాదర్ పూర కు చెందిన వివాహిత శగుఫ్తా సైఫ్(21) ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందిన సంగతి తెలిసిందే. సిద్దిపేట పట్టణానికి చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ రియాజుద్దీన్, శగుఫ్తా సైఫ్ తమ ఏకైక బిడ్డను ఇచ్చి ఘనంగా వివాహం జరిపించామని, కొన్ని నెలలకే కట్నం కోసం తమ బిడ్డను భర్త రియాజ్ టార్చర్ చేశాడన్నారు. రెండు నెలల క్రితం 6 లక్షలు ఇచ్చి, మరో 3 లక్షలు రూపాయలు ఫిక్స్ డిపోసిట్ చేశామని తెలిపారు. చనిపోయే ఒకరోజు ముందుకు తమకు ఫోన్ చేసిందని.. అమ్మాయి శరీరం పై ఎర్రటి గుర్తులు గుర్తించామని ఇది ముమ్మాటికీ భర్త రియాజ్, వారి కుటుంబీకులు చేసిన హత్యేనని, శగుఫ్తా సైఫ్ మృతి పై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించకుండానే మృతదేహాన్ని క్రిందకు దించారని, పోలిస్ స్టేషన్లో కేసుపెడితే 15 రోజులు ఐన న్యాయం జరగడం లేదని అన్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అన్నారు.

హత్యకు పాల్పడిన నిందితులను 24గంటల్లో పట్టుకుంటాం..

హత్యకు పాల్పడిన నిందితులను 24గంటల్లో పట్టుకుంటాం..

సిద్దిపేట 26 డిసెంబర్ 22

జిల్లాలో కాలకం సుష్టించిన చేర్యాల జడ్పిటిసి శెట్టి మల్లేశం హత్య.. సోమవారం మండలం చేర్యాల, గుర్జకుంట క్రాస్ రోడ్డు వరకు మార్నింగ్ వాక్ వెళ్ళుతుండగా మార్గమధ్యలో సుమారు 6 నుండి 6:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. తలకు బలమైన గాయం కావడంతో, చికిత్స నిమ్మితం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రధమ చికిత్స అనంతరం, హైదరాబాద్ రెఫర్ చేయరు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శెట్టి మల్లేశం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత శెట్టి మల్లేశం ను హత్య చేసిన నిందితుల గురించి ప్రత్యేకంగా హుస్నాబాద్ ఎసిపి సతీష్, చేర్యాల సిఐ శ్రీనివాస్, ఎస్ఐ భాస్కర్ రెడ్డి లతో ప్రత్యేకంగా టీమ్స్ ను ఏర్పాటు చేశామని, 24 గంటల లోపు నిందితులను పట్టుకుని హత్యకు గల కారణాలను తెలియపరుస్తామని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ లో రెచ్చిపోతున్న హిజ్రాలు.. వేలల్లో వసూళ్లు..!

హైదరాబాద్ లో రెచ్చిపోతున్న హిజ్రాలు.. వేలల్లో వసూళ్లు..!

హైదరాబాద్

* ప్రాంతాలుగా పంచుకుని వేలల్లో వసూళ్లు చేస్తున్నరు..

* రౌడీలలాగా దాడులకు పాల్పదుతున్న హిజ్రాలు..

* బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరిన హిజ్రాల గ్రూపు తగాదాలు..

హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో తమను రౌడీలతో వేధిస్తున్న హిజ్రా నాయకురాలు మోనాలిసా మీద చర్యలు తీసుకోవాలి అంటూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో రెండో గ్రూపుకు చెందిన హిజ్రాల ఆందోళన చేశారు. పోలిస్ స్టేషన్ లో హంగామా సృష్టించి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయడంతో పాటు పోలిసుల విధులు ఆటంకం కల్పించిన హిజ్రాలపై ipc 353, 306 red with 511 ఐపిసి సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్తితి ఉండడంతో కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసు ఉన్నతాధికారుల కసరత్తు చేస్తున్నారు.

చేర్యాల జెడ్పీటీసీ మృతి…

చేర్యాల జెడ్పీటీసీ మృతి…

చేర్యాల 26 డిసంబర్ 22

సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ శేట్టే మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి చేయడంతో మృతి…తలకు తీవ్రగాయాలు అపస్మారక స్థితిలో ఉన్న మల్లేశం ను మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి నుండి హైదరాబాద్ తరలించిన కుటుంబీకులు, పరిస్థితి విషమించడంతో మృతి చెందిన్నట్లు తెలుస్తోంది.

మద్యంతో కుటుంభాలు చిన్న బిన్నం అవుతున్నాయి..కేంద్ర మంత్రి

మద్యంతో కుటుంభాలు చిన్న బిన్నం అవుతున్నాయి..కేంద్ర మంత్రి

మద్యానికి అలవాటు పడి తన కుమారుడు మరణించాడు,ఇప్పుడు అతని భార్య ఏకాకిగా మిగిలిపోయిందని ఇలాంటి పరిస్థితి తల్లి,తండ్రికి రావద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసైన వ్యక్తికి పిల్లను ఇవ్వొద్దని కేంద్ర మంత్రి అన్నారు. మద్యానికి బానిసైన అధికారి కంటే ఒక కూలీ చేసుకొనే, రిక్షా కార్మికుడిని, చిన్న చిన్న పనిచేసుకుని తల్లి తండ్రులను పోషించే వారిని పెళ్లికొడుకుగా ఎంపిక చేయడం మంచిదని అన్నారు. తాను ఏంటో ఉన్నత పదవిలో (ఎంపీ), తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటైన తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని డీ అడిక్షన్ కేంద్రంలో కూడా చేర్పించామని… ఆ అలవాటును మానేస్తాడనే అనుకున్నామని… ఆ తర్వాత ఆరు నెలలకు పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. కానీ, మళ్లీ మద్యం సేవించడం ప్రారంభించాడని, చివరకు రెండేళ్ల క్రితం చనిపోయాడని, చనిపోయేటప్పుడు అతని కుమారుడికి రెండేళ్ల వయసు, భార్య ఏకాకిగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎ తల్లి, తండ్రికి రావద్దని,మీ కూతుర్లని, అక్కచెల్లెళ్లను కాపాడుకోవాలని తెలిపారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ రాక..

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ రాక..
హైదరాబాద్‌ 26 డిసెంబర్ 22

శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నెల 30 వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. అయిదు రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆమె పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేసింది. దిల్లీ నుంచి భారతీయ వాయుసేన విమానంలో రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లి.. భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ చేపట్టిన ‘ప్రసాద్‌’ పథకం కింద ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకొని, బొల్లారంలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్దకు వెళ్లి అమర జవాన్లకు నివాళులర్పిస్తారు. అనంతరం రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై ఇచ్చే విందులో సాయంత్రం 7.45 గంటలకు పాల్గొంటారు. 27న ఉదయం 10 గంటలకు నారాయణగూడలోని కేశవ్‌ మెమోరియల్‌ విద్యాసంస్థల బోధకులు, విద్యార్థి ని, విద్యార్థులతో ముఖాముఖిలో కార్యక్రమంలో పాల్గొంటారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో 74వ బ్యాచ్‌ ట్రైనీ ఐపీఎస్‌ అధికారులతో ముఖాముఖీకి మధ్యాహ్నం 3 గంటలకు హాజరవుతారు. కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని)కి వెళ్లి వైడ్‌ ప్లేట్‌ మిల్లును ప్రారంబిచ్చంనున్నారు.28న ఉదయం హకీంపేట నుంచి విమానంలో రాజమహేంద్రవరానికి.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలానికి వెళ్లి, సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు. వనవాసీ కల్యాణ్‌ పరిషత్‌ – తెలంగాణ ఏర్పాటు చేసే సమ్మక్క సారలమ్మ జనజాతి పూజారి సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. కుమురం భీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్‌ గురుకుల పాఠశాలలను భద్రాచలం నుంచే ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 2.20 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శిస్తారు. ఆలయంలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, కామేశ్వరాలయ ఆలయ పునరుద్ధరణకు శంకుస్థాపన చేస్తారు. 29న ఉదయం 11 గంటలకు జి.నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో బీఎం మలానీ నర్సింగ్‌ కళాశాల, మహిళా దక్షత సమితి సుమన్‌ జూనియర్‌ కళాశాలల బోధకులు, విద్యార్థినులతో భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్‌లో సమతామూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. 30న ఉదయం 9.30 గంటలకు హెలికాప్టర్‌లో యాదాద్రికి వెళ్లి.. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి నిలయానికి తిరిగి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విందు ఇస్తారు. వీరనారీలను సత్కరిస్తారు.

– స్వాగతం పలకనున్న ముఖ్యమంత్రి
కేసీఆర్‌

శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి వస్తున్న రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాయంత్రం హకీంపేటకు వెళ్లనున్నారు. సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో ఆమె గౌరవార్థం గవర్నర్‌ ఇచ్చే విందు కార్యక్రమంలోనూ పాల్గొనే అవకాశం ఉంది.

మెదలైన కౌంటింగ్..

మెదలైన కౌంటింగ్…

వేములవాడ 26 డిసెంబర్ 22

మొదలైన కౌంటింగ్ సెస్ (సహకార విద్యుత్ సరఫరా) స్వేచ్చావతావరణంలో 24 డిసెంబర్ శనివారం ఎన్నికలు జరగగా సెస్ ఎన్నికలు పోలింగ్ శాతం 84 శాతం జరిగింది. వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఎలక్షన్ అథారిటీ సుమిత్ర ఆధ్వర్యంలో అభ్యర్థుల సమక్షంలో పోలైన ఓట్ల బాక్స్ లు సీల్ తీసి లెక్కింపు చేస్తున్నారు.సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనయిని రాష్ట్ర కో-ఆపరేటివ్ ఎన్నికల అథారిటీ సుచిత్ర తెలిపారు

కౌంటింగ్

అర్హులైన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూములు ఇస్తాం.. ఎమ్మెల్యే

అర్హులైన వారికి మాత్రమే డబుల్ బెడ్ రూములు ఇస్తాం.. ఎమ్మెల్యే

హుస్నాబాద్ 25 డిసంబర్ 22

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఎలాంటి పక్షపాతం వహించం, డ్రా పడతి ప్రకారమే లబ్ధిదారుల ఎంపిక చేస్తామని తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు 1400 అప్లికేషన్స్ వచ్చాయని, ఈ అప్లికేషన్స్ ఆధారంగా 489 మంది లబ్ధిదారులు అర్హులు. 284 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు అందజేయడానికి రెడీగా ఉన్నాయని తెలిపారు. నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని, డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఎలాంటి ఫిర్యాదులు ఉన్న మున్సిపల్ కార్యాలయం లో, ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు బాక్సులు పెట్టడం జరిగింది తమ ఫిర్యాదులను అందులో వేయవచ్చుని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఎలాంటి పైరవీలకు తావులేదు, సోశామిడియలో వచ్చే పుకారులు నమ్మవద్దుఅని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైస్ సాయి రెడ్డి రాజిరెడ్డి, మునిసిపల్ చేర్పర్సన్ ఆకుల రాజిత, తదితరులు పాల్గొన్నారు.

హనుమత్ యాగ ఉత్సవాల్లో పాల్గొన్న..మాజీ ఎంపి

హనుమత్ యాగ ఉత్సవాల్లో పాల్గొన్న..మాజీ ఎంపి

హుస్నాబాద్ 25 డిసంబర్ 22

భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో జరుగుతున్న హనుమత్ యాగ ఉత్సవాల్లో ఆదివారం పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ 15లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు ను ప్రారంభించారు.

గుడులేని నిరుపెదాలకే డబుల్ బెడ్ రూం ఇండ్లు..ఇవ్వాలి

గుడులేని నిరుపెదాలకే డబుల్ బెడ్ రూం ఇండ్లు..ఇవ్వాలి

గుడులేని నిరుపెదాలకే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలి….గడిపె మల్లేశ్

హుస్నాబాద్ 25 డిసంబర్

ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి ఏడ్లు గడిచిపోయినప్పటికి దరఖాస్తులు పెట్టుకున్న లబ్ధిదారులకు నిష్పక్షపాతంగా విచారణ చేసి ఇవ్వలేదని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి,
అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏజాగ లేని పేదలకు మున్సిపల్ కంప్యూటర్, కుటుంబ సభ్యుల రికార్డులను పరిశీలించిన తర్వాతే లబ్ధిదారులకు ప్రభుత్వం కట్టిచ్చిన రెండు పడకల ఇండ్లును మంజూరి చేయాలని, ఇండ్లు మంజూరి కోసం ఇటివలచేసిన సర్వే తప్పుల తడకగా ఉందని లబ్ధిదారుల తండ్రి, భర్త వయస్సు, కొన్ని పేర్లు రెండు సార్లు, ఇష్టారాజ్యంగా చేశరన్నారు, ఇండ్లు, స్థలాలు ఉన్నావారికి లబ్ధిదారులుగా ఎంపిక చేయడం పట్ల సిపిఐ తరపున నిరసన వ్యక్తం చేస్తున్నమని, మల్లి రిసర్వే చేసి, తప్పుడు సర్వే చేసిన అధికారులపై వెంటనే శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోని అధికారులను కోరారు. పేదల ఫిర్యాదులను స్వీకరించేందుకు మరో 10 రొజుల గడువును ఇవ్వాలని జిల్లా స్థానిక మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్ లను గడిపె మల్లేశ్ కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, జనగాం రాజు కుమార్, ఏలురి స్వాతి,కాల్వల ఎల్లయ్య పోగుల నవ్య ,రాయిళ్ళశోభ తదితరులు పాల్గొన్నారు.

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...